ఐశ్వర్యారాయ్
తమిళ సినిమా : 2.ఓ చిత్రంలో అందాల భామ ఐష్ కూడా ఉందా? ఈ ప్రశ్నకు తాజాగా అవుననే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి రావడం విశేషం. ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రంపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కలిసి నటించిన చిత్రం ఎందిరన్ (తెలుగులో రోబో). శంకర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సాంకేతిక పరిజ్ఞానంలో హాలీవుడ్‌కు దీటుగా నిలిచిన చిత్రం ఎందిరన్. అలాంటి చిత్రానికి సీక్వెల్‌గా నిర్మాణంలో ఉన్న సినిమా 2.ఓ. అయితే ఇందులో బ్రిటీష్ భామ ఎమీజాక్సన్ రజనీకాంత్‌కు జంటగా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించారు.
ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.450 కోట్ల వ్యయంతో లైకా సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్‌లో ఉన్న 2.ఓ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం పెద్దగా బయటకు రాలేదు. ఈ ఏడాది చివరిలో తెరపైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి ఐశ్వర్యారాయ్ కూడా నటించారన్న ప్రచారం తాజాగా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతుండడం విశేషం.
2.ఓ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నట్లు, ఎందిరన్ చిత్రానికి, 2.ఓ చిత్రానికి కమ్యూనికేషన్ కల్పించే విధంగా ఐష్ పాత్ర ఉంటుందని, ఈ విషయాన్ని ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ కళాకారిణి సబిత వెల్లడించినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. అయితే చిత్రం విడుదల ముందు వరకూ ఏ విషయాన్ని వెల్లడించని దర్శకుడు శంకర్ ఇప్పుడీ సంచల వార్తపై అయినా తమ మౌనం వీడతారా?లేక అదీ చిత్ర ప్రచారంలో ఒక భాగం అవుతుందని సైలెంట్ అవుతారా అన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment