వరల్డ్ వైడ్‌గా అత్యంత సుందరమైన ప్రదేశాలున్న దేశాల్లో ఉక్రెయిన్ (Ukraine) ఒకటి. ఎప్పుడూ వివిధ దేశాల పర్యాటకులతో సందడిగా ఉండే ఉక్రెయిన్ పరిసర ప్రాంతాలు రష్యా యుద్దం ప్రకటించడంతో అతలాకుతలం అయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలు సరిహద్దులను దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి దాడులు చేస్తుండటంతో..ఉక్రెయిన్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
ఈ నేపథ్యంలో భారత సినీ పరిశ్రమలు ఉక్రెయిన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాయి. ఎందుకంటే అంత్యంత సుందరమైన ప్రదేశాలను కలిగిన ఉక్రెయిన్‌లో మన భారతీయ సినిమాలు ఎన్నో అక్కడ షూటింగ్స్‌ను జరుపుకున్నాయి. అందుకే ఉక్రెయిన్‌తో మన భారత సినీ పరిశ్రమకు అందులో మన తెలుగు ఇండస్ట్రీకి మంచి అనుబంధం ఉంది. మరి అక్కడ రూపుదిద్దుకున్న మన తెలుగు సినిమాలు, భాతర చిత్రాలు ఏవో ఓ సారి చూద్దాం.
తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం, రణం, రుధిరం). దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లో ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ మూవీలోని పలు సన్నివేశాలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేసిన ‘నాటు నాటు’ సాంగ్ ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన నాటు నాటు పాట ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సెన్సెషన్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ రోబో. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన రోబో 2.0లోని చాలా సన్నివేశాలను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించారు. ఇందులో మెక్సికన్ బ్యూటీ అమీ జాక్సన్ లేడీ రోబోగా నటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది.
2017లో వచ్చిన తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం విన్నర్. ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న మొదటి ఇండియన్ చిత్రమిదేనని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రకటించాడు. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సహనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 99 సాంగ్స్. ఈ సినిమా కూడా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇండియాలోనే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఉక్రెయిన్‌లో లాంగ్ షెడ్యూల్‌తో ముగిసింది. ఇహాన్‌భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ పోషించిన చిత్రం దేవ్. 2019లో విడుదలైన ఈ చిత్రాన్ని రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment