'ప్రభాస్ సరసన నటించాలని ఉంది'
'ప్రభాస్ సరసన నటించాలని ఉంది'
Published Wed, Apr 13 2016 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్న బ్రిటీష్ బ్యూటి అమీజాక్సన్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఇప్పటికే విక్రమ్ లాంటి స్టార్ హీరోతో శంకర్ లాంటి టాప్ డైరెక్టర్లతో కలిసి నటించిన ఈ బ్యూటి, మరో సారి శంకర్ దర్శకత్వంలో రోబో 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్కు జోడిగా నటిస్తోంది అమీ. ఇలా టాప్ స్టార్స్తో కలిసి పనిచేస్తున్న ఈ భామ ఓ టాలీవుడ్ హీరో సరసన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోందట.
మదరాసీ పట్టణం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అమీజాక్సన్, హిందీలో ఏక్ దివానా థా, తెలుగులో ఎవడు, తమిళ్లో ఐ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ను చూసి షాక్ అయ్యానన్న ఈ బ్యూటి, ఛాన్స్ వస్తే ప్రభాస్తో కలిసి నటించడానికి రెడీ అంటూ ప్రకటించింది. మరి అమీ కోసం ఎవరైన ప్రభాస్ సరసన ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.
Advertisement
Advertisement