
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు లదాఖ్ ప్రాంతంలోని 6,153 మీటర్ల స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని అధిహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లికల్ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్. అఖిల్‌లు ఈ పర్వతాన్ని అధిరోహించారు.
ఈ యాత్రకు సంబంధించి తనకు ఆర్‌ఎస్ ప్రవీణ్ తోడ్పాటునందించారని మల్లికార్జున తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీలపై అభిమానంతో సాయికిరణ్ బ్యానర్ ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment