Robo 2
-
ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్ అమీ జాక్సన్ (ఫొటోలు)
-
పిచుకా క్షేమమా..!
అది దొరకదు. కాని అది ఉంటుంది. మనం ఇల్లు కట్టుకుంటే హక్కుగా వచ్చి దాని ఇల్లు కట్టుకుంటుంది. మనం ఒండుకుని తింటాం. రాలినవి అవి ఏరుకుని తింటుంది. వాసాల మీద వాలుతుంది. వసారాపై వాలుతుంది. బల్బ్ మీద కూచుంటుంది. నీళ్ల తొట్టి అంచు మీద ఆలోచిస్తుంది. అది మనల్ని పట్టించుకుంటుంది. అసలు మనల్నే మర్చిపోతుంది. మనిషిది కూడా పిచ్చుక ప్రాణమే. కాని ఆ పిచ్చుక ప్రాణానికి ఈ పిచుక చేసే పిచ్చిపనులే ప్రమాదం. పిల్లల కథల్లో, పాటల్లో, సామెతల్లో, పలుకుబడుల్లో, సినిమాల్లో పిచ్చుక లేకుండా ఎలా ఉంటుంది. పిచ్చుక లేకపోతే మనం ఉండగలమా? రాసుకోవద్దూ ఇవాళ దాని గురించి? ‘గురి తప్పిన బాణం వలే తిరుగాడింది పిచ్చుక’ అని రాశాడు ఒక తెలుగు కవి. గదిలోకి దూసుకు వచ్చిన పిచ్చుక ఒక్క క్షణం ఎక్కడికొచ్చానా అని తొట్రుపడి గురి తప్పిన బాణంలా గిరికీలు కొట్టి మళ్లీ బయటకు బుర్రున ఎగిరిపోయిన దృశ్యం ఆ వాక్యం చదవగానే కళ్ల ముందు మెదులుతుంది. నిజానికి ‘పిచ్చుక’ అనగానే దృశ్యాలు, జ్ఞాపకాలు, బాల్యాలు చుట్టుముట్టనిది ఎవరికి? చిలుకలు ఎప్పుడో కాని రావు. కాకులు వచ్చినా మనకు నచ్చవు. నెమళ్లు ఎక్కడుంటాయో తెలియదు. గద్దలు ప్రమాదం. పావురాళ్లు గుళ్లను మసీదులను ఇష్టపడతాయి. మరి మన ఇళ్లకి ఎవరు రావాలి? పిచ్చుకమ్మే. అది తానుగా వచ్చి లేదా మగనితో వచ్చి వరండా లో కిచకిచమని, వడ్లను పొడిచి తిని, అద్దంలో ముఖం చూసుకొని, అమ్మ చేటలో బియ్యం ఏరుతూ ఉంటే దూరాన నేల మీద గెంతుతూ ఉండి విసిరిన నూకలను నోట కరుచుకుని, బావి గట్టు మీద వాలి, గిలక మీద కాళ్లు పెట్టి, బిందె పెట్టి పెట్టి లోతుకు పోయిన సిమెంటు గుంటలో నిలిచిన నీళ్లలో స్నానాలాడి... ఈ పిచ్చుకలే కదా జీవన లిప్తలను ఇస్తాయి ఇచ్చాయి అందరికీ. అందుకే అవంటే అందరికి ఇష్టం. కసురుకోవడానికి ఇష్టపడని స్నేహం. గమనించండి అప్పటికీ ఇప్పటికీ ఎవరూ పిచ్చుకలను కసురుకోరు. అవి వస్తే ఆనందం. వచ్చి వెళ్లిపోయినా ఆనందమే. అంటీ ముట్టని చుట్టం... పిచ్చుక మనిషితోనే ఉంది. మనిషితోనే ఉంటుంది. కాని అంటదు. ముట్టదు. అంటినా ముట్టినా సహించదు. మనిషి ఆవాసాల్లోనే అది గూడు కట్టుకుంటుంది. పూరి గుడిసెల వసారాల్లో, మిద్దిళ్ల వాసాల్లో ఉండే ఖాళీల్లో, వాకిలి పైన, సీలింగ్ ఫ్యాన్ పైడొప్పలో, వెంటిలేటర్లలో, ఓపెన్ షెల్ఫ్‌లలో, బావి లోపలి గోడల్లో ఉండే రంధ్రాల్లో అవి గూడు కట్టుకుంటాయి. గడ్డి వాటి గూడుకు ముఖ్యమైన మెటీరియల్. లేకుంటే పుల్లలు పుడకలూ ఎలాగూ సేకరిస్తాయి. పిచ్చుకల గూళ్లను భారతీయులు ఏ కోశానా కూల్చరు. కూల్చడం పాపం అనుకుంటారు. వాటిలోకి తొంగి చూడటం వాటికి పుట్టిన పిల్లలను తాకడం చేయరు. అలా చేయడాన్ని పిచ్చుకలు నచ్చవు. పొదగడానికి పెట్టిన గుడ్లను తాకితే అవి వాటిని పొదగవని పిల్లలకు చెబుతారు. పిచ్చుకలు మనుషుల్లానే కుటుంబానికి విలువ ఇస్తాయి. ఆడ, మగ కలిసి కష్టపడి గూడు కట్టి పిల్లలను సాకి సంతరిస్తాయి. అందుకని కూడా మనవాళ్లకు అవంటే ఇష్టం. మగపిచ్చుక కొంచెం బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా స్పీడుగా ఉంటుంది. అవి రెండు ఏమిటేమిటో మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి మాటలు వినడం ఎవరికైనా సరే బాగుంటుంది. పిచ్చుకలు మూడేళ్లు బతుకుతాయి. కాని అవి ఆ మూడేళ్లను సంపూర్తిగా జీవిస్తాయి. బద్దకించవు. మెల్లగా ఉండవు. ఉత్సాహం మానుకోవు. ఎప్పుడూ బతుకు మీద ఆశతో మన బతుకు మనం బతుక్కుందాం అన్నట్టుగా ఉంటాయి. మనుషులు తినేవి కొన్ని అవి తింటాయి. అవి తినేవి కొన్ని వాటికి దొరుకుతాయి. ఇప్పుడు మనుషులు తినేవి కొన్ని వాటికి విషపూరితం. అవి తినే పురుగులు కూడా విషపూరితమైపోతున్నాయి. కథల్లో పలుకుబడిలో.... కథల్లో పిచ్చుక ఉంటే పిల్లలకు ఇష్టం. పసిపిల్లలకు గోరుముద్దలు తినిపించేటప్పుడు ‘ఇది కాకమ్మ ముద్ద... ఇది పిచ్చుకమ్మ ముద్ద’ అని తినిపిస్తారు. కొన్ని పిచ్చుక లు కథల్లో భలే తెలివి చూపిస్తాయి. కొన్ని నవ్విస్తాయి. కాకి ఉప్పుతో మేడ కట్టుకుందట, పిచ్చుక పుల్లలతో కట్టుకుందట. కాకి పిచ్చుకను చూసి ఎగతాళి చేసిందట. కాని వానొస్తే ఏముంది? ఉప్పు కరిగి కాకి దిక్కులేనిది అయ్యింది. పిచ్చుక మాత్రం వెచ్చగా తన బిడ్డలను జవురుకొని నిద్రపోయింది. పిచ్చుక సోషలిస్టు. దానికి ఎంత కావాలో అంతే తిని ఎగిరిపోతుంది. ఆశ చాలా చెడ్డది అని చెబుతుంది. గిన్నెలో మరికొన్ని గింజలను వదలడం దానికి ఇష్టం. అందుకే పల్లీయులు దానిని చేరదీస్తారు. వసారాల్లో వరి కంకులనో జొన్న కంకులనో వేళ్లాడగడతారు. అవి వచ్చి తింటే ఆ తృప్తి వేరు. ‘పిచ్చుక మొడితే మంచిది’ అని పల్లెల్లో అనుకుంటారు. అది మొట్టడం అరుదు. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ మూర్ఖత్వం పాపం అనుకుంటారు. మనుషుల్లో అలాంటి అల్పప్రాణి కనిపిస్తే కనికరించాలని పిచ్చుకను చూసి నేర్చుకున్నారు. బంగారు బాతులాగే బంగారు పిచ్చుక కూడా పోలికకు వాడతారు. ‘కాకమ్మ పిచుకమ్మ కబుర్లు’ అంటారు కాని ఉద్దేశాలు లేని హాౖయెన కబుర్లు చెప్పుకుంటే మంచిది కదా పిచ్చుకమ్మల్లాగా. అపాయం తడి చెత్త, పొడి చెత్త అని అన్నీ కవర్లలో పెట్టి పారేస్తున్నాం. బావి దగ్గర గిన్నెలు కడిగి మెతుకులు నేలన పడేసేది లేదు. బియ్యం ఏరేది లేదు. అందులో నూకను పారేసేది లేదు. శ్లాబ్ వేసి ఇళ్లు కట్టుకుంటున్నాం. కిటికీలు తెరవకుండా మూసేస్తున్నాం. బోర్లు చల్లదనాన్ని ఇవ్వవు... స్థలాన్నీ ఇవ్వవు. ఫ్యాక్టరీల ద్వారా, కార్ల ద్వారా, ఏసిల ద్వారా, ఫోన్ల ద్వారా గాలిలో హానికారమైన రసాయనాలను తరంగాలను వదులుతున్నాం. తిండి గింజల పంటలకు బదులు వ్యాపార పంటలు వేసి పిచ్చుకలు ఎంత దూరం ఎగిరినా ఏమీ దొరకని స్థితి తెస్తున్నాం. వాటిపై కొట్టిన రసాయనాలు తిని చచ్చిన పురుగులను తిని పిచ్చుకలు చచ్చిపోతున్నాయి. పిచ్చుకది పిచ్చుక ప్రాణం. తట్టుకోలేదు. అందుకే రచయితలు ‘చివరి పిచ్చుక’ అని కథలు కూడా రాశారు. పర్యావరణకారులు పిచ్చుకలను ఆదరించడానికి గూళ్లను ఏర్పాటు చేసే ప్రచారం చేస్తున్నారు. వాటికి కావాల్సిన గింజలు పెట్టమని, నీళ్లు పెట్టమని చైతన్యం కలిగిస్తున్నారు. రేడియేషన్ లేకుండా సెల్‌టవర్లను తగ్గించాలని ‘రోబో2.ఓ’ వంటి సినిమాలే వచ్చాయి. ఎంత పెద్ద భవంతి ఉన్నా దాని బాల్కనీలో మొక్కలు ఆ నీటి కుండీ పక్కన వాలేందుకు పిచ్చుకలు లేకపోతే ఆ సంపదకు అర్థమేమిటి? ఒక చిన్ని బుజ్జి పిచ్చుక ఉదయాన్నే ‘ఎలావున్నావమ్మా వొదినా’ అని ఇంట్లోకి వచ్చి నిద్ర లేపేలా మన పరిసరాలు, ఊరు, నేల, భూగోళం ఉండాలని కోరుకొని ఆ విధంగా ఉండేలా ప్రయత్నించకపోతే మనం ఎలా ఉంటున్నట్టు. ఆలోచిద్దాం ఇవాళ్టి నుంచైనా. బయట ఎండగా ఉన్నట్టుంది.. వెళ్లి కొంచెం పిచ్చుకలకు గింజలు, నీళ్లు పెడదాం పదండి. – సాక్షి ఫ్యామిలీ -
పక్షుల కోసం పాట
పక్షుల అంతరంగం ఎలా ఉంటుంది? వాటిని బాగా ప్రేమించేవాళ్లకు కొంత అర్థం అవుతుంది. అక్షయ్ కుమార్ కూడా పక్షి ప్రేమికుడు. టెక్నాలజీ డెవలప్మెంట్ కొన్ని పక్షుల అంతానికి కారణం అవుతోందని రగిలిపోతాడు. తన కోపాన్ని పాట రూపంలో ప్రతిబింబించాలనే ఆకాంక్షతో ఓ పాట పాడారట. ఆ పాటను కైలాష్ ఖేర్ పాడారు. ఇదంతా ‘2.0’ సినిమా గురించే. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘2.0’. ఈ చిత్రానికి ఏఆర్. రెహమాన్ స్వరకర్త. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘యందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు సీక్వెల్ ఇది. ఈ సినిమాలో బర్డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సాంగ్‌ను సింగర్ కైలాష్ ఖేర్ పాడారు. ప్రభాస్ నటించిన ‘మిర్చి’లో ‘పండగలా దిగివచ్చాడు’, మహేశ్ నటించిన ‘భరత్ అనే నేను’లో ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్స్‌ను పాడింది కైలాష్‌నే. ‘‘వన్ అండ్ ఓన్లీ రెహమాన్ సారథ్యంలో ‘2.0’ మూవీ కోసం ఓ బ్యూటిఫుల్ బర్డ్ సాంగ్ పాడా’’ అని పేర్కొన్నారు కైలాష్ ఖేర్. ‘2.0’ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ∙కైలాష్‌ఖేర్, ఏఆర్ రెహమాన్ -
పండక్కి పండగే
క్యారే సెట్టింగా..? అంటూ ఓ పక్క థియేటర్లలో సందడి చేస్తూనే మరో సినిమాలో బిజీ అయిపోయారు రజనీకాంత్. ‘కాలా’ చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయింది. అదే రోజున కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను డెహ్రాడూన్‌లో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేలోగా ఈ సినిమాను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రజనీ. అందుకే సినిమాకు ఫుల్ డేట్స్ కూడా కేటాయించేసారట. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తోందట సన్ నెట్ వర్క్ సంస్థ. విశేషం ఏంటంటే 2019 సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ కూడా విడుదల కావాలి. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం 2019 సంక్రాంతికి కూడా రాకపోవచ్చు అని చెన్నై టాక్. సో.. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కూడా ‘2.0’ కంటే ముందే ఆడియన్స్‌ని పలకరించొచ్చు అని ఊహాగానాలు విని పిస్తున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పూర్తి పొలిటికల్ టచ్‌తో ఉండబోతోందనే వార్తలు వినిపించినప్పటికీ ‘‘పొలిటికల్ టచ్ ఉండదు. కానీ రజనీకాంత్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే చిత్రమిది’’ అని పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్. పొంగల్‌కి ‘2.0’ కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ సినిమా. ఏదైతేనేం.. పొంగల్‌కి తలైవర్ సినిమా తోడైతే అభిమానులకు పండగే. అన్నట్లు.. ‘2.0’ని వచ్చే ఏడాది రిప్లబిక్ డేకి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఒకవేళ సంక్రాంతికి కార్తీక్ సుబ్బరాజ్‌తో చేస్తున్న సినిమా వచ్చి, ఆ వెంటనే ‘2.0’ కూడా వస్తే.. ఫ్యాన్స్‌కి డబుల్ ఫెస్టివల్. అయినా.. కలెక్షన్స్ డివైడ్ అవుతాయి కాబట్టి.. వారం పది రోజుల గ్యాప్‌లో రెండు రజనీ సినిమాలు వచ్చే చాన్సే లేదు. -
రజనీ సినిమాకు షాక్ : లీకైన 2.ఓ టీజర్
గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 2.ఓ. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ అధికారికంగా విడుదల కాకముందే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విదేశాల్లో ప్రదర్శించిన సమయంలో ఎవరో మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లీక్ పై స్పందించిన చిత్రయూనిట్ తాము టీజర్ అధికారికంగా రిలీజ్ చేయలేదని ప్రకటించారు. ఘనవిజయం సాధించిన రోబో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న 2.ఓను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నెగెటివ్ రోల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపైద దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ టీజర్ లో రజనీతో పాటు అమీజాక్సన్, అక్షయ్‌కుమార్ లు కూడా కనిపించారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాక ముందే ఈ టీజర్ బయటకు వచ్చేయటంతో చిత్రయూనిట్ తలలు పట్టుకున్నారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
అమ్మా.. నీకే ఫోన్ గిఫ్ట్ యువర్ టైమ్ దిస్ దివాలీ: యునైట్ ఫర్ లవ్ నిడివి : 1 ని. 15 సె. హిట్స్ :94,42,843 మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మోస్ట్లీ అది మీ చేతిలోని స్మార్ట్ ఫోన్! అవునా? స్మార్ట్ ఫోన్‌తో నిద్ర లేస్తారు. స్మార్ట్ ఫోన్ తో నిద్రలోకి జారిపోతారు. టుడే యాత్కైతే.. టైమే సరిపోవడం లేదు. కెరియర్ ఓరియెంటెడ్ కదా! బిజీ బిజీ. పైపైకి ఎదగాలంటే ఎట్ ఎనీ టైమ్ ఆఫీస్‌తో కనెక్ట్ అయి ఉండాలి నిజమే. మరి అమ్మతో! ‘ఒరేయ్ ఒక్క ముక్క తిని పోరా’ అని వెంటపడే అమ్మతో.. ఫోన్ రాగానే తింటున్నది వదిలేసి ‘బై.. మమ్మీ’ అనేసి వెళ్లిపోతే మనపై బెంగ పెట్టుకునే అమ్మతో.. కనెక్ట్ కాలేమా? అమ్మకంటే ఎక్కువా? కాదు. అమ్మా ఎక్కువే, కెరీరూ ఎక్కువే. ఏం చేయాలి? ఈ వీడియోలో.. దట్ బాయ్.. ఏం చేస్తాడో తెలుసా? దీపావళి గిఫ్ట్ ఇస్తాడు. ఆమె నిద్రలే చే సరికి గిఫ్ట్ ప్యాక్ కనిపిస్తుంది. కొడుకు.. ముందే లేచి తల్లి కోసం బ్రెడ్ స్లయిస్ మీద బటర్ అద్దుతూ డైనింగ్ రూమ్‌లో ఉంటాడు. తల్లి గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చిన్న బాక్స్. ఆ చిన్న బాక్స్‌లో స్మార్ట్ ఫోన్! కొడుకును వెతుక్కుంటూ వస్తుంది. బాక్స్‌ని కొడుక్కి చూపించి, ‘ఇది నీ ఫోన్ కదా!’ అంటుంది. ఆమెకేం అర్థం కాదు. కొడుకు నవ్వుతాడు. ‘ఈరోజంతా నా ఫోన్ నీదే. నా ఫోనే కాదు, నేను కూడా. హ్యాపీ దివాలీ మా’ అని బ్రెడ్ స్లయిస్ ఇస్తాడు తినమని. ఆవేళ్టికి కంప్లీట్‌గా తన ప్రపంచంతో తల్లిని కనెక్ట్ చేస్తాడు. తల్లిని తన ప్రపంచం చేసుకుంటాడు. గ్రేట్ గిఫ్ట్ కదా! నోకియా కంపెనీ యాడ్ ఇది. వీడియోలో లాస్ట్ సీన్.. ఈవెనింగ్ ‘ప్రియా’ అనే అమ్మాయి మన హీరోకి ఫోన్ చెయ్యడం. స్క్రీన్ మీద ప్రియ అని డిస్ప్లే అవుతుంటుంది. ‘అమ్మా.. మాట్లాడు’ అంటాడు. అమ్మ నవ్వుతుంది. ‘మాట్లాడమ్మా.. ఈరోజు వచ్చే కాల్స్ అన్నీ నీకే..’ అంటాడు. ‘నో.. నో.. నువ్వే మాట్లాడు’ అని అమ్మ పెద్దగా నవ్వుతుంది. అమ్మ నవ్వుతో దీపావళి వెలిగిపోతుంది. నవ్వించి చంపుతాడు ఖరిబ్ ఖరిబ్ సింగిల్: ట్రైలర్ నిడివి :2 ని. 23 సె. హిట్స్ :45,60,219 దాదాపు సింగిల్ అని అర్థం.. ‘ఖరిబ్ ఖరిబ్ సింగిల్’ అంటే! ఇర్ఫాన్‌ఖాన్, పార్వతి (మలయాళీ నటì ) సింగిల్ సింగిల్. కానీ కలిసి ప్రయాణం చేయవలసి వస్తుంది. ఒక స్త్రీ, ఒక పురుషుడు.. చిర్రుబుర్రులు, చిటపటల జర్నీ.. ఎలా ఉంటుందో ఊహించండి. లైవ్లీగా ఉంటుంది. కానీ లవ్లీగా ఉండదు. హిస్టారికల్ ప్లేసెస్ తిరుగుతుంటారు. ఓ చోట ఇద్దరూ ఒకే రూమ్‌లో స్టే చేయవలసి వస్తుంది. పార్వతి స్నానం చేసి, బట్టలు మార్చుకుంటున్నప్పుడు సడెన్‌గా ఇర్ఫాన్ వచ్చేస్తాడు లోపలికి. ‘ఓ మై గాడ్’ అని పెద్దగా అరిచేస్తుంది పార్వతి. ఇర్ఫాన్ కూడా అరిచేస్తాడు అంతకన్నా పెద్దగా ‘ఓ మై గాడ్.. ’ అని! ఈ ట్రైలర్లో ఇంకా చాలా సీన్స్ మన పొట్టని పకపకా టికిల్ చేస్తాయి. ఇర్ఫాన్ ఎక్స్‌ప్రెసివ్. ముందూవెనుకా చూసుకోకుండా పెద్దగా మాట్లాడేస్తుంటాడు. పార్వతి ‘ఎక్స్‌ప్రెస్సో. చప్పుడు చెయ్యకుండా సివిలైజ్డ్గా కాఫీ తాగే రకం. ‘నా జీవితంలో మొత్తం మూడు గ్రేట్ లవ్‌స్టోరీలు ఉన్నాయి’ అంటాడు ఇర్ఫాన్! ‘వ్వాట్’ అంటుంది పార్వతి ముఖం చిట్లించి. ‘అవును. ప్రతి లవ్వూ హిస్టారిక్, లెజెండ్రీ, షేక్స్పియరియన్ ట్రాజిడీ’ అంటాడు. ఆమె నవ్వుతుంది. ఆ మూడు ప్లేస్‌లు.. హిస్టారిక్.. లెజెండ్రీ.. షేక్స్పియరియన్ కాలాలకు బ్యాగులు సర్దేసుకుంటారు. వీళ్లది ‘సాత్ జీనె మర్నే వాలీ స్టోరీ’ కాదు. కలిసి జీవించరు. కలిసి కన్నుమూయరు. నో ఎమోషన్. కానీ చివర్లో అమ్మాయి పడిపోతుంది. ‘నీ స్మైల్ బాగుంటుంది’ అంటాడు ఇర్ఫాన్.. రోప్ వేలో ఇద్దరూ కలిసి ప్రయాణిస్తున్నప్పుడు. అప్పుడు పడిపోదు. ఇక్కడో తనకు తెలియకుండానే పడిపోతుంది. పడిపోవడం అంటే ప్రేమలో అనుకోకండి. నచ్చిన అబ్బాయి దగ్గర అమ్మాయి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో అలాగ! నచ్చడం అంటే మళ్లీ ప్రేమ అనుకోకండి. నచ్చడం. అంతే. ఈ ఫన్ ఫిల్డ్ కామెడీ నాన్–లవ్ స్టోరీ థియేటర్స్‌లోకి నవంబర్ 10న వస్తోంది. బై ద వే.. మనసుకు నచ్చిన అబ్బాయి దగ్గర అమ్మాయి ఎంత ఫ్రీగా ఉంటుందో తెలుసా? ట్రైలర్ చివర్లో మీరే చూస్తారు. టూవో మూవీ త్రీడీ మేకింగ్ ఆఫ్ 2.0 3డి ఫీచరెట్ నిడివి 3 ని. 35 సె. హిట్స్ 28,47,777 2.0 (టూ పాయింట్ ఓ) మూవీ.. నో డౌట్ సూపర్ హిట్. 2018 జనవరి 25న అంటున్నారు కదా మూవీ రిలీజ్. అప్పుడే ఎలా చెప్తాం హిట్ అని?! డైరెక్ట్‌గా త్రీడీలో షూట్ చేస్తున్న తొలి ఇండియన్ ఫిల్మ్ మరి! అయితే మాత్రం ఇప్పుడే ఎలా చెప్పేస్తాం సూపర్ హిట్ అని? హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘2.o’ ను 450 కోట్ల రూపాయలతో తీస్తున్నారు. ఇవన్నీ సరే.. మూవీ హిట్ అని ఎలా చెప్తాం? ఇదిగో... ఈ ‘మేకింగ్ ఆఫ్ 2.o’ ఫీచరెట్ని చూస్తే అనిపిస్తోంది. త్రీడీలో సినిమాను ఎలా తీస్తారో శంకర్ ఇందులో ప్రాక్టికల్‌గా చూపెడుతూ, డిస్క్రిప్షన్ ఇస్తుంటాడు. మేకింగ్ ప్రాసెస్ అమేజింగ్‌గా ఉంది. రజనీకి రోబో రూపం తెచ్చేందుకు ఒక టీమ్మొత్తం శ్రమించడం కూడా.. అక్కడేదో విశ్వాంతరాళంలో పని జరుగుతున్నట్లుగా ఉంది. సినిమాటోగ్రాఫర్ నిర్వాణ్షా అయితే.. నాట్ లెస్ దేన్.. ఎ కెమెరా సైంటిస్ట్! టూడీ, త్రీడీ షూటింగ్‌ల మధ్య తేడాలను చెప్పడానికి ‘లైకా’ కంపెనీ ఈ వీడియోను యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసింది. సినిమాకు డబ్బులు పెడుతోంది ‘లైకా’నే. పగిలిందేదో పగిలింది మిగిలిందేరా జీవితం! రూడీ మాన్క్యూసో అండ్ పూ బియర్: బ్లాక్ అండ్ వైట్ నిడివి 3 ని. 7 సె. హిట్స్ :16,72,135 పాతికేళ్ల అమెరికన్ ఇంటర్నెట్ కమెడియన్ రూడీ మాన్క్యూసో (ఫొటోలో ఉన్నది అతడే) కాస్త సీరియస్‌గా లైఫ్ గురించి ఆలోచించి ఆలపించిన గీతం ఈ ‘బ్లాక్ అండ్ వైట్’. ఇతడితోపాటు నలభై ఏళ్ల అమెరికన్ గ్రామీ విజేత జేయస్ బాయ్డ్ (పూ బియర్ అనేది స్టేజ్ నేమ్) కొన్ని జీవిత సత్యాలను ఇందులో శోధించారు. ‘నా లైఫ్ పజిల్‌ను పూర్తి చేయడానికి నాలోని ముక్కలన్నిటినీ జతకూర్చాలా! పగిలిందేదో పగిలిందని.. మిగిలిన దాన్నే నా జీవితం అనుకోవాలా..’ అంటూ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇదొక పియానో బేస్డ్ పాప్ గీతిక. రూడీ తొలి సింగిల్ ట్రాక్. ‘నా దారికి అడ్డం లెయ్.. అడ్డం లెయ్. ఫ్రమ్ ద బిగినింగ్ టు ద నౌ.. చాలా దూరం వచ్చేశాం. బ్లాక్ అండ్ వైట్‌లో నేను ప్రపంచాన్ని చూశాను. నువ్వెందుకు చూడవు..’ అని ఇద్దరూ కలిసి పాడతారు. మంచి రంగస్థల నాటకం చూస్తున్నట్లు ఉంటుంది ఈ సాంగ్. వితవుట్ కలర్స్.. మనం మనంగా జీవిద్దాం, ఉన్నది ఉన్నట్లుగా జీవితాన్ని చూద్దాం అంటున్నారు రూడీ అండ్ పూ బియర్. -
క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్
-
క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్
రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రోబో 2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు సినిమా భారీతనంలో న్యూస్ లో వినిపించిన రోబో పేరు ఇప్పుడో జర్నలిస్ట్ లపై దాడి చేయటంతో తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్ జరుగుతుండగా.. కవర్ రేజ్ కోసం వెళ్లిన ఇద్దరు జర్నలిస్ట్ లపై యూనిట్ సంబంధించిన బౌన్సర్ లు దాడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర సహాయ దర్శకుల్లో ఒకరు జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈవిషయం పెద్దదై కేసుల దాక వెల్లటంతో యూనిట్ సభ్యులు వెంటనే నష్టనివారణకు దిగారు. స్వయంగా దర్శకుడు శంకర్ కలుగజేసుకొని జర్నలిస్ట్ లను క్షమాపణ కోరారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ఫ్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటోంది. రజనీకాంత్ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్ -
రోబో 2 ట్రైలర్ ఎప్పుడంటే.?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా 2.0. శంకర్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన రోబోకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే 400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఒక పాట మినహా మిగతా భాగం షూటింగ్ పూర్తి చేస్తున్న రోబో 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న రోబో 2 అఫీషియల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాణాంతర కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అందుకే షూటింగ్ తరువాత 6 నెలలకు పైగా సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్‌కే కేటాయించారు. ట్రైలర్ రిలీజ్ అయిన నెల తరువాత అక్టోబర్ లో దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సల్మాన్‌పై మనసు పారేసుకున్న హీరోయిన్
-
రజనీ రోబో 2 షూటింగ్‌కు బ్రేక్
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రంలో 2.o. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ లో బిజీగా ఉంది. అయితే యుఎస్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. రజనీకాంత్, అమీజాక్సన్, మోడల్ సుధాన్షు పాండే లపై షూటింగ్ జరుగుతుండగా సాంకేతిక కారణాల వల్ల షూటింగ్ ను నిలిపివేశారు. ఈ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ ను శంకర్ తన ఫేవరెట్ స్టైల్ లో ఫ్రీజ్ టెక్నిక్ తో తెరకెక్కించాలని నిర్ణయించాడట. అయితే అందుకోసం ఏర్పాటు చేసిన కెమెరాలలో తలెత్తిన సాంకేతిక కారణల వల్ల షూటింగ్ నిలిచిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ఈ రోజు లేదా రేపు షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు రోబో యూనిట్. -
రోబో 2 @ 150
‘రోబో 2’ @ 150 అనగానే.. ఇది ఆ సినిమా బడ్జెట్ అయ్యుంటుందని అనుకోవడం సహజం. అయితే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని దాదాపు 350 కోట్ల రూపాయలతో తీస్తు న్నారని విన్నాం కదా? మరి.. 150 ఏంటి? అని సినిమా బడ్జెట్ గురించి తెలిసినవాళ్లు అనుకుంటారు. 150 అనేది ఈ సినిమా బడ్జెట్‌కి సంబంధించినది కాదు. గతేడాది డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అప్పట్నుంచీ ఇప్పటివరకూ 150 రోజులు షూటింగ్ చేశారు. ఇటీవల చిత్రీకరించిన క్లయిమాక్స్‌తో సహా 60 శాతం సినిమా పూర్తయింది. క్లయిమాక్స్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సన్నివేశాల్లో రజనీకాంత్ కనబర్చిన ఎనర్జీ సూపర్ అంటున్నారు సిల్వ. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, చిత్ర కథానాయకుడు రజనీకాంత్, కథానాయిక అమీ జాక్సన్‌పై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం. నవంబర్‌లో ఫస్ట్ లుక్‌ని విడుదల చేయాలను కుంటున్నారు. కాగా, ఈ చిత్రంలో రజనీ ఎలా కనిపిస్తారు? అనే ఊహకు తెరదించుతూ ఈలోపే చిత్రదర్శకుడు శంకర్ శాంపిల్‌గా ఓ వర్కింగ్ స్టిల్ బయటపెట్టారు. దీపావళి సందర్భంగా వచ్చే ఏడాది అక్టోబర్ 19న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట! -
రోబో 2 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి
రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ 2.0. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఐ సినిమా ఫెయిల్యూర్‌తో డీలా పడ్డ శంకర్, 2.0తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చూసుకోవాలని భావిస్తున్నాడు. రజనీ అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినా.. ప్రస్తుతం శంకర్ ప్లానింగ్‌తో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ అయిపోవటంతో దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే అని భావిస్తున్నారు. పాటలతో పాటు కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ సెట్స్ రూపొందించారు. పతాక సన్నివేశాల్లో ఎర్రకోట, పార్లమెంట్ పరిసరాల్లో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఆ రెండింటినీ చెన్నైలో సెట్ వేసినట్టుగా సమాచారం. భారీ గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి 2017 చివర కల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రోబో 2 లుక్ తెలిసేది ఎప్పుడంటే..?
కబాలి సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించిన రజనీకాంత్. లాంగ్ బ్రేక్ తరువాత రోబో 2 షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ గ్రాఫికల్ వండర్ రోబోకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అత్యంత భారీ బడ్జెట్‌తో రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వంద రోజులకు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాకు 2.0 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దేశంలోని టాప్ టెక్నిషియన్స్‌తో పాటు పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సారధ్యంలో రూపొందుతున్న రోబో సీక్వల్‌ను 2017 సెకండ్ హాఫ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రజనీ సినిమాలో మళ్లీ నీలాంబరి
రజనీకాంత్, రమ్యకృష్ణలది సూపర్ హిట్ జోడి. నరసింహ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నరసింహాగా రజనీ, నీలాంబరిగా రమ్యకృష్ణ పోటి పడి నటించారు. అయితే ఇంత భారీ సక్సెస్ అందించిన ఈ కాంబినేషన్ తరువాత రిపీట్ కాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తెరను పంచుకోబోతున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరో సినిమా రోబో 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్‌లో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనుంది. దాదాపు 17 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాలోని శివగామి పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ, ప్రస్తుతం కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో నటిస్తోంది. ఒకే సమయంలో రజనీ, కమల్ లాంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటోంది ఈ సీనియర్ హీరోయిన్. -
బాహుబలి, రోబోల కన్నా భారీగా..!
భారతీయ వెండితెర మీద వచ్చిన భారీ చిత్రాల్లో అన్నింటికన్నా ముందున్న సినిమా బాహుబలి. ఇప్పటి వరకు ప్రకటించిన లెక్కల ప్రకారం బాహుబలి రెండు భాగాలకు కలిపి 200 కోట్లకు కాస్త అటు ఇటుగా ఖర్చు పెడుతున్నారు. ఇక అదే స్థాయిలో తెరకెక్కుతున్న మరో సినిమా రోబో 2. శంకర్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 200 కోట్లకు పైగానే ఖర్చవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలను మించే స్థాయిలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు, కోలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇటీవల చంద్రకళ సినిమాతో భారీ విజయం సాధించిన కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి, చారిత్రక నేపథ్యంలో ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా 2017 మార్చ్‌లో ప్రారంభించనున్నారు. షూటింగ్ ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రకటించాడు సుందర్.సి. అయితే ఈసినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించనున్నారన్న వార్తలపై మాత్రం ఆయన స్పందించలేదు. సౌత్‌లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో పాటు భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు ప్రకటించాడు. -
రజనీ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 2.0. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త సంచలనం సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. అక్షయ్ చేస్తున్న రోల్‌కు సంబందించి కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్షయ్ రెమ్యూనరేషన్‌కు సంబందించి ఆసక్తికరమైన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆసియాలోనే అత్యంత పారితోషికం తీసుకుంటున్న జాబితాలో రజనీకాంత్ రెండో స్థానంలో ఉన్నాడు. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ తరువాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో రజనీనే. అయితే రోబో సీక్వల్ కోసం అక్షయ్, రజనీ కన్నా ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాడట. ముందుగా ఈ సినిమాలో విలన్ రోల్‌కు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్లను సంప్రదించారు. అయితే నెగెటివ్ రోల్లో నటించటంతో పాటు భారీగా డేట్స్ ఇవ్వాల్సిరావటంతో వాళ్లు అంగీకరించలేదు. అయితే జాతీయ స్థాయిలో సినిమాకు క్రేజ్ తీసుకు వచ్చేందుకు బాలీవుడ్ స్టార్ తోనే ఆ పాత్ర చేయించాలని భావించిన రోబో యూనిట్ భారీ మొత్తం ఆఫర్ చేసి అక్షయ్‌ని ఒప్పించారట. ఎంత అన్నది తెలియక పోయినా.. ఈ సినిమాకు రజనీ కన్నా అక్షయ్ కుమారే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
అందుకే రోబో 2 చేయలేదు: కమల్
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రోబో. ఈ సినిమాను ముందుగా కమల్ హాసన్ హీరోగా ప్లాన్ చేశాడు శంకర్. కమల్‌తో ఫోటో షూట్ కూడా చేసిన తరువాత ఆ ప్రాజెక్ట్ రజనీ చేతికి వెళ్లింది. ఆ తరువాత రోబో 2 సమయంలో కూడా శంకర్, కమల్‌ను సంప్రదించాడట. అయితే ఈసారి కమల్‌తో విలన్ పాత్ర చేయించాలని భావించాడు శంకర్. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన కమల్, రోబో 2 చేయలేకపోవడానికి కారణాన్ని వివరించాడు. గతంలో రజనీ కమల్‌లు చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌కు చాలా గ్యాప్ వచ్చింది.ఆ సమయంలో తిరిగి కలిసి నటిస్తే మనలో ఎవరో ఒకరు ఆ సినిమాకు నిర్మాత అయి ఉండాలని ఒప్పందం చేసుకున్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు. అయితే రోబో 2 సినిమాకు బయటి వాళ్లు నిర్మాతలు కావటంతో రజనీ, కమల్ల మల్టీ స్టారర్ సాధ్యం కాలేదు. సరైన కథ దొరికితే రజనీతో కలిసి నటించడానికి ఎప్పుడూ సిద్దమే అన్నాడు కమల్. ప్రస్తుతం రోబో 2 సినిమాలో కమల్ చేయాల్సిన విలన్ పాత్రను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. -
గ్రాఫిక్స్ కోసమే 100 కోట్లు.?
సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రోబో 2. రోబో సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మరింత భారీగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా కనువిందు చేయనుందట. అందుకు తగ్గట్టుగా బడ్జెట్లో భారీ మొత్తాన్ని గ్రాఫిక్స్ కోసమే కేటాయిస్తున్నారు. ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి రోబో 2 సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి. ఇందు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి రెడీ అయ్యింది చిత్ర నిర్మాణ సంస్థ. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని భారీ గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఐ సినిమా డిజాస్టర్ కావటంతో రోబో 2ను సూపర్ హిట్ చేసి తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్నాడు శంకర్. రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. -
'ప్రభాస్ సరసన నటించాలని ఉంది'
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న బ్రిటీష్ బ్యూటి అమీజాక్సన్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఇప్పటికే విక్రమ్ లాంటి స్టార్ హీరోతో శంకర్ లాంటి టాప్ డైరెక్టర్లతో కలిసి నటించిన ఈ బ్యూటి, మరో సారి శంకర్ దర్శకత్వంలో రోబో 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడిగా నటిస్తోంది అమీ. ఇలా టాప్ స్టార్స్‌తో కలిసి పనిచేస్తున్న ఈ భామ ఓ టాలీవుడ్ హీరో సరసన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోందట. మదరాసీ పట్టణం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అమీజాక్సన్, హిందీలో ఏక్ దివానా థా, తెలుగులో ఎవడు, తమిళ్లో ఐ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్‌ను చూసి షాక్ అయ్యానన్న ఈ బ్యూటి, ఛాన్స్ వస్తే ప్రభాస్‌తో కలిసి నటించడానికి రెడీ అంటూ ప్రకటించింది. మరి అమీ కోసం ఎవరైన ప్రభాస్ సరసన ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. -
హీరో అక్షయ్ కు చేదు అనుభవం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న పిరియాడిక్ మూవీ 'రుస్తుం' కోసం లండన్ వెళ్లిన అక్షయని అక్కడి హెత్రో ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన పత్రాలు సరిగా లేవంటూ ఆయనను గంటన్నర పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంచేశారు. ఈ సమయంలో అక్షయ్‌తో పాటు వ్యక్తిగత సహాయకుడు కూడా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2 షూటింగ్ షెడ్యూల్ ముగించుకొన్న అక్షయ్, రుస్తుం షూటింగ్ కోసం మంగళవారం లండన్ బయలుదేరారు. బుధవారం ఉదయానికి లండన్ చేరుకున్న అక్షయ్‌ని ఎయిర్‌పోర్ట్‌లోనే గంటన్నర పాటు నిలిపివేశారు. ఈ సమయంలో సాధారణ ప్రయాణికులతో పాటే అక్షయ్‌ని కూడా ఉండమనటం హీరోను మరింత అసహనానికి గురిచేసింది. అభిమానులు ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీల కోసం ఇబ్బంది పెడుతున్నారని, ఎక్కడైన ప్రైవేట్ ప్లేస్‌లో వెయిట్ చేయడానికి అనుమతించాలని అక్షయ్ కోరినా, ఎయిర్ పోర్ట్ అధికారులు అంగీకరించలేదు. -
హీరోయిన్‌కి సూపర్ స్టార్ కితాబు
ఇప్పటి వరకు కెరీర్లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా, వరుసగా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ అమీ జాక్సన్. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతన్న రోబో 2 సినిమాలో నటిస్తున్న ఈ బ్రిటీష్ బ్యూటీని, ఆ సినిమా హీరో రజనీకాంత్ తెగ పొగిడేస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్‌కు సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రకరిస్తున్న నేపథ్యంలో అమీ పనితీరును రజనీ పొగిడారు. అమీజాక్సన్‌ను ఐశ్వర్యారాయ్‌తో పోల్చిన రజనీ, భవిష్యత్తులో ఈ బ్రిటిష్ భామ కూడా జాతీయస్థాయిలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవటం ఖాయం అంటున్నాడు. రోబో సినిమా కోసం ఐశ్వర్యతో కలిసి నటించిన రజనీ, ఆ సమయంలో ఐశ్వర్య వర్కింగ్ స్టైల్ భేష్ అంటూ పొగిడాడు. తాజాగా అమీ విషయంలో కూడా ఇదే విధంగా స్పందించాడు రజనీకాంత్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2 సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఒక్క సెట్‌కే 20 కోట్లా..?
భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన సినిమా రోబో. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ సృష్టించిన ఈ విజువల్ వండర్ ప్రాంతీయ భాషా చిత్రాల మార్కెట్ హద్దులను చెరిపేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించడం పై చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వచ్చింది. మరోసారి సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అదే స్థాయిలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు చిత్రయూనిట్. ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం 20 కోట్ల రూపాయలతో చెన్నై శివార్లలో సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో రజనీకాంత్, అక్షయ్ కుమార్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీబేట్స్ ఈ యాక్షన్ సీన్స్‌ను భారీగా డిజైన్ చేస్తున్నాడు. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రోబో 2ను 2017 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రెండు కోట్లిస్తే చేస్తుందట..?
మదరాసి పట్టణం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా.., నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తరువాత వరుసగా తమిళ, హిందీ, తెలుగు సినిమాలతో బిజీ అయ్యింది. అయితే ఈ సినిమాలేవి ఈ అమ్మడికి స్టార్ స్టేటస్ మాత్రం ఇవ్వలేకపోయాయి. అదే సమయంలో శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం 'ఐ' అమీ జాతకం మార్చేసింది. ఐ సినిమా భారీ ఫెయిల్యూర్ అయినా అమీకి మాత్రం మంచి క్రెడిట్ దక్కింది. ఈ సినిమాతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న అమీజాక్సన్ అనంతరం వరుస సినిమాలతో మరింత బిజీ అయ్యింది. ప్రస్తుతం తమిళ్లో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రోబో సీక్వల్లోనూ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ఈ ఆఫర్‌తో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అమీ జాక్సన్ కొత్త ప్రాజెక్ట్ అంగీకరించాలంటే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో పర్వాలేదనిపించిన రవితేజ, తన నెక్ట్స్ సినిమా కోసం అమీ జాక్సన్‌ను ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిన అమీ, రెమ్యూనరేషన్ మాత్రం 2 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. మరి ఇంత భారీ మొత్తం ఇచ్చి ఈ అమ్మడిని హీరోయిన్గా తీసుకుంటారో లేదో చూడాలి. -
ఆర్నాల్డ్ ప్లేస్‌లో హృతిక్ రోషన్!
సెట్స్ మీదకు రాక ముందు నుంచే సంచలనాలను నమోదు చేస్తోంది రోబో 2. శంకర్, రజనీ కాంత్‌ల కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న, ఈ భారీ చిత్రానికి అదే స్ధాయిలో భారీ కాస్టింగ్‌ను సెట్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అందుకే రజనీకి ప్రతినాయకుడిగా హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్‌ను నటింప చేయాలని ప్రయత్నించారు. ఆర్నాల్డ్ కూడా అంగీకరించినా, షూటింగ్ కోసం ఎక్కువ రోజులు కేటాయించలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఆర్నాల్డ్ స్థానంలో ఇండియన్ హీరోను రీప్లేస్ చేసే ఆలోచనలో ఉన్నాడు శంకర్. సినిమా స్థాయి మరింతగా పెరగాలంటే బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరో అయితే సినిమాకు బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతోందని భావిస్తున్నారు. అందుకే బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్‌ను రజనీకి విలన్‌గా నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే శంకర్, హృతిక్ రోషన్‌ను కలిసి కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
రజనీకి టెస్ట్ పెడుతున్న శంకర్
'ఐ' సినిమా ఫెయిల్యూర్‌తో ఢీలా పడిపోయిన దర్శకుడు శంకర్, తనని తానూ ప్రూవ్ చేసుకోవటానికి మరో భారీ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శివాజీ, రోబో లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన రజనీకాంత్ కాంబినేషన్లో రోబో సీక్వల్కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా 2016 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. రజనీకాంత్, ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కపాలీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. మలేషియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వారం రోజులు గ్యాప్ రావటంతో.. ఆ గ్యాప్‌లో రోబో 2కు కావాల్సిన మేకప్ టెస్ట్‌లో పాల్గొననున్నాడు సూపర్ స్టార్. అవతార్, ఐ లాంటి భారీ చిత్రాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన సీన్ ఫుట్ రజనీకి మేకప్ టెస్ట్ చేయబోతున్నాడు. హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రోబో, బాహుబలి సినిమాలకు గ్రాఫిక్స్ సూపర్ వైజర్‌గా పనిచేసిన శ్రీనివాస మోహన్ మరోసారి గ్రాఫిక్స్ బాధ్యతలు తీసుకున్నాడు. దీపిక పదుకొనే హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. -
రోబో 260 కోట్లు
♦ జనవరిలో ‘రోబో2’ షురూ! ♦ విలన్‌గా ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ ఓకే! ‘ఐ’ సినిమాలో ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి హీరో విక్రమ్ చిన్న చిన్న ప్లాన్స్ వేయడు. ఒక ప్లాన్‌ని మించి మరొక ప్లాన్ ఉండాలనుకుంటాడు. అందుకే సినిమాలో ‘అంతకు మించి’ అని విక్రమ్‌తో చిత్రదర్శకుడు శంకర్ అప్పుడప్పుడు డైలాగ్ చెప్పించాడు. ఇప్పుడు శంకర్ ‘రోబో 2’ విషయంలో ‘అంతకు మించి’ అంటున్నారు. తొలి భాగానికన్నా మించిన బడ్జెట్‌తో, అంతకు మించిన గ్రాఫిక్స్‌తో, అంతకు మించిన కథ, కథనాలతో ‘రోబో 2’ని రూపొందించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘రోబో-2’ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్... ►‘రోబో’కి దాదాపు 130 కోట్లకు అటూ ఇటూగా బడ్జెట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బడ్జెట్‌కి రెండింతలతో ‘రోబో 2’ తీయాలనుకుంటున్నారట శంకర్. మలి భాగం నిర్మాణ వ్యయం 260 కోట్ల రూపాయల దాకా అవుతుందని చెన్నయ్ టాక్. ►‘రోబో 2’కి కథ అనుకున్నప్పుడే ఇది భారీ బడ్జెట్ చిత్రం అవుతుందని శంకర్‌కి తెలుసు. అలాగే, కొంతమంది నిర్మాతలు కూడా ఈ చిత్రం బడ్జెట్ గురించి తెలుసుకుని ‘రిస్క్ తీసుకోవడం అనవసరం’ అని ఫిక్స్ అయ్యారనే టాక్ వచ్చింది. ఒకానొక దశలో ఈ చిత్రానికి నిర్మాత దొరకడం కష్టం అనే వార్త కూడా ప్రచారమైంది. చివరికి విజయ్‌తో ‘కత్తి’ చిత్రాన్ని నిర్మించిన ‘లైకా ఇంటర్నేషనల్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. ►{పీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. వాస్తవానికి ఈ డిసెంబర్లోనే చిత్రీకరణ మొదలుపెట్టాలనుకున్నారు. అయితే, రజనీకాంత్ కథానాయకునిగా నటిస్తున్న ‘కపాలి’ అప్పటికి పూర్తయ్యే అవకాశం లేదట. అందుకని ‘రోబో-2’ని 2016 జనవరిలో మొదలుపెట్టాలనుకుంటున్నారు. ► మొదటి షెడ్యూల్‌ను చెన్నైలోనే జరపడానికి ప్లాన్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ తర్వాత విదేశాల్లో షూటింగ్ జరుపుతారు. ► హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆ పాత్రను ఇక్కడివాళ్లతోనే చేయించాలని శంకర్ అనుకున్నట్లు ఓ వార్త ఉంది. కానీ, ఆర్నాల్డ్‌ని ఖరారు చేసేశారు. రెండో షెడ్యూల్లో ఆయన పాత్ర చిత్రీకరణ ఉంటుంది. ► ‘రోబో’కు అద్భుతమైన స్వరాలందించిన ఎ.ఆర్. రహమాన్ ఈ రెండో భాగానికి కూడా సంగీతదర్శకునిగా వ్యవహరిస్తారు. రహమాన్‌కి శంకర్ చూచాయగా కథ చెప్పేశారట. ►తొలి భాగానికి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా వ్యవహరించారు. మలి భాగానికి మాత్రం ‘ధూమ్’, ‘ధూమ్ 2’, ‘వాంటెడ్’ వంటి పలు భారీ బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు దక్షిణాది చిత్రాలకు కెమెరామ్యాన్‌గా చేసిన నీరవ్ షాను తీసుకున్నారు. ► అన్నట్లు... ఈ చిత్రానికి ‘రోబో 2’ టైటిల్ కాదు. వేరే అనుకుంటున్నారు. మరో వారంలో టైటిల్‌ను రిజిస్టర్ చేయనున్నారు. -
బాహుబలి యూనిట్లో మార్పులు
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ భారీ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. బాహుబలి అంతటి ఘనవిజయం సాదించటం వెనక నటీనటుల కృషి ఎంత ఉందో, అంతకు మించి విజువల్ గ్రాఫిక్స్ కీరోల్ ప్లే చేశాయి. అయితే ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్ బాహుబలి 2కు పనిచేయటం లేదు. డిసెంబర్ నుంచి బాహుబలి 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇదే సమయంలో శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం రోబో 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుండటంతో శ్రీనివాస్ మోహన్ బాహుబలి యూనిట్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా మరొకరిని తీసుకోవాలని నిర్ణయించాడు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాకు అత్యుత్తమ గ్రాఫిక్స్ అందించి జాతీయ అవార్డ్ సాధించిన ఆర్ సి కమల్ కణ్ణన్‌ను బాహుబలి 2కు గ్రాఫిక్స్ సూపర్ వైజర్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి. మరి శ్రీనివాస్ మోహన్ స్థానంలో వచ్చిన కమల్ కణ్ణన్ రాజమౌళి ఆలోచనలకు ఎలాంటి దృశ్యరూపం ఇస్తాడో చూడాలి. -
సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?
స్టార్ హీరోల సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు సందడి చేయటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కమలహాసన్, విజయ్, సూర్య, అజిత్ ఇలా కోలీవుడ్ స్టార్ హీరోలు దాదాపు అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో నటిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసి చాలా కాలమే అయింది. అందుకే తన నెక్ట్స్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆడిపాడటానికి రెడీ అవుతున్నాడు తలైవా. రజనీకాంత్ ప్రస్తుతం 'కబాలీ' చిత్రంలో నటిస్తున్నారు. రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీగా నిర్మిస్తున్నారు. 'మద్రాస్' ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రజనీ చేయబోయే నెక్స్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కబాలీ తరువాత శంకర్ దర్శకత్వంలో రోబో సినిమా సీక్వల్ తో నటించనున్నాడు సూపర్ స్టార్. రజనీ, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన శివాజీ, రోబో సినిమాలు ఘనవిజయం సాధించిన నేపధ్యంలో రోబో 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విలన్ పాత్రకు హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ శంకర్ 'ఐ' సినిమాలో నటించిన అమీ జాక్సన్ ను ఎంపిక చేశారు. రోబో 2 సినిమాలో నటించడానికి మరో హీరోయిన్ కోసం ఇప్పుడు చిత్రయూనిట్ వేట కొనసాగిస్తుంది. తమిళ్ తో పాటు, తెలుగు హిందీ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నేషనల్ లెవల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ భారీ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి. -
ఈసారి త్రీడీలో?
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘రోబో’ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నారని సమాచారం. తొలి భాగానికన్నా మలిభాగం మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. త్రీడీ మూవీగా ‘రోబో 2’ని తీయాలన్నది శంకర్ లక్ష్యం అని చెన్నయ్ టాక్. రజనీ సరసన దీపికా పదుకొనేని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. అయితే, శంకర్ మనసు మారిందట. ఫస్ట్ పార్ట్‌లో నటించిన ఐశ్వర్యా రాయ్‌నే తీసుకోవాలనుకుంటున్నారట. పారితోషికం ఫిక్స్ అయితే యస్! ఈ సీక్వెల్‌కి సంబంధించి ప్రచారం అవుతున్న వార్తల్లో ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్కి సంబంధించిన వార్త ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ’ ఆడియో వేడుకలో ఈ హాలీవుడ్ స్టార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఆయన ‘రోబో 2’లో నటించానున్నారని టాక్. మొదట్లో ఈయన విలన్‌గా నటిస్తారనే వార్త వచ్చింది. అయితే, మరో హీరోగా నటిస్తారట. ప్రస్తుతం ఆర్నాల్డ్ పారితోషికం గురించి చర్చలు జరుగుతున్నాయని బోగట్టా. పారితోషికం ఫిక్స్ అయితే ఆర్నాల్డ్ యస్ చెబుతారని సమాచారం. మరి.. ఆర్నాల్డ్ ‘రోబో 2’లో నటిస్తారా? ఇది త్రీడీ మూవీయా? అసలు నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -
రోబో 2 కోసం హాలీవుడ్ సూపర్‌స్టార్
చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న శంకర్ 'రోబో 2' కు ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే కథ రెడీ చేసిన శంకర్ నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. తొలి భాగంలో నటించిన రజనీ హీరోగా మరోసారి నటిస్తాడన్న విషయం ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. హీరోయిన్స్, విలన్ కోసం వేట కొనసాగుతోంది. 'రోబో 2' తెర మీదకు వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా లో విలన్‌గా హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ చేత చేయించాలని ప్రయత్నించాడు శంకర్. తన గత సినిమా 'ఐ' ఆడియో వేడుకకు కూడా ఆర్నాల్డ్ ను ఆహ్వానించి తన సినిమాల రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో చూపించాడు. అయితే అప్పట్లో సినిమా కథ రెడీ కాకపోవటంతో ఆర్నాల్డ్ నుంచి ఎలాంటి హామీ రాలేదు. ఇటీవలే 'రోబో 2' కథను ఫైనల్ చేసిన శంకర్ మరోసారి ఆర్నాల్డ్ నటించే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పటివరకు ఆర్నాల్డ్, తన అంగీకరం తెలపకపోయినా 'రోబో 2'లో నటించటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ కత్రినా కైఫ్, దీపిక పదుకొనేలు నటించనున్నారు. రజనీ పుట్టిన రోజు డిసెంబర్ 12న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. -
రజనీకాంత్ సరసన?
ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు... అసలు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘రోబో 2’ సినిమా ఉంటుందా? లేదా? అనే విషయమే ఇంకా స్పష్టం కాలేదు. అప్పుడే ఈ చిత్రంలో రజనీ సరసన నటించబోయే కథానాయిక ఎవరు? అనే విషయమై చెన్నయ్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సూపర్ స్టార్ సరసన కత్రినా కైఫ్‌ని కథానాయికగా తీసుకున్నారన్నది ఆ చర్చల సారాంశం. రజనీ నటించిన ‘కొచ్చాడయాన్’లో కత్రినాను తీసుకోవాలనుకున్నారనీ, కానీ తేదీలు లేక ఆమె అంగీకరించలేదనీ అప్పట్లో ఓ వార్త ప్రచారమైంది. ఈ ‘రోబో 2’ విషయమై ఇటీవల కత్రినాను శంకర్ సంప్రతించారట. ఇప్పుడు మాత్రం రజనీ సరసన నటించడం కోసం కత్రినా తన డైరీ చెక్ చేసి మరీ, తేదీలు కేటాయించే ప్రయత్నం మీద ఉన్నారట. -
రజనీకాంత్ హీరో...విక్రమ్ విలన్..?
-
శంకర్ మనసు రోబో 2 వైపు మళ్లింది!