గ్రాఫిక్స్ కోసమే 100 కోట్లు.? | 100 cr for robo 2 graphics | Sakshi
Sakshi News home page

గ్రాఫిక్స్ కోసమే 100 కోట్లు.?

Published Sun, May 8 2016 10:43 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

గ్రాఫిక్స్ కోసమే 100 కోట్లు.?

గ్రాఫిక్స్ కోసమే 100 కోట్లు.?

సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రోబో 2. రోబో సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మరింత భారీగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా కనువిందు చేయనుందట. అందుకు తగ్గట్టుగా బడ్జెట్లో భారీ మొత్తాన్ని గ్రాఫిక్స్ కోసమే కేటాయిస్తున్నారు.

ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి రోబో 2 సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి. ఇందు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి రెడీ అయ్యింది చిత్ర నిర్మాణ సంస్థ. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని భారీ గ్రాఫిక్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఐ సినిమా డిజాస్టర్ కావటంతో రోబో 2ను సూపర్ హిట్ చేసి తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్నాడు శంకర్. రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement