Rajani
-
కాగితం కళ: పేపర్ సూపర్
‘హౌ టూ....’ అని గాలించేందుకు అప్పట్లో గూగులమ్మ లేదు. రిఫర్ చేసేందుకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేవు. ‘కాగితం కళ’పై చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకున్న మేడా రజని ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో తనకు తోచిన రీతిలో రకరకాల డిజైన్లు చేసేది. ‘కాగితం కళ’ అనేది ఆమె బాల్య జ్ఞాపకం కాదు. బతుకు బాట వేసిన సాధనం. ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న ఉత్తేజం....ప్రకృతి పాఠశాలలో ఎన్నో నేర్చుకోవచ్చు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం గిలకలదిండికి చెందిన రజనికి ప్రకృతి ప్రసాదమైన పూలను చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం. విరబూసిన పూల నుంచి స్ఫూర్తిపొంది, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టేది. ‘పేపర్ క్విల్లింగ్’ ఆర్ట్‌ని సాధన చేసేది. ఇది తన అభిరుచి మాత్రమే కాదు ఆర్థికంగా బలాన్ని ఇచ్చింది. తన పరిధిలో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణప్రాంంతాలకు వెళుతూ పేద విద్యార్థులకు ‘పేపర్ క్విల్లింగ్’లో ఉచిత శిక్షణ ఇచ్చేలా చేస్తోంది.‘శ్రీ క్రియేషన్స్’ అనే సంస్థకు శ్రీకారం చుట్టి క్రియేటివ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ శిక్షణా తరగతులను ఆఫ్ లైన్, ఆన్లైన్లో నిర్వహిస్తోంది. ‘సింధు డిజైన్స్’ పేరుతో శుభకార్యాల కోసం అందమైన ఆకృతిలో పేపర్ బ్యాగులు, కాగితపు పూలతో చేసిన ఫ్లవర్ వాజ్‌లు, బొకేలు, పూల జడలు, పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్‌తో చేసిన ఫొటో ఫ్రేమ్‌లు... మొదలైనవి తయారు చేస్తోంది.‘కళ’కున్న గుణం ఏమిటంటే మనల్ని ఖాళీగా కూర్చోనివ్వదు! ఎప్పుడూ ఏదో తెలుసుకునేలా చేస్తుంది. నేర్చుకునేలా చేస్తుంది.‘పేవర్ ఆర్ట్ గురించి నాకు బాగా తెలుసు’ అని ఎప్పుడూ అనుకోలేదు రజిని. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటుంది. విదేశీ కళలకు లోకల్ ఫ్లేవర్ జోడించడం గురించి రకరకాలుగా ఆలోచిస్తుంటుంది.చండీగఢ్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన రజని ‘నా కళ నా దగ్గరే ఉండాలి’ అని అనుకోలేదు. తనకు తెలిసిన కళకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి మరీ కొత్త తరానికి పరిచయం చేస్తోంది.‘క్రియేటివ్ హార్ట్స్– ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అకాడమీ’ జాతీయ స్థాయిలో నిర్వహించినపోటీలో రజని తయారు చేసిన రాధాకృష్ణ పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ ‘గోల్డెన్ బ్రష్ అవార్డు’ గెలుచుకుంది. ఇలాంటి పురస్కారాలు ఆమె ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి.‘అవార్డ్ అందుకున్నాను అనే ఆనందం కన్నా నా వల్ల పదిమంది ఈ కళలో ప్రాంవీణ్యం సాధించారనే విషయం గొప్పగా ఉంటుంది’ అంటుంది రజిని. తన ఆర్ట్‌వర్క్‌కు సంబంధించిన ప్రదర్శనలను దేశంలో ఎన్నోచోట్ల ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్న రజని పేపర్ ఆర్ట్‌లో మరెన్నో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.‘నేర్చుకున్నది ఎప్పుడూ వృథాపోదు’ అనేది ఆమె నోటినుంచి వినిపించే మాట. నిజమే కదా! ఉత్సాహం ఇస్తుంది. ఉపాధి ఇస్తుంది. ఇతరులకు ఉపాధి కలిగించేలా చేస్తుంది. ఎంతో ఇచ్చింది...చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న పేపర్ క్రాఫ్ట్ నాకు ఉత్సాహాన్నిచ్చింది. ఉపాధి కల్పించింది. పేరు తెచ్చింది. నేను కన్న కలలు నిజం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఈ కళలో రాణించేందుకు ఓర్పు, శ్రద్ధ, ఏకాగ్రత, సృజనాత్మకత ఉండాలి. నేర్చుకున్నచోటే ఉండి΄ోకుండా కాలంతో పాటు కొత్త కళలు, సాంకేతికతపై దృష్టి పెట్టాలి.– మేడా రజని– ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం -
Rajni Bector: ఓ విజేత ప్రస్థానం
రజనీ బెక్టార్... సమైక్య భారతంలోని కరాచీ నగరంలో 1940లో పుట్టారామె. తండ్రి అకౌంటెంట్ జనరల్. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం లాహోర్‌లో పెరిగారు. ఆమెకు ఏడేళ్లు నిండేలోపే దేశవిభజన జరిగింది. రజని కుటుంబం భారతదేశానికి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో చదువుకుందామె. కాలేజ్ చదువు పూర్తయ్యేలోపే లూథియానాలోని ఒక వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. ఆమె జీవితంలో కీలకమైన ఘట్టాలు జరిగాయి. గానీ అప్పటికి ఆమె వయసు పదిహేడే. చదువు పూర్తికాకముందే పెళ్లికి తలవంచాల్సి రావడంతో కలిగిన ఆ అసంతృప్తే ఆమెను ఇప్పుడు విజేతగా నిలిపింది. లూథియానాలో అడుగుపెట్టినప్పటి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకునే వరకు సాగిన ఆమె విజయయాత్రను సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారామె.ఓ కొత్త ప్రపంచం ‘‘నేను లూథియానాకి వచ్చేనాటికి అది చాలా చిన్న పట్టణం. ఢిల్లీ నుంచి వచ్చిన నాకు లూథియానాను పట్టణం అనడానికి కూడా మనసొప్పేది కాదు. పట్టణం మొత్తానికి నాలుగు కార్లుండేవి అంతే. మా అత్తగారింటివాళ్లు ఛాందసులు. మా పుట్టింట్లో అమ్మ వైపు, నాన్న వైపు వాళ్లందరూ ఉన్నత విద్యావంతులు, విశాల దృక్పథం కలిగిన వాళ్లు. అత్తగారిల్లు– పుట్టిల్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నం. దాంతో నేను కొత్త మనుషుల మధ్యకు మాత్రమే కాదు, ఏకంగా కొత్త ప్రపంచంలోకి వచ్చి పడ్డాననే చెప్పాలి. వంటతో స్నేహంనాకు రకరకాలు వండడం, కొత్త వంటలను ప్రయత్నించడం హాబీ. ఆ హాబీయే నాకు పెద్ద ఆలంబన అయింది. స్నేహితులను, బంధువులను ఇంటికి ఆహ్వానించడం వారికి చేసి పెట్టడం, వారు ప్రశంసిస్తుంటే పొంగిపోవడమే జీవితంగా మారిపోయాను. హీరో మోటార్ కార్పొరేషన్‌కు చెందిన బ్రిజ్మోహన్ ముంజాల్, ఎవన్ సైకిల్స్ కంపెనీకి చెందిన పహ్వాస్లు ‘లూథియానా ప్రజలకు మంచి వంటలను రుచి చూపిస్తున్నావ్’ అన్నారు. అప్పటి ఎమ్ఎల్ఏ ఒకరు తన మనుమరాలి పెళ్లికి కేటరింగ్ చేసి పెట్టమని అడిగారు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. స్థాణువులా ఉండిపోయాను. ఎలాగో ధైర్యం చేసి అంగీకారంగా తలూపాను. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో రెండు వేల మందికి వంటలు చేయించాను. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏ వేడుక జరిగినా నాకు కబురు వచ్చేది. అయితే అవేవీ కమర్షియల్ సర్వీస్‌లు కాదు, స్నేహపూర్వక సర్వీస్లే. కొంతకాలానికి ఇంట్లోనే కుకరీ క్లాసులు మొదలు పెట్టాను. అప్పుడు మా అత్తగారు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇంట్లో మగవాళ్లు వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నారు, నువ్వు క్లాసులు చెప్పి సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని కోప్పడ్డారు. మా వారు నాకు మద్దతుగా నిలవడంతో ఆ పెనుతుఫాను సమసిపోయింది. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జైన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సలహాతో అందులో ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, బేకరీ కోర్సులో చేరాను. పిల్లలు కొంచెం పెద్దయి బోర్డింగ్ స్కూల్‌కెళ్లిన తర్వాత నేను కాలేజ్‌లో చేరడంతో ఇంట్లో నాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు. యూనివర్సిటీలో అడుగు పెట్టగానే నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. పెళ్లి కారణంగా చదువాపేసినప్పటి నుంచి మనసులో దాగి ఉన్న దిగులు ఒక్కసారిగా ఎగిరిపోయింది. కోర్సు పూర్తి కాగానే మా వారిచ్చిన ఇరవై వేలతో 1978లో క్రిమికా ఐస్‌క్రీమ్ యూనిట్ ప్రారంభించాను. ‘క్రీమ్ కా’ అనే అర్థంలో పెట్టానా పేరు. లూథియానాలో క్వాలిటీ ఐస్‌క్రీమ్ స్టాల్ పక్కన నేను స్టాల్ తెరిచాను కాని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను కాదని మా యూనిట్‌కి ఎవరైనా వస్తారా అనే భయం చాలా రోజులు వెంటాడింది. అయితే నేను స్టాల్లో కూర్చోవడం లూథియానాలో మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఇంట్లో మగ్గిపోకుండా బయటకు వచ్చి ఏదైనా సాధించాలనే తపన ఉన్న వాళ్లందరూ తమ ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి నన్ను మోడల్‌గా చూపించేవారు. నా ఐస్‌క్రీమ్‌కి కూడా ఆదరణ పెరగసాగింది.ఐస్‌క్రీమ్‌తో మొదలు బిస్కట్ వరకు క్వాలిటీని కాదని మా స్టాల్‌కి రావాలంటే వాళ్లకంటే ఎక్కువగా చేయాలి. ఐస్‌క్రీమ్‌తోపాటు బ్రెడ్, బిస్కట్ వంటి బేకరీ ఫుడ్ చేయడం మొదలు పెట్టాను. మా స్టాల్‌ను విస్తరించి జీటీ రోడ్లోకి మార్చాం. అంతా గాడిలో పడిందనుకునే సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలైంది. పంజాబ్ అట్టుడికిపోయింది. అనంతరం దేశం మొత్తాన్ని కుదిపేసిన దుర్ఘటన ఇందిరాగాంధీ హత్య జరిగింది. అప్పటికి వందేళ్ల నుంచి మా కుటుంబం చేస్తున్న ధాన్యం, ఎరువుల వ్యాపారం స్తంభించిపోయింది. రైతులతో సంబంధాలు తెగిపోయాయి. బెదిరింపులు ఎక్కువయ్యాయి. మా పెద్దబ్బాయి మీద అపహరణ ప్రయత్నం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే.. 1990 నుంచి నా ఫుడ్ బిజినెస్సే ఇంట్లో అందరికీ ఫుడ్ పెట్టింది. ఇంట్లో అందరమూ క్రిమికా కోసమే పని చేయడం మొదలుపెట్టాం. పదహారు గంటల పని ఇప్పుడు క్రిమికాకు సంబంధించిన రోజువారీ బాధ్యతలేవీ లేవు. కానీ కీలకమైన సమయాల్లో రోజుకు పదహారు గంటలు పనిచేశాను. ఆహారం మీద నాకున్న ప్రత్యేకమైన అభిరుచే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. విజేతగా నిలబెట్టింది. నేను నా టేస్ట్బడ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. క్వాలిటీ చెక్‌లో భాగంగా ప్రతిదీ రుచి చూడాలి. కేవలం రుచి మాత్రమే చూడాలి. కడుపు నిండా తినకూడదు. కడుపు నిండితే రుచిని గ్రహించే శక్తిని కోల్పోతాం. ఆ నియమం పాటిస్తేనే విజయం మనదవుతుంది. ఈ దేశంలో జీవించాలని వచ్చాం. ఇక్కడే సవాళ్లనెదుర్కొన్నాం. జీవితాన్ని వెతుక్కున్నాం. మూడేళ్ల కిందట పద్మశ్రీ పురస్కారం అందుకున్నాను. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది’’ అన్నారు రజనీ బెక్టార్. మెక్‌డీ బర్గర్లో మా బన్నుమెక్ డొనాల్డ్ ఫుడ్ చైన్ మనదేశంలో అడుగుపెట్టింది. వాళ్లకు అవసరమైన బన్ కోసం బేకరీలన్నింటినీ సందర్శించారు. మా బేకరీని ఎంపిక చేసుకున్నారు. అయితే వారికి కావల్సిన నియమాలు, పరిమితులకు లోబడి తయారు చేసి ఇవ్వడానికి ఒక ఏడాదిపాటు ఎక్సర్సైజ్ చేశాం. మధ్యప్రదేశ్‌లో పండే నాణ్యమైన గోధుమల పిండితో చేసిన బన్ వారి ఆమోదం పొందింది. మొదట్లో కొంత నష్టం వచ్చినప్పటికీ క్వాలిటీ కంట్రోల్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఇక మాకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మెక్‌డీకి అవసరమైన సాస్ ΄్లాంట్ కూడా పెట్టాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లో కూడా వేగంగా విస్తరించగలిగాం. టర్నోవర్ ఏడు వేల కోట్లకు చేరింది. మా ముగ్గురబ్బాయిలు బాధ్యతలు పంచుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు మూడవ తరం అడుగుపెట్టింది. మా మనుమడు ఢిల్లీ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. -
Nidhi: బామ్మ మాట.... బిజినెస్ బాట
పెద్దల మాట పెరుగన్నం మూట అని ఊరికే అనలేదు. పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే పెద్ద వ్యాపార సూత్రంగా మారింది. ముంబైకి చెందిన రజని, నిధి ‘గ్రాండ్మా సీక్రెట్’ పేరుతో సరదాగా ప్రారంభించిన హోమ్ మేడ్ హెయిల్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుతోంది. దీనిని బట్టి ఏదైనా పాతకాలం నాటి కబుర్లు చెప్పినా, పాతపద్ధతులు పాటించినా, అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసే వారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో! ఎందుకంటే అప్పటి పాత ఫార్ములానే కదా... ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది. నిధి టుటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపటం అలవాటు. నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళవించి ఒక విధమైన తలనూనెను తయారు చేసేది. అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్‌తో నిధి తలకు మర్దనా చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది. అమ్మమ్మ చేతి నూనె మహాత్మ్యం వల్ల నిధికి తోటి విద్యార్థినులందరూ కుళ్లుకునేంత నల్లటి ఒత్తైన కేశనిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది. ఇంతలో దేశాన్నంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి గురుగ్రామ్‌ను కూడా వదల్లేదు. అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదల్లేదు. ఫలితంగా నిధి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడటం మొదలు పెట్టింది. క్రమంగా ఆమెను ఇతరులెవరూ పోల్చుకోలేనట్లు తయారైంది. అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది. తన అమ్మ నుంచి ఆ నూనె తయారీ ఫార్ములాను తెలుసుకుని, తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సాయం చేయగలరా అని అడిగింది. కోడలు చెప్పిన ఫార్మూలాను ప్రయత్నించింది అత్తగారైన రజని. ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్‌ను నిధి తలకు రాసి మర్దనా చెయ్యడం మొదలు పెట్టారు ఆ అత్తాకోడళ్లు. ఆశ్చర్యం! కొద్దిరోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాన్నిచ్చింది. పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్ల వాళ్లు అది గమనించి, ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. తమకు కూడా అలాంటి ఆయిల్ తయారు చేసి ఇమ్మని అడగడమే కాదు, అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుంది అనిపించింది నిధికి. దాంతో తన నానమ్మ రజని సాయంతో, అమ్మ సహకారంతో ఆయిల్ తయారీ ఆరంభించింది. వీరి ఆయిల్ గురించి ఆ నోటా ఈ నోటా కాదు... కొన్ని డజన్ల వాట్సాప్ గ్రూపులలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితం అయిన ఆయిల్ తయారీ పెద్దఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది. దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి, రజిని దువా కలిసి ‘నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్’ పేరుతో ఒక సరికొత్త ఆయిల్ బ్రాండ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఫలితంగా అందరి జుట్టు పెరగడం మాట ఎలా ఉన్నా, వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇప్పుడు నిధి, రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్ 67,000 ఇళ్లకు చేరింది. నెలకు లక్ష బాటిళ్ల తయారీతో నెలకు సుమారు యాభై లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. అమ్మమ్మ ఫార్మూలా ప్రకారం ఇప్పుడు నిధి, ఆమెతో పాటు ఆమె నానమ్మగారు... స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటలపాటు మరగబెడుతూ, కలుపుతూ తయారు చేసిన ఈ హోమ్ మేడ్ ఆయిల్ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిళ్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది. పాత కాలం నాటి ఫార్ములాను తేలికగా చూసే వాళ్లు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడటం సాధ్యం అవుతుందేమో! -
ACB raids: తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ తనిఖీలు..
జమ్మికుంట/వరంగల్‌క్రైం: రెండు అంతస్తుల ఇల్లు.. 21 ఇంటి స్థలాలు.. ఏడు ఎకరాల భూమి.. కిలోన్నర బంగారం.. ఇతరత్రా కలిపి మార్కెట్ వి లువ ప్రకారం రూ.12 కోట్ల ఆస్తులు. ఇవన్నీ జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజనికి చెందిన హనుమకొండలోని ఇంటితోపాటు మరో ఐదు చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో వెలుగుచూశాయి. ఉదయం నుంచి హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీ, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ రజని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అమె బంధువులు, సన్నిహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒక్కో చోట ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఆమె గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. రూ.12కోట్ల అక్రమాస్తులు.. తహసీల్దార్ మర్కల రజనిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో ఆరు చోట్ల దాడులు నిర్వహించామన్నారు. రజనికి హనుమకొండలో కేఎల్ఎన్రెడ్డి కాలనీలో రెండు అంతస్తుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ.25లక్షలు, లాకర్లు, ఇంట్లో కిలోన్నర బంగారం, ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు తెలిపారు. దీని విలువ (ప్రభుత్వ విలువ ప్రకారం) రూ.3.25 కోట్లు. ఇందులో సుమారు రూ.3కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ రమణామూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ రజనిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. -
‘ఫైవ్స్ వరల్డ్ కప్’లో భారత మహిళల జట్టు కెప్టెన్‌గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘హాకీ ఫైవ్స్’ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యతిమరపు రజని కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఎఫ్ఐహెచ్ అధికారికంగా నిర్వహించే ఈ టోర్నీ ఒమన్‌లోని మస్కట్‌లో జనవరి 24నుంచి 27 వరకు జరుగుతుంది. గోల్‌కీపర్ రజని భారత్‌కు 96 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. భారత జట్టుకు మహిమా చౌదరి వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా...బన్సారి సోలంకి, అక్షతా అబాసో ఢేకలే, జ్యోతి ఛత్రి, మరియానా కుజుర్, ముంతాజ్ ఖాన్, అజ్మినా కుజుర్, రుతుజ దాదాసొ పిసాల్, దీపిక సోరెంగ్ ఇతర జట్టు సభ్యులు. టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్ ‘సి’లో భారత్‌తో పాటు నమీబియా, పోలండ్, అమెరికా ఉన్నాయి. ఫిజి, మలేసియా, నెదర్లాండ్స్, ఒమన్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా, న్యూజిలాండ్, పరాగ్వే, థాయిలాండ్, ఉరుగ్వే కూడా పాల్గొంటున్నాయి. ఆ తర్వాత జనవరి 28నుంచి 31 వరకు జరిగే పురుషుల ‘హాకీ ఫైవ్స్’ ప్రపంచకప్‌లో భారత సారథిగా సిమ్రన్‌జిత్ సింగ్ ఎంపికయ్యాడు. సూరజ్ కర్కేరా, ప్రశాంత్ కుమార్, మన్దీప్ మోర్, మంజీత్, రాహీల్, మణీందర్, పవన్ రాజ్‌భర్, గుర్జోత్ సింగ్, ఉత్తమ్ సింగ్ జట్టులో ఇతర సభ్యులు. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
‘అభయ హస్తం’పై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రేవంత్‌రెడ్డి ‘అభయ హస్తం’ ఫైలుపై తొలి సంతకం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీల హామీల అమలును సుగమం చేసేలా దానిని రూపొందించారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగురాలు రజనికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాలను సీఎస్ శాంతికుమారితో కలసి రేవంత్‌రెడ్డి అందజేశారు. మాట నిలబెట్టుకున్న సీఎం: హైదరాబాద్‌లోని న్యూ బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి కుమార్తె రజని. అక్టోబర్ 17న గాందీ భవన్‌కు వచ్చిన ఆమె.. తన వైకల్యం వల్ల ఉద్యో గం దొరకడం లేదని, ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న రేవంత్.. అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారు. గురువారం రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. రజనిని వేదికపైకి ఆహ్వనించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఆమెకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా నెలకు రూ.50వేల వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చారు. మాటను నిలబెట్టుకున్నారంటూ సీఎం రేవంత్‌కు రజని, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కాంగ్రెస్ ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ కార్యకలాపాలను ఫోన్లో చిత్రిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రజనీ అశోక్‌రావ్ పాటిల్‌ను సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలయ్యే దాకా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీలపై ఆయన చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిస్తుండగా విపక్ష సభ్యుల నిరసనను పాటిల్ వీడియో తీశారు. ఆమెను సస్పెండ్ చేయాలంటూ రాజ్యసభ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ధన్‌ఖడ్ అన్ని పార్టీల నేతల అభిప్రాయం కోరారు. ఆమెపై చర్య తీసుకునే ముందు విచారణ జరిపితే బాగుంటుందని వారన్నారు. -
తెలుగులో ఫస్ట్ మూవీ.. పది పేజీల డైలాగ్: సీనియర్ నటి
రజని అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ అప్పటి తెలుగు సినిమా అభిమానులకు ఆమె సుపరిచితురాలు. ఆ కాలంలో ఆమె అందాల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచింది. దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఆగ్ర హీరోల సినిమాల్లోనూ కనిపించింది. ఎలాంటి సినీ నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1985లో ‘బ్రహ్మముడి’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు రజనీ. తొలి సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. సీతారామ కల్యాణం, రెండు రెళ్ల ఆరు, అహ నా పెళ్లంట చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మజ్నులో నాగార్జున , సీతరాముల కల్యాణంలో బాలకృష్ణ సరసన నటించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు సినిమాల్లో ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రజిని మాట్లాడుతూ..' దాసరి నారాయణరావు నుంచి ఫోన్ వచ్చింది. మా అన్నయ్య దాసరి వద్దకు వెళ్లారు. ఈ సినిమాలో మీ చెల్లెలు హీరోయిన్ అని చెప్పారు. నాన్నను అడిగితే నీకు ఇష్టమైతే చేయి అన్నారు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. అప్పట్లో డీడీలో తెలుగు నెలకొకసారి వచ్చేది. నాకేమో తెలుగు రాదు. ఫస్ట్ డేనే కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్. ఈ డైలాగ్స్ అన్నీ మీవే అని ఒకాయన ఓ పది పేజీల నా చేతిలో పెట్టారు. అప్పుడే నాకు చాలా భయమేసింది. ఇక డైరెక్టర్ వస్తే బయటకు పో అనడం ఖాయమని ఫిక్స్ అయిపోయా. ఆయన చెప్పిన వెంటనే వెళ్లిపోదామనుకున్నా. నాకు తెలుగులో నమస్కారం తప్ప ఏమీ రాదు. కాసేపటికే దాసరి నారాయణరావు వచ్చారు. ఆ డైలాగ్ చెప్పడం రాదు సార్ అన్నా. వెంటనే డైలాగ్ పేపర్ ఇచ్చిన ఆయన్ను పిలిచి బయటకు పంపారు. ఆ డైలాగ్ పేపర్ తీసుకుని అవీ చదవడం నాకే కష్టంగా ఉంది నీకెలా వస్తాయన్నారు. ఆ క్షణం నాకు దేవుడిలా కనిపించారు. అప్పుడే ఆయనను గురువుగా భావించా. అంతవరకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నేను కాస్త కూల్ అయ్యా. 1234 వచ్చా అన్నారు. ఏ భాషలోనైనా చెప్పు.. ఏమీ రాకపోతే 1234 చెప్పు చాలు అన్నారు. నా ఫస్ట్ మూవీలో నంబర్స్తోనే నేను డైలాగ్స్ చెప్పా. బ్రహ్మముడి సినిమాతో నా కెరీర్లో తెలుగులో ప్రారంభమైంది. నేను తెలుగులో మాట్లాడాతుంటే నవ్వడం స్టార్ట్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చింది అలనాటి అందాల నటి రజినీ. -
Pydi Rajani: మిసెస్ ఇండియా పోటీలకు విశాఖ మహిళ పైడి రజని
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): రాజస్థాన్ రాష్ట్రం సిటీ ఆఫ్ టైగ్రేసెస్ రంతంపోర్ ప్రాంతంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి మిసెస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలకు ఆంధ్రా యూనివర్సిటీ స్కాలర్, ఏవీఎన్ కళాశాల ఇంగ్లిష్ విభాగాధిపతి, శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్(సేవ) అధ్యక్షురాలు పైడి రజని ఎంపికయ్యారు. గతేడాది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను ఈమె గెలుచుకున్నారు. ఆలిండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్యం, ప్రాంతీయ నృత్యం, ప్రాంతీయ వంటకాలు, శాస్త్రీయ వేషధారణ, దేశంపై సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల నిర్వహణపై నాలుగు రోజుల పాటు జరగనున్న పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొననున్నారు. చదవండి: ఖైదీల బంక్.. రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు.. -
CM YS Jagan: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు, రజని
సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన సింధు బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2022లో తాను గెలిచిన బంగారు పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన విజయాల పట్ల పీవీ సింధు, రజనీని సీఎం జగన్ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన రాష్ట్రానికిచెందిన సుప్రసిద్ధ అంతర్జాతీయ క్రీడాకారులు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజని. కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన ఘనవిజయాలపట్ల అభినందనలు తెలియజేసిన సీఎం. @Pvsindhu1 #Andhrapradesh pic.twitter.com/ZH1Q4ot7Rx — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 25, 2022 -
‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం దక్కకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరుపు రజనికి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆడే ఛాన్స్ లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టులో గోల్‌కీపర్ రజనిని ఎంపిక చేశారు. అమ్మాయిల ప్రపంచకప్ హాకీ ముగిసిన 11 రోజుల వ్యవధిలోనే బర్మింగ్‌హామ్ ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ మొదలవుతాయి. అయితే ఈ జట్టు కోసం పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఫిట్నెస్ లేని స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఈ టోర్నీకి కూడా దూరమవగా, మూడు మార్పులతో కామన్వెల్త్ జట్టును ఎంపిక చేశారు. భారత మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజనీ ఎటిమార్పు, దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెపఎటన్), గుర్జిత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను పుఖ్రంబం, మోనిక, నేహా, జ్యోతి, నవజోత్ కౌర్, సలీమా టేరియా, వందన కటరియా , లాల్రెమ్సియామి, నవనీత్ కౌర్, షర్మిలా దేవి, సంగీత కుమారి చదవండి: FIH Womens Hockey World Cup: ‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్‌కు.. -
భారత మహిళల హాకీ ఫైవ్స్ జట్టు కెప్టెన్‌గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీ జూన్ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరుగుతుంది. -
Savita Punia: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి
Savita Punia To Lead Indian Women Hockey Team: సీనియర్ గోల్‌కీపర్ సవిత పూనియాను భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా నియమించారు. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అనుభవజ్ఞురాలైన సవితకు జట్టు పగ్గాలు అప్పగించారు. ఒమన్‌లోని మస్కట్‌లో ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఇందులో 16 మంది టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి గోల్‌కీపర్ ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు Champions keep playing until they get it right. 🏋️🏃♀️🏑#WeareTeamIndia #SavitaPunia #IndianWomenHockeyTeam #HockeyIndia #gymtime #sportswomen pic.twitter.com/pKTiurTrV1 — Savita Punia (@savitahockey) November 24, 2021 -
జీహెచ్ఎంసీ లో ఉన్నత స్థాయి అధికారిణిగా స్వీపర్ రజనీ
-
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన పీవీ సింధు, రజనీ
-
జాతీయ మహిళల హాకీ శిబిరానికి రజని
టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళల హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇటిమరపు రజని ఎంపికైంది. చిత్తూరు జిల్లాకు చెందిన రజని 2009 నుంచి భారత సీనియర్ జట్టుకు రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తోంది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత జట్టులో రజని సభ్యురాలిగా ఉంది. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన మొత్తం 25 మంది క్రీడాకారిణులకు బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీలో శిబిరం నిర్వహిస్తారు., -
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే రజనీ
-
అన్న, వదిన గొడవ పడుతున్నారని..
జీడిమెట్ల: తన అన్న, వదినల మధ్య గొడవలు జరగడాన్ని తట్టుకోలేక మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చింతల్ చంద్రానగర్‌లో వజ్రాల రామకృష్ణారెడ్డి, రజని(34) దంపతులు నివాసం ఉంటున్నారు. రామకృష్ణా రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా, రజని గృహిణి. ఈ నెల 19న రామకృష్ణారెడ్డి ఉదయం డ్యూటీకి వెళ్లగా అతని కుమార్తె సహస్ర స్కూల్‌కు వెళ్లింది. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన సహస్ర తలుపు తట్టగా తల్లి ఎంతకూ తెరవకపోవడంతో కింది పోర్షన్లో ఉంటున్న వర్మకు విషయం చెప్పింది. ఆయన తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా రజని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. రజని రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.’ తన అన్న వదినల మధ్య గొడవలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు’ అందులో పేర్కొంది. మృతురాలి భర్త రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘నేను సవాల్ చేస్తున్నా..చంద్రబాబు'
పట్నంబజారు(గుంటూరు): ‘నేను సవాల్ చేస్తున్నా.. నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. నాపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా? నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకొంటా.. మరి మీరేం చేస్తారో చెప్పండి.. నా సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?’ అంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఉద్వేగభరితంగా మాట్లాడారు. చంద్రబాబు, ప్రత్తిపాటి చేసిన ఆరోపణలు నిరూపించకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లి కోటి అనే వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు, ప్రత్తిపాటిలు నీచరాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేగా తాను బరిలోకి దిగే సమయం నుంచి కోటి వ్యవహరించిన తీరు తనను మానసికంగా ఇబ్బందికి గురిచేసిందన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూనే ఉన్నాడని.. అతని చేష్టలు శృతిమించడంతో తమ పార్టీ కార్యకర్తలు పోలీసులకు íఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందుకే బీసీ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అన్యాయానికి అండగా నిలబడుతున్నారని మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో చంద్రబాబుకు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. జిల్లాలో ముగ్గురు మహిళలకు సీట్లిచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది అయితే.. ఒక్క సీటు కూడా ఇవ్వని చంద్రబాబుకు మహిళలపై ఉన్న గౌరవమేంటో తెలుస్తోందన్నారు. అనంతరం పిల్లి కోటి పెట్టిన పోస్టింగ్, అనుచిత వ్యాఖ్యలను మీడియాకు చూపారు. -
స్టోక్ కాంగ్రీపై మనోళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు లదాఖ్ ప్రాంతంలోని 6,153 మీటర్ల స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని అధిహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లికల్ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్. అఖిల్‌లు ఈ పర్వతాన్ని అధిరోహించారు. ఈ యాత్రకు సంబంధించి తనకు ఆర్ఎస్ ప్రవీణ్ తోడ్పాటునందించారని మల్లికార్జున తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీలపై అభిమానంతో సాయికిరణ్ బ్యానర్ ప్రదర్శించారు. -
వినియోగదారుల అక్కయ్య
80ల కాలంలో వినియోగదారులకు ఒక అక్కలా మార్గం చూపించిన పాత్ర రజని. తూనికల్లో, కొలతల్లో ఆటో చార్జీలలో, స్కూలు ఫీజుల్లోమధ్య తరగతివాడు ఎలా మోసపోతున్నాడో, నష్టపోతున్నాడో చూపించి, మేల్కొల్పిన పాత్ర రజని. వినియోగదారుల ఉద్యమందేశంలో ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ఈ పాత్ర, పోషించిన నటి ప్రియా టెండూల్కర్ ఎప్పటికీ గుర్తుండిపోతారు.రజని’ సీరియల్ అనగానే గంజిపెట్టిన చిన్న అంచు కాటన్ చీరలు, ముడివేసిన కొప్పు, నుదుటన పెద్దబొట్టు..‘ నాటి ప్రేక్షకుల మదిలో ఓ మధ్యతరగతి గృహిణి ఇమేజ్ అలాగే కళ్లముందు నిలిచిపోయింది. అలాగే, మొదటిసారి వినియోగదారుల హక్కుల విషయంలో అవగాహన కలిగించడానికి ‘రజని’ సీరియల్‌తో పెద్ద సాహసమే చేసింది దూరదర్శన్. సామాన్యుని పెన్నిధి ‘రజని’ దూరదర్శన్‌లో వచ్చే సీరియల్స్ నాడు విభిన్న తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవి. అలాంటి సమయంలో ముంబయ్ చిత్ర దర్శకుడు బసు ఛటర్జీకి ఒక ఆలోచన వచ్చింది. రచయిత కరన్ రజ్దాన్, అనిల్ చౌదరీలు ఛటర్జీ ఆలోచనను పంచుకున్నారు. సామాన్య మానవుడు ఎదుర్కొనే కష్టనష్టాలను రాసుకున్నారు. పిల్లాడికి స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా, ఇంటికి సమయానికి గ్యాస్ సిలిండర్ రావాలన్నా, నిత్యావసర సరుకుల కొనుగోలులో మోసాలున్నా, ఆటో–రిక్షా డ్రైవర్ల ఆగడాలను కట్టిపెట్టాలన్నా.. ఇవన్నీ సామాన్యుడు ఎదుర్కొనే సమస్యలే. ఇవన్నీ ఆ సామాన్యుడు ఎదురు తిరిగితేనే వాటికి అడ్డుకట్టవేయడం సాధ్యం. ఆ సామాన్యుడు మగ అవడం కంటే ‘ఇల్లాలు’ అయితే.. అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘రజని.’ ఏడాదికి సరిపడా కథనాలు సిద్ధమయ్యాయి. అవినీతి వ్యవస్థపై పోరాటం, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో ముందుండే రజని 1985లలో బుల్లితెరపై ప్రతీ ఆదివారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ప్రియా ‘రజినీ’ టెండూల్కర్ ప్రియ తన బాల్యం నుండే కళలు, సంస్కృతి పట్ల మొగ్గు చూపేవారు. ఆమె తండ్రి ప్రముఖ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ టెండూల్కర్. ముంబయ్‌లోనే పుట్టి పెరిగారు. పద్నాలుగేళ్ల వయసులో మొదటిసారి మరాఠీ స్టేజీ మీద నటించింది. ఆ తర్వాతి కాలంలో .. ఫైవ్‌స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్, ఎయిర్ హోస్టెస్, పార్ట్–టైమ్ మోడల్, న్యూస్ రీడర్.. ఇలా భిన్నమైన ఉద్యోగాలు చేసింది.1974లో శ్యామ్ బెనెగల్ ‘అంకుర్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత వరసగా డజన్ మరాఠీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక కన్నడ సినిమాలోనూ నటించింది. 1985లో ‘రజని’ టీవీ సీరియల్ ద్వారా ఇండియా మొత్తం ప్రియ పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘స్వయంసిద్ధ’ అనే టీవీ సీరీస్‌లోనూ నటించింది. ప్రియ సహజంగానే స్వేచ్ఛావాది. సామాజిక కార్యకర్త కూడ. సామాజిక సమస్యల మీద ఎలాంటి భయం లేకుండా తన భావాలను బయటపెట్టేది. ప్రియా నిర్వహించే ‘జిమ్మెదార్ కౌన్’అనే టాక్ షోలో ఆమె ఒక మండే అగ్నికణంలా ప్రేక్షకులకు కనిపించేది. ‘పూజ న ఫూల్’ అనే గుజరాతీ సినిమాలోనూ ముఖ్యపాత్ర పోషించారు ప్రియ. ఆ మూవీ ద్వారా పెద్ద విజయాన్ని అందుకుంది. రజనీ సీరియల్లో సహనటుడైన కరణ్ రాజ్దాన్ను 1988లో పెళ్లి చేసుకున్న ప్రియ కుటుంబ కలహాలతో 1995లో విడిపోయింది. కొన్నేళ్లపాటు రొమ్ముక్యాన్సర్‌తో పోరాడిన ప్రియ అనే రజని 2002 సెప్టెంబర్‌లో గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. నిజాల నిగ్గు తేల్చే గృహిణి రజని ఒక ఆవేశపూరితమైన మహిళ. ఆమె దేనికీ భయపడదు. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరిస్తుంది. నిజాల నిగ్గు తేలుస్తుంది. ఆమె కుటుంబం మొదట కంగారుపడుతుంది తప్ప, ఎదురు చెప్పదు. తమ చుట్టుపక్కల పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా, టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఆటో, రిక్షా డ్రైవర్ల సమస్య అయినా.. జనం తరపున పోరాడటానికి రజని ముందుంటుంది. రాజకీయనాయకులు, పోలీసు అధికారులను సైతం హెచ్చరించడానికి ఆమె ఏ మాత్రం వెనుకాడదు. చెడును చూసినప్పుడు వెనకడుగువేసే ప్రసక్తేలేదు. ధైర్యంగా పోరాడుతుంది. వ్యవస్థతో పోరాడటానికి తన గొంతుకను వినిపించడానికి ఏ మాత్రం వెనుకంజవేయదు. ‘మగవాడు ఎంతటి కఠిన మార్గం మీదనైనా వెళతాడు, ఆడది అతణ్ణి అనుసరించాలి’ అని చెప్పే పెద్దల నీతి మాటలను రజని తప్పని చూపుతుంది. మార్గం ఎవరికైనా ఒకటే అని రుజువుచేస్తుంది. దారితీసిన ఉద్యమాలు ‘రజని’ ఆదివారం ఉదయం టిఫిన్ ముగించుకునే సమయానికి వచ్చేది. అరగంటపాటు అర్థవంతమైన సమస్యలపై సామాన్య మానవుడు పడే అగచాట్లను చూపేది. అన్ని ఎపిసోడ్లలో బాగా పాపులర్ అయిన ఎపిసోడ్స్..వంటకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ సమస్య. ఇప్పటిలాగా నాటి రోజుల్లో బుక్ చేసిన రెండు రోజుల్లోనే గ్యాస్ వచ్చేది కాదు. రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇల్లాళ్లు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అంతేకాదు, సిలండర్ డెలివరీచేసే ఏజెంట్లు సృష్టించే సమస్యలూ ఇన్నీ అన్నీ కావు. సామాన్య మానవుల కష్టాలు కాబట్టి ఇది అందరి నాడినీపట్టుకుంది. ముంబయ్‌కి చెందిన ‘ఆల్ ఇండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్’ ఈ షోకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. మరో ఎపిసోడ్లో.. టాక్సీ డ్రైవర్ల వేధింపులు. ‘తమవి చెడ్డ పాత్రలుగా సృష్టించారని, క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని ముంబయ్‌లో 500 మంది టాక్సీ డ్రైవర్లు ఒక ఉద్యమంగా నడుస్తూ దూరదర్శన్ కార్యాలయానికి Ðð ళ్లారు. రజని ప్రభావం ఎంతటిదంటే ఓ నిశ్శబ్ద విప్లవానికి దారితీసింది. భారతీయ బుల్లితెర చరిత్రలో ‘రజని’ ఎప్పుడూ చెప్పుకోదగిన పాత్రగా మిగిలిపోతుంద’ని దర్శకుడు ఛటర్జీ గుర్తుచేసుకున్నారు. పద్మిని కొల్హాపూర్ – ప్రియా టెండూల్కర్ ప్రియా టెండూల్కర్‌కి ముందు ఈ షోకి బాలీవుడ్ నటి పద్మిని కొల్హాపురి అనుకున్నారట.‘అప్పటికే పద్మిని ఇండస్ట్రీలో పెద్ద తార. ఆమెతో ‘రజని’ పైలట్ ఎపిసోడ్ కూడా షూట్ చేశాం. కానీ, ఆ తర్వాత పద్మిని డేట్స్ దొరకడం గగనమైపోయింది. ఆప్పుడు యాక్టర్స్ అయిన అనితారాజ్, బిందియా గోస్వామి, ప్రియలతో విడివిడిగా పైలట్ ఎపిసోడ్స్ షూట్ చేశాం. ప్రియ ‘రజని’కి పర్ఫెక్ట్ అనుకున్నాం. అలా అందరినీ దాటుకొని ప్రియా టెండూల్కర్‌ని ‘రజని’ వరించింది. అది ఆమె కోసమే పుట్టిన సీరియల్ అయ్యింది’ అన్నారు బసు చటర్జీ.పదమూడు ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత ముంబయ్ చర్చిగేట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీరియల్ టీమ్ అంతటినీ దూరదర్శన్ ఘనంగా సత్కరించింది. ఇంతటి ఘనవిజయం సాధించిన సీరియల్ కనీసం ఏడాది పాటు వస్తుందని ఆశించాం. 42 వారాలకు ఎపిసోడ్స్ రష్ సిద్ధం. కానీ, ప్రభుత్వం ఈ సీరియల్‌ని నిలిపివేయమని కోరింది. కారణం, సీరియల్ సామాన్యుడి వైపు ఉండటమే. ఈ సమాధానం మమ్మల్ని చాలా నిరాశపరిచింది’ అని గుర్తుచేసుకున్నారు దర్శకుడు ఛటర్జీ.‘రజని’ సీరియల్ వచ్చిన దాదాపు 27 ఏళ్లకు అమీర్‌ఖాన్ ‘సత్యమేవ్ జయతే’ అంటూ స్టార్ ప్లస్‌లో సామాజిక సమస్యల అవగాహనపై ఓ కార్యక్రమం చేశారు. బాలీవుడ్ స్టార్‌ని సైతం ‘రజని’ సీరియల్ ఈ విధంగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.– ఎన్.ఆర్ -
రజనీ 132
చార్మినార్: నగరంలో జీఓ నంబర్ 132 మళ్లీ తెరపైకి వచ్చింది. బోనాల ఉత్సవాల్లో రజనీ అనే ఏనుగు పాల్గొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. సోమవారం సచివాలయంలోని సి– బ్లాక్‌లో బోనాల జాతర ఉత్సవాలపై జరిగిన ఉన్నతస్థాయి అధికారులు, ఉత్సవాల నిర్వాహకుల సమీక్ష సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకువచ్చింది. సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులు కోరారు.నగరంలో జరిగే బోనాల జాతర ఉత్సవాలతో పాటు మొహర్రం సంతాప దినాల సందర్భంగా రజనీ అనే ఏనుగునువినియోగించడం ఆనవాయితీగా వస్తుందన్న విషయాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,ఇంద్రకరణ్ రెడ్డిలకు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు జి.నిరంజన్ వివరించారు. అమ్మవారి ఘటాలఊరేగింపులో ఆనవాయితీ.. బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి ఘటం ఊరేగింపు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం అమ్మవారి ఘటం ఊరేగింపులతో పాటు పాతనగరంలో అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపులో జూపార్కుకు చెందిన రజనీని ప్రతి ఏటా వినియోగిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అంబారీని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. బోనాల జాతర ఉత్సవాలతో పాటు పదో మొహర్రం సందర్భంగా జూపార్కుకు చెందిన రజనీని వినియోగిçస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించినందున ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తిరిగి హైకోర్టును ఆశ్రయించి బోనాల జాతర ఉత్సవాల్లో ఏనుగు పాల్గొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏమిటీ జీఓ 132.. సెంట్రల్ జూ అథారిటీ విజ్ఞప్తి మేరకు మతపరమైన ఊరేగింపుల్లో రజనీ పాల్గొనరాదని 2009 డిసెంబర్ 22న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 132ను జారీ చేసింది. దీని ప్రకారం మతపరమైన ఊరేగింపుల్లో ఏనుగులు పాల్గొనడానికి అవకాశాలు లేకుండాపోయాయి. అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఫిర్యాదులు, చర్చలు, సంప్రదింపుల అనంతరం ఏటా బోనాల జాతర ఉత్సవాలతో పాటు మొహర్రం సంతాప దినాల్లో రజనీ ఏనుగు పాల్గొంటోంది. అప్పటి నుంచి జీఓ 132 కొనసాగుతున్నప్పటికీ.. ఏయేటికాయేడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఓ 132ను రిలాక్స్ చేస్తూ మెమోలు జారీ చేయడంతో మతపరమైన ఊరేగింపుల్లో జూపార్కుకు చెందిన ఏనుగు పాల్గొంటూ వస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ఉత్సవాల నిర్వాహకుడు తమకు ఏనుగును ఇవ్వడం లేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏ ఉత్సవాల్లో రజనీని వినియోగించరాదంటూ హైకోర్టు మార్చి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రజనీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు. చర్యలు చేపట్టాలి.. రానున్న బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్నో దశాబ్దాలుగా బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అంబారీని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధిత ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించి బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ ఏనుగు పాల్గొనేలా చర్యలు చేపట్టాలి. – జి.నిరంజన్, అక్కన్న మాదన్న దేవాలయ చైర్మన్ -
లేడీ బాండ్
ఈ రెండు నెలల్లో రజనీ ఎవరెవరి బ్యాక్‌గ్రౌండ్‌ను తవ్వుతున్నారో తెలుసు కునేందుకు ఆమెలా కొందరు గూఢచర్యం చేశారు కానీ.. రజనీ చిరునవ్వు నవ్వేందుకు తప్ప నోరు మెదపనేలేదు. చివరి విడత ఎన్నికల తర్వాత ఈ లేడీ బాండ్ తనకు అనువైన విశ్రాంతి విడిది కోసం రహస్యాన్వేషణ ప్రారంభించవచ్చు. ఇంగ్లండ్ రచయిత్రి అగాథా క్రీస్టీ నవలల్లో ‘మిస్ మార్పుల్’ అనే కల్పిత పాత్ర ఉంటుంది. మిస్ మార్పుల్ పెద్దావిడ. అవివాహిత. ‘సెయింట్ మేరీ మీద్’ అనే గ్రామంలో నివసిస్తుంటుంది. అదీ కల్పిత గ్రామమే. మార్పుల్ గూఢచారి. తొలిసారి ఆమె పాత్ర లండన్ నుంచి వెలువడే ‘ది రాయల్ మ్యాగజీన్’ 1927 డిసెంబరు సంచికలో వచ్చిన ‘ది ట్యూస్డే నైట్ క్లబ్’ ఒక చిన్న కథలో కనిపిస్తుంది. తర్వాత 1930లో క్రీస్టీ రాసిన ‘ది మర్డర్ ఎట్ ద వికారేజ్’ నవలలో కీలకమైన పాత్రగా కథను నడిపిస్తుంది. క్రీస్టీ ఇప్పుడు లేరు. నాలుగు దశాబ్దాల క్రితమే చనిపోయారు. మిస్ మార్పుల్ ఇప్పటికీ ఉంది. బహుశా ఎప్పటికీ! ప్రస్తుతం మిస్ మార్పుల్.. మన దగ్గర రజనీ పండిత్ రూపంలో ముంబైలో ఉంది! భారతదేపు తొలితరం ప్రైవేట్ మహిళా డిటెక్టివ్ రజని. అపరాధ పరిశోధనలో మాత్రమే కాదు, అంతుచిక్కని వ్యూహాలను ఛేదించడంలోనూ రజని ఎక్స్పర్ట్. ఎన్నో హత్యల్ని సాల్వ్ చేశారు. అపార్థాలతో నలిగిపోతున్న ఎందరో దంపతుల జీవితాలను చక్కబరిచారు. పేరున్న కంపెనీల్లో జరిగే విద్రోహాలను కనిపెట్టారు. ఇవన్నీ చేయడం కోసం ఆమె అనేక వేషాలు వేశారు. పనిమనిషిగా, చూపులేని మనిషిగా, గర్భిణిగా, మందమతిగా.. ఇలా అనేకం. అన్నీ కూడా తెర వెనుక ఉన్నదానిని, జరుగుతున్నదానిని బయటికి లాగేందుకే. కొన్నిసార్లు పరిస్థితులు ప్రాణాంతకం అయ్యేవి. అయినా ఆమె ధైర్యం వీడలేదు. ధైర్యం కాదు. తెగింపు అది. మిస్ మార్పుల్ లానే రజనీ కూడా అవివాహితగానే ఉండిపోయారు. ప్రస్తుతం ఆమెకు 57 ఏళ్లు. క్రీస్టీ పాత్ర మిస్ మార్పుల్తో రజనీని పోల్చడం ఎందుకంటే గూఢచర్యంలో ఆ పాత్రకు సరిసాటిగా రజనీ జీవితం నిరంతరం గుట్టు మట్లను వెలికి తీయడంలోనే గడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇంకా బిజీ. ఎన్నికల స్కెడ్యూలు మొదలైనప్పటి నుంచీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గురించి ఆరా తియ్యడానికీ, ఆ అభ్యర్థులకు పోటీగా నిలబడిన ప్రత్యర్థుల బలాలను, బలహీనతలను కూపీ లాగడానికి రజనీని ఆశ్రయిస్తూనే ఉన్నాయి. చివరి దశ ఎన్నికల పోలింగ్.. వచ్చే ఆదివారంతో పూర్తవుతోంది కనుక రజనీ తయారు చేయబోయే రసహ్య నివేదికలు కూడా ఈ ఒకటీ రెండ్రోజుల్లో ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ‘‘ఆ తర్వాత కొంతకాలం ఏదైనా ఒక అజ్ఞాత ప్రదేశంలో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లొస్తాను’’ అంటున్నారు రజనీ పండిత్. -
అవును మేం విడిపోయాం!
చెన్నై, పెరంబూరు: అవును మేం విడిపోయాం అంటున్నారు నటుడు విష్ణువిశాల్. వెన్నెలా కబడ్డికుళ్లు చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగప్రవేశం చేసిన ఈయన విభిన్న కథా చిత్రాలతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ఇటీవల విష్ణువిశాల్ నటించిన రాక్షసన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆయనకు నటుడు నటరాజన్ కూతురు రజనీకి 2011లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే విష్ణువిశాల్‌కు రజనీకి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇప్పుడు కోర్టు ద్వారా విడాకులు కూడా పొందారట. దీని గురించి నటుడు విష్ణువిశాల్ మంగళవారం తన ట్విట్టర్లో పేర్కొంటూ తాను, రజనీ ఏడాదిగా విడివిడిగా జీవిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు విడాకులు మంజూరయ్యారని తెలిపారు. తమకు ఒక కుమారుడు ఉన్నాడని, అతని మంచి భవిష్యత్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇకపై కూడా తమ కుమారుడి బాగోగులు చూసుకుంటామన్నారు. రజనీ, తానూ చాలాకాలం సంతోషంగా జీవించామని, ఇప్పుడు అనివార్యకారణాలతో విడిపోయినా, స్నేహితులుగానే మెలుగుతామని అన్నారు. ఇది ఇరు కుటుంబాల మంచి కోసమే తీసుకున్న నిర్ణయం అని నటుడు విష్ణువిశాల్ పేర్కొన్నారు. -
రజత రజనికి స్వాగతం
రజని.. మన జిల్లా క్రీడారత్నం. హాకీలో రాణించి జిల్లాకు, దేశానికి పేరు తెచ్చిన ఆణిముత్యం. ఎర్రావారిపాళెం మండలం ఎనుములవారి పల్లె నుంచి అంతర్జాతీయ క్రీడా యవనికపై కీర్తి పతాకాన్ని ఎగరేసిన అమ్మాయి. పల్లె నుంచి ‘ఆట’ంకాలు అధిగమించి ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తూ తాజాగా ఆసియా క్రీడల్లోనూ అపూర్వ ప్రతిభ కనబరిచిందీమె. ఇండియా జట్టు కీపరుగా స్వర్ణావకాశం తప్పినా రజత పతకం సాధించడంలో కీలక భూమిక పోషించింది. జకార్తాలో జరిగిన క్రీడల్లో గెలిచాక శుక్రవారం తొలిసారి తిరుపతి చేరుకున్న ఈమెకు క్రీడాభిమానులు.. వివిధ సంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. ఈమెకు ప్రభుత్వం రూ.6 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. తిరుపతిలో స్వచ్ఛభారత్‌కు రజని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. చిత్తూరు, తిరుపతి సిటీ: 2020లో జరిగే ఒలింపిక్స్‌లో భార త్ మహిళల హాకీ జట్టు తరఫున ఆడి, విజేతగా నిలిచి పతకం సాధించడమే లక్ష్యమని భారత్ మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ యతిమరపు రజని తెలిపారు. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని సి ల్వర్ మెడల్ సాధించి శుక్రవారం మొట్టమొదటి సారిగా తిరుపతికి విచ్చేసిన రజనికి జిల్లా క్రీడాపాధికార సంస్థ అధ్వర్యంలో అధికారులు, క్రీడా సం ఘాల ప్రతినిధులు శ్రీపద్మావతి మహిళ వర్సిటీలో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ 20 ఏళ్ల తరువాత హాకీలో సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. 2016లో ఒకసారి మహిళా వర్సిటీకి వచ్చానని, తిరిగి 2020లో ఒలింపిక్స్‌లో పతకం సాధించి మళ్లీ ఇక్కడికి వస్తానని విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ పతకం సాధించిన రజ నికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు జిల్లా కలెక్టర్ ప్రకటించారని జిల్లా క్రీడాపాధికార సంస్థ సీఈఓ లక్ష్మీ తెలిపారు. విద్యార్థులు రజనీని స్ఫూర్తిగా తీసుకుని చదువులో, క్రీడల్లో రాణిం చాలని కోరారు. తుడా చైర్మన్ నరసింహయాదవ్, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి, మహిళ వర్సిటీ వీసీ దుర్గాభవాని, రెక్టార్ ఉమ మాట్లాడుతూ మారుమూల గ్రామానికి చెందిన రజని నేడు ఇండియా హాకీ జట్టులో స్థానం సంపాదించడం ఎంతో గర్వకారణమన్నా రు. అంతకు ముందు రజనీని మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు దుశ్శాలువతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ చీఫ్ కోచ్ సుదర్శనం నాయుడు, రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మిట్టపల్లి సురేంద్రరెడ్డి, ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్, బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పాండ్రవేటి గిరి, కబడ్డీ కోచ్ బాలాజీ, హాకీ కోచ్‌లు వెంకటరమణ, లక్ష్మీ నారాయణ, జూడో కోచ్ గోపి, రజనీ తల్లిదండ్రులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం రేణిగుంట: భారత హాకీ జట్టు గోల్‌కీపర్ రజనీకి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒంటి గం టకు ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా క్రీడా సాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయా సంస్థల ప్రతినిధులు, విద్యార్థినులు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తిని కనబరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పతకం కోసం తాను పది సంవత్సరాల పాటు శ్రమించానన్నారు. ఈ స్థాయికి వచ్చాక అందరూ గుర్తిస్తున్నారే కానీ, కొన్నేళ్లపాటు తాను ఎన్నో ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. స్మార్ట్ సిటీ అంబాసిడర్‌గా రజని తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి స్మార్ట్ సిటీ బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ హాకీ ప్లేయర్ రజనీ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, కమిషనర్ విజయ్‌రామరాజు చర్చించి ఆమెను తిరుపతి స్మార్ట్ సిటీ బ్రాండ్ అం బాసిడర్‌గా నియమించారు. అలానే స్వచ్ఛ తిరుపతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. హాకీలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రజనీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కమిషనర్ విజయ్‌రామరాజు హర్షం వ్యక్తం చేశారు. ‘సాక్షి’తో కమిషనర్ మాట్లాడుతూ రజనీని విద్యా ర్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తిరుపతి పరపతిని మరింత ఇనుమడింప చేసేందుకు, స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్య పరిచేందుకు రజనీ సేవలను వినియోగించుకుంటామన్నారు. -
బోనాలకు రజనీ రెడీ
చార్మినార్: బోనాల జాతర ఉత్సవాల్లో పాల్గొనడానికి రజనీ సిద్ధంగా ఉంది. ఉత్సవాల్లో రజనీ (ఏనుగు)కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అంబారిపై అమ్మవారి ఊరేగింపును కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో మావటీలు శిక్షణనిస్తున్నారు. నగరంలోని మూడు ప్రతిష్టాత్మకమైన అమ్మవారి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతర ఊరేగింపులో రజినీ పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఎలాంటి అదురు బెదురు లేకుండా అత్యంత ఉత్సాహాంగా బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొంటోంది. 30న ఊరేగింపు ఈ నెల 30న (సోమవారం) సికింద్రాబాద్ ఉజ్జాయినీ మహాంకాళి దేవాలయం అమ్మవారి జాతర ఊరేగింపులో రజనీ పాల్గొంటుంది. ఆగస్టు 5వ తేదీనా బోనాల సమర్పణ రోజు కార్వాన్‌లోని సబ్జిమండి నల్లపోచమ్మ మహాంకాళి దేవాలయం ఉత్సవాల సందర్భగా నిర్వహించే బోనాల జాతరలో రజనీ ఊరేగింపులో ఉంటుంది. 5న శ్రీ అక్కన్న మాదన్న మహాంకాళి దేవాలయం అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొననుంది. ఆరు దశాబ్దాలుగా అంబారీపై అక్కన్న మాదన్న అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగుతూ వస్తోందని దేవాలయం కమిటి అ«ధ్యక్షులు జి.నిరంజన్ తెలిపారు. -
ఆసియా క్రీడలకు రజని
న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్లుగా భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్‌కీపర్ ఇతిమరపు రజని తొలిసారి ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనుంది. ఆగస్టు, సెప్టెంబర్లలో ఇండోనేసియాలో జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టులో రజని రెండో గోల్‌కీపర్‌గా ఎంపికైంది. ఈ నెలలో లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులోనూ ఈ చిత్తూరు జిల్లా క్రీడాకారిణికి స్థానం లభించింది. ఆసియా క్రీడల కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. ఈ క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్‌కీపర్లు), దీప్ గ్రేస్ ఎక్కా, సునీత లాక్రా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మింజ్, మోనిక, ఉదిత, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, రాణి రాంపాల్, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్, నవ్‌జ్యోత్ కౌర్. -
ప్రపంచకప్ హాకీ టోర్నీకి రజని
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి ఇతిమరపు రజని ప్రపంచకప్ టోర్నమెం ట్లో పాల్గొనే భారత జట్టులో ఎంపికైంది. గతేడాది ఆసియా కప్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించిన రజని ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్న∙భారత జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జూలై 21 నుంచి ఆగస్టు 5 వరకు లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్ కీపర్లు), సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మిన్జ్, మోనిక, నేహా గోయల్, నవ్‌జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, రాణి రాంపాల్ (కెప్టెన్), వందన కటారియా, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి, ఉదిత. -
ముగ్గురి ఉసురు తీసిన క్షణికావేశం
త్రిపురాంతకం: క్షణికావేశం ముగ్గురి నిండు ప్రాణాలు గాలిలో కలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తొలుత తన కుమార్తె, కుమారుడికి ఉరేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని మేడపిలో బుధవారం జరిగింది. ఈ సంఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గుమ్మా రజని (26)ని గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మక్కెళ్లపాడుకు చెందిన గుమ్మా అంజికి ఇచ్చి వివాహం చేశారు. భర్త అంజి వ్యవసాయం పనులు చేస్తుండేవాడు. ఆమెకు కుమార్తె మౌనిక (5), కుమారుడు సతీష్ (3) ఉన్నారు. కుటుంబం కలహాల నేపథ్యంలో రజని మేడపిలోని పుట్టింట్లో 20 రోజులుగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు రామతీర్థం వద్ద కూలి పనులకు వెళ్లారు. ఇంటి వద్ద రజని నాయనమ్మ, తాత మాత్రమే ఉన్నారు. చీకటి పడే సమయంలో తొలుత కుమార్తెకు, కుమారుడిని ఫ్యాన్ కొక్కీకి ఉరేసి చంపి ఆ తర్వాత తల్లి రజని కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు నిర్జీవంగా వేలాడుతుండటాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో పొద్దుపోయిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి తల్లి, పిల్లల ఆత్మహత్యతో బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ కమలాకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రేమికురాలి ఆత్మహత్య
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రేమించి పెళ్లాడిన ప్రియుడిని దూరం చేయటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేని ఆ యువతి బహుళ అంతస్తుపై నుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. వాంబేకాలనీలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంబేకాలనీ హెచ్ బ్లాకుకు చెందిన తమ్మిశెట్టి రజని(19) పాలిటెక్నిక్ చదువుకుంది. డోర్నకల్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తుంది. అక్కడే రూం బాయ్‌గా పనిచేస్తున్న గోపితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలి అనుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఈ నెల 16వ తేదీన ఇంటి నుంచి పారిపోయి హైదరాబాదులో వివాహం చేసుకున్నారు. ఆస్పత్రికి వెళ్ళిన రజని తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన దుర్గ మరుసటి రోజు నున్న రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తన కుమార్తె కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేసింది. దుర్గ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రజని, గోపి హైదరాబాదులో ఉన్నట్లు తెలుసుకున్నారు. విషయం దుర్గకు చెప్పడంతో ఆమె రజనికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని వేడుకుంది. ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని తెలిపింది. రజని, గోపి ఇంటికి వచ్చేశారు. గోపీ మైనర్ అని తేలడంతో స్టేషన్‌కు వెళ్లిన ఇరు వర్గాల పెద్దలు రెండేళ్ల తర్వాత వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు రజనిని తల్లి దుర్గకు అప్పగించి ఇంటికి పంపేశారు. గోపిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమించి వివాహం చేసుకున్న తమను పెద్దలు విడదీశారంటూ మనస్తాపానికి గురైన రజని శుక్రవారం మధ్యాహ్నం తల్లి దుర్గ ఇంట్లో వంట చేస్తుండగా మేడపై నుంచి బలవంతంగా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో రజని అక్కడిడక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రజని ఆత్మహత్యకు గల కారణా లపై ఆరా తీశారు. కేసు నమోదుచేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాçప్తు చేస్తున్నట్లు సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు. -
రాతికి ఈతొస్తే?
స్త్రీ జీవితాన్ని రాతిలా మార్చాలని చూస్తుంది సమాజం. బాధ్యతలు, బరువులతో ఆమెను కుటుంబానికి పరిమితం చేస్తుంది. ఉన్న చోటే ఉంచేస్తుంది. అలాగే మిగిల్చేస్తుంది. కాని అన్ని రాళ్లు నీళ్లలో మునిగిపోవు. నీళ్లలో తేలుతాయి. ఈదులాడుతాయి. ముందుకు పోతాయి. రజనీ లక్కా మేలిమి రత్నం. తను కదలడమే కాదు, కదలలేని స్థితిలో ఉన్న ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్’ పిల్లలకు కూడా ఈత నేర్పుతోంది. ఇలా సేవ చేస్తున్న మహిళ రజనీ మాత్రమే. ఎంత గొప్ప ప్రయత్నం! రజని లక్కా. సాధారణ గృహిణి ఒకప్పుడు. అలాగే ఉండిపోయి ఉంటే ఇంత పేరు వచ్చి ఉండేది కాదు. అల్‌జజీరా టెలివిజన్ ఆమెను వెతుక్కుంటూ వచ్చేది కాదు. నేషనల్ మీడియా ఆమె అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూసేది కాదు. 58 ఏళ్ల వయసులో ఆమె ఒక్కసారిగా నీళ్లలోకి డైవ్ చేస్తుంటే కెమెరా లెన్స్‌లు జూమ్ అవుతాయి. స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలను ఒక చేత్తో పట్టుకుని ఈదుతుంటే స్విమ్మింగ్ పూల్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అని మైక్‌లు ఎదురు చూస్తుంటాయి. ఇంతకీ ఆమె ఘనత ఏమిటి? కల... చిగిర్చిన కల... రజని పుట్టిందీ పెరిగిందీ గుంటూరులో. చదివింది సెయింట్ లూథరన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో. చదువుకుంటున్నప్పుడు స్పోర్ట్స్‌లో టీమ్ లీడర్ ఆమె. షాట్‌పుట్, జావెలిన్ త్రోలో మెడల్స్ సాధించి, స్టేట్‌కు రిప్రజెంట్ చేశారు. స్పోర్ట్స్ పర్సన్ కావాలనేది ఆమె కల. ఈ లోపు అవాంతరం. నాన్నకు హార్ట్ ఎటాక్. దాని నుంచి బయటపడినా తండ్రి బాధ్యత ముందుకొచ్చింది. హార్ట్ ఎటాక్ మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందో? తానుండగానే కూతురికి పెళ్లి చేసేయాలనుకున్నారాయన. అలా స్పోర్ట్స్ మీద కలలు పెంచుకున్న రజనికి పదహారేళ్లకే పెళ్లయింది. భర్తతో అనంతపురం జిల్లాకు ప్రయాణం. ఆ తరవాత ఇద్దరు పిల్లలతో బళ్లారిలో కుటుంబ జీవితం. రోజులు గడిచిపోయాయి. పిల్లలు స్కూలుకెళ్లే వయసొచ్చింది. పెళ్లి కారణంగా అణచి వేసుకున్న అభిరుచులు ఒక్కసారిగా పురివిప్పుకున్నాయామెలో. ఆ ప్రస్థానం ఆమె మాటల్లోనే... ‘చదువు మానేసి పెళ్లి చేసుకోవడంతో తెలియని అసంతృప్తి ఉండేది. డాక్టర్లుగా, లాయర్లుగా సెటిల్ అయిన క్లాస్‌మేట్స్‌ను చూసినప్పుడు ఆ అసంతృప్తి మరీ ఎక్కువగా ఉండేది. దాంతో వ్యాపకాల్లో పడ్డాను. మొక్కలు పెంచాను. మూడు వందల రకాల మొక్కలతో ఇంటిని అడవిలా మార్చేశాను. ఎంత పిచ్చి అంటే ఐస్‌క్రీమ్ కప్పులో కూడా చిన్న మొక్కను నాటేదాన్ని. పిల్లల్ని స్కూలుకి పంపించి నేను గార్డెన్‌లోకి వెళ్లేదాన్ని. ఒక్కోసారి పిల్లలు స్కూలు నుంచి వచ్చే వరకు అలాగే గడిచిపోయేది. భోజనం చేయలేదని కూడా గుర్తొచ్చేది కాదు’. లక్ష్యం వైపు ఈదులాట ‘ఆ టైమ్‌లో బ్యూటీషియన్ కోర్స్ పరిచయమైంది. బెంగళూరులో కోర్స్ చేశాను. అప్పుడే నాకు స్విమ్మింగ్ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. అయితే అది శీతాకాలం కావడంతో కోచింగ్ అందుబాటులో లేదు. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయాను. పిల్లలు పెద్దయి ప్రొఫెషనల్ కోర్సుల కోసం హాస్టల్స్‌కి వెళ్లిపోయిన తర్వాత నేను కోల్పోయిన చదువు మళ్లీ గుర్తు రాసాగింది. ఓపెన్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌కు అప్లయ్ చేశాను. తీరా ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్‌కి మా మామగారికి ఆరోగ్యం బాగోలేక నా చదువుకు మరోసారి అవాంతరం. కొంతకాలానికి అంటే 1994లో బళ్లారిలో స్విమ్మింగ్‌పూల్ ఓపెన్ అయింది. అప్పటికి నాకు 34 ఏళ్లు. ఐదు రోజుల్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాను. అంతకంటే ఎక్కువగా ఒక ఆలోచన తొలిచేయసాగింది. చదువుకోలేకపోయిన కారణంగా ఏ మహిళైనా గృహిణిగానే ఉండిపోవాల్సిన పని లేదు. ఇష్టమైన రంగంలో పని చేయాలి, గుర్తింపు తెచ్చుకోవాలనిపించింది. బ్యూటీషియన్ సర్టిఫికేట్ ఉంది... అది చాలు అనుకున్నాను. బళ్లారిలో పార్లర్ ఓపెన్ చేశాను. బయటి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నా లక్ష్యాలు కూడా మారుతూ వచ్చాయి. స్విమ్మింగ్ నేర్చుకోవడమే కాదు నేర్పించాలి అనుకున్నాను. కోచ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఏఎస్సీఏ (అమెరికన్ స్విమ్మింగ్ కోచెస్ అసోసియేషన్) లెవెల్ ఒన్, టూ, త్రీలు పూర్తిచేశాను. కెనడాలో సీఆర్ఆర్ (కెనడియన్ రెడ్ క్రాస్ కోర్స్), న్యూజిలాండ్‌లో ఆస్ట్ స్విమ్ టెస్ట్ పూర్తి చేశాను. మరో సమాజం కనిపించింది! బళ్లారిలో స్విమ్మింగ్‌లో కోచింగ్ ఇస్తున్నప్పుడు మా పనమ్మాయి స్విమ్మింగ్ ఫీజు గురించి అడిగి మళ్లీ మెదలకుండా ఉండిపోయింది. అప్పుడు వాళ్లబ్బాయికి పూల్‌లో పర్మిషన్ తీసుకుని ఫ్రీగా నేర్పించాను. అప్పటి నుంచి పేద పిల్లలకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను. చదువుతోపాటు మరొక టాలెంట్ ఉంటే జీవితంలో అదే ఉపాధిగా మారవచ్చు. స్విమ్మింగ్ లైఫ్ సేవర్ కూడా. ప్రమాదవశాత్తూ నీటిలో పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుతుంది. స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్‌కి ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉంటుంటారు. పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్లను ఎత్తుకోలేక తల్లులు పడే అవస్థ చూసినప్పుడు మనసు పిండేసినట్లనిపించేది. ఇలాంటి పిల్లలకు బస్సు, రైలు నీటిలో పడడం వంటి ప్రమాదం సంభవిస్తే, నిస్సహాయంగా నీటిలో మునిగిపోవాల్సిందేనా? అనుకుంటే గుండె నీరయిపోయినట్లు బాధ. ఇలాంటి పిల్లలకు నేను చేయగలిగింది ఈత నేర్పించడమే. ఇప్పటి వరకు 60 మందికి పైగా పిల్లలకు ఈత నేర్పించి, టోర్నమెంట్లకు తీసుకెళ్లాను. ఉత్తేజ్ (మూగ పిల్లవాడు) ఆరు మెడల్స్ తీసుకున్నాడు. అరవై మందిలో 12 మంది మెడల్స్ వరకు కొనసాగారు. స్విమ్ జర్నీలో మా పిల్లలు బళ్లారికి మొత్తం 64 మెడల్స్ తెచ్చారు. ప్రతిదీ ఒక సంతోషమే. బ్లైండ్ గాళ్స్‌కి నేర్పించినప్పుడు ఎంత సంతోషించానో వాళ్లు ప్రాక్టీస్ మానేసినప్పుడు అంతకంటే ఎక్కువ బాధ పడ్డాను. తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం మామూలు అమ్మాయిల కంటే బ్లైండ్ అమ్మాయిలకు చాలా ఎక్కువ. అందుకే వాళ్లకు కరాటే కోచింగ్ కూడా ఇప్పించాలనుకున్నాను. కానీ అది తీరనేలేదు. అల్ జజీరా చెప్పే వరకు తెలియదు జీవితమంటే ఆస్తుల్ని పెంచుకోవడం కాదు, ఉన్నది తింటూ కూర్చోవడమూ కాదు. పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలి. అప్పుడే మనం తినే అన్నానికి న్యాయం చేసినవాళ్లమవుతాం. ఈ ఆలోచనలే నాతో ఈ పనులన్నీ చేయించాయి. నేను నమోదు చేసింది రికార్డ్ అని అల్ జజీరా వాళ్లు నా దగ్గరకు వచ్చే వరకు నాకు తెలియనే తెలియదు. ‘ఇండియాలోనే కాదు, ఆసియా దేశాల్లోనూ ఇలాంటి సర్వీస్ చేస్తున్న మహిళ లేరు’ అని అల్ జజీరా యాంకర్ చెప్తున్నప్పుడు ఎవరూ మరొకరి కోసం ఇలాంటి చిన్న పని కూడా చేయడం లేదా అనిపించింది. దాంతో నా సర్వీస్‌ని విస్తృతంగా చేయడానికి ‘సాయి రజని స్విమ్మింగ్ లైఫ్ అకాడమీ’, ‘సాయి రజని స్విమ్మింగ్ లైఫ్ ట్రస్ట్’ మొదలు పెట్టాను. నా సర్వీస్‌కి బళ్లారి జిల్లా అధికారులు స్విమ్మింగ్ పూల్‌ను ఫ్రీగా ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు. నా ట్రస్ట్‌కి ఏటా మా రమణారెడ్డి (భర్త) కొంత డబ్బిస్తారు. మిగిలిన డబ్బు నేను సంపన్న వర్గాల పిల్లలకు సమ్మర్ కోచింగ్ ఇచ్చి సంపాదించుకుంటాను. స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్లకు తీసుకెళ్లాలనేది నా ఆకాంక్ష. తెలుగు నేల మీద పుట్టాను, కన్నడ రాష్ట్రంలో నేను నివసిస్తున్న బళ్లారికి ఇన్ని మెడల్స్ తేగలిగాను. తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను చేయగలిగిన పని చేయాలని ఉంది’ అంటున్నారు రజని. గోపీని నడిపించాలి గోపీచంద్ పదకొండేళ్ల పిల్లాడు, రెండు కాళ్లూ లేవు. ఎనిమిదేళ్ల వయసులో ఐస్‌క్రీమ్ కొనుక్కుని పరుగెత్తుకుని వస్తూ బస్సు కింద పడిపోయాడు. రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. ఆ పిల్లాడిని అనాథాశ్రమంలో వదిలాడు తండ్రి. ఓ రోజు ఆర్ఫనేజ్ విజిట్ చేసినప్పుడు గోపీ కనిపించాడు. పెరిగే వయసు, కాళ్లు లేకపోవడంతో వ్యాయామం లేక దేహం పెరిగిపోతోంది. అలాంటి పిల్లలకు స్విమ్మింగ్ చాలా అవసరం. గోపీకి ధైర్యం చెప్పి పూల్‌లో దించాను. రెండు రోజుల్లో బ్యాక్ స్ట్రోక్ పూర్తిగా నేర్చుకున్నాడు. నా చేతిని వదిలేసి ఈత కొట్టసాగాడు. స్టేట్ లెవెల్ పోటీల్లో, ఉదయ్‌పూర్, జైపూర్‌లో జరిగిన పారా స్విమ్మింగ్‌లో మెడల్స్ తెచ్చుకున్నాడు. ఆ వార్తలు రావడంతో గోపీకి ప్రోస్థటిక్ లెగ్స్ డొనేట్ చేయడానికి ఆదిత్య మెహతా కంపెనీ ముందుకొచ్చింది. బస్సు ప్రమాదంలో జరిగిన నష్టాన్ని స్విమ్మింగ్ ద్వారా భర్తీ చేయగలిగానని తృప్తి. ఇప్పటికి సర్వెంట్స్ పిల్లల్ని నలుగురిని చదివిస్తున్నాను. గోపీకి సర్జరీ అయిన తర్వాత నా దగ్గరకే తెచ్చుకుని వాడిని కూడా చదివిస్తాను. బాగా చురుకైన పిల్లాడు. వాడలా నిరాశగా ఉంటే చూడలేకపోతున్నాను. వాడిని నడిపించాలి, అన్ని రకాలుగా వాడు వాడి కాళ్ల మీద నిలబడే వరకు వాడి చేతిని వదలను. ఇంగ్లిష్ చానెల్ మెడల్ తప్పింది! కోచ్‌గా మారడానికి ముందు ఏడెనిమిదేళ్లపాటు స్విమ్మర్‌గా అనేక టోర్నమెంట్లలో పాల్గొన్నాను. మొత్తం 68 మెడల్స్ గెలుచుకున్నాను. 2006లో త్రివేండ్రంలో తొలి మెడల్ అందుకున్నాను, ఆ తరువాత రాజ్‌కోట్, భోపాల్, ఆస్రేలియా, శ్రీలంకల్లో మెడల్స్ అందుకున్నాను. ఇంగ్లిష్ చానెల్ మెడల్ తృటిలో తప్పిపోయింది. పౌర్ణమి రోజు పోటీలు పెట్టకూడదు. కానీ వెస్ట్రన్ పీపుల్‌కి తూర్పు దేశాల మీద ఒకింత చిన్నచూపు ఉంటుంది. అది ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉంటుంది. స్లాట్లు ఇచ్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు. నాకు పౌర్ణమి రోజు సాయంత్రం ఆరుగంటల తర్వాత ఇచ్చారు. బోట్ లో నుంచి నీటిలో దూకి, ఈదుతున్నాను. బోట్‌ను తిరగ్గొట్టేసేటంత పెద్ద అల వచ్చి నన్ను ముంచేయబోయింది. అప్పుడు బోట్లో ఉన్న మహిళ నీటిలో దూకి నన్ను లాగేసింది. ప్రొటెక్షన్ పర్సన్ తాకారంటే ఇక పోటీకి అర్హత ఉండదు. – వాకా మంజులారెడ్డి -
గేలి చేసినా గోల్ చేశా..
అమ్మ తోడ్పాటు, నాన్న కష్టం, శిక్షకుల ప్రోత్సాహం అడవిపల్లె నుంచి నా ప్రతిభను అంతర్జాతీయక్రీడా యవనికపై సుస్థిరం చేశాయి. ఇద్దరు ఆడపిల్లలతల్లి అని మా అమ్మను గేలి చేశారు. హాకీలో శిక్షణ కోసం కురచ దుస్తులు వేసుకుని వెళుతుంటే ఎగతాళి చేశారు. వారిమాటలు నాలో పట్టుదలను పెంచాయి. ఒలింపిక్స్‌లో దేశం నుంచిప్రాతినిథ్యం వహించి, నా పల్లెకు గుర్తింపు తెచ్చాను. హేళన చేసినవారి నుంచే అభినందనలు అందుకున్నా. పట్టుదలకు ప్రోత్సాహం తోడైతే పేదరికాన్ని కూడా జయించవచ్చని హాకీ జాతీయ జట్టుగోల్కీపర్ రజని తన మనసులోని భావాలు పంచుకుంది. చిత్తూరు, భాకరాపేట: మాది ఎర్రావారిపాళెం మండలం ఎనుములవారిపల్లె గ్రామం. ఇది మారుమూల అటవీ సరిహద్దుల్లో ఉంటుంది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం, ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని ఐదో తరగతి వరకు పచ్చారవారిపల్లె ప్రాథమిక పాఠశాలకు వెళ్లేదాన్ని. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి బడికి వెళ్లేదాన్ని. అప్పుడు మా బంధువులు కూడా మా అమ్మను ఆడపిల్లల తల్లి అంటూ ఆటపట్టించేవారు. ఎవరినీ ఏమీ అనలేకపోయేదాన్ని. హైస్కూల్లో ఉండగా మా పీఈటీ మాస్టర్ వెంకట రాజు ఆటల పోటీలు నిర్వహించేవారు. నేను కాస్త చురుగ్గా ఉన్నానని గ్రహించిన ఆయన హాకీలో మెళకువలు నేర్పారు. ఆయన సారథ్యంలోనే శిక్షణ తీసుకున్నా. నేను ముందే చెప్పాను కదా సార్. మాది పల్లె. అక్కడి ప్రజల తీరు, మాటలు ఎలా ఉంటాయో మీకు తెలియనిది కాదు. బడికి వెళ్లేటప్పుడు అచ్చు ఆడపిల్ల లా దుస్తులు ధరించే దాన్ని. అయితే హాకీలో శిక్షణకు అవి పనికిరావు. ప్యాంట్, టీషర్టు ధరించి వెళుతుం టే ఆటపట్టించడం నాకు గుర్తు. మా అమ్మ తులసి ఒక మాట అడిగింది. ఈ దుస్తులు వేసుకుని ఆడగలవా? అందుకు నేను చెప్పింది ఒకటే మాట. ఎందుకంటే నా చిన్నతనంలో చూసినవి మనసులో ఉండిపోయాయి. ‘‘అమ్మ పాడి గేదెలు ఇచ్చే పాలు పితకడం, మా నాన్న రమణాచారి వడ్రంగి పనులతో’’ కష్టపడే తీరు నాలోని కసి పెంచింది. అదే పట్టుదలతో హాకీపై మనసు లగ్నం చేశాను. కఠోర సాధన చేయడానికి మా అమ్మ ఆశీర్వాదం, మా నాన్న కష్టం వృథా కానివ్వకూడదని కసిగా సాధన చేశాను. ఆటంకం కాకూడదని.. నా పట్టుదల చూసిన మా అమ్మ,నాన్న కష్టాలు భరించారు. నాలోని క్రీడాకారిణికి ఊపిరి పోయడానికి అప్పులు చేసి, కోచింగ్ క్యాంపులకు పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పేదరికంలో ఉంటే ఎంత చిన్నతనమో అనేది కూడా మా పల్లెల్లో కళ్లారా చూశాను. ఆ సంఘటనలు నేను మరిచిపోలేను. నా బాధ చూసిన మా అమ్మా, నాన్న ఇవన్నీ నీవు ఏమి పట్టించుకోవద్దు. భవిష్యత్తు ఉంది. అనుకున్నది సాధించు. ఇక్కడే మనకు కోల్పోయిన గౌరవం, అభిమానం దక్కుతుందన్నారు. ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే వాస్తవం అనిపిస్తుంది. మొదట నేను జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైనప్పుడు చాలా మంది నోళ్లలో మా ఊరి పేరు నానింది. అనేక ఒడుదుడుకులు ఎదుర్కొ ని, మన దేశం నుంచి ఒలింపిక్ హాకీ జట్టుకు నేను గోల్‌కీపర్‌గా ప్రాతినిథ్యం కల్పించడానికి అవకాశం కల్పించింది. అంతే..! మా పల్లె ప్రపంచ క్రీడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ సమయంలో బయటివారే కాదు. మా అమ్మనాన్నలకు ఊరి వారి నుంచి అభినందనలు, నాకు శుభాకాంక్షలు అందిన సందర్భంలో కన్నీరు ఉబికింది. బాధతో కాదు.. ఆనందంతో. ఎక్కడైతే నేను, మా అమ్మ హేళనకు గురయ్యామో అక్కడే అభినందనలు అందుకోవడం మరిచిపోలేని తీపి గురుతు. ఆడపిల్లల తల్లిదండ్రులకు మా అమ్మనాన్న ప్రేరణ కలిగించారనే సంతృప్తి మిగిలింది. రజనీ ప్రస్థానం ♦ 2004: ఆరో తరగతిలోనే పుత్తూరులో జరిగిన జోనల్స్‌లో రన్నర్‌గా నిలిచింది ♦ 2005లో తిరుపతిలో జరిగిన ఇంటర్ జోనల్స్‌లో ప్రాతినిథ్యం ♦ 2005లో పంజాబ్ రాష్ట్రం జలంధర్ ♦ 2006 ఢిల్లీ ♦ 2007లో కోయంబత్తూరు, జబల్పూర్ ♦ 2008లో రూర్కెలాలో జాతీయ పోటీలు ♦ 2009లో మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ ♦ 2010లో చైనా, న్యూజిలాండ్, చైనా, కొరియా, అర్జెంటీనాలో ఆడింది. ♦ 2011లో ఆస్ట్రియా పోటీల్లో ఈమె పాల్గొన్న జట్టు సిల్వర్ మెడల్ సాధించింది ♦ 2012 జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్‌గా నిలిచింది. ♦ 2013లో నెదర్లాండ్, జర్మనీ, మలేషియా జరిగిన మ్యాచ్‌ల్లో ప్రాతిని«థ్యం. ♦ 2014లో అంతర్జాతీయ మ్యాచ్‌లో స్వర్ణపతకం ♦ 2016ఒలింపిక్ అర్హత సాధించింది ♦ 2017 జపాన్‌లో జరిగిన ఏసియన్ హాకీ చాంపియన్ షిప్లో ఆసియా చాంపియన్లుగా నిలిచిన భారత మహిళల జట్టుకు రజని గోల్ కీపర్ పల్లెటూరి పిల్లనే... పల్లెటూరి పిల్ల. ఏమిటీ డ్రస్సు అని ఆకతాయి మాటలు అన్నారు. అయినా కుంగిపోలేదు. ఇబ్బంది అనిపించడం సహజమే. కానీ అదే పల్లెటూరి పిల్లగా 18 దేశాల్లో జరిగిన హాకీ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాను. నన్ను ఎగతాళి చేసిన వారే.. రజనీనా మా ఊరి పిల్లేనబ్బా. మా ఊరికి గొప్ప పేరు తెచ్చిం దబ్బా అన్నారు. కుటుంబ నేపథ్యం.. తల్లి : తులసి (పశువుల కాపరి) తండ్రి : రమణాచారి (వడ్రంగి) సంతానం : ముగ్గురు కుమార్తెలు, కుమారుడు (రజనీ రెండో సంతానం) చదువు : 1 నుంచి 5 వరకు పచ్చార్లవాండ్లపల్లె, 6–10వరకు నెరబైలు, తిరుపతిలో డిగ్రీ తల్లి తులసి, తండ్రి రమణాచారిలతో రజని -
రజనీ వెబ్సైట్ పేరు మార్పు
-
ప్రపంచ హాకీ టోర్నీల్లో రాణిస్తాం
సాక్షి, తిరుమల: తిరుమలేశుని ఆశీస్సులు, సహచర క్రీడాకారుల ప్రతిభతో ఆసియా హాకీ కప్ గెలిచామని భారత జట్టు గోల్‌కీపర్ ఇతిమరపు రజని ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయి హాకీ టోర్నీల్లో మరింత క్రీడాస్ఫూర్తితో రాణించి, మరిన్ని విజయాలు అందిస్తామన్నారు. ఆమెకు టీటీడీ జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించారు. -
రంగు పొర
చూపుకు రంగుంటుంది. నలుపు.. తెలుపు.. ఎరుపు.. నీలం. చూపుకు రంగేంటి?! తెలుపంటే... పవిత్రం. నలుపంటే... మలినం. ఎరుపంటే... విప్లవం. నీలం అంటే... ఆకాశమంత. మగవాడి చూపులో కూడా ఇన్ని రంగులు ఉంటాయి! రంగులను బట్టి కూడా మగవాడి చూపు ఉంటుంది!! ఆ రంగుల్లో కొన్ని... ‘పొర’ల్లా పరుచుకుంటాయి. ఆ పొరలు విడిపోవాలి. నోరు మంచిదైతే... ఊరు మంచిదవుతుంది. కన్ను మంచిదైతే... కాపురం బాగుంటుంది. తొలిరాత్రి ముగిసింది.. ‘రజనీ! ప్లీజ్ ఆ చీర మార్చుకొని హాయిగా నైటీ వేసుకోవచ్చు కదా!’ అప్పటికి అయిదోసారి బతిమాలుతున్నాడు నవీన్. ‘అరే.. నేను చీరలో ఉండడం వల్ల నీకేంటి ఇబ్బంది? ఎందుకంత ఫీలవుతున్నావ్ నవీన్?’ భర్త ప్రవర్తన వింత అనిపించడంతో ఆశ్చర్యంగా అడిగింది రజని. ‘నాకేం ఇబ్బంది. ఆ తెల్ల చీరతో నువ్వే ఇబ్బంది పడ్తున్నావేమో.. నైట్‌వేర్‌లో అయితే ఫ్రీగా ఉంటావ్ కదా అని అంతే..’ అన్నాడు భుజాలెగరేస్తూ! తన మాట కాదని నొప్పించడమెందుకని ‘సరేలే.. మార్చుకుంటా’ అంటూ వాష్‌రూమ్‌కి వెళ్లి నైటీ వేసుకొని వచ్చింది రజని. రజని ఇలా గదిలోకి రాగానే నవీన్ అలా వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. నవ్వుకుంది ఆమె. అయిదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు పాలిపోయిన మొహంతో. తేడా గమనించింది. ‘స్టమక్ అప్సెట్ ఏమో’ అనుకొని ఊరుకుంది. తన చిన్నప్పటి కబుర్లేవో చెబుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. రజని చెప్పింది యాంత్రికంగా విన్నాడే కాని అతని మనసు మనసులో లేదు. నిద్రపోయిన భార్య మొహాన్ని తదేకంగా చూస్తున్నాడు. ‘ఎంత అమాయకంగా కనపడుతోంది.. నన్ను మోసం చేస్తోందా? తాను నిజంగానే మోసపోయాడా? అందుకే ఫస్ట్‌నైట్ అంత స్మూత్‌గా జరిగిపోయిందా? గాడ్.. అయితే బ్యాచ్లర్స్ పార్టీ రోజు తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నిజమేనా? నిజమే..’ నవీన్‌కి తలలో బాంబు పేలినట్టయింది. విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఎలా అడగాలి? ఏమని మొదలుపెట్టాలి? ఈ ఆలోచనలతోనే ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు.. రజని చాలా క్యాజువల్‌గా... హ్యాపీగా కనపడుతోంది. రొమాంటిక్ జోక్స్ వేస్తూ ఉడికిస్తోంది. ‘ఏమీ తెలీనట్టు ఎంతలా నటిస్తోంది? రెండోరాత్రికే ఈ కవ్వింపు జోక్స్ఏంటో.. ఆ ఎక్స్‌పీరియెన్స్ అంతకు ముందు లేకపోతే ఇలాంటి మాటలు ఎలా వస్తాయ్? జాణ.. ’ కసిగా అనుకున్నాడు నవీన్ మనసులో.అనుమానం అతణ్ణి మనిషిలా ఉండనివ్వట్లేదు. ఉచ్చనీచాలు మరిచేలా చేస్తోంది. చేసింది. ఆ రాత్రే ఆమెకు టార్చర్ మొదలుపెట్టింది అతని మైండ్‌లో తిష్ఠ వేసి. ‘ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా?’ అద్భుతంగా నటించాడు. ‘మా మేనత్త పెట్టిన చీర. రెండో రాత్రి కట్టుకోమని చెప్పింది’ సిగ్గుపడుతూ. ‘నేనొకటి అడగనా?’ అన్నాడు. ‘ఊ.. అడుగు’ గారంగా అన్నది. ‘కో ఎడ్యుకేషన్ కాలేజ్‌లో చదివావ్ కదా..’ ఆగాడు. ‘అవును..పీజీ కూడా కో-ఎడ్డే. క్లాస్మేట్స్ అందరం కలిసి గోవా టూర్ కూడా వెళ్లామని చెప్పాను కదా. ఫోటోలు కూడా చూశారు కదా. వండర్ఫుల్డేస్.. భలే ఎంజాయ్ చేసేవాళ్లం.’ ఒక్క క్షణం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లింది రజని. ‘అదే.... ఆ టైమ్‌లో ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉ...న్నా..’ రజని కళ్లల్లోకి చూస్తూ ఆగాడు. చాలా మామూలుగా.. హాయిగా నవ్వింది రజని. ‘మా క్లాస్‌లో ఉన్న అబ్బాయిలంతా నాకు బాయ్‌ఫ్రెండ్సే..’ నవ్వుతూనే అనేసి బాల్కనీలోకి వెళ్లిపోయింది. తనకు కావాల్సిన సమాధానం కాదు అది. కొంపదీసి తన మనసులో ఉన్నది అర్థమైందా ఏంటీ ఆమెకు. అర్థంకానీ.. అసలు విషయం బయటపడుతుంది అనుకున్నాడు. బాల్కనీలో ఉన్న రజని కళ్లల్లో సన్నటి నీటి పొర. ఆ సంఘర్షణ, అనుమానాలతో నాలుగు రోజులకే హానీమూన్ ట్రిప్ ముగించుకొని ముభావంగా ఇంటికి బయలుదేరింది ఆ జంట. మూడు నెలలు గడిచాయి... ఇంట్లో వాతావరణాన్ని, తమ మధ్య కమ్యూనికేషన్‌ను నార్మల్‌గా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తోంది రజని. కానీ కుదరనివ్వట్లేదు నవీన్. ఆమె ప్రతి కదలికను అనుమానంగానే చూస్తున్నాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే వేడి వేడి టీ ఇవ్వబోతుంటే మొహం తిప్పుకొని వెళ్లిపోతాడు. లేదంటే ఆమె వ్యక్తిగతానికి సంబంధించి ఆరా తీస్తాడు. ఈ వేధింపులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయే కానీ తగ్గడం లేదు. అవి ఎంతలా శ్రుతిమించాయంటే కాలేజ్ డేస్‌లో ఆమె ప్రవర్తన గురించి ఎంక్వయిరీ చేసేంతనగా. ఆమె ఫ్రెండ్స్‌కే ఫోన్ చేసి ఆమె క్యారెక్టర్ గురించి కూపీ లాగుతున్నాడు. అయినా సహిస్తోంది. పెళ్లికి ముందు తనకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరనీ... తనకెవరితో ఎలాంటి ఫిజికల్ రిలేషన్స్ లేవనీ ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. బతిమాలుతోంది. సంసారాన్ని నరకం చేయొద్దని ప్రాథేయపడింది. చివరకు అతని అనుమానం పోవడానికి ఏం చేయమన్నా చేస్తానంది. ‘అయితే గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్దాం.. రా’ అన్నాడు స్థిరంగా. ఆ మాటకు షాక్ అయింది రజని. కోపం, అసహ్యం, బాధ, తన మీద తనకు జాలి.. కలిగాయి. గుండె పగిలేంత దుఃఖం పొంగుకొస్తున్నా తమాయించుకొని ‘వెళదాం పద’ అంది. అయితే... పరీక్ష చేయడానికి డాక్టర్ ససేమిరా అంది. పైగా నవీన్‌ను చెడామడా తిట్టింది. అమ్మాయికి పెళ్లికి ముందు సెక్సువల్ రిలేషన్ లేదు అనడానికి మొదటి రాత్రి రక్తస్రావం కావడం ఏ రకంగా ప్రామాణికం అని నిలదీసింది. చదువుకున్న వాడివి నీ సంస్కారం ఇదేనా? అంటూ గడ్డిపెట్టింది. హైమన్ (కన్నెపొర) ఎంత సున్నితంగా ఉంటుందో? ఏయే సందర్భాల్లో చిరిగిపోయే అవకాశాలుంటాయో వివరించింది. భార్యాభర్తల దాంపత్యానికి నమ్మకం పునాది.. అనుబంధానికి అండర్స్టాండింగ్ ఉండాలి అంటూ క్లాస్ తీసుకొని పంపించింది. ఇంటికొచ్చాక... గదిలోకి వెళ్లిపోయి.. సూట్‌కేస్‌తో బయటకు వచ్చింది రజని. హతాశుడయ్యాడు నవీన్. ‘ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావ్ రజనీ?’ ఈసారి నవీన్ షాక్ అయ్యాడు. ‘నీ అనుమానంతో నేనింకా అవమానపడదల్చుకోలేదు. నీకు తెలియని ఇంకో విషయం... స్కూల్ డేస్ నుంచి కూడా నేను సైక్లింగ్ చాంపియన్ని’అంటూ బయటకు నడిచింది రజని. నేపథ్యం రజని, నవీన్... ఇద్దరూ చదువుకున్న వాళ్లే. ఆమె ఎంబీఏ. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్దలు కుదిర్చిన పెళ్లి. చక్కటి ఈడూజోడు.. అన్ని విధాలా తగిన సంబంధం అని రెండు కుటుంబాల వాళ్లూ అనుకొని ఘనంగా పెళ్లిచేశారు. పెళ్లికి ముందు బ్యాచ్లర్స్ పార్టీలో తన భార్య గురించి, తన అత్తగారింటి వైభోగం గురించి చెబుతూ నవీన్ మురిసిపోతుంటే అసూయపడ్డ అతని స్నేహితుడొకడు.. ‘ఒరేయ్.. అంత సోషల్మూవింగ్ ఉన్న అమ్మాయి పెళ్లికి ముందే అన్ని చేసుంటుంది జాగ్రత్తరోయ్’ అని కూశాడు. ‘ఎలా తెలుస్తుందిరా’ అని అడిగాడు అమాయకంగా. వాడు చెప్పాడు. అందుకే ఫస్ట్‌నైట్ అయ్యాక వాష్‌రూమ్‌లోకి వెళ్లి చీర చూశాడు నవీన్. రజని ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు. జీవనసహచరిని దూరం చేసుకున్నాడు. అదో పెద్ద మూఢనమ్మకం! మన సమాజంలో ఇప్పటికీ ఉన్న మూఢనమ్మకం... మొదటి రాత్రి తెల్లచీర ధరించాలని, మరునాడు దాన్ని పరీక్షించాలని, మరక ఉంటే ఆమె వర్జిన్ అనీ, లేకుంటే కాదని! నేటికీ చాలామంది మగవాళ్ల మెదళ్లను తొలుస్తున్న పురుగు ఇది. ప్రతిదానికీ సైన్స్ రీజన్ చెప్తున్నా అర్థం కావట్లేదు.. చేసుకోవట్లేదు. నవీన్ ఇందుకు అతీతుడేం కాదు. నవీన్ చేసిన పని మెంటల్ క్రూయల్టీ. హిందూ వివాహచట్టం ప్రకారం భార్య శీలాన్ని శంకించడం, ఆమె శీలవతి కాదని ప్రచారం చేయడం, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు చేయించడం వంటివన్నీ మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తాయి. అలాంటి వ్యక్తి నుంచి విడాకులు తీసుకోవచ్చు. ఐపీసీ 498ఏ కింద కేస్ కూడా నమోదు చేయవచ్చు.- ఇ.పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ - సరస్వతి రమ -
గూఢనారి నెం.1
రజని డిటెక్టివ్ సర్వీసెస్‌ను ఆరంభించినప్పుడు, మిగతా ఏజెన్సీల వాళ్లు నవ్వారు. కొన్ని పేపర్లయితే పరువు తక్కువనిచెప్పి యాడ్ వేసుకోడానికి కూడా వెనకాడాయి. కొన్ని పోటీ సంస్థలు.. దుకాణం సర్దేసుకొమ్మని ఆమెను బెదిరించాయి. ‘‘ఇది కూడా ఒక నేర సామ్రాజ్యం లాంటిదే, శాల్తీ ఎప్పుడు గల్లంతవుతుందో చెప్పలేం’’ అని కొందరు శ్రేయోభిలాషులు చెప్పి చూశారు. రజని భయపడలేదు. వెనక్కి తగ్గలేదు. దేశంలోనే నెం.1 గూఢనారిగా నిలబడ్డారు. వంచిన తల ఎత్తకుండా అమ్మాయిలు కాలేజీకి వెళ్లి వచ్చే ఒకానొక కాలంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడూ అలాగే వెళ్లి వస్తున్నారు కదా అమ్మాయిలు! ఇక ఆ కాలంలోకి పనిగట్టుకుని మరీ వెళ్లడం ఎందుకు? వెళ్లాలి. రజనీ పండిత్‌ను చూడాలంటే వెళ్లాలి. ఇప్పుడు ఆమె వయసు 50. ఆమెను పద్దెనిమిదీ పందొమ్మిదేళ్ల వయసులో చూడాలంటే దాదాపు ముప్పై ఏళ్ల వెనక్కు వెళ్లాలి. ముంబైలోని రూపారెల్ కాలేజీకి వెళ్లి వస్తున్నప్పుడు కాలేజ్ గేటు దగ్గర నిలబడి ఆమె లోపలికి వెళుతున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు చూడాలి. డిటెక్టివ్‌లా ఆమె వెంట వెళ్లగలిగితే కనుక దారి పొడవునా రజనీని చూడొచ్చు. ఏముంటుంది రజనిలో అంత స్పెషాలిటీ? ఏంటా? మిగతా అమ్మాయిల్లా ఆమె తల వంచుకుని నడవదు! దిక్కులు చూస్తూ నడుస్తుంది. చుట్టు పక్కలు చూస్తూ నడుస్తుంది. మనుషుల కళ్లల్లోకి చూస్తూ, మనుషుల మాటలు వింటూ, మనుషుల కదలికలు గమనిస్తూ, మరీ ముఖ్యంగా మనుషుల ఫీలింగ్స్ పట్టేస్తూ నడుస్తుంది! అలా ఓ రోజు తన క్లాస్మేట్ ఫీలింగ్స్ పట్టేసింది రజని. డిగ్రీ ఫైనలియర్ ‘‘ఏం జరిగింది?’’.. క్లాస్మేట్ని అడిగింది రజని ఓ రోజు. ‘‘ఏం లేదే’’ అంది ఆ క్లాస్మేట్. ‘‘పోనీ ఏం జరుగుతోంది?’’ అంది రజని. క్లాస్మేట్ కంగారుగా చూసింది. ‘‘నీ కోసం కాలేజీకి ఎవరెవరో వస్తున్నారు! వాళ్లంతా ఎవరు?’’ అని అడిగింది. క్లాస్మేట్ భయంగా చూసింది. రజని ఆమె కళ్లను చూసింది. తెగబోతున్న చెరువు కట్టల్లా ఉన్నాయవి. రజని ఆమె పెదవుల్ని చూసింది. నిజాన్ని చెప్పలేక వణుకుతున్నట్లుగా ఉన్నాయవి. రజని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. ‘‘నీకేం భయం లేదు’’ అని భరోసా ఇచ్చింది. విషయం రాబట్టింది. తనొక అనైతిక వలయంలోకి వెళ్లినట్టు ఆ క్లాస్మేట్ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ కుటుంబాన్ని గట్టెక్కించింది. ‘‘థ్యాంక్స్ అమ్మా’’ అన్నారు క్లాస్మేట్ తండ్రి. ఆయనే ఇంకొక మాట కూడా అన్నారు.. నీలో ఒక స్పైకి ఉండాల్సిన చురుకుదనం ఉంది’’ అన్నారు. స్పై! గూఢచారి. ఆ మాట కిక్ ఇచ్చింది రజనికి. తననొక లేడీ గూఢచారిగా ఊహించుకోవడం ఆమెకు బాగుంది. ఆడపిల్లవి.. ఆ దరిద్రం నీకెందుకు? డిగ్రీ పూర్తయింది. ఏవేవో ఉద్యోగాలు చేస్తోంది రజని. ఏదీ సంతృప్తిని ఇవ్వడం లేదు. డిటెక్టివ్ ఏజెన్సీలలో ‘స్పై’గా చేస్తానని కరికులం వీటాయ్ (సీవీ) పట్టుకెళ్లింది. ‘‘మరాఠీ లిటరేచర్ మాకేం పనికొస్తుంది’’ అన్నారు. ‘ఆడపిల్ల డిటెక్టివ్‌గా ఏం పనికొస్తుంది’ అనే మాటనే వాళ్లిలా సున్నితంగా అన్నారు. వాస్తవానిక్కూడా వాళ్లకు అమ్మాయిలు అక్కర్లేదు. బయట పడని నేరాలను, ఘోరాలను, అక్రమ సంబంధాలను, అనుమానాలను, అరాచకాలను ఛేదించాలి. ఈమెకెంత మరాఠీ వచ్చినా, ఎంత ఇంగ్లిష్ వచ్చినా, ఎంత చలాకీగా ఉన్నా, బుర్ర ఎంత షార్ప్‌గా ఉన్నా... స్త్రీ సహజసిద్ధమైన ‘అబలత్వం’ కారణంగా చిన్న పొరపాటు జరిగినా ఏజెన్సీ పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయి. అందుకే రజనీని ఎవరూ తీసుకోలేదు. చివరికి రజని తండ్రి కూడా.. ‘‘ఆడపిల్లవి.. ఆ దరిద్రం నీకెందుకు?’’ అని విసుక్కున్నాడు. డాన్ల ముంబైలో లేడీ డిటెక్టివ్! రజని తండ్రి శాంతారామ్ పండిత్. ముంబై పోలీస్ శాఖలో క్రిమినల్ ఇన్వెస్టిగేటర్. అందుకే ఆ తలనొప్పి తన కూతురికి వద్దనుకున్నారు. వీళ్ల కుటుంబం థానేలో ఉంటుంది. అక్కడికి 27 కి.మీ. దూరంలోని కాలేజీలో రజనిని ‘డే స్కాలర్’గా చదివించడానికే ఆయన సంశయించారు. ఇక డాన్ల ముంబైలో డిటెక్టివ్‌గా చేస్తానంటే ఒప్పుకుంటారా? పైగా ఆమె సొంతంగా ఒక ఏజె న్సీని పెడతానంటోంది. ‘వొద్దొద్దు’ అనేశారాయన. ‘‘ప్లీజ్ నాన్నా’’ అంది రజని. తల్లి ఆమెకు సపోర్ట్‌గా వచ్చింది. ‘‘ఇష్టపడి చేస్తానంటోంది కదా... ఆ కష్టమేదో తనే పడుతుంది. కాదనడం ఎందుకు?’’ అంది. అయిష్టంగా ఒప్పుకున్నారు శాంతారామ్ పండిత్. మళ్లీ ఈ కాలంలోకి వచ్చేద్దాం. అమ్మాయిలు ఎప్పటిలా వంచిన తల ఎత్తకుండానే కాలేజీలకు వెళ్లివస్తున్నారు. ఒక్కటే మార్పు. రజని కాలంలో అమ్మాయిల చేతుల్లో సెల్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు లేవు. ఇప్పటి అమ్మాయిల చేతులు స్మార్ట్ఫోన్లు లేకుండా లేవు. అయినప్పటికీ లేడీ డిటెక్టివ్‌ల సంఖ్య తక్కువగానే ఉంది. స్మార్ట్‌ఫోన్ ఉంటే స్పయింగ్ తేలిక అవుతుందని కాదు. రహస్యాలను ఛేదించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, అమ్మాయిల్ని ఈ ఫీల్టులోకి పంపే ధైర్యాన్ని తల్లిదండ్రులు చేయలేకపోతున్నారు. రజని సొంతంగా స్థాపించిన ఏజెన్సీనే తీసుకోండి. 1991లో ఆమె ‘రజనీ పండిత్ డిటెక్టివ్ సర్వీసెస్’ను ప్రారంభించారు. 2010లో ముంబైలోని మాహిం ప్రాంతంలో ఆఫీసు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు నెలకు 20 కేసుల వరకు వస్తున్నాయి. ఆమె దగ్గర 30 మంది వరకు డిటెక్టివ్లు పనిచేస్తున్నారు. వారిలో మహిళా డిటెక్టివ్లు సగంలో సగానికన్నా తక్కువే! వాళ్లు కూడా రజని దగ్గర శిక్షణ పొందినవాళ్లు. కేసును బట్టి వేషం కట్టి... కేసు అంతు తేల్చడం కోసం రజని రకరకాల వేషాల్లోకి మారిపోయేవారు. అంధురాలిగా, గర్భిణిగా, తోపుడుబండి వ్యాపారిగా.. ఇలా! భార్యాభర్తల అనుమానం కేసులు ఎక్కువగా వచ్చేవి. అలాగే అక్రమ సంబంధాల కేసులు, పెళ్లిసంబంధాల కోసం వధూవరుల వివరాలను ఆరా తీసే కేసులు. కొన్ని సందర్భాలలో రజని క్లయింట్లకు ధైర్యం చెప్పేవారు. వాళ్లకు అండగా ఉండేవాళ్లు. వాళ్లకు స్ఫూర్తిగా నిలబడేవారు. ప్రేరణ ఇచ్చేవారు. అలా సోషల్ సర్వీసును కూడా తన వృత్తిలో భాగంగా చేసుకున్నారు రజని. అందుకే పేరును సంపాదించుకున్నంతగా, డబ్బును సంపాదించుకోలేకపోయారు ఈ భారతదేశపు తొలి మహిళా డిటెక్టివ్. ప్రతి యువతీ తొలి మహిళే! పేరు కోసం రజని ఈ ఫీల్డులోకి రాలేదు. అందుకే ‘ఈమె భారతదేశపు తొలి మహిళా డిటెక్టివ్వా? మహారాష్ట్ర తొలి మహిళా డిటెక్టివ్వా’ అన్న చర్చ అవసరం లేదు. తనొక మహిళా డిటెక్టివ్. అంతే. అదే తనకు గుర్తింపు. గౌరవం. నేటికీ అనేక రంగాల్లో ఉన్నట్లే డిటెక్టివ్ సర్వీసుల్లో కూడా పురుషాధిక్యం ఉంది. నిజానికి కాస్త ఎక్కువగానే ఉంది. అందుకే ఈ ఫీల్డులోకి కొత్తగా వచ్చే ప్రతి యువతినీ మనం తొలి మహిళా డిటెక్టివ్‌గానే గుర్తించాలి. హంతకుడు ఎంపీ బంధువు! రజని ఈ పాతికేళ్లలో 75 వేలకు పైగా కేసులను ఛేదించారు. హంతకుడెవరో కనిపెట్టి, అతడిని పట్టుకోవడం కోసం ఓ ఇంట్లో ఆరు నెలలపాటు పనిమనిషిగా చేశారు! ఆమె కెరియర్లోని అత్యుత్తమమైన కేసులలో అదొకటి. ఒక మహిళ తన అక్రమ సంబంధం బయటపడి, ప్రియుడి చేత తన భర్తని చంపించింది. ఆ ప్రియుడే తర్వాత ఆమె కొడుకును కూడా చంపేశాడు. ఈ కేసులో పోలీసులు అతడిని పట్టుకోలేకపోయారు. రజని సహాయం తీసుకున్నారు. హంతకుడు ఆ ఇంటికి రాత్రి పూట వచ్చి పోతుంటాడన్న క్లూ ఒక్కటే రజనికి తెలుసు. ఆ ఇంట్లోకి ఎలాగో పనిమనిషిగా చే రారు. నమ్మకంగా పని చేశారు. ఒకసారి ఇంటామె కళ్లు తిరిగి పడిపోతే రజని వెంటనే డాక్టర్ని పిలిపించి, దగ్గరుండి మరీ ఆమెకు మందులు అవీ మింగించి మనసు దోచుకున్నారు. ఆప్పట్నుంచీ ఆమెకు కేర్ టేకర్ అయ్యారు. ‘‘నువ్వూ ఇక్కడే ఉండిపో’’ అన్నారు. రజనికి అది మంచి అవకాశంగా దొరికింది. ఓ రోజు రాత్రి ఆ ప్రియుడికి, ఇంటావిడకు పెద్ద గొడవ అయింది. ‘‘వెళ్లిపో, నీ ముఖం నాకు చూపించకు’’ అని పెద్దగా అతడిపై అరుస్తోంది ఆమె. అతడు వెళ్లిపోయాడంటే మళ్లీ దొరకడు. ఏం చేయాలి? పోలీసులకు చెప్పాలంటే బయటికి వెళ్లాలి. అప్పటికి మొబైల్స్ లేవు. లాండ్‌లైన్ ఉంది కానీ, వాళ్లిద్దరూ గొడవ పడుతున్న హాల్లోనే ఉంది. రజని ఆలోచనలో పడింది. ఈ గొడవనంతా పట్టించుకోనట్లు వంటగదిలోకి వెళ్లింది. కత్తితో కాలికి గాయం చేసుకుంది. రక్తం కారుతుంటే భయంతో అరుస్తూ హాల్లోకి వచ్చింది. ఇంటావిడ కంగారు పడింది. ‘‘ఏంటా రక్తం రజనీ, కింద డాక్టర్ ఉంటాడు వెళ్లు’’ అని పంపించింది. తర్వాత 20 నిముషాల్లోనే పోలీసులు వచ్చి, ఆ హంతకుడిని అరెస్ట్ చేశారు. అతడో ఎంపీ బంధువు! ఆత్మవిశ్వాసం, ధైర్యం, దృఢచిత్తం ఉంటే అమ్మాయిలు ఎంతటి పురుషాధిక్య రంగంలోనైనా రాణిస్తారు. తామేమిటో నిరూపిస్తారు. నేనెప్పుడూ దేనికీ భయపడ ను. చావే కదా మన అల్టిమేట్ భయం. అది ఏదో ఒక రూపంలో వచ్చి తీసుకెళుతుంది. ఊరికే కూర్చొని ఉన్నా, పైనుంచి సీలింగ్ విరిగిపడి చనిపోవచ్చు. ఇక భయపడడానికేముంది? ‘ఆన్ డ్యూటీ’ చనిపోవడం గౌరవమే కదా. (నవ్వుతూ) రజని తన అనుభవాలతో ‘ఫేసెస్ బిహైండ్ ఫేసెస్’, ‘మాయాజాల్’ అనే పుస్తకాలు రాశారు. మొదటి పుస్తకానికి రెండు అవార్డులు వచ్చాయి. రెండో పుస్తకానికి ఆరు అవార్డులు వచ్చాయి! ఇవి కాక కెరీర్ మొత్తం మీద ఆమె 54 అవార్డులు సాధించారు. అస్ట్రేలియాకు చెందిన ఓ టీవీ చానల్ ఆమెపై డాక్యుమెంటరీ కూడా తీసింది. ప్రస్తుతం విదేశాలకు సంబంధించిన అపరాధపరిశోధన కూడా చేస్తున్నారు. కెరీరే నా బాడీగార్డ్ తొలి మహిళా డిటెక్టివ్ రజనీ పండిత్ మాహిమ్‌లోని తన కార్యాలయంలో ‘సాక్షి’ ముంబై ప్రతినిధి గుండారపు శ్రీనివాస్‌తో సంభాషించారు. దేశంలోనే మీరు తొలి మహిళా డిటెక్టివ్. అయితే మీరు మహారాష్ట్ర తొలి మహిళా డిటెక్టివ్ మాత్రమే అన్న వాదన ఉంది. ఏది కరెక్టు? వేరే డిటెక్టివ్ ఎవరైనా కనిపెట్టి చెప్పాలి (నవ్వుతూ). పోనీ మీరు చెప్తారా ఏది కరెక్టో? మీడియాను మించిన డిటెక్టివ్ ఎవరుంటారు? మీడియా అన్నది పెద్ద వ్యవస్థ. కానీ మీరు వ్యక్తిగా అంతుచిక్కని కేసులెన్నింటినో ఛేదించారు! వ్యక్తిలోని తపనకు వ్యవస్థకున్నంత బలం ఉంటుంది. రహస్యశోధన నా ప్రాణవాయువు. స్త్రీలకు ఇది అనువైన రంగం కాదని అంటారు. అనువు కాని చోటే అధికురాలినని నిరూపించదలిచారా? ఎవరికో చాలెంజ్ చేసి నేను ఈ రంగంలోకి రాలేదు. ఇష్టపడి వచ్చాను. నేను ఉన్నంత కాలం నాలో ఈ ఇష్టం ఉంటుంది. అంతేకాదు, పురుషుల కన్నా స్త్రీలకే ఇది ఎక్కువ అనువైన రంగం అని నమ్ముతాను. అపరాధ శోధనలో పురుషులకు కొన్ని పరిమితులు ఉంటాయి. అవి మాకు ఉండవు. వారికుండే సౌలభ్యాలు కూడా మీకు ఉండవేమో కదా! కావచ్చు. కానీ రహస్యాల పరిశోధనలో మునిగిపోయాక సౌఖ్యాలు, సౌలభ్యాల ఆలోచన రాదు. ఒక డిటెక్టివ్‌గా మీరెన్నో విజయాలు సాధించారు. కానీ ఒక మహిళగా మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అర్థం కాలేదు. మీరు ఎంచుకున్న కెరీర్ మీకో కుటుంబాన్ని లేకుండా చేసిందన్న ఆలోచన మీకు ఏ సందర్భంలోనైనా కలిగిందా? మీరు అడుగుతున్నది నా పెళ్లి విషయమే అయితే... అవివాహితగా మిగిలిపోవడం గురించి నేనెప్పుడూ కలత చెందలేదు. మీరు ఈ రంగంలోకి రావడం మీ నాన్నగారికి ఇష్టం లేదు. మీరు డిటెక్టివ్ అయితే మీ పెళ్లి కావడం కష్టం అని బహుశా ఆయన భావించి ఉంటారా? (నవ్వుతూ) నాన్న సంగతి తెలీదు. నేైనె తే అలా అనుకోలేదు. నిజానికి నేను ఈ రంగంలోకి వస్తానని నాకు తెలియకముందే.. పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయం తీసుకున్నాను. అలా ఎందుకు నిర్ణయించుకున్నారు? చాలా దాంపత్యాలను చూశాను. మా బంధువులవీ, చుట్టుపక్కలవాళ్లవీ. భార్యాభర్తలు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, తలలు పగలగొట్టుకుంటూ ఉండటం చూశాక పెళ్లంటే నాకు విముఖత ఏర్పడింది.కానీ ఈ యాభై ఏళ్ల వయసులో... మీరు ఒంటరితనం ఫీల్ కావడం లేదా?(నవ్వుతూ) భర్త ఉండీ ఒంటరిగా ఉన్న ఆడవాళ్లు ఎంతమంది లేరు! నాకు తోడుగా మా అమ్మ ఉంది. అక్క ఉంది. అన్న ఉన్నాడు. తమ్ముడు ఉన్నాడు. అన్న భార్య, తమ్ముడి భార్య, వారి పిల్లలు, అక్క కొడుకు ఉన్నారు. అందరం ఒకే ఇంట్లో ఉంటాం. ఇంక ఒంటరితనం ఎక్కడ? కెరీర్ అయితే బాడీగార్డ్‌లా ఎప్పుడూ నా వెంటే ఉంటుంది. మాధవ్ శింగరాజు -
చిత్తూరు జిల్లా ఖ్యాతి విశ్వవాప్తం
చంద్రగిరిః హాకీ క్రీడలో మొదటి మహిళల ఏసియన్ చాంపియన్‌షిప్ ట్రోఫీ సాధించి, ప్రతిష్ఠాత్మమైన రియో ఒలంపిక్స్‌లో హాకీ గోల్ కీపర్‌గా ఉత్తమ ప్రతిభను కనబరిచి చిత్తూరు జిల్లా ఖ్యాతినికి రజనీ విశ్వవ్యాప్తం చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ఎన్.శివప్రసాద్ కొనియాడారు. ఎర్రావారిపాళ్యం మండలం నెరబైలు గ్రామానికి చెందిన రజనీని బుధవారం చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో సీబార్ స్పోర్ట్స్ కల్చరల్ అకాడమీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మేళతాళాలతో చంద్రగిరి టవర్‌క్లాక్ వద్ద నుంచి ఊరేగింపుగా పాఠశాల వద్దకు వచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ మారు మూల గ్రామాల్లో ఆదరణ లేక మరుగున పడిన ఇలాంటి రజనీలను ఆదరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం గ్రూప్–2 ఉద్యోగంతో పాటు రూ.25లక్షల నగదు, తిరుపతిలో ఇంటి స్థలాన్ని మంజూరు చేసిందని తెలిపారు. ఒలంపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయం రజనీ మాట్లాడుతూ తాను ఇంతటి స్థాయికి రావడానికి గురువు వెంకరాజు కారణమైతే, తాను రియోలో ఆడేందుకు అన్ని విధాల కృషి చేసిన వ్యక్తి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు. 2005లో హాకీని ఎంచుకున్న తాను పట్టుదలతో కృషి చేశానన్నారు. 2008లో మొట్టమొదటి సారిగా భారత జట్టు తరపున న్యూజిలాండ్‌తో ఆడినట్లు చెప్పారు. రానున్న ఒలంపిక్స్‌లో దేశానికి స్వర్ణ పతకమే లక్ష్యంగా జట్టు తరపున ఆడుతానని తెలిపారు. చంద్రగిరిలో హాకీ అకాడమీను నెలకొల్పి, మరింత మందిని దేశానికి అందించేలా కృషి చేస్తానన్నారు. అనంతరం రజనీని ఎంపీ శివప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఎంఈవో ప్రభాకర్ రాజు, ప్రిన్సిపల్ నాగరాజు నాయుడు, మస్తాన్, పాదిరి «దనుంజయ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. మహిళా వర్శిటీలో ఉద్యోగం తిరుపతి సెంట్రల్ : రియో ఒలంపిక్స్‌లో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన హాకీ ఇండియన్ ఉమెన్ టీమ్ గోల్ కీపర్ ఇ.రజిని సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. రజనిని బుధవారం సాయంత్రం శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో వీసీ దుర్గాభవానీ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. వీసీ మాట్లాడుతూ కృషి, పట్టుదలతో పాటు లక్ష్యసాధన ఉంటే ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరోజు జీవితంలో పైకి ఎదిగే అవకాశం వస్తుందన్నారు. అలాంటి జాబితాలో ఓ మారుమూల గ్రామంలో జన్మించి దేశ హాకీ టీమ్ గోల్‌కీపర్‌గా రాణిస్తున్న రజని ఆదర్శనీయం అన్నారు. రజిని ఒప్పుకుంటే తమ యూనివర్శిటీ నుంచి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. దీనికి స్పందించిన రజిని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అవకాశం వచ్చినప్పుడు తన సేవలను మహిళా వర్శిటీకి అందిస్తానని వినయంగా తెలిపారు. అనంతరం రజిని, ఆమె తల్లి దండ్రులు తులసి,రమణాచారితో పాటు గురువు హాకీ ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్లను వేర్వేరుగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళావర్శిటీ యాజమాన్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలు సంయుక్తంగా ట్రోఫీలను అందించి, ఆత్మీయంగా సన్మానించారు. రిజిస్ట్రార్ విజయలక్ష్మి, కృష్ణకుమారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శారా సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
కబాలి 'పది' నిజాలు
ముంబై: టీజర్ లోనే కబాలి రా.. అంటూ సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం కబాలి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులముందుకి వచ్చింది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యి, కోట్లలో వ్యాపారాన్ని గడించిన ఈ సూపర్ మూవీపై అంచనాలు అంతకంటే భారీగా నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరించిన కబాలి ఫీవర్ సృష్టించే రికార్డులపై అత్యంత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కబాలి సినిమాకు సంబంధించి ముఖ్యమైన పది సంగతులు సినీ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక కొత్త టీమ్ తో రజనీకాంత్ కలిసి పనిచేయడం రజనీకాంత్ తాజా సినిమాలో గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణం పాడిన పాట లేకపోవడం సైన్ ఫిక్షన్ ..సూపర్ నేచురల్ ఫిలిం ఓ డాన్ నిజ జీవిత గాథ అధారంగా రూపొందించిన చిత్రం థ్యాంక్స్ టు సౌందర్య రజనీకాంత్. మూడో సినిమాతోనే సూపర్ స్టార్ రజనీ సినిమాకు దర్మకత్వం వహించాడు పా రంజిత్, అయితే ఆయనను రజనీకాంత్ కూ పరిచయం చేసిన ఘనత కూతురికి సౌందర్యకు దక్కుతుంది. సో. ..కబాలిని ఇంత గొప్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన క్రెడిట్ కూడా సౌందర్యదే. మరోవైపు సినిమా మొదలైన పావుగంట తర్వాత హీరో తలైవా తెరమీద ఆవిష్కారం. మామూలు రజనీకాంత్ స్టయిల్ విన్యాసాలు.. పంచ్ డైలాగులు.. ఈ సినిమాలో లేవు. ట్రైయిలర్స్ లేవు. మలేషియన్ ప్రభుత్వం రజనీకాంత్ పట్ల గౌరవ సూచకంగా ఒక స్పెషల్ స్టాంప్ ను విడుదల చేసింది. మలేషియాలో భారీగా రిలీజవున్న తొలి భారతీయ సినిమా కబాలి. సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగా మలేషియాలో జరగడంతో అక్కడకూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కబాలి సృష్టించిన మేనియా ఇంతేనా ఇంకా చాలా ఉంది. గూగుల్ స్పెషల్ యాప్, ఓ ప్రయివేటు విమానయానసంస్థరూపొందించిన స్పెషల్ విమానం, ముత్తూట్ ఫినాన్స్ వారి వెండినాణాలు, దబ్ స్మాష్ వీడియో కాంపిటీషన్, కోయంబత్తరూ లో ఒక కఫే రజనీ కి డెడికేట్ .. ఇలా చాలా ప్రత్యేకతలే వున్నాయి. మరి కలెక్షన్ల వసూళ్లలో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పనుందో వేచి చూడాలి. -
షాక్..
పట్టుకోండి చూద్దాం అప్పటి వరకు మౌన మునిలా ఉన్న వాతావరణం ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చింది. రాక్షసులందరూ కట్టగట్టుకొని అరుస్తున్నట్లు ఆకాశంలో శబ్దాలు వినిపిస్తున్నాయి. కాసేపట్లో భారీ వర్షం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హారికకు మనసులో భయంగా ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉండడం హారికకు ఇదే మొదటిసారి. కుటుంబ సభ్యులందరూ ఒక పెళ్లి కోసం బెంగళూరు వెళ్లారు. ఎగ్జామ్స్ లేకపోతే... తాను కూడా పెళ్లికి వెళ్లేది. ‘‘ఈసారి ఎలాగైనా సరే... మంచి మార్కులు తెచ్చుకోవాలి’’ అని మనసులో గట్టిగా అనుకుంది. గాలి హోరును, ఆకాశం నుంచి వినిపించే శబ్దాలను పట్టించుకోకుండా చదువులో నిమగ్నమైపోయింది హారిక. ఇంతలో ఫోన్ మోగింది. ‘‘అప్పటి నుంచి నాన్నగారి ఫోన్‌కు ప్రయత్నిస్తున్నాను. నాట్ రీచబుల్... అని వస్తోంది. నాన్నగారు ఊళ్లో లేరా?’’ ‘‘అమ్మా, నాన్న, తమ్ముడు పెళ్లికి వెళ్లారు అంకుల్. రేపు సాయంత్రానికి వచ్చేస్తారు’’ అని చెప్పింది హారిక. ఫోన్ చేసిన వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్. హారిక వాళ్ల ఇంటి దగ్గరలోనే ఉంటాడు. హారిక నాన్న శేఖర్‌కు ఆనంద్ క్లోజ్‌ఫ్రెండ్. అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన ఆనంద్, శేఖర్‌తో కాసేపు మాట్లాడిపోదామనుకున్నాడు. కానీ ఫోన్ కలవక పోవడంతో ఇంట్లోనే ఉండిపోయాడు. కాసేపటికి..... గాలి గట్టిగా వీస్తోంది. కిటికీ వైపు నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ‘‘ఎవరూ?’’ అంటూ స్టడీరూమ్ నుంచి బయటికి వచ్చింది హారిక. ఎవరూ కనిపించకపోవడంతో మళ్లీ స్టడీరూమ్లోకి వెళ్లింది. ‘ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం? పిల్లి దూరి ఉంటుంది’ అనుకుంది. రెండు నిమిషాల తరువాత... ఏదో అలికిడి కావడంతో స్టడీరూమ్ నుంచి బయటికి వచ్చింది హారిక. అంతే... వెనక నుంచి ఎవడో గట్టిగా పట్టుకున్నాడు. కణతల దగ్గర గన్ పెట్టాడు. ‘‘నీ ప్రాణాలు పోవడమా? రక్షించుకోవడమా? అన్నది పూర్తిగా నీ చేతుల్లో ఉంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు... ఎక్కడ ఉన్నాయో చెబితే... నీకేమీ కాదు...’’ అన్నాడు ఆ దొంగ. షాక్ నుంచి కోలుకోని హారిక ఏం మాట్లాడలేదు. ‘‘మాట్లాడవేం....’’ గద్దించాడు దొంగ. ఈలోపే ఫోన్ మోగింది... ‘‘నువ్వు అడిగినట్లే డబ్బు, నగలు ఎక్కడ ఉన్నాయో చెబుతాను. అయితే ఆ ఫోను ఎత్తనివ్వు’’ అన్నది హారిక. ‘‘ఇంట్లో దొంగ దూరాడని చెప్పడానికా?’’ కళ్లెర్ర చేశాడు దొంగ. ‘‘కాదు... నేను ఆ ఫోన్ అటెండ్ చేయకపోతే... నేనేదో ప్రమాదంలో ఉన్నారనుకుంటారు. అందుకే...’’ అంది తెలివిగా హారిక. ‘‘సరే, మాట్లాడు. నా గురించి ఒక్క మాట చెప్పినా... నీ ప్రాణాలు తీస్తాను’’ అని బెదిరించాడు దొంగ. ఫోన్ ఎత్తింది హారిక. అటు నుంచి హారిక అమ్మ రజనీ: ‘ఎలా ప్రిపేరవుతున్నావు?’ ‘‘నోట్స్ కోసం ఆ రవిని హెల్ప్ అడిగాను. నీరజను హెల్ప్ అడిగాను. శ్రీని హెల్ప్ అడిగాను... ప్లీజ్ ఎమర్జెన్సీ అని కూడా చెప్పాను. కానీ ఎవరూ హెల్ప్ చేయలేదు’’ అని ఫోన్ పెట్టేసింది హారిక. ఇది జరిగిన పదినిమిషాల్లోనే ఆ ఇంటిని పోలిసులు చుట్టుముట్టారు. దొంగను అరెస్ట్ చేసి పోలిస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు ఇన్స్పెక్టర్ ఆనంద్. ఇప్పుడు చెప్పండి... హారిక ప్రమాదంలో ఉన్నట్లు బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మరి ఎలా ఈ ప్రమాదం నుంచి హారిక బయట పడింది? ఫోన్లో మ్యూట్ బటన్ ఉపయోగించి ‘ఆ రవిని నోట్స్ కోసం అడిగాను’, ‘నీరజను అడిగాను’, ‘శ్రీని అడిగాను’ అనే మాటలు వినబడకుండా కేవలం ‘హెల్ప్’ ‘హెల్ప్’ ‘హెల్ప్’ ‘ప్లీజ్ ఎమర్జెన్సీ’ అనేవి మాత్రమే తల్లికి వినబడేలా చేసింది హారిక. దీంతో కూతురు ప్రమాదంలో ఉందని గ్రహించి వెంటనే ఇన్స్పెక్టర్ ఆనంద్కి ఫోన్ చేసింది రజనీ. -
రజనీ వర్సెస్ కట్టప్పా!
రజనీ: కట్టప్పా... నీకో విషయం తెలుసా? మా ఊళ్లో చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు. దీపాలు కూడా ఉండేవి కావు. అయినా సరే, అర్థరాత్రి వరకు కష్టపడి చదివేవాడిని... కట్టప్ప: అదెలా????!!!!! రజనీ: అగరుబత్తి వెలిగించి ఆ వెలుగులో శ్రద్ధగా చదువుకునేవాడిని... కట్టప్ప: ???????!!!!!!!!??????? రజనీ: మరి నీ సంగతి? కట్టప్ప: మీకు ఆ ఆగరు బత్తి అయినా ఉండేది. మాకు అది కూడా కొనే స్తోమత లేదు. అయినా సరే రాత్రి బాగా కష్టపడి చదువుకునేవాడిని.... రజనీ: అదెలా సాధ్యం?????!!!!!! కట్టప్ప: మా ఇంటి పక్కన ప్రకాశ్, సూర్య అనే ఇద్దరు అన్నదమ్ములు, వారి చెల్లి జ్యోతి అని ఉండేవారు. రాత్రి సమయంలో వారిని మా ఇంటికి పిలిచి, వాళ్ల వెలుగులో చదువుకునేవాడిని. గబ్బర్‌సింగ్ వర్సెస్ సాంబ! గబ్బర్: అరెవో సాంబా... ఎంతమంది? సాంబ: ఇద్దరు దొరా... గబ్బర్: నేను లెక్కల్లో కొంచెం వీక్... 2 దేని తరువాత వస్తుంది? సాంబ: 1 తరువాత వస్తుంది... గబ్బర్: అలాగా... 2కు ముందు ఏముంటుంది? సాంబ: 1 గబ్బర్: మరి మధ్యలో ఏముంటుంది? సాంబ: ఏమీ ఉండదు దొరా! గబ్బర్: మరి అలాంటప్పుడు రెండూ ఒకేసారి రావచ్చు కదా! ఏమిటి పిచ్చి వేషాలు? సాంబ:???!!!!! -
చట్టం దూరంగా ఉంచింది... బంధం దగ్గర చేసింది!
కేస్ స్టడీ రజనీ, మాధవ్లది అన్యోన్య దాంపత్యం. వివాహమై ఎనిమిదేళ్లైనా ఏమాత్రం వారి మధ్య అపోహలు అపార్థాలు లేవు. ఉద్యోగంలో, ఇంటిపనిలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. ఒక పూట వంట రజని చేస్తే, మరో పూట మాధవ్ చేస్తాడు. ఇరువురు ఒకే సంస్థలో ఉద్యోగం చేసుకుంటారు. కానీ కడివెడు పాలల్లో ఒక విషం బొట్టులా ఆర్నెల్ల క్రితం రజనీ మేనత్త పల్లెటూరి నుండి వచ్చింది. తనకు ఏ దిక్కూ లేదని, మేనకోడలింట్లో పెద్ద దిక్కుగా ఉంటానని తిష్ట వేసింది. ఇకనేం రజనీ మనస్సులో రోజూ విషం చిమ్మే కబుర్లు మొదలెట్టి, భార్యాభర్తల మధ్య చిచ్చు రగిల్చింది. చినికి చినికి గాలివానై విడాకుల వరకు వెళ్లింది. కేసు విచారణ ముగిసింది. జడ్జిగారికి విడాకులకు కారణాలు కన్పించలేదు. కేస్ కొట్టివేస్తే అప్పీల్‌కు వెళ్తారు. ఈ లోగా ఇరువురి మధ్య ద్వేషం పెరుగుతుంది. అందుకే ప్రత్యామ్నాయ ఉపశమనంగా సెక్షన్ 13-ఎ ప్రకారం అంటే ఆల్టర్నేటివ్ రిలీఫ్‌గా వారికి ‘జుడీషియల్ సపరేషన్’ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది భార్యాభర్తల మధ్య వివాహం రద్దు పరచదు. కేవలం ఒక కప్పు కింద సంసారం చేసే బాధ్యతను రద్దు పరచి, పరస్పరం ఆలోచించుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం రజనీ, మాధవ్‌లు వేరువేరుగా కొంతకాలం ఉన్నారు. తమ లోపాలను, ఆలోచనా విధానాలను సరిదిద్దుకున్నారు. అపోహలు తొలిగాక హాయిగా కలిసి కాపురం చేస్తున్నారు. రజనీ మేనత్తను సాగనంపారు. న్యాయమూర్తిగారు సెక్షన్ 13ఎ హిందూ వివాహచట్టం ప్రకారం ఆల్టర్నేటివ్గా జుడీషియల్ సపరేషన్ ఆర్డర్స్ ఇచ్చి వారికి కాపురం నిలబెట్టుకునే అవకాశం ఇచ్చారు. -
సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?
స్టార్ హీరోల సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు సందడి చేయటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కమలహాసన్, విజయ్, సూర్య, అజిత్ ఇలా కోలీవుడ్ స్టార్ హీరోలు దాదాపు అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో నటిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసి చాలా కాలమే అయింది. అందుకే తన నెక్ట్స్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆడిపాడటానికి రెడీ అవుతున్నాడు తలైవా. రజనీకాంత్ ప్రస్తుతం 'కబాలీ' చిత్రంలో నటిస్తున్నారు. రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీగా నిర్మిస్తున్నారు. 'మద్రాస్' ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రజనీ చేయబోయే నెక్స్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కబాలీ తరువాత శంకర్ దర్శకత్వంలో రోబో సినిమా సీక్వల్ తో నటించనున్నాడు సూపర్ స్టార్. రజనీ, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన శివాజీ, రోబో సినిమాలు ఘనవిజయం సాధించిన నేపధ్యంలో రోబో 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విలన్ పాత్రకు హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ శంకర్ 'ఐ' సినిమాలో నటించిన అమీ జాక్సన్ ను ఎంపిక చేశారు. రోబో 2 సినిమాలో నటించడానికి మరో హీరోయిన్ కోసం ఇప్పుడు చిత్రయూనిట్ వేట కొనసాగిస్తుంది. తమిళ్ తో పాటు, తెలుగు హిందీ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నేషనల్ లెవల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ భారీ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి. -
‘రజని’ ట్రయల్..
బహదూర్‌పురా: బోనాల ఉత్సవాల ఊరేగింపులో పాల్గొననున్న రజని ఏనుగుతో జూ అసిస్టెంట్ క్యూరేటర్, బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ హరీష్ కౌషిక్‌లు సోమవారం ట్రయల్ నిర్వహించారు. జూ పార్కు ప్రధాన ముఖద్వారం నుంచి కిషన్‌బాగ్ వెనుక వైపు జూ సర్వీస్ గేట్ వరకు ట్రయల్‌ను నిర్వహించారు. సికింద్రాబాద్‌తో పాటు పాతబస్తీలో జరిగే బోనాల ఊరేగింపులో రజని పాల్గొంటుందని జూ అధికారులు తెలిపారు. -
బడిని ఇంటికి తెచ్చింది!
సహాయాన్ని అర్థించి వచ్చేవారికి సాయపడటం వేరు. అవసరంలో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ సాయం చేయడం వేరు. మొదటిది చేయడానికి మంచి మనసుండాలి. రెండోది చేయడానికి మంచి మనసుతో పాటు గొప్ప ఔన్నత్యం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్న వ్యక్తి రజనీ పరాంజపే. ఓ ఉన్నత లక్ష్యంతో ఆవిడ వేసిన అడుగు... ఎందరో పేద చిన్నారులకు అక్షరభిక్ష పెట్టింది! మన దేశంలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో నిరక్షరాస్యత ఒకటి. వేళకింత ముద్దే పెట్టలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డలకు చదువులెలా చెప్పించగలరు! అందుకే పేద చిన్నారుల్లో కొందరు బాల కార్మికులుగా మారుతుంటే మరికొందరు దుర్వ్యసనాలకు బలైపోతున్నారు. అలాంటివారందరినీ చూసి ఓ అమ్మ మనసు చలించింది. నాలుగక్షరాలు నేర్పి ఆ చిన్నారుల భవితకు బంగారు బాట వేసేందుకు ఆమె పాదం పయనమయ్యింది. బడికెళ్లలేని పిల్లల దగ్గరకు బడినే తీసుకెళ్లింది. ముంబైకి చెందిన రజనీ పరాంజపే అందరిలాగా తన ఉద్యోగం, కాపురమే జీవితం అనుకోలేదు. ఉపాధ్యాయినిగా, ఓ ఇల్లాలిగా తన బాధ్యతలు నిర్వరిస్తూనే...పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత తనకెంతో ఇష్టమైన సోషల్వర్క కోర్సును పూర్తి చేశారు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆమె దృష్టి మురికివాడల్లోని పిల్లల మీద పడింది. చదువు లేక వారి అందమైన బాల్యం వీధుల పాలవుతుంటే చూసి తట్టుకోలేకపోయారు. వారి భవిష్యతుకు తానే బాటలు వేయాలనుకున్నారు. అయితే అది అంత తేలిక కాదు. ఎందుకంటే, మురికివాడల్లో ఉండేవారు రోజూ ఎక్కడ పని దొరికితే అక్కడకు వెళ్లిపోతుంటారు. పిల్లల్ని చదివించుకోవాలన్న ఆలోచనే ఉండదు వారికి. పైగా పిల్లలు ఇంటి దగ్గరుంటే ఇంటికి కాపలా ఉంటారు, మంచినీళ్లు పడతారు అనుకుంటుండంతో పిల్లల్ని బడికి రప్పించడం అంత సులువు కాదని అర్థమైందామెకి. దాంతో బడినే వాళ్ల దగ్గరకు తీసుకెళ్లాల నుకున్నారు. తన పూర్వ విద్యార్థి అయిన బీనాసేథ్ లష్కారీతో కలిసి 1989లో ‘డోర్ స్టెప్ స్కూల్’ని స్థాపించారు. ఇద్దరూ వాడవాడకీ తిరిగేవారు. ఎక్కడ చిన్నారులు కనబడితే అక్కడే పాఠాలు మొదలయ్యేవి. మొదట్లో ఇది అక్కడివాళ్లకి వింతగా అనిపించినా... పిల్లలకు జ్ఞానం పెరుగుతుండటం, వాళ్లు చిన్న చిన్న ఇంగ్లిషు పదాలు పలుకుతుండటం చూసి సంతోషమేసింది. దాంతో డోర్ స్టెప్ స్కూల్‌కి ఆదరణ పెరిగింది. వేల మంది పేద పిల్లలను చదువులతల్లి ఒడికి చేర్చింది. ప్రస్తుతం ఎంతోమంది వాలంటీర్లు, స్పాన్సర్లు రజని వేసిన బాటలో సాగుతున్నారు. రోడ్ల పక్కన, కుళాయిల దగ్గర, పొలం గట్ల మీద, రైల్లే ప్లాట్ఫాముల మీద ఎక్కడ పిల్లలు కనిపిస్తే అక్కడే చదువు చెప్తున్నారు. ఎన్ని ఆటంకా లొచ్చినా ఏదో ఒకరోజు తమ రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యతను సాధిస్తామంటున్నారు. ఆశయం గొప్పదైనప్పుడు, ఆచరణలో ఆటంకాలు ఓ లెక్కా?! వాళ్లు తప్పకుండా అనుకున్నది సాధిస్తారు!! -
రజనీ, అమీర్ తో ఎందిరన్-2 ?
2010లో అద్భుత విజయాన్ని సాధించి తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ఎందిరన్. అలాంటి చిత్రానికి సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆ చిత్ర కెప్టెన్ శంకర్ కూడా ఎందిరన్‌కు కొనసాగింపును తెరకెక్కించాలనుకుంటున్నారు. ఎందిరన్ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబోగా, దాన్ని కనుగొన్న శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేశారు. ఐశ్వర్యారాయ్ నాయకిగా నటించారు.ఈ చిత్ర సీక్వెల్ నిర్మాణం గురించి ఇటీవల మళ్లీ ప్రచారం ఊపందుకుంది. లింగా తరువాత రజనీ, ఐ చిత్రం తరువాత శంకర్ రిలాక్స్ అవడం అందుకు ఒక కారణం కావచ్చు. అయితే ఎందిరన్ చిత్రానికి కొనసాగింపు గురించి వీరిద్దరూ ఇటీవల కథా చర్చలు జరిపినట్లు కూడా కోలీవుడ్ టాక్. ఈ విషయంలో తాజా డెవలప్మెంట్ ఏమిటంటే ఎందిరన్-2లో సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించే అవకాశం ఉంది. ఈ ఇద్దరిని కలిపి శంకర్ తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున వెండి తెరపై మరోసారి అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నట్లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. ఎందిరన్ చిత్ర నిర్మాణం 130 కోట్లుగా ప్రచారం అయ్యింది. అయితే ఈ చిత్రానికి అత్యధికంగా 200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. శంకర్ ఐ చిత్రాన్ని 120 కోట్లతో తెరకెక్కించారు. కాగా అమీర్‌ఖాన్ నటించిన పికె చిత్ర నిర్మాణ వ్యయం 85 కోట్లు అని తెలిసింది. అయితే ఈ రెండు చిత్రాల బడ్జెట్ కలిపితే ఎందిరన్-2 తయారవుతుందన్నమాట. వీటిలో రజనీ, అమీర్‌ఖాన్, శంకర్ల పారితోషికమే 100 కోట్లకు చేరుతుందని మరో 100 కోట్లు నిర్మాణ వ్యయం అవుతుందనేది గణాంకాలు. చిత్ర ప్రచార ఖర్చు రూ.50 కోట్లు, పైగా మరో 50 కోట్లు వ్యయం ఉంటుందని మొత్తం 300 కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాత ముందుకు వస్తేనే ఎందిరన్-2 చిత్ర రూపకల్పన సాధ్యం అని సినీ పండితులు వాదన. వారి అంత భారీ బడ్జెట్‌తో చిత్రం చేయడానికి ఎవరు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం. -
మాకు స్ఫూర్తి రజనీ గారే!
మహాభాష్యం చిత్తరంజన్, ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు ప్రముఖ కవి, గాయకుడు, వాగ్గేయకారుడు, స్వరకర్త రజనీగారు లలిత సంగీత వికాసానికీ, అభివృద్ధికీ ఎనలేని సేవలందించారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో 1941లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నో మధురమైన లలిత గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఉమర్ ఖయ్యాయి తత్త్వాన్ని వర్ణిస్తూ కృష్ణశాస్త్రి గారు రాసిన ‘అతిథిశాల’కు ఆయన పర్షియన్ సంగీతపు పోకడలతో అద్భుతమైన బాణీలు కూర్చారు. ఆయనే ఖయ్యావయిగా కూడా నటించి పాడారు. మా తండ్రి గారు, రజనీ గారి తండ్రి గారు పిఠాపురం వాస్తవ్యులు. అందుకని ఆయనకు నా పైన ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. 1963లో హైదరాబాద్ ఆకాశవాణిలో ఈ నాటిక ప్రసారమైనప్పుడు ఆయనతో పాటు నేనూ అందులోని పాటలు పాడాను. అరబ్బీ సంగీత పద్ధతిలో పాటలే కాక పద్యాలు కూడా చదవడం అంత తేలికైన విషయం కాదు. కర్ణాటక, హిందుస్తానీ సంగీతంలో వాడుకలో లేని రాగాలెన్నిటినో ఉపయోగించడం లాంటి ప్రయోగాలెన్నో చేసిన మొట్టమొదటి వ్యక్తి - రజనీగారు. ఆ తరువాత పాలగుమ్మి విశ్వనాథం గారు, ఆ పైన నేను కూడా వాడుకలో లేని అనేక రాగాల్ని వినియోగించి, ప్రజారంజక గీతాలు తయారుచేశాం. ఆ విషయంలో మా అందరికీ స్ఫూర్తి రజనీ గారే. -
కవ్వింత
చిత్రం పనివాడు: అయ్యా, ఈరోజు టీవీలో వచ్చే ‘కడపటి యుద్ధం’ సినిమా చూడొచ్చా? యజమాని: ఇదేం విచిత్రమైన కోరికరా? పనివాడు: అది నేను నిర్మించిన తొలి-చివరి సినిమా అయ్యగారు!!! లవ్లీ షాక్ రజని: గౌతమ్, మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. గౌతమ్: నా గురించి నువ్వేం భయపడకు రజని. మా అక్క కూతురు కిరణ్మయి కూడా నన్ను ప్రేమిస్తోంది. ఫ్యామిలీ ప్యాక్ ఎలక్ట్రిసిటీ పాఠం అయ్యాక టీచరు ప్రశ్నలు అడుగుతోంది. నిద్రపోతున్న వెంకట్‌ని లేపి నువ్వు ఏ పాఠం వింటున్నావో చెప్పు అని అడిగింది. పైకి లేచి ‘ఎలక్ట్రికిటీ’ మేడమ్ అన్నాడు. అదేంటి అలా పలుకుతున్నావు రేపు మీ పేరెంట్స్‌ని పిలుచుకురా. టీచర్: మీ అబ్బాయి ‘ఎలక్ట్రికిటీ’ అని పలుకుతున్నాడేంటి? తండ్రి: వాడి కెపాక్రిటీ అంతే మేడమ్ టీచరు: మీ ఆయన కూడా అలా మాట్లాడతాడేంటమ్మా? తల్లి: దీనికి ఇంత ‘పబ్లికిటీ’ అవసరమా? మేడమ్! కారణం తెలిసింది! రామ్: ఆ నవల చదివితే కేశాలు నిక్కబొడుచుకుంటాయన్నావు, అదేం లేదే! శ్యామ్: అది జుట్టున్న వారికి రా, నీకు కాదు. మగ జ్యోతిష్కుడు! శ్రీలత: నా భర్త క్షేమంగా ఉండాలంటే నేను ఏ నోము చేయాలో చెబుతారా? జ్యోతిష్కుడు: మూగనోము -
సూపర్ స్టార్‌తో సినిమా నా అదృష్టం
విదేశీ భామలు భారతీయ చిత్రాల్లో నటించడం కొత్త కాదు. అయితే, ఎక్కువ శాతం నృత్యగీతాల్లో కనిపిస్తుంటారు. ఎమీ జాక్సన్ వంటి ఏ కొందరో కథానాయికలుగా కూడా ఇక్కడ రాణిస్తుంటారు. ఇప్పుడు మరో విదేశీ భామ మన భారతీయ చిత్రంలో మెరవనున్నారు. అది కూడా తొలి చిత్రంతోనే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ విదేశీ అందం పేరు ‘లారెన్ జె ఇర్విన్’. రజనీ సరసన ‘లింగా’లో నటిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో నటిగా, గాయనిగా, నృత్యకారిణిగా చేశానని, రజనీ సరసన నటించడం తన అదృష్టమని లారెన్ తెలిపారు. కొంచెం కొంచెం తమిళ్ నేర్చుకుంటున్నానని ముద్దు ముద్దుగా అన్నారు. ఇదిలా ఉంటే.. ‘లింగా’లో ఇప్పటికే అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో లారెన్ పాత్ర వస్తుందని సమాచారం. రజనీ కాంబినేషన్లో లారెన్ తొలి సన్నివేశం చేసినప్పుడు, ‘బాగా నటించావు’ అని ఆయన అభినందించారట. ఆ విషయాన్ని తెగ ఆనందపడిపోతూ చెప్పారు లారెన్. -
బాసర ఆలయ ఏఈవోపై వేటు
బాసర, న్యూస్‌లైన్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయంలో ఏఈవోగా విధులు నిర్వహించి ఇటీవలే బదిలీ అయిన గంగా శ్రీనివాస్‌పై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. సుప్రసిద్ధమైన దేవాలయంలో తిష్టవేసి ఏళ్ల తరబడిగా అన్నీతానై వ్యవహరిస్తున్న ఆయన ఆగడాలు ఎట్టకేలకు పరాకాష్టకు చేరాయి. సుమారు 15 ఏళ్ల క్రితం బాసర ఆలయంలో క్రింది స్థాయి ఉద్యోగిగా చేరింది మొదలు అక్రమమార్గంలో ఏఈవో స్థాయికి ఎదిగాడంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆలయ ఆదాయం మొదలుకుని అభివృద్ధి పనులకు కేటాయించే నిధుల వినియోగం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లో జరిపించిన ఆయనపై చివరకు సస్పెన్షన్ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. బాసర ఆలయంలో ఈవోగా ఉన్నతస్థాయి అధికారులున్నా, ఏఈవోగా చక్రం తిప్పిన శ్రీనివాస్ ఇటీవలే హైదరాబాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయానికి డెప్యూటేషన్‌పై వెళ్లారు. హైదరాబాద్‌లో డెప్యూటేషన్‌పై వెళ్లిన ఆయన సొంత అవసరాల పేరిట సెలవు పెట్టారు. ఇదే క్రమంలో ఆయన బాసరకు చెందిన ఓ వివాహితను తీసుకెళ్లాడంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో గంగా శ్రీనివాస్‌పై పోలీసులు 497, 498 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం జిల్లాలో వ్యాపించగా పత్రికా కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ గంగా శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. తన భార్యను తీసుకెళ్లాడన్న ఓ వ్యక్తి పోలీసుస్టేషన్లో శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేయడం, ఆయనపై కేసులు నమోదు కావడం వల్ల ఆలయ ప్రతిష్టకు భంగం కలగడంతో సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అదే విధంగా కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్‌గా బాసర దేవాలయంలో పనిచేస్తున్న రజినిని కూడా విధుల నుంచి తొలగించినట్లు ఆలయ ఈవో తెలిపారు. కాగా మొదటి నుంచి వివాదాల్లో చిక్కుకున్న శ్రీనివాస్ సస్పెన్షన్ ఆలయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
'భారతరత్న' నా తల్లికి అంకితం: సచిన్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తనకు ప్రకటించిన 'భారతరత్న' అవార్డును తన తల్లి రజనికి అంకితం చేస్తున్నట్లు సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ ఈరోజే తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను సచిన్ టెండూల్కర్, సైన్స్‌లో విశేష సైవలు అందించిన ప్రధాని సాంకేతిక సలహాదారుడు సిఎన్ఆర్ రావులకు ఈరోజు భారత తర్న ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పురస్కారం తనకు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి సచిన్ ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. అంతకు ముందు క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా సచిన్ మాట్లాడుతూ క్రికెట్ వైపు నడిపించిన తల్లికి కృతజ్ఞతలు తెలిపాడు. అమ్మ ప్రార్థనలే తనని ఈస్థాయికి చేర్చాయని చెప్పారు. ఏ వ్యక్తి అయినా గొప్పవాడు అయ్యేందుకు కుటుంబమే కారణమన్నారు. -
రోబోకి ఏమైంది..? Part 2
-
దటీజ్ రజని Part 3
-
దటీజ్ రజని Part 2
-
దటీజ్ రజని Part 1