
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): రాజస్థాన్ రాష్ట్రం సిటీ ఆఫ్ టైగ్రేసెస్ రంతంపోర్ ప్రాంతంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి మిసెస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలకు ఆంధ్రా యూనివర్సిటీ స్కాలర్, ఏవీఎన్ కళాశాల ఇంగ్లిష్ విభాగాధిపతి, శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్(సేవ) అధ్యక్షురాలు పైడి రజని ఎంపికయ్యారు. గతేడాది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను ఈమె గెలుచుకున్నారు.
ఆలిండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్యం, ప్రాంతీయ నృత్యం, ప్రాంతీయ వంటకాలు, శాస్త్రీయ వేషధారణ, దేశంపై సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల నిర్వహణపై నాలుగు రోజుల పాటు జరగనున్న పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment