
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్–శంకర్ కాంబినేషన్‌లో ‘రోబో’కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘2.0’. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. బడ్జెట్.. విజువల్ ఎఫెక్ట్స్.. ఎక్కువ భాషల్లో రిలీజ్ కానున్న సినిమాగా ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన ‘2.ౖ’ మరో అరుదైన ఘనతనూ సొంతం చేసుకోనుంది. అది కూడా అరబ్ దేశమైన సౌదీ అరేబియాలో కావడం విశేషం. సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ 1980లలో సౌదీలో సినిమా హాళ్లను మూసేసిన విషయం తెలిసిందే.
థియేటర్ల ఏర్పాటు, సినిమాల ప్రదర్శనకు సౌదీ ప్రభుత్వం ఇటీవల మళ్లీ అనుమతిఇచ్చింది. 35 ఏళ్ల తర్వాత సౌదీలో థియేటర్లు ఏర్పాటు చేశాక విడుదలయ్యే తొలి భారతీయ సినిమా, అది కూడా ఓ సౌత్ సినిమా ‘2.ౖ’ కావడం గర్వించదగ్గ విషయమే. ఈ సినిమా పాటల విడుదల వేడుకను దుబాయ్‌లో ఎంత గ్రాండ్‌గా చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది మార్చి చివరికల్లా సౌదీలో థియేటర్లు ప్రారంభించే అవకాశం ఉందట. ఏప్రిల్‌లో రిలీజ్ కానున్న ‘2.ౖ’ సినిమాని అక్కడ ప్రదర్శించేందుకు చిత్రబృందం సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరపగా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట.
Comments
Please login to add a commentAdd a comment