సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..? | rajani, Shankar robo 2 team secrching for second heroin | Sakshi
Sakshi News home page

సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?

Published Wed, Oct 21 2015 1:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?

సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?

స్టార్ హీరోల సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు సందడి చేయటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కమలహాసన్, విజయ్, సూర్య, అజిత్ ఇలా కోలీవుడ్ స్టార్ హీరోలు దాదాపు అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో నటిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసి చాలా కాలమే అయింది. అందుకే తన నెక్ట్స్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆడిపాడటానికి రెడీ అవుతున్నాడు తలైవా.

రజనీకాంత్ ప్రస్తుతం 'కబాలీ' చిత్రంలో నటిస్తున్నారు. రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీగా నిర్మిస్తున్నారు. 'మద్రాస్' ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రజనీ చేయబోయే నెక్స్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కబాలీ తరువాత శంకర్ దర్శకత్వంలో రోబో సినిమా సీక్వల్ తో నటించనున్నాడు సూపర్ స్టార్.

రజనీ, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన శివాజీ, రోబో సినిమాలు ఘనవిజయం సాధించిన నేపధ్యంలో రోబో 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విలన్ పాత్రకు హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ శంకర్ 'ఐ' సినిమాలో నటించిన అమీ జాక్సన్ ను ఎంపిక చేశారు.

రోబో 2 సినిమాలో నటించడానికి మరో హీరోయిన్ కోసం ఇప్పుడు చిత్రయూనిట్ వేట కొనసాగిస్తుంది. తమిళ్ తో పాటు, తెలుగు హిందీ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నేషనల్ లెవల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ భారీ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement