బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే.. అమర్‌కు ఊహించని ఆఫరిచ్చిన నాగ్.. మరో ఆలోచన లేకుండా! | Bigg Boss Grand Finale Promo Amardeep Gets Offer From Nagarjuna | Sakshi
Sakshi News home page

Bigg Boss Grand Finale: క్రేజీ ఆఫర్‌.. 7 సెకన్ల టైమ్.. అమర్‌దీప్‌ అంత వేగంగా!

Published Sun, Dec 17 2023 10:23 AM | Last Updated on Sun, Dec 17 2023 10:45 AM

Bigg Boss Grand Finale Promo Amardeep Gets Offer From Nagarjuna - Sakshi

Bigg Boss Season 7 Telugu Grand Finale: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ సీజన్‌-7 గ్రాండ్ ఫినాలే షురూ కానుంది. వందకు పైగా రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులు కట్టి పడేసిన తెలుగువారి బిగ్ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది.  ఈ నేపథ్యంలో సీజన్-7 విన్నర్‌ ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. శనివారం రోజు ఇంటి సభ్యులంతా చిల్ అయ్యారు. 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. ఇక చివరి రోజు సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. 

(ఇది చదవండి: 'సలార్‌' రెండో ట్రైలర్‌తో ప్రభాస్‌ రెడీ)

తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ ఏడాది సీజన్-7 గ్రాండ్‌ ఫినాలేను మరింత గ్రాండ్‌ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ ఫినాలేకు హాజరైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ గ్రాండ్‌ ఫినాలేలో మాస్ మహారాజా రవితేజ, కల్యాణ్ రామ్, యాంకర్ సుమ, ఆమె కొడుకు రోషన్, బబుల్ గమ్‌ హీరోయిన్‌ మానస చౌదరి, అల్లరి నరేశ్, రాజ్‌ తరుణ్‌ సందడి చేశారు. వీరంతా తమ సినిమాల ప్రమోషన్లలో భాగంగా గ్రాండ్‌ ఫినాలేకు హాజరయ్యారు.

అయితే మరోవైపు ఈరోజు బిగ్‌ బాస్‌ సీజన్-7 విన్నర్‌ ఎవరో తెలిసిపోనుంది. కానీ అంతకంటే ముందు టాప్-6లో ఉన్న కంటెస్టెంట్స్‌కు సూట్ కేస్‌ ఆఫర్‌ తీసుకొచ్చారు. అల్లరి నరేశ్, రాజ్‌ తరుణ్ సూట్‌కేసుతో హౌస్‌లో అడుగుపెట్టారు. 'రండి బాబు రండి.. ఆలోచిస్తే ఆశాభంగం' అంటూ అల్లరి నరేశ్‌ వారికి సూట్‌కేస్‌ కోసం రండి వేలంపాట మొదలెట్టాడు. ఆ తర్వాత ఇన్ని రోజుల కష్టపడి ఉట్టి చేతులతో బయటికెళ్లడమా? అంటూ రాజ్ తరుణ్‌ టెంప్టింగ్ అయ్యేలా సలహా ఇచ్చాడు. 

అయితే ప్రోమో చివర్లో మాస్ రవితేజ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అమర్‌దీప్‌కు ఎవరు ఊహించని ఆఫర్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ గేట్స్ తెరిచి ఉన్నాయి.. నువ్వు బయటకి వస్తే నెక్ట్స్‌ సినిమాలో రవితేజతో పాటు నటిస్తావ్ అన్నారు. అంతేకాకుండా అమర్‌కు కేవలం 7 సెకన్లు మాత్రమే టైం ఇచ్చాడు. దీంతో అమర్‌దీప్‌ మరో ఆలోచన లేకుండా పరుగుత్తాడు. అయితే అమర్‌దీప్‌ నిజంగానే బయటికొచ్చేశాడా? చివరి నిమిషంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఇవాళ ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేను మిస్ అవ్వకండి. 

(ఇది చదవండి: Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement