భారతీయ వెండితెర మీద వచ్చిన భారీ చిత్రాల్లో అన్నింటికన్నా ముందున్న సినిమా బాహుబలి. ఇప్పటి వరకు ప్రకటించిన లెక్కల ప్రకారం బాహుబలి రెండు భాగాలకు కలిపి 200 కోట్లకు కాస్త అటు ఇటుగా ఖర్చు పెడుతున్నారు. ఇక అదే స్థాయిలో తెరకెక్కుతున్న మరో సినిమా రోబో 2. శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 200 కోట్లకు పైగానే ఖర్చవుతుందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ రెండు సినిమాలను మించే స్థాయిలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు, కోలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇటీవల చంద్రకళ సినిమాతో భారీ విజయం సాధించిన కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి, చారిత్రక నేపథ్యంలో ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా 2017 మార్చ్లో ప్రారంభించనున్నారు.
షూటింగ్ ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రకటించాడు సుందర్.సి. అయితే ఈసినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించనున్నారన్న వార్తలపై మాత్రం ఆయన స్పందించలేదు. సౌత్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో పాటు భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు ప్రకటించాడు.
బాహుబలి, రోబోల కన్నా భారీగా..!
Published Sat, Jun 18 2016 8:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM
Advertisement
Advertisement