
రజనీకాంత్
సరికొత్త అప్‌డేట్స్‌తో వస్తున్న చిట్టి రజనీకాంత్ రోబో స్పీడెంతో చూడాలనుందా? విలన్ అక్షయ్ కుమార్ క్రూరమైన ఆలోచనలేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఇంకొన్ని రోజులు ఆగితే చాలు.. మనకో చిన్న క్లూ దొరికేస్తుంది. ఎలా అంటారా..? వచ్చే నెలలో ‘2.0’ సరికొత్త టీజర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘2.0’. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదల పలు వాయిదాల తర్వాత నవంబర్ 29న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం టీజర్‌ను ఆగస్ట్ 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.