రోబో 2 రిలీజ్ మరింత ఆలస్యం | Robo 2.0 aiming for Diwali 2017 | Sakshi
Sakshi News home page

రోబో 2 రిలీజ్ మరింత ఆలస్యం

Published Sat, Jun 25 2016 8:56 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

రోబో 2 రిలీజ్ మరింత ఆలస్యం

రోబో 2 రిలీజ్ మరింత ఆలస్యం

ఐ సినిమా ఫెయిల్యూర్ తరువాత సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రోబో 2. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో సినిమాకు సీక్వల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్నాడు. బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ రజనీ సరసన ఆడిపాడనుంది.

ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2017 సమ్మర్ నాటికి ఆడియన్స్ ముందుకు వస్తుందని భావించారు. అయితే భారీ విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందనున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్కు మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అందుకే హడావిడిగా రిలీజ్ చేసేకన్నా, కాస్త సమయం తీసుకొని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సమ్మర్లో బాహుబలి పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుండటంతో బిజినెస్ పరంగా కూడా రోబో వాయిదా వేయటమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు యూనిట్ సభ్యులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement