లండన్: అదేంటీ.. రజనీకాంత్ సూపర్‌స్టార్ కదా? మరి సైంటిస్ట్ అంటారేంటి? ..నిజమే, రజనీకాంత్ గొప్ప స్టార్ ఇమేజ్ ఉన్న నటుడని మనకు తెలుసు. ఇంగ్లండ్ పోలీసులకు తెలియదు కదా? అందుకే తమ వెబ్‌సైట్‌లో రజనీకాంత్‌ను సైంటిస్ట్‌గా చూపుతూ ఓ ఫొటో పోస్ట్ చేశారు. అసలు విషయమేంటంటే.. ఓ వ్యక్తి మోతాదుకి మించి తాగి కారు డ్రైవింగ్ చేస్తుండగా, డర్బీ పోలీసులు పట్టుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో రీడింగ్ ఓ రేంజ్‌కి వెళ్లడంతో పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఫన్నీగా చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ‘ఈ వ్యక్తి ఆల్కహాల్ మోతాదు ఇంతగా నమోదవ్వడానికి కారణం సైంటిస్టులకు కూడా అంతుబట్టడంలేద’ంటూ ట్వీట్ చేసిన పోలీసులు సైంటిస్ట్‌కు సింబల్‌గా మన తలైవా చిత్రాన్ని వాడుకున్నారు. ఇటీవల విడుదలైన రోబో 2.ఓలో రజనీకాంత్ సైంటిస్ట్ పాత్ర కూడా పోషించాడు కదా.. అదే ఫొటోను ఇంగ్లండ్ పోలీసులు ఫన్నీగా వాడుకున్నారన్నమాట. నిజానికి రజనీకాంత్ సైంటిస్ట్ కాదనే విషయం వాళ్లకూ తెలుసు!
A male subject to a breath test by Derby Police this morning provided a reading that biologically shouldn't even be possible.
— Derby Police (@DerbyPol) 9 February 2019
The male had a BAC of 0.341% which is like driving whilst under a surgical anaesthetic or being in a coma. Oh, and he has 2 prior life disqual's 😉
#fb pic.twitter.com/roHAzHq1pv
Comments
Please login to add a commentAdd a comment