robo 2.0
-
12 ఏళ్ల తర్వాత రజినీతో నటించనున్న ఐశ్వర్యరాయ్
హీరో రజినీకాంత్– హీరోయిన్ ఐశ్వర్యారాయ్ మరోసారి జోడీ కడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. వీరిద్దరూ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘రోబో’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2010లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ–ఐష్ జోడీకి మంచు మార్కులే పడ్డాయి. ‘రోబో’ రిలీజైన పుష్కరానికి (పన్నెండేళ్లు) మరోసారి వీరు జోడీగా నటించనున్నారని టాక్. రజినీకాంత్ నటించనున్న 169వ సినిమాకి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట నెల్సన్. ఇందులో రజినీకి జోడీగా ఐశ్వర్య కనిపించబోతున్నారని భోగట్టా. ఈ జోడీ మరోసారి మ్యాజిక్‌ను క్రియేట్ చేయడం ఖాయం అంటోంది కోలీవుడ్. త్వరలోనే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ కీలక పాత్ర చేయనున్నారని టాక్. -
ఉక్రెయిన్‌లో అందమైన ప్రదేశాలెన్నో, అక్కడ రూపుదిద్దుకున్న భారత సినిమాలు..
వరల్డ్ వైడ్‌గా అత్యంత సుందరమైన ప్రదేశాలున్న దేశాల్లో ఉక్రెయిన్ (Ukraine) ఒకటి. ఎప్పుడూ వివిధ దేశాల పర్యాటకులతో సందడిగా ఉండే ఉక్రెయిన్ పరిసర ప్రాంతాలు రష్యా యుద్దం ప్రకటించడంతో అతలాకుతలం అయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలు సరిహద్దులను దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి దాడులు చేస్తుండటంతో..ఉక్రెయిన్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత సినీ పరిశ్రమలు ఉక్రెయిన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాయి. ఎందుకంటే అంత్యంత సుందరమైన ప్రదేశాలను కలిగిన ఉక్రెయిన్‌లో మన భారతీయ సినిమాలు ఎన్నో అక్కడ షూటింగ్స్‌ను జరుపుకున్నాయి. అందుకే ఉక్రెయిన్‌తో మన భారత సినీ పరిశ్రమకు అందులో మన తెలుగు ఇండస్ట్రీకి మంచి అనుబంధం ఉంది. మరి అక్కడ రూపుదిద్దుకున్న మన తెలుగు సినిమాలు, భాతర చిత్రాలు ఏవో ఓ సారి చూద్దాం. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం, రణం, రుధిరం). దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లో ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ మూవీలోని పలు సన్నివేశాలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేసిన ‘నాటు నాటు’ సాంగ్ ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన నాటు నాటు పాట ఏ రేంజ్లో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. View this post on Instagram A post shared by K.K.Senthil Kumar (@dopkksenthilkumar) సెన్సెషన్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ రోబో. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన రోబో 2.0లోని చాలా సన్నివేశాలను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించారు. ఇందులో మెక్సికన్ బ్యూటీ అమీ జాక్సన్ లేడీ రోబోగా నటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. 2017లో వచ్చిన తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం విన్నర్. ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న మొదటి ఇండియన్ చిత్రమిదేనని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రకటించాడు. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సహనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 99 సాంగ్స్. ఈ సినిమా కూడా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇండియాలోనే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఉక్రెయిన్‌లో లాంగ్ షెడ్యూల్‌తో ముగిసింది. ఇహాన్భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ పోషించిన చిత్రం దేవ్. 2019లో విడుదలైన ఈ చిత్రాన్ని రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. -
ఇంగ్లండ్ పోలీస్ ట్విటర్లో సూపర్‌స్టార్!
లండన్: అదేంటీ.. రజనీకాంత్ సూపర్‌స్టార్ కదా? మరి సైంటిస్ట్ అంటారేంటి? ..నిజమే, రజనీకాంత్ గొప్ప స్టార్ ఇమేజ్ ఉన్న నటుడని మనకు తెలుసు. ఇంగ్లండ్ పోలీసులకు తెలియదు కదా? అందుకే తమ వెబ్సైట్లో రజనీకాంత్‌ను సైంటిస్ట్‌గా చూపుతూ ఓ ఫొటో పోస్ట్ చేశారు. అసలు విషయమేంటంటే.. ఓ వ్యక్తి మోతాదుకి మించి తాగి కారు డ్రైవింగ్ చేస్తుండగా, డర్బీ పోలీసులు పట్టుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో రీడింగ్ ఓ రేంజ్‌కి వెళ్లడంతో పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఫన్నీగా చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ‘ఈ వ్యక్తి ఆల్కహాల్ మోతాదు ఇంతగా నమోదవ్వడానికి కారణం సైంటిస్టులకు కూడా అంతుబట్టడంలేద’ంటూ ట్వీట్ చేసిన పోలీసులు సైంటిస్ట్‌కు సింబల్‌గా మన తలైవా చిత్రాన్ని వాడుకున్నారు. ఇటీవల విడుదలైన రోబో 2.ఓలో రజనీకాంత్ సైంటిస్ట్ పాత్ర కూడా పోషించాడు కదా.. అదే ఫొటోను ఇంగ్లండ్ పోలీసులు ఫన్నీగా వాడుకున్నారన్నమాట. నిజానికి రజనీకాంత్ సైంటిస్ట్ కాదనే విషయం వాళ్లకూ తెలుసు! A male subject to a breath test by Derby Police this morning provided a reading that biologically shouldn't even be possible. The male had a BAC of 0.341% which is like driving whilst under a surgical anaesthetic or being in a coma. Oh, and he has 2 prior life disqual's 😉 #fb pic.twitter.com/roHAzHq1pv — Derby Police (@DerbyPol) 9 February 2019 -
2.0 @ 2:28:52
కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 29వ తేదీ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ ‘2.ఓ’ థియేటర్లోకి వచ్చే రోజు అది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 2010లో వచ్చిన ‘ఎందిరిన్’ చిత్రానికి ‘2.ఓ’ సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యయని కోలీవుడ్ సమాచారం. నిడివి 2గంటల 28నిమిషాల 52 సెకన్లు అట. సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పలేదు కానీ కొన్ని పదాలను మ్యూట్ చేయమని అడిగారట. ఇంకో విషయం ఏంటంటే... ఇప్పటివరకూ శంకర్ దర్శకత్వం వహించిన ‘జెంటిల్‌మేన్, భారతీయుడు, అపరిచితుడు, రోబో’ తదితర చిత్రాల్లోకెల్లా ‘2.ఓ’ సినిమా నిడివి తక్కువని కోడంబాక్కమ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... రజనీకాంత్ కెరీర్లో 1995లో విడుదలైన ‘ముత్తు’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 23న జపాన్‌లోని టోక్యోలో రీ–రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
రోబో 2.0 ట్రైలర్ రిలీజ్
-
టీజర్ ఆన్ ది వే
సరికొత్త అప్డేట్స్తో వస్తున్న చిట్టి రజనీకాంత్ రోబో స్పీడెంతో చూడాలనుందా? విలన్ అక్షయ్ కుమార్ క్రూరమైన ఆలోచనలేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఇంకొన్ని రోజులు ఆగితే చాలు.. మనకో చిన్న క్లూ దొరికేస్తుంది. ఎలా అంటారా..? వచ్చే నెలలో ‘2.0’ సరికొత్త టీజర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘2.0’. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదల పలు వాయిదాల తర్వాత నవంబర్ 29న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం టీజర్‌ను ఆగస్ట్ 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. -
2.0 @ 29.11.18
ఎప్పటినుంచో సినీ ప్రేమికులు ఎదురుచూస్తోన్న సినిమాల్లో ‘2.0’ చిత్రం ఒకటి. ఇప్పటికే చాలా సార్లు ఈ సినిమా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు చిత్రబృందం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటింటించింది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘2.0’. 2010లో శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘యందిరిన్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ సినిమాను ముందుగా గత ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలచేయాలనుకున్నప్పటికీ వీలుపడలేదు. అలాగే ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించిన విజువల్ ఎఫెక్ట్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు ‘2.0’ చిత్రబృందం సినిమాను ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. ‘‘అందరికీ హాయ్. చివరిగా మూవీ ఫైనల్ కాపీని ఇవ్వడానికి విజువల్ ఎఫెక్ట్స్ డీల్ చేస్తోన్న కంపెనీలు ఓ డెలివరీ డేట్‌ను చెప్పారు. సినిమాను ఈ ఏడాది నవంబర్ 29న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు డైరెక్టర్ శంకర్. ఈసారైనా చెప్పిన తేదీకి సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. -
మరో 100 కోట్లతో ఫినిషింగ్ టచ్‌లు...
ఇనుములో బంగారం మొలిచెనే!రోబో తర్వాత వస్తున్న సీక్వెల్ 2.0.అద్భుతంగా ఉండటానికి శంకర్ చేస్తున్నప్రయత్నం మేలిమి బంగారం.ఎప్పుడో దీపావళికి రావాల్సింది.ఉయ్ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద బ్లాస్ట్. పండగ ఎప్పుడు వస్తుందా అని లుగులు ఎప్పుడు చిమ్ముతుందా అనిశంకరాభిమానులంతా ఎదురు చూస్తున్నారు. కొందరు డైరెక్టర్లతో చిక్కే.ఉదాహరణకు శంకర్ ‘విజువల్ ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్లా కనిపించకూడదు. అవి కథలో భాగం అయిపోవాలి. ప్రేక్షకుడు కథను ఎంజాయ్ చేయాలి’ అంటారు.చిన్నమాటే.కాని దాని బరువు వందల మంది విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్ మీద పడుతుంది.శంకర్ తాజా చిత్రం ‘2.ఓ’ లో ఒక అడవి సన్నివేశం ఉంది. అడవినంతా తెర మీద సృష్టించాలి. అడవి కనిపించిన వెంటనే ప్రేక్షకుడు ‘ఆహా... విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగున్నాయి’ అని అనుకుంటే సినిమా ఓడిపోయినట్టు. ఆ అడవిలో మమేకమైపోయి ఇప్పుడేం జరుగుతుందా అని ఉత్సుకతతో ఉంటే సినిమా గెలిచినట్టు. అడవిలోని ఆకునూ తీగనూ లతనూ మట్టినీ మానునూ పువ్వునూ చాలా సహజంగా విజువల్ ఎఫెక్ట్స్ కాదు అన్నంత బాగా సృష్టించాల్సిన భారం టీమ్ మీద ఉంటుంది.‘2.ఓ’ ఆలస్యానికి బహుశా కారణం ఇదే అయి ఉండవచ్చు. పర్ఫెక్షనిజమే దాని విడుదలకు అడ్డంకి అవుతుండవచ్చు. ఆలస్యం అమృతం అమృతం అంటారు శంకర్.ఆ అమృతం మరింత మధురంగా మారడానికి మరో వంద కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని కథనం. మరో వందకోట్లు.ఆల్రెడీ ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అంటున్నారు. ఈ వంద కోట్లతో కలిపి 500 కోట్లు కావచ్చు. భారతదేశంలో ఇంత ఖరీదైన బడ్జెట్‌తో తయారయ్యే చిత్రం ఇదే. ‘బాహుబలి’ రికార్డును ఇది చెరిపేయవచ్చు. కాని ప్రేక్షకుడు కోరుకునేది అదే కదా. ఒక రికార్డు చెరిపే స్థాయిలో మరో రికార్డు సిద్ధం అవుతుండాలి. ఒక గొప్ప సినిమా వచ్చాక మరింత గొప్ప సినిమా సిద్ధమవుతూ ఉండాలి. ‘2.ఓ’ మరింత గొప్ప సినిమా కాబోతున్నదనే సూచనలు కనిపిస్తున్నాయి. సెట్లో కళ్లద్దాలతో... సెట్లో డైరెక్టర్ కళ్లద్దాలతో ఉండటం మామూలే– సైట్ ఉంటే. శంకర్‌కు సైట్ లేదు. కాని ఆయన ‘2.ఓ’ సెట్లో ఎప్పుడూ చాలా శక్తివంతమైన కళ్లద్దాలను పెట్టుకుని ఉంటాడు. అవేమిటో తెలుసా? త్రీడీ కళ్లద్దాలు. హాలీవుడ్ వాళ్లను మించిపోవాలనుకున్నారు శంకర్. హాలీవుడ్లో సినిమాలు 2డిలో తీసి త్రీడిలో కన్వర్ట్ చేస్తుంటారు. కాని ‘2.ఓ’ను డైరెక్ట్‌గా త్రీడీలో చిత్రీకరిస్తున్నారు. షాట్ అయ్యాక మానిటర్ మీద ఆ షాట్ ఎలా వచ్చిందో చూడాలంటే త్రీడీ కళ్లద్దాలు ఉండాలి. శంకర్ ఆ కళ్లద్దాలు పెట్టుకుని షాట్‌ను గమనించుకుని అది ఓకే అయ్యిందనుకున్నాకే నెక్ట్స్ షాట్‌కు వెళతారు. లేదంటే రీషాటే. ఇంత టెక్నికల్ వ్యవహారం నిమగ్నమై ఉన్నందువల్లే ఇప్పటికే మనకు కనుల విందు చేయాల్సిన సినిమా ఇంకా ఆలస్యమవుతున్నదో ఏమో. స్క్రిప్ట్‌కు తాళం ‘రోబో’ హిట్ అయ్యాక దానికి సీక్వెల్ తీయాలని 2012లోనే అనుకున్నారు శంకర్. దానికి అవసరమైన కథను రూపకల్పన చేయడానికి తమిళంలో సాహిత్యకారునిగా పేరు గడించిన జయమోహన్‌ను ఎంచుకున్నారు. ‘రోబో’కు పని చేసిన డైలాగ్ రైటర్ మదన్ కార్కె (గీత రచయిత వైరముత్తు కుమారుడు) ఇందులోని టెక్నికల్ డైలాగ్స్ విషయంలో జయమోహన్‌కు సాయం పట్టాడు. ‘నా ఇమేజినేషన్‌కు తగినట్టుగా కథ హ్యూజ్‌గా వైల్డ్‌గా ఎదిగిపోయింది’ అంటారు శంకర్. భారీ సినిమాలకు మహా భారీ ప్రొడ్యూసర్ అయితేనే కరెక్ట్. శ్రీలంక మూలాలు కలిగిన తమిళ పారిశ్రామిక వేత్త, ‘లైకా’ మొబైల్స్ ద్వారా 21 దేశాలలో ఐదు వేల కోట్ల వ్యాపార లావాదేవీలకు ఎదిగిన అల్లిరాజా సుబస్కరన్ దీనికి నిర్మాతగా ముందుకు వచ్చాడు. ఈయన లైకా ప్రొడక్షన్స్ ఇంతకు ముందు విజయ్‌తో ‘కత్తి’ (తెలుగులో ఖైదీ నం.150) వంటి సూపర్ హిట్‌ను సాధించి ఉంది. హీరోగా రజనీకాంత్ ముందే సిద్ధం. కాని విలన్‌గా చాలా పేర్లే వినిపించాయి. ఆర్నాల్డ్ ష్వాస్నెగర్ను, ఆమిర్ ఖాన్‌ను, విక్రమ్‌ను వీరందరినీ దాటి ఆ అద్భుతమైన అవకాశం అక్షయ్ కుమార్‌కు చేరింది. హీరోయిన్గా అమీ జాక్సన్‌ను తీసుకున్నారు. అంతా సిద్ధం అయ్యాక స్క్రిప్ట్‌ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని లాక్ చేశారు శంకర్. ఆయనలోని సుగుణమో దుర్గుణమో ఒకసారి స్క్రిప్ట్‌కు లాక్ చేశాక ఏది రాసుకున్నారో అదే తీయాలి... ఏమైనా ఎంత ఖర్చయినా. ‘ఐ’ సినిమాలో ‘పూలనే కునుకేయమంటా’ పాటను చైనాలో పూలు వికసించే కాలంలో తీయాలని శంకర్ నిర్ణయించుకుని అందుకోసం ఆరు నెలలు వేచి ఉండి వెళ్లి తీశారు. స్డూడియోలో తీసి ఉంటే ఒక వంతు ఖర్చయ్యే పాటకు చైనాలో తీయడం వల్ల పది వంతులు ఖర్చయ్యింది. ఇలాంటి తాళ రాక్షసుడు కనుకనే అలాంటి ఎన్నో సీన్లు ‘2.ఓ’ లో రాసుకున్నాడు కనుకనే వాటన్నింటినీ అనుకున్నట్టుగా తీయడంలో సినిమా విడుదలకు ఆలస్యమవుతున్నదేమో. మరో వంద కోట్లు సినిమా 2017 దీపావళికి వస్తుందని ఆశించారు. జనవరి 1, 2018కి వస్తుందని ఆశించారు. వేసవి సెలవుల్లో గ్యారంటీ అని కూడా అన్నారు. ఆడియో లాంచ్ అయ్యింది. ట్రైలర్ బయటకు వదలకపోయినా ‘కట్’ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయినా విడుదల గురించి హీరో గాని దర్శకుడు కాని ఏమీ మాట్లాడటం లేదు. ఈలోపు రజనీ కాంత్ ‘కబాలి’, ‘కాలా’ తీసుకున్నారు. దర్శకుడు కార్తి సుబ్బరాజ్‌తో మరో సినిమా కూడా చేస్తున్నారు. వీటి ముందు మొదలైన ‘2.ఓ’ మాత్రం విడుదల కాలేదు. ఈ నేపధ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో వంద కోట్లు విడుదల చేస్తున్నారని వార్త. అయితే ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయడానికే అయి ఉంటుందని ట్రేడ్ పండితుల పరిశీలన. ‘2.ఓ’ ను ప్రపంచ వ్యాప్తంగా 13 భాషలలో ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ అన్ని భాషలకు డబ్బింగ్ పనులు జరగాలి. భారీ క్లయిమాక్స్‌కు తగినట్టుగా ఎఫెక్ట్స్ కోసం మరిన్ని నిధులు అవసరమయ్యాయేమో తెలియదు. ఈ విషయం అటుంచితే ఈ సినిమా కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో థియేటర్లు త్రీడీకి అనువుగా అప్డేట్ అవ్వాల్సి ఉంది. ఇవన్నీ ముగిశాకే సినిమాను పకడ్బందీగా విడుదల చేయాలని వేచి ఉన్నారో ఏమో తెలియదు. షోలే అవుతుందా? భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘షోలే’ను 1973లో మొదలెట్టి మూడేళ్ల పాటు తీశారు. దీని చిత్రీకరణ సమయంలోనే ఒక్కో హీరో రెండు మూడు సినిమాలు చేశారు. అందరూ ఆ సమయంలో ఇంత ఆలస్యమా అన్నవారే. కాని ఒక మంచి సినిమా అన్ని విధాలా పూర్తవ్వడానికి అంత సమయం తీసుకుంటుంది మరి. ‘2.ఓ’ విషయంలో కూడా ఇదే పునరావృతం అవుతున్నట్టుంది. శంకర్ అభిమానులు, రజనీ అభిమానులు, కమర్షియల్ సినిమా అభిమానులు ‘2.ఓ’ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాసులతో కలెక్షన్లతో ఆ వత్తులను వెలిగించాలనుకుంటున్నారు. భూనభోనాంతరాలు దిమ్మెరపోయే వెలుగు ‘2.ఓ’ విడుదలతో సాక్షాత్కరిస్తుందని ఆశిద్దాం. భారీ చిత్రీకరణ ‘2.ఓ’ చిత్రీకరణ సరిగ్గా 2015 డిసెంబర్లో మొదలైంది. అయితే ఇది స్టూడియోల్లో తీసే సినిమా కాదు. భారీ మైదానాలు కావాలి. అందుకే చెన్నై పూనమలై రోడ్‌లోని 160 ఎకరాల ఇ.వి.పి. థీమ్ పార్క్‌ను లీజుకు తీసుకుని దానినే ప్రధాన స్టూడియోగా మలుచుకున్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కూడా 45 రోజులు షూట్ చేశారు. వంద రోజులు షూట్ చేస్తే సాధారణంగా ఒక సినిమా పూర్తయిపోతుంది. కాని వంద రోజుల చిత్రీకరణ తర్వాత సినిమా సగమైనట్టుగా శంకర్ ప్రకటించారు. నూట యాభై రోజుల చిత్రీకరణ తర్వాత మూడు వంతుల సినిమా పూర్తయినట్టు చెప్పారు. 2017 అక్టోబర్‌కు చిత్రీకరణ అధికారికంగా ముగిసింది. కాని అసలు కథ అప్పుడే మొదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని చోట్ల సగం సెట్లు వేసి మిగిలిన భాగాలను స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా పూర్తి చేశారు. కొన్నిసార్లు అసలు ఏ సెట్ లేకుండా తీసి తెర మీదే సెట్‌ను పూర్తిగా సృష్టించారు. ఉదాహరణకు ఇందులో ఒక పాటను అమి జాక్సన్, రజనీల మీద ఉక్రయిన్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా అక్కడకు వెళ్లి లొకేషన్లను చూసుకుని వచ్చారు కూడా. కాని రజనీకాంత్ అనారోగ్యం వల్ల ఆ పని జరగలేదు. కాని శంకర్ ఉక్రయిన్ అని ఫిక్స్ అయ్యారు కదా. పాట మొత్తం ఉక్రయిన్‌లో తీసినట్టుగానే స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆ ల్యాండ్ స్కేప్స్‌ను సృష్టించారు. దీనికంతా సమయం పడుతుంది. ఈ సమయం వల్లే సినిమా ఆలస్యం అవుతున్నట్టుంది. – వెస్లీ గోపాల్ -
మరింత ఆలస్యం కానున్న‘2.o’
సూపర్‌స్టార్ రజనీకాంత్, ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో రాబోతున్న 2.o సినిమా మరింత ఆలస్యం కానుందని సమాచారం. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్, హై క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైయింది. కానీ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు మాత్రం ఆలస్యంగా జరుగుతున్నాయి. హై టెక్నీషియన్స్‌తో అమెరికాలో జరుగుతున్న ఈ గ్రాఫిక్స్ పనుల వల్లే సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మొదలు పెట్టలేదని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో కనీసం చిత్ర యూనిట్‌కు కూడా తెలియడం లేదు. లైకా ప్రొడక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 2.o ను తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా... వీఎఫ్ఎక్స్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా, అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. రజనీ ‘కాలా’ విడుదలకు రెడీ అవ్వగా, యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. -
స్త్రీలకు చీరే సింగారం
తమిళసినిమా: స్త్రీలకు చీరే సింగారం. ఇలా అన్నది ఎవరో తెలుసా? ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? కొందరి మాటలకు, చేతలకు అసలు సంబంధం ఉండదంటారు. ఈ ఇంగ్లాండ్ భామ అలాంటి వారిలో ముందుంటుందని చెప్పవచ్చు. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా శంకర్ దర్శకత్వం వహించిన ఐ చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసింది. ఆ తరువాత పలు గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. అదేమంటే తాను విదేశీ అమ్మాయిని మా కల్చర్ అంతే అంటూ ఎలాంటి తడబాటు లేకుండా బదులిచ్చేసింది. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రం విడుదల కావలసి ఉండగా ఈ అమ్మడు యూరప్ దేశంలో సెటిల్ అవనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ట్విట్ ప్రేక్షకులకు మరో షాక్ అవుతోంది. అదేంటో చూద్దాం. స్త్రీలకు చీరలే సింగారం. సంప్రదాయబద్ధమైన ఆ దుస్తులే స్త్రీల్లో అణుకువను ప్రదర్శిస్తాయి.కొన్ని సమయాల్లో లెహన్కా దుస్తులు మహిళల అందాలను మెరుగుపరుస్తాయి. ఇకపోతే ఇండియా అంటే నా మనసులో ఎప్పుడూ ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఇది లేటెస్ట్ ఎమీ ట్వీట్. నటి ఎమీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది అయితే భారతీయ నారీ సంప్రదాయ చీరకట్టు ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆకర్షిస్తుందన్నది గమనార్హం. -
2.ఓలో ఐష్ కూడా ఉందా?
తమిళ సినిమా : 2.ఓ చిత్రంలో అందాల భామ ఐష్ కూడా ఉందా? ఈ ప్రశ్నకు తాజాగా అవుననే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి రావడం విశేషం. ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రంపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కలిసి నటించిన చిత్రం ఎందిరన్ (తెలుగులో రోబో). శంకర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సాంకేతిక పరిజ్ఞానంలో హాలీవుడ్‌కు దీటుగా నిలిచిన చిత్రం ఎందిరన్. అలాంటి చిత్రానికి సీక్వెల్‌గా నిర్మాణంలో ఉన్న సినిమా 2.ఓ. అయితే ఇందులో బ్రిటీష్ భామ ఎమీజాక్సన్ రజనీకాంత్‌కు జంటగా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించారు. ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.450 కోట్ల వ్యయంతో లైకా సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్‌లో ఉన్న 2.ఓ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం పెద్దగా బయటకు రాలేదు. ఈ ఏడాది చివరిలో తెరపైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి ఐశ్వర్యారాయ్ కూడా నటించారన్న ప్రచారం తాజాగా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతుండడం విశేషం. 2.ఓ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నట్లు, ఎందిరన్ చిత్రానికి, 2.ఓ చిత్రానికి కమ్యూనికేషన్ కల్పించే విధంగా ఐష్ పాత్ర ఉంటుందని, ఈ విషయాన్ని ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ కళాకారిణి సబిత వెల్లడించినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం హల్చల్ చేస్తోంది. అయితే చిత్రం విడుదల ముందు వరకూ ఏ విషయాన్ని వెల్లడించని దర్శకుడు శంకర్ ఇప్పుడీ సంచల వార్తపై అయినా తమ మౌనం వీడతారా?లేక అదీ చిత్ర ప్రచారంలో ఒక భాగం అవుతుందని సైలెంట్ అవుతారా అన్నది వేచి చూడాలి. -
సీక్వెల్ మచ్చీ సీక్వెల్
మచ్చీ... ‘రోబో’ అప్డేట్ అయ్యి వస్తున్నాడు.... భారతీయుడు విశ్వరూపం చూపిస్తాడట. ఈసారి పందెంకోడి మళ్లీ బరిలోకి దిగాడు... సామి దూకుడు పెంచాడు... మారి మమ్మమ్మాస్...సీక్వెల్ మచ్చీ సీక్వెల్... ఈ ఏడాది తమిళంలో సీక్వెల్స్ జోరు సాగుతోంది... ‘2.0’, ‘విశ్వరూపం 2’ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయ్యాయి.... ఆన్ సెట్స్‌లో పదికి పైగా సీక్వెల్స్ ఉన్నాయి. సీక్వెల్స్ మావా సీక్వెల్స్. మరోసారి ఇండియన్ విశ్వరూపం కొడుకు మీద ఉన్న ప్రేమకన్నా, దేశభక్తే మిన్న అని చెప్పాడు భారతీయుడు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్, ఉర్మిళ, మనీషా కోయిరాల ముఖ్య తారలుగా తమిళ్, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు’ (1996). ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లతో నిర్మించిన ఈ సినిమా 30 కోట్లను అప్పట్లోనే కొల్లగొట్టింది. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ విభాగంలో కమల్‌హాసన్ స్టేట్ అండ్ నేషనల్ అవార్డులు అందుకున్నారు. అంతేనా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపించారు. భారతీయుడు అంత క్రేజ్ ఉండబట్టే... ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు దర్శకుడు శంకర్ అండ్ కమల్‌హాసన్. సీక్వెల్ ఎనౌన్స్ చేసిన వెంటనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముందు ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత తప్పుకున్నారు. దాంతో ఫస్ట్ పార్ట్‌ని నిర్మించిన ఏయం రత్నం సీక్వెల్ తీయడానికి ముందుకొచ్చారు. ప్రముఖ రచయిత జయమోహన్‌తో కలసి ప్రముఖ రచయిత వైరముత్తు తనయుడు, యువరచయితల్లో మంచి పేరు తెచ్చుకున్న కబిలన్ వైరముత్తు రెండో భాగానికి కథ రెడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేయిస్తున్నారట. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.విశేషం ఏంటంటే.. రానున్న రోజుల్లో కమల్ రెండు సీక్వెల్స్‌లో కనిపించనున్నారు. ఆల్రెడీ ‘విశ్వరూపం 2’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆల్మోస్ట్ ఐదేళ్ల క్రితం రిపబ్లిక్‌డే టైమ్‌లో ‘విశ్వరూపం’ విడుదలైంది. కమల్‌హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, జై దీప్ ముఖ్య తారలుగా నటించారు. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 90కోట్లతో రూపొందిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరింది. సో.. ‘విశ్వరూపం 2’ పై అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి, చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వరూపం ఫస్ట్‌లుక్ రంజాన్‌కు సామి స్క్వేర్ ! పద్నాలుగేళ్లు పట్టింది.. 2003లో వచ్చిన ‘సామి’ సినిమాకు సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేందుకు. విక్రమ్, త్రిష, వివేక్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సామి’. దోచుకున్న వారిని దోచుకునే పోలీస్ పాత్రలో విక్రమ్ నటించారు. అప్పట్లో ఐదు కోట్లతో రూపొందిన ఈ సినిమా 30కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘లక్ష్మీనరసింహా’ పేరుతో బాలకృష్ణ రీమేక్ చేశారు. తెలుగులో కూడా మంచి స్పందన లభించింది. సామి స్వే్కర్ ఆన్‌లోకేషన్ ‘సామి’ సెన్సేషనల్ హిట్ సాధించడంతో ‘సామి స్వే్కర్పై అంచనాలు పెరిగాయి. స్క్రిప్ట్ పరంగా ఇద్దరు హీరోయిన్లకు చాన్స్ ఉన్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లోనే క్రియేటివ్ డిఫరెన్స్‌తో హీరోయిన్ త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ 80శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సీక్వెల్లో కూడా విక్రమ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. రంజాన్‌కు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. సామిలో విక్రమ్ మళ్లీ రేస్ మొదలైంది డిఫరెంట్ యాంగిల్ రౌడీయిజాన్ని ‘మారి’లో చూపించారు దర్శక–నటుడు–నిర్మాత ధనుష్. ఆయన హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో కాజల్ కథానాయికగా రూపొందిన చిత్రం ‘మారి’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. పావురాల రేసింగ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో హైలెట్. ఈ ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు ధనుష్. మారిలో ధనుష్ బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పదేళ్ల క్రితం ధనుష్ నటించిన ‘యారుడా నీ మోహిని’కి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా ఇన్నేళ్ల తర్వాత ధనుష్ ‘మారి 2’కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 40 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మారి2 వర్కింగ్ స్టిల్ ఇదిగో వస్తా.. అదిగో వస్తా! రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ డేట్ చాలాసార్లు మారింది. కానీ అంచనాలు మాత్రం మరింత పెరిగాయి. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఆల్మోస్ట్ ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్. ఆల్మోస్ట్ 130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘రోబో’ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘2.0’ అయితే... రిలీజ్‌కు ముందే ఆల్మోస్ట్ 150 కోట్ల బిజినెస్ చేసింది. రోబో అంతేకాదు ఈ సినిమాను త్రీడీ వెర్షన్‌తో పాటు, ఆల్మోస్ట్ 14 భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కొందరైతే ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు చేసిన మొదటి సినిమా ‘బాహుబలి’ రికార్డులను ‘2.0’ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరిలో రావాల్సిన ఈ సినిమా ఏప్రిల్‌కి వాయిదా పడింది. అదీ జరగలేదు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తారని కొందరు, లేదు లేదు దీపావళికి రిలీజ్ చేస్తారని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. మరి.. ఇదిగో వస్తా.. అదిగో వస్తా అంటున్న ‘2.0’ ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి. 2.0 కాంచన కమింగ్ సూన్ ‘ముని’ సినిమాను తెరకెక్కించేటప్పుడు రాఘవ లారెన్స్ ఊహించారో లేదో.. ఈ సినిమాకు మూడు సీక్వెల్స్ వస్తాయని. స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ వేదిక, రాజ్ కిరణ్ ముఖ్య తారలుగా 2007లో రూపొందిన సినిమా ‘ముని’. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు 15 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 2011లో వచ్చిన ‘కాంచన’, నాలుగేళ్ల తర్వాత 2015లో వచ్చిన ‘కాంచన 2’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కాంచన3 వర్కింగ్ స్టిల్ ఇప్పుడు ‘కాంచన 3 రూపొందుతోంది. ఈ సినిమాని కూడా స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇందులో ఓవియా, వేదిక నటిస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఎనిమిదేళ్ల క్రితం ‘ముని’ ఫస్ట్ పార్ట్‌లో నటించిన వేదిక మళ్లీ ‘కాంచన 3’లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుంచి ఓవియా తప్పుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఓవియా ‘కాంచన 3’ షూట్లో జాయిన్ అవ్వడంతో ఆ వార్తలు అవాస్తవం అని తేలిపోయాయి. ‘కాంచన 3’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘ముని’లో రాజ్‌కిరణ్, లారెన్స్ బరిలోకి అదే పందెంకోడి విశాల్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘పందెం కోడి’. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, మీరా జాస్మిన్ జంటగా తమిళ్లో రూపొందిన చిత్రం ‘సండైకోళి’ (2005) తెలుగులో ‘పందెంకోడి’గా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ నిర్మిస్తున్నారు. స్టార్టింగ్‌లో కాస్త స్లోగా ఈ చిత్రం షూటింగ్ సా..గిం..ది. ఇప్పుడు ‘పందెం కోడి’ మంచి ఊపుమీద ఉంది. ఈ సీక్వెల్లో విశాల్ సరసన కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేసుకుందని సమాచారం. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కీర్తీ సురేశ్, విశాల్ నవ్వుల పందిరి ‘పెళ్లాం ఊరెళితె’ ఏం జరిగిందో థియేటర్లో చూశాం. ఇది తమిళ ‘చార్లీ చాప్లీన్’కి రీమేక్. శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 16 ఏళ్ల క్రితం ప్రభుదేవా, ప్రభు, లివింగ్స్టన్, అభిరామి, గాయత్రి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చార్లీ చాప్లీన్’. థియేటర్స్‌లో నవ్వులతోపాటు, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ప్రస్తుతం ‘చార్లీ చాప్లీన్ 2’ తెరకెక్కుతోంది. శక్తి సుందర్ రాజన్ దర్వకత్వంలోనే ప్రభుదేవా, ప్రభు, ఆదా శర్మ, నిక్కి గల్రానీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ 70 శాతం కంప్లీట్ అయ్యిందని సమాచారం. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందట. పెళ్లి మండపంలో మా నవ్వుల పందరి ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడండి అంటున్నారు చిత్రబృందం. ఆదా శర్మ సుడిగాడి సందడి సినిమా రిలీజ్‌కి ముందే లీకయ్యే పరిస్థితి ఇప్పుడు. అయితే కొన్ని కొన్ని సీన్లు లీకవుతుంటాయి. అయితే రిలీజైన మర్నాడు మొత్తం సినిమా ఆన్లైన్లో దర్శనమిస్తోంది. దీన్ని ఉద్దేశించే ‘తమిళ్ పడమ్ 2.0’ చిత్రబృందం ‘మా సినిమా మే 25న విడుదలవుతుంది. 26న ఆన్లైన్లో ఉంటుంది. చూసుకోండి’ అని సెటైరికల్‌గా అన్నారు. అన్నట్లు ఇది కూడా సెటైరికల్ మూవీనే. సీయస్ అముదాన్ దర్శకత్వంలో డిఫరెంట్ పేరడీలతో శివ, దిశా పాండే జంటగా రూపొందిన చిత్రం ‘తమిళ్ పడమ్’. ఈ సీక్వెల్ సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్‌తో తెరకెక్కుతోంది. ‘తమిళ్ పడమ్’ సినిమా తెలుగులో ‘సుడిగాడు’ టైటిల్‌తో రిలీజైన సంగతి తెలిసిందే. మరికొన్ని... ఈ సినిమాలే కాకుండా త్రిష, అరవిందస్వామి జంటగా ‘చదురంగ వేటై్ట 2’ తెరకెక్కుతోంది. ఇది ‘చదురంగ వేటై్ట’ కి సీక్వెల్. అలాగే సముద్రఖని దర్వకత్వంలో 2009లో రూపొందిన ‘నాడోడిగల్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన శశికుమార్‌నే రెండో పార్ట్‌లో నటిస్తున్నారు. అంతేకాదు ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకత్వంలో శశికుమార్ హీరోగానే ‘సుందరప్పాండియన్ 2’ తెరకెక్కనుందని కోలీవుడ్ సమచారం. రామ్‌బాలా దర్శకత్వంలో సంతానం హీరోగా రూపొందిన హారర్ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. మరికొందరి స్టార్ హీరోలతో పాటు, చిన్న హీరోలు కూడా సీక్వెల్ స్వింగ్‌లో రావడానికి చర్చలు జరుగుతున్నాయట. ఆల్రెడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కలకలప్పు’కి సీక్వెల్‌గా సుందర్. సి రూపొందించిన ‘కలకలప్పు 2’ విడుదలైంది. ఇప్పటికి పదికి పైగా సీక్వెల్స్ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. చూడబోతుంటే ఇది ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనాలేమో. -
ఇక సినిమాలకు గుడ్‌బై!
సాక్షి, సినిమా: జీవితం మన చేతుల్లో ఉండదు అనడానికి చాలా ఉదాహరణలే ఉంటాయి. అదే విధంగా ఈ నాగరిక యుగంలో ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది. రేపన్నది ఎక్కడో, ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఉత్తరాదికి చెందిన నటి శ్రియ రష్యాకు చెందిన యువకుడిని పెళ్లాడింది. ఇలా ఎవరి జీవితం ఎవరితో ముడిపడుతుందో తెలియదు. నటి ఎమీజాక్సన్ విషయాన్నే తీసుకుంటే ఎక్కడో కెనడాకు చెందిన ఈ అమ్మడు దర్శకుడు విజయ్ దృష్టిలో పడడం, మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్ పరిచయం అవడం అన్నది ఆమే ఊహించి ఉండదు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌కు వెళ్లిన ఎమీజాక్సన్ తమిళంలోనే ఎక్కువ చిత్రాలను చేసింది. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశాలను రెండుసార్లు దక్కించుకున్న అతి తక్కువ మంది నటీమణుల్లో ఎమీ ఒక్కరు. ఐ చిత్రంలో విక్రమ్ సరసన నటించి అందాల మోత మోగించిన ఎమీ ప్రస్తుతం రజనీకాంత్‌తో జత కట్టిన 2.ఓ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులో రోబోగా అదరగొట్టనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం విడుదలనంతరం తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఈ భామ ఆ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుండడం, కొత్త అవకాశాలు రాకపోవడం వంటివి నిరాశప రిచాయ నే చెప్పాలి. అయితే ఆంగ్ల సీరియల్లో నటిస్తున్న ఎమీ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చే నిర్ణయాన్నే తీసుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భారతీయ సినిమాలకు ఇక టాటా అని, తాను ఆఫ్రికన్ దేశంలోని మొరాకోలో సెటిల్ అవ్వబోతున్నానని ఎమీ చెప్పిందన్నదే ఆ ప్రచారం. ఇదే నిజం అయితే ఆమె అభిమానులకు నిరాశకలిగించే విషయమే అవుతుంది. -
2.ఓ.. ఉత్త సినిమానేనా?
సాక్షి, సినిమా : సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను ఏ మాత్రం నిరాశపరచకుండా చాలా జాగ్రత్తగా స్టార్ డైరెక్టర్ శంకర్ 2.ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఈ చిత్రం భారీ బిజినెస్ చేస్తోంది. రిలీజ్ డేట్లో స్పష్టత లేకపోయినా.. భారీ అంచనాలను కొనసాగించేలా మేకింగ్ వీడియోలు వదులుతూ శంకర్ మతి పొగొడుతున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ సమాచారం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. 2.ఓ 3డీ వర్షన్ విడుదల ఉండబోదనేది దాని సారాంశం. నిజానికి విజువల్ ఎఫెక్ట్స్ మూలంగా చిత్ర విడుదల ఆలస్యమౌతోందన్నది తెలిసిందే. సీజీ వర్క్‌పై శంకర్ అసంతృప్తితో ఉండటమే అందుకు కారణం. పైగా 3డీ ప్రొడక్షన్ పనులను అమెరికాకు చెందిన ఓ కంపెనీకి అప్పగించగా.. వారితో శంకర్‌కు బేధాభిప్రాయాలు తలెత్తినట్లు ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి. ఈ పరిస్థితులతో 3డీ వర్షన్ విడుదల ఆలోచనను నిర్మాతలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే గనుక 2.ఓ లాంటి భారీ బడ్జెట్ మూవీని మనం మాములు చిత్రంగానే తెరపై చూస్తామన్న మాట. -
హుహూ..!
‘హుహూ’...‘2.0’ టీజర్లో ఇదిగో ఇలాగే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు రజనీకాంత్. అవునా! మరి..‘2.0’టీజర్‌ను అధికారికంగా రిలీజ్ చేయలేదు కదా! అంటే..నిజమే అధికారికంగా రిలీజ్ చేయకుండానే ‘2.0’ టీజర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా ఆల్మోస్ట్ 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘2.0’. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వల్ల వాయిదా వేశారు. కానీ ఇంతలోనే ఊహించని విధంగా ఆల్మోస్ట్ 90 సెకన్ల నిడివి ఉన్న ‘2.0’ టీజర్ సోషల్ మీడియాలో లీకైంది. ఈ లీకేజ్ పై రజనీకాంత్ కూతురు సౌందర్యా రజనీకాంత్ స్పందిస్తూ– ‘‘అధికారికంగా ప్రకటించడానికి ముందే ఆన్లైన్లో ఇలాంటివి లీక్ అవ్వడం సహించరానిది. ప్రొత్సహించకూడని విషయం. ఓన్లీ కొన్ని సెకన్ల ఎగై్జట్‌మెంట్ కోసం మూవీ యూనిట్ హార్డ్‌వర్క్‌ని, కష్టాన్ని, సెంటిమెంట్స్‌ను అగౌరవపరచడం సరికాదు. ఇది సిగ్గుపడ్సాలిన విషయం. పైరసీని ఆపండి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ని దుర్వినియోగం చేయకండి’’ అని అన్నారామె. మరోవైపు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన ఓ ముఖ్య ప్రతినిధి బర్త్‌డే సందర్భంగా వీఐపీలకు ‘2.0’ టీజర్ స్పెషల్‌గా వేశారట. అక్కడి నుంచి ఈ ‘2.0’ టీజర్ లీకైందన్న వాదనలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘కాలా’ టీజర్ కూడా అధికారికంగా చెప్పిన సమయానికన్నా ముందే ఆన్లైన్లో లీకైన విషయం తెలిసిందే. ‘కాలా’ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
'తమిళనాడులోనే అత్యంత దారుణం'
సాక్షి, చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్‌హాసన్‌లు రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించిన తర్వాత తమిళనాడులో ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ రాజకీయంగా కలిసి పనిచేస్తారా.. ఒకే పార్శ్వంలోనే ముందడుగు వేస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు ఎన్నో అనుమానాలున్నాయి. దీనిపై రజనీకాంత్ మాట్లాడుతూ.. 'రాజకీయంగా కలిసి ముందుకెళ్లే విషయం కమల్‌హాసనే నిర్ణయించాలి. రానున్న లోక్‌సభ ఎన్నికలపై త్వరలోనే నా నిర్ణయాన్ని వెల్లడిస్తా. దేశంలో రాజకీయంగానూ, ప్రభుత్వ వ్యవస్థల పరంగానూ అత్యంత దారుణంగా ఉన్న రాష్ట్రం తమిళనాడేనని' అభిప్రాయపడ్డారు. రోబో 2.ఓ గ్రాఫిక్ వర్క్స్ ఆలస్యం అవుతున్నందున ముందుగా ఏ సినిమా విడుదల చేయాలో రెండు రోజుల్లో చెబుతానని రజనీ అన్నారు. పా.రంజత్ తెరక్కిస్తున్న కాలా మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. లోకనాయకుడు కమల్‌హాసన్ మాత్రం రజనీతో కలిసి పనిచేస్తారా లేదా అన్నదానిపై ఏ మాత్రం సమాచారం ఇవ్వడం లేదు. రజనీకాంత్‌తో కలిసి నడుస్తానా లేదా అన్నదానిపై కాలమే సమాధానం ఇస్తుందన్నారు. మా ఇద్దరి సిద్ధాంతాలు రాజకీయాల్లో సెట్ అవుతాయా అనేది మరోసారి ఆలోచించాలన్నారు. వీరిద్దరూ కలిసి అడుగేస్తే మీ వెంటే అంటూ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇదివరకే తమ అభిప్రాయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. -
‘2.ఓ’.. మరో నాలుగు నెలలు వాయిదా
సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. వీరి కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన రోబో సినిమాకు సీక్వల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాను ముందుగా 2018 జనవరిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్ ను ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం 2.ఓ మరోసారి వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉన్నాయట. ఈ గ్రాఫిక్స్ కోసం ఎన్నో దేశాల్లో పని జరుగుతున్నా అనుకున్న సమయానికి పని పూర్తవుతుందో లేదో అన్న అనుమానం వ్యక్తమవుతుంది. దీంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. 2.ఓనే ఏకంగా ఆగస్టు మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ చిత్రం వాయిదా పడినట్టుగా వార్తలు పెద్ద ఎత్తున విపిస్తున్నా.. చిత్రయూనిట్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. -
మళ్లీ వాయిదానా..?
తమిళసినిమా: 2.ఓ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందా? అలాంటి అవకాశం లేకపోలేదంటున్నారు సినీ వర్గాలు. 2010లో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ఎందిరన్. దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి రజనీ, శంకర్ల టీమ్ సిద్ధం అయిన విషయం తెలిసిందే. 2.ఓ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎందిరన్ కంటే అద్భుతంగా రూపొందించాలని భావించారు. అందుకు లైకా సంస్థ ముందుకొచ్చింది. ఈ చిత్రం సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. రజనీకాంత్‌కు జంటగా ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్, విలన్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌లు నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీత భాణీలను అందిస్తున్నారు. రెండేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది.గతేడాది అక్టోబరులో దుబాయ్‌లో చిత్ర ఆడియోను ఘనంగా విడుదల చేశారు. కాగా ఇటీవల ఒక నిమిషం 48 సెకన్లతో కూడిన ఈ చిత్ర మేకింగ్ వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. దీంతో 2.ఓ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అభిమానుల్లో నిరాశ: చిత్ర విడుదల తేదీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ముందుగా 2.ఓ చిత్రాన్ని గతేడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఏప్రిల్ 27న తెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూడోసారి ప్రకటనలో కూడా మార్పు జరిగేటట్లుందని సమాచారం. చిత్ర గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. చిత్ర టీజర్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. ప్రస్తుతం శంకర్ ఈ చిత్ర టీజర్‌ను అమెరికాలోని లాస్ఏంజల్స్లో రూపొందించే పనిలో ముమ్మరంగా ఉన్నారట. ఒకవేళ ఏప్రిల్ 27న 2.ఓ చిత్రం విడుదల కాకపోతే మే నెలకు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. -
వైభవంగా ‘2.0’ టీజర్ లాంచ్
‘నాన్ ఎప్పో వరువేన్, ఎప్పిడి వరువేన్ను యారుక్కుమ్ తెరియాదు. ఆనా వరవేండియ నేరత్తుల వరువేన్’. ‘నాన్ లేట్టా వందాలుమ్ లేటెస్టా వరువేన్’... రజనీకాంత్ చెప్పిన పాపులర్ డైలాగ్స్‌లో ఈ రెండూ కూడా ఉన్నాయి. మొదటిది ‘ముత్తు’ సినిమాలోది. రెండోది ‘బాబా’లో చెప్పిన డైలాగ్. ఈ రెండు డైలాగ్స్‌ని రజనీకాంత్ తాజా చిత్రం ‘2.0’కి కనెక్ట్ చేయొచ్చు. ‘నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎవరికీ తెలియదు. కానీ రావాల్సినప్పుడు వస్తా’ అన్నది ఫస్ట్ డైలాగ్ అర్థం. ‘నేను లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తా’ అన్నది రెండో డైలాగ్ అర్థం. ఇప్పటికి రెండు మూడు సార్లు వాయిదా పడిన ‘2.0’ లేటెస్ట్గా రావడం ఖాయమని, రావాల్సిన టైమ్ (సమ్మర్ హాలిడేస్)కే వస్తుందని అభిమానులు అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ‘2.0’ గ్రాఫిక్స్ వర్క్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోంది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దుబాయ్‌లో విడుదల చేశారు. టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘టీజర్ రిలీజ్ ఫంక్షన్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల సమక్షంలో ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. అందుకు తగ్గ వేదిక కోసం చూస్తున్నాం’’ అని ‘2.0’ టీమ్ ప్రతినిధి పేర్కొన్నారు. సెక్యూరిటీ, వేదిక అన్నీ కరెక్ట్‌గా కుదిరితే అభిమానుల మధ్యలో ఫంక్షన్ చేయడం పక్కా. ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఈ వేడుక ఉంటుంది. హైదరాబాద్‌లో టీజర్ రిలీజ్ చేసిన 30 రోజులకు చెన్నైలో ట్రైలర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఏప్రిల్ 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఆ నెలలోనే రావడానికి ముమ్మరంగా పనులు చేయిస్తున్నారు. -
చిట్టి ఆన్ ది వే
దీపావళికి(గతేడాది) వస్తున్నాం... జనవరి 25న వస్తున్నాం... అని ‘2.0’కి రెండు ముహూర్తాలు ఫిక్స్ చేశారు. రాలేదు. ఏప్రిల్‌లో మూడో ముహూర్తం ఉంది. ఈసారి రావడం పక్కా అని రజనీకాంత్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వచ్చే అవకాశం ఉందని ‘2.0’ యూనిట్ స్పీడ్ చూస్తే అనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల స్పీడు పెంచారట. ‘‘2.0 సినిమా టీజర్ పనులు లాస్ ఏంజెల్స్‌లో ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. సినిమాలో ఎక్కువ శాతం సీజీ వర్క్ ఉండటం మూలాన ఎక్కువ టైమ్ పడుతోంది. కంప్లీట్ అవ్వగానే టీజర్ విడుదల తేదీ చెబుతాం’’ అని చిత్రదర్శకుడు శంకర్ పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రం ఆడియో వేడుకను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. టీజర్‌ను హైదరాబాద్‌లో, ఆ తర్వాత చెన్నైలో ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో ‘రోబో’కి సీక్వెల్‌గా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా కనిపిస్తారు. అమీ జాక్సన్ కథానాయిక. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటు న్నారు. మరి.. వస్తుందా? అదే రోజు తమిళ సంవత్సరాది. తమిళ ప్రేక్షకులు రెండు పండగలు చేసుకుంటారా? వేచి చూద్దాం. -
కమల్‌కు కుదిరింది.రజనీకే..
తమిళసినిమా: కమలహాసన్, రజ నీకాంత్ సినీదురంధురులే. నటులుగా ఎవరికి వారే నిష్ణాతులు. సీనియర్ అంశానికి వస్తే కొంచెం కమలహాసనే ఎక్కువ. వీరిలో ఒకరిది క్లాస్ ఫాలోయింగ్, మరొకరిది మాస్ ఫాలోయింగ్. కమల్, రజనీ ఇద్దరు మంచి మిత్రులు. కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఇది నిజ జీవితం, సినీ జీవితాలకు సంబంధించిన అంశం మాత్రమే. తాజాగా ఈ సినీ దిగ్గజాలిద్దరూ రాజకీయ రణరంగంలోకి దూకుతున్నారు. రణరంగం అని ఎందుకు అనాల్సి వచ్చిం దంటే రాజకీయాల్లో ప్రత్యక్ష యుద్ధాలు లేకపోయినా, మాటల యుద్ధాలు తూటాల్లా పేలుతుంటాయి. అలాం టి యుద్ధంలో ప్రజల మనసులను గెలుచుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలకు సినీ గ్లామర్ మాత్రమే చాలదంటారు. అంతకు మించి కావలసి ఉంటుంది. రజనీ, కమల్ మాత్రం తమ తాజా చిత్రాలతో మరింత ప్రేక్షకాదరణ పొంది, దాన్ని ఓట్లుగా మార్చుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. కమల్ రాజకీయ ప్రవేశంపై వెల్లడించినప్పుడు సినిమాలకు స్వస్తేనా? అనే ప్రచా రానికి శ్రీకారం పడింది. ఆ తరువాత రజనీకాంత్ తానూ రాజకీయ రంగప్రవేశం చేశాను అనగానే కమ ల్కు తలెత్తిన ప్రశ్నే ఆయనకు వర్తించింది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న 2.ఓ, కాలా చిత్రాలే చివరి చిత్రాలు అనే ప్రచారం జరిగింది. అలాంటిది రజనీకాంత్ ఒక మంచి రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. కమల్ కూడా విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చిత్రాలను విడుదల చేసి రాజకీయాలపై దృష్టి సారించాలని భావించినా, ఇప్పుడు ఇండియన్–2కు రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో అవినీతిపై పాశుపతాస్త్రం లాంటి కథా ఇతివృత్తంతో ఓ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన రాజకీయాల జోలికి పోలేదు కాబట్టి ఒక చిత్రంగానే కమల్ భావించారు,ప్రేక్షకులు ఆదరించారు. ఇండియన్–2 విషయానికి వస్తే, కమల్ ఈ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి వాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఇప్పటికే దర్శకుడు శంకర్ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు. చిత్రానికి యువ సంగీతదర్శకుడు అనిరుద్‌ను, సౌండ్ డిజైనర్‌గా 2.ఓ చిత్రానికి పనిచేస్తున్న విశ్వనా«థ్సుందర్ను ఎంపిక చేసినట్లు ప్రచారం. ఇతర నటీనటులు,సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసి త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లైకా సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటి రాజకీయ నేపథ్యంతో కూడిన కథలో నటించాలని రజనీ కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌కు ఇండియన్ 2 కుదిరింది. మరి రజనీకి కథ ఎప్పుడు సెట్ అవుతుంది. ముదల్వన్ 2 చేయాలన్న ఆలోచన రజనీకాంత్‌కు ఉన్నట్లు టాక్. అది నెరవేరాలంటే శంకర్ ముందు కమల్‌తో ఇండియన్ 2 పూర్తి చేసిన తరువాతే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో? ఎవరి యుక్తి ఎలాంటి రిజల్ట్నిస్తుందో. -
రజనీ 2.o నిడివి ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్. ఆయన తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 2.o... 'రోబో'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2.o సినిమా మొత్తం నిడివి వంద నిమిషాలు మాత్రమేనట. అంటే గంట 40 నిమిషాలు మాత్రమే. ఒకప్పుడు సినిమా నిడివి మూడు గంటలు ఉంటే.. ఇప్పుడు రెండున్నర గంటలకు తగ్గిన సంగతి తెలిసిందే. మామూలుగా కమర్షియల్ సినిమాలు రెండు గంటలకుపైగా ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్రెండ్‌కు భిన్నంగా గంట 40 నిమిషాల్లో ఈ అత్యంత భారీ సినిమాను శంకర్ ముగించినట్టు చెప్తున్నారు. ఏమాత్రం సాగదీసే సీన్స్ లేకుండా.. చూస్తున్నంతసేపు ఉత్కంఠగా ఉండేలా సినిమాను కుదించబోతున్నారని చెప్తున్నారు. ఇది సినిమాకు ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, అరబిక్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్14న విడుదల చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
అలాంటి కథ ఉంటే చెప్పండి!
తమిళసినిమా: సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలకు రహదారి సినిమా అనే భావం చాలా మందిలో ఉంది.ముఖ్యంగా తమిళనాడులో జరుగుతున్నది ఇదే అయినా అనాధిగా జరుగుతున్నదే. కాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న మీమాంసను బద్దలు కొడుతూ సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు ఆయన రాజకీయరంగప్రవేశం చేశారు. అందుకు అభిమానులు స్వాగతిస్తున్నా, కొందరు సినీ, రాజకీయవాదులు మాత్రం రజనీకాంత్ రాజకీయాల్లో రాణించలేదని బాహటంగానే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన రాజకీయ పునాదులను బలంగా నాటుకునే ప్రయత్నంలో వ్యూహాలు రచిస్తున్నారు రజనీ అండ్ కో. అందులో భాగంగా అభిమానులను కార్యకర్తలుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా, మరో పక్క తనను ఉన్నత శిఖరాలకు చేర్చిన సినిమాను వాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు టాక్. రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం ఏప్రిల్‌లో విడుదలమ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ఆయన అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న కాలా చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే 2.ఓ బ్రహ్మండ చిత్రమే అయినా అది అభిమానులను మాత్రమే సంతృప్తి కలిగించగలదు. ఇక కాలా చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఇది ఆయనకు రాజకీయంగా ఎంత వరకు పనికొస్తుందో ఊహించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మరో రెండేళ్లలో పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించి తమిళనాడులోని 234 నియోజిక వర్గాల్లోనూ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. అందువల్ల తన రాజకీయ భవిష్యత్‌కు బ్రహ్మాస్త్రంలా పనికొచ్చే రాజకీయ నేపథ్యంతో కూడిన ఒక చిత్రాన్ని చేయాలన్న ఆలోచనతో మన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉన్నట్లు తాజా సమాచారం. ఇదే భావనతో కబాలి, కాలా చిత్ర దర్శకుడు పా.రంజిత్‌ను ఆ తరహా కథ ఉందా? లేకపోతే అలాంటి కథను సిద్ధం చేయండి అని రజనీ చెప్పారట. అదే విధంగా శివాజీ, ఎందిరన్, 2.ఓ చిత్రాల దర్శకుడు శంకర్‌తో కలిసి ముదల్వన్–2 చేయాలని ఆయన భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. -
‘2.0’తో ఆ థియేటర్లు స్టార్ట్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్–శంకర్ కాంబినేషన్లో ‘రోబో’కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘2.0’. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. బడ్జెట్.. విజువల్ ఎఫెక్ట్స్.. ఎక్కువ భాషల్లో రిలీజ్ కానున్న సినిమాగా ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన ‘2.ౖ’ మరో అరుదైన ఘనతనూ సొంతం చేసుకోనుంది. అది కూడా అరబ్ దేశమైన సౌదీ అరేబియాలో కావడం విశేషం. సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ 1980లలో సౌదీలో సినిమా హాళ్లను మూసేసిన విషయం తెలిసిందే. థియేటర్ల ఏర్పాటు, సినిమాల ప్రదర్శనకు సౌదీ ప్రభుత్వం ఇటీవల మళ్లీ అనుమతిఇచ్చింది. 35 ఏళ్ల తర్వాత సౌదీలో థియేటర్లు ఏర్పాటు చేశాక విడుదలయ్యే తొలి భారతీయ సినిమా, అది కూడా ఓ సౌత్ సినిమా ‘2.ౖ’ కావడం గర్వించదగ్గ విషయమే. ఈ సినిమా పాటల విడుదల వేడుకను దుబాయ్‌లో ఎంత గ్రాండ్‌గా చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది మార్చి చివరికల్లా సౌదీలో థియేటర్లు ప్రారంభించే అవకాశం ఉందట. ఏప్రిల్‌లో రిలీజ్ కానున్న ‘2.ౖ’ సినిమాని అక్కడ ప్రదర్శించేందుకు చిత్రబృందం సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరపగా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. -
ప్రేక్షక దేవుళ్లు శాసిస్తారు.. తలైవా పాటిస్తాడు
ఎవరు నడుచుకుంటూ వస్తే సూర్యుడు గొడుగు పడతాడో... ఎవరికి దాహం వేస్తే మేఘం పరుగు పరుగున వస్తుందో... ఎవరు విశ్రమిస్తే చుక్కలు జోల పాడతాయో... ఎవరు బొటనవేలెత్తి చూపితే కోట్ల అభిమానులు పూలదండలౌతారో... ఆ తమిళ సూపర్‌స్టార్ సింగిల్‌గా రాజకీయాల్లోకి వచ్చి ‘తలైవా’గా రాణిస్తారా? తెలుగు ఇండస్ట్రీ ఏమంటోంది? రజనీకాంత్ : కలక్షన్లలో హిట్ అయ్యారు. ఎలక్షన్లలో హిట్ అవుతారా? పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో డిసెంబర్ 31న రజనీకాంత్ ప్రకటించడంతో ఆయన అభిమానులకు ఈ ఏడాది ఒక రోజు ముందుగానే న్యూ ఇయర్ వచ్చేసినట్లయింది! అయితే అది యేటా రెగ్యులర్‌గా వచ్చే న్యూ ఇయర్ కాదు. ఇరవై ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తే వచ్చిన న్యూ ఇయర్! న్యూ ఎరా!పాలిటిక్స్‌లోకి వచ్చేశానని రజనీ ప్రకటించగానే మండపంలోని వేలాది మంది అభిమానులు ‘తలైవ.. తలైవ..’ అని నినాదాలు చేశారు. అవి రణన్నినాదాలు. తమిళనాడులో ఉద్ధండులైన రాజకీయ నాయకులను సైతం ఉలిక్కిపడేలా చేసిన రాజకీయ ప్రకంపనాలు. ‘‘అవినీతిపై పోరాడదాం.. అసమానతల్ని అంతమొందిద్దాం. మార్పుని తీసుకొద్దాం’’ అని రజనీ పిలుపు ఇవ్వగానే.. ‘అలాగే తలైవా.. చూపిద్దా తడాఖా’’ అని అభిమానుల స్వరం ప్రతిధ్వనించింది. రజనీ నిజంగానే పాలిటిక్స్‌లోకి వచ్చేశారా? ఇంకా కొంతమంది నమ్మడం లేదు. రెండు దశాబ్దాల ఎదురుచూపులు అంత వెలుగును ఒక్కసారిగా తట్టుకోగలవా? ఆ వెలుగు నిజమని నమ్మగలవా? నమ్మాలి. నిజంగానే రజనీలో ఆ రోజున రాజకీయ నాయకుడు సాక్షాత్కరించాడు. బొటనవేళ్లు పైకెత్తి తన రాజకీయ ప్రవేశానికి సంకేతం ఇచ్చారు. ‘‘నాకు జీవితాన్ని ఇచ్చిన అభిమానులారా.. తమిళ ప్రజలారా.. మీ అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు. నా అభిమానులను ఎలా కీర్తించాలో తెలియడం లేదు. ఆర్రోజులుగా, ఆరువేల మందికి పైగా అభిమానులు నాతో ఫొటో దిగేందుకు చూపిన ఓర్పు, పాటించిన క్రమశిక్షణ చెప్పలేని అనుభూతిని కలిగించింది. ఇదే క్రమశిక్షణ, ఓర్పు భవిష్యత్తులో కూడా కొనసాగితే ఏదైనా సాధించగలమని అర్థమైంది. మనం సరైన దిశగా వెళుతున్నాం. రాజకీయాల్లోకి రావడానికి నాకు భయం లేదు’’ అని తన ప్రసంగాన్ని చిన్నపాటి మోటివేషన్‌తో ప్రారంభించారు రజనీ. ‘‘నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చు. మిగతావి నేను చూసు కుంటానని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. యుద్దంలో జయిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం ప్రాపిస్తుంది. అదే.. యుద్ధం చేయకుండా వెళ్లిపోతే పిరికిపంద అంటారు. ఇప్పటికే అన్నీ పూర్తి చేశాను. బాణాన్ని గురి చూసి వదలడమే ఇక మిగిలింది’’ అని చెప్పారు. రజనీ ఒకసారి చెప్పాడు కాబట్టి.. ఇంకోసారి అడగన క్కర్లేదు. నిజమేనా అని చెయ్యి గిల్లుకోనక్కర్లేదు. రజనీసర్.. యువార్ ది స్టార్. రజనీసర్.. యువార్ ది వార్. ఇదీ.. నిన్నటి, మొన్నటి వైబ్రేషన్.. సెలబ్రేషన్! రాజకీయాల్లో రజనీ శక్తియుక్తులేమిటో బయట పడేందుకు మరికొంత సమయం పట్టొచు కానీ సినిమాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ ఏ స్టార్‌కూ లేనిది. ‘రజనీసర్ టైమ్ చూసుకోరు. టైమ్ ఎంత అవ్వాలో ఆయనే డిసైడ్ చేస్తారు!’. ‘రజనీసర్ క్యాలెండర్లో మార్చి 31 తర్వాత ఏప్రిల్ 2 ఉంటుంది. అందుకే రజనీసర్ని ఎవరూ ఫూల్‌ని చెయ్యలేరు’. ‘శాంటాక్లాస్ తనే ప్రతి సంవత్సరం రజనీసర్ దగ్గరికి గిఫ్ట్ కోసం వస్తాడు!’. ‘రజనీసర్ ‘కౌన్‌బనేగా...’ హాట్ సీట్లో కూర్చున్నప్పుడు సర్ని క్వొశ్చన్ అడగడానికి కంప్యూటర్ గారే హెల్ప్‌లైన్ తీసుకోవలసి వచ్చింది!’. రజనీసర్ ఆరో తరగతి నోట్సే ఇప్పుడు మనం చూస్తున్న వికీపీడియా! సూపర్‌మేన్, బాట్స్‌మేన్ రజనీసర్ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ రోజు టీచర్స్ డే. ఇవన్నీ.. రజనీకాంత్ అభిమానుల మీద ఉన్న జోకులు. అంతగా వారికి ఆయనపై నమ్మకం. ఏదైనా చేయగలడని, ఏదైనా సాధించగలడని. అలాంటి శక్తిమంతుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడంటే.. సమాజమే మారిపోతుంది వారు గట్టిగా నమ్ముతున్నారు. అభిమానం రాబిన్హుడ్నీ చేస్తుంది, రాఘవేంద్ర స్వామినీ చేస్తుంది. పాలిటిక్స్‌లో అంత పవర్ ఉంటుంది. రజనీ రాజకీయ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు మాత్రమే ఇంతకాలం ఎదురు చూడలేదు. ప్రత్యర్థులకు చెక్ పెట్టడం కోసం రాజకీయ నాయకులు సైతం పరోక్షంగా ఆయన్ని ‘రాజకీయం’లోకి దింపేందుకు ఇరవై ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. జయలలితకు చెక్ పెట్టడానికి కరుణానిధి వర్గం, కరుణానిధిని అదుపులో ఉంచేందుకు జయలలిత వర్గం ఎన్నోసార్లు రజనీ అనే అస్త్రాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేశారు. ‘పోలింగ్ డేట్ దగ్గర పడింది రజనీ. నువ్వొక్క మాట చెప్పు ఈ రాష్ట్రానికి.. మేము వందసార్లు ప్రచారం చేసుకుంటాం’ అనే సంకేతాలనూ డీఎంకే అనేకసార్లు రజనీకి పంపింది. ఆఖరికి ‘కబాలి’ ట్రైలర్‌ని కూడా ఆ పార్టీ జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంది! రజనీ మాత్రం ఎప్పుడూ ఎవరి పక్షమూ నిలవలేదు. చివరి వరకు అభిమానుల పక్షాన్నే ఉండి, ఇప్పుడు తమిళ ప్రజల కోసం అభిమానుల అండతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నిలబడి గెలిచారూ అంటే ఆయనపై అభిమానులకు ఉన్న నమ్మకం గెలిచినట్లు. అభిమానంతో ఏదైనా సాధించగలం అన్న ఆయన నమ్మకం కూడా గెలిచినట్లే! కామెంట్స్: శివ మల్లాల ఎమ్జీఆర్‌లా ఉండాలి రజనీకాంత్ వచ్చి సరిగ్గా నిలబడి చేస్తారా? ఎలక్షన్ దాకా ఉంటారా? ఊరికే మాట్లాడుతు న్నారా? పవన్ కల్యాణ్ కూడా ముప్పైసార్లు చెప్పాడు. అది అంటాడు, ఇది అంటాడు. పొలిటికల్ కన్సిస్టెన్సీ ఉండాలి పవన్‌కి అయినా, రజనీకాంత్‌కు అయినా. ఎన్టీఆర్‌గారు వచ్చారంటే, యంజీఆర్ గారు వచ్చారంటే ఒక మాట అనుకున్నారంటే తప్పో ఒప్పో చేసేసేవారు. వాళ్లకున్న కాన్ఫిడెన్స్ గానీ నమ్మకం గానీ వీళ్లకు లేదు. – తమ్మారెడ్డి భరద్వాజ తపన ఉన్న మనిషి తొంభైల మధ్యకాలంలో చాల సంవత్సరాలు రజనీతో సన్నిహితంగా మెలిగాను. ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంటాడు. చాలా మంచి మనిషి. గొప్ప మానవతావాది. ఆయన రాజకీయాలలోకి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు. ఆయన మనస్పూర్తిగా తలుచుకుంటే, దానిని సాధించే దాకా వదిలిపెట్టే రకం కాదు. కచ్చితంగా రాజకీయాల్ని ఒక పట్టు పడతాడని అనుకుంటున్నాను. – అల్లు అరవింద్ స్ట్రాంగ్‌గా నిలబడాలి రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రావటం మంచిదే. పాలిటిక్స్‌లోకి ఎవరైనా రావచ్చు. ఫలానా వాళ్లే రావాలనే రూలేం లేదు. సేవ చేయలనే ఉద్దేశం ఉంటే చాలు ఎవరైనా ఎన్నికల్లో పోటీ పడొచ్చు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. ఆయన పార్టీ పెడితే బావుంటుంది. ఆయన ఎంత వరకూ స్ట్రాంగ్ నిలబడి చేస్తారో చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. – జీవిత రాజశేఖర్ మానవతావాది నేను రజనీకాంత్‌ని రెండు సార్లు కలిశాను. రజనీ గురించి దేÔ¶ ం మొత్తం మీద ఒక అభిప్రాయం ఉంది మోస్ట్ హానెస్ట్ అని. గొప్ప మానవతావాది. ఫ్రెండ్లీ నెచర్. ప్రజలందరికి ఏమని ఉంటుందంటే..æ ‘రాజకీయాలు బావుండాలి. రాజకీయ నాయకులు బావుండాలి. మన సొమ్ము తినకూడదు’ అని. అది నిజం కావాలంటే రజనీకాంత్‌లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి. అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి కావాలి. ప్రజలకు సేవ చేయాలి. – పోసాని కృష్ణ మురళి సరైన సమయం రజనీకాంత్ తమిళనాడు ప్రజల సమస్యలను చూసి అర్ధం చేసుకున్న వ్యక్తి. ఏ నటుడైనా రాజకీయల్లోకి రావాలంటే వాళ్లంత మాస్ ఫాలోయింగ్ ఉండాలి. తెలుగు నాట ఎన్టీఆర్, తమిళనాట ఎమ్జీఆర్, జయలలిత.. వీళ్లంతా కూడా మాస్ ప్రజల హృదయాల్ని గెలుచుకున్నవారే. 25 సంవత్సరాలు టైమ్ తీసుకుని శూన్యమైన తమిళ రాజకీయల్లోకి సరైన సమయంలో రజనీ వస్తున్నాడు అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా ఆయన్ని ఆహ్వానిస్తున్నాను. – జయప్రద