shooting spot
-
గోదారి సీనుంటే.. బొమ్మ బ్లాక్‌బస్టరే..
తాళ్లపూడి: వయ్యారి గోదారి పరవళ్లు.. ఒంపులు తిరిగిన గోదారి గట్లు.. ఆపైనుండే గుడి గోపురాలు.. నీటి మధ్య ఇసుక తిన్నెలు.. లంకలు.. సూర్యోదయాస్తమయ వేళల్లో గోదారమ్మ నుదుటిన అలదుకునే సిందూరం.. పావన నదిపై నీలి మేఘాలంకరణలు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నని చెప్పేది గోదారోళ్ల సౌభాగ్యం. భౌతిక నేత్రంతో చూసే భాగ్యం ఇక్కడివారిదైతే.. ఇవే దృశ్యాలను వెండితెరపై చూసి అచ్చెరువొంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని భావించేవారెందరెందరో.. కొంత కళాత్మక దృష్టి.. ఒకింత భావుకత.. మరికొంత రసరమ్యమైన మనసు.. వీటికి తోడు భావగర్భితమైన కెమెరా కన్ను.. చాలు.. ఓ సుందర దృశ్య కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి. ఇలాంటి మనసున్న దర్శక, నిర్మాతలెందరో మన గోదావరిని అమ్మగా.. కొంటె కోణంగిగా.. వయ్యారిభామగా.. పడుచు పిల్లగా.. మరెన్నో విధాలుగా వెండి తెరపై ప్రపంచానికి చూపించి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన కథలకు నేపథ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలను ఎన్నుకుని ఎనలేని కీర్తిని గడించారు. తెలుగు సంస్కృతికి ప్రతీకలు గోదావరి జిల్లాలు. ఇక్కడి ప్రజల వాడుక భాషే ‘చిత్ర’ భాషగా వ్యవహరిస్తారు. ఇక్కడి ఆచార వ్యవహారాలే ప్రామాణికంగా భావిస్తారు. దర్శక దిగ్గజాల్లో ఒకరైన నాటి ఆదుర్తి సుబ్బారావు నుంచి నేటి శేఖర్ కమ్ముల వరకూ ఎందరో గోదావరి అందాలతో వారి చిత్రాలను సుసంపస్నం చేసుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకులే కాక.. ఈ ప్రాంతానికే చెందిన వంశీ తీసిన చాలా సినిమాలు గోదావరి నది నేపథ్యంగా సాగినవే. వారిలో చాలా మందికి పాపికొండల నుంచి అంతర్వేది వరకూ ఎన్నో ప్రాంతాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. ఆ చిత్రం హిట్టు కొట్టేస్తుందనేది గట్టి నమ్మకం కొవ్వూరు పరిసరాల్లో.. ముఖ్యంగా కొవ్వూరు మండలంలోని గోష్పాద క్షేత్రం, కుమారదేవం, ఆరికిరేవుల, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం పరిసర ప్రాంతాల్లో గోదావరి తీరాన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. వేగేశ్వరపురంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆంజనేయుని ఆలయం రేవు, బల్లిపాడు ఇసుక ర్యాంపు లంకలు, మలకపల్లిలోని కుంటముక్కల వారి గృహంలో అనేక సినిమాల్లో చాలా సన్నివేశాలే చిత్రీకరించారు. 👉వేగేశ్వరపురంలో చిరంజీవి నటించిన రక్తసింధూరంలోని ఓ పాటను, రామ్‌చరణ్, సమంత నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలను తాడిపూడి, వేగేశ్వరపురం గోదావరి లంకల్లో చిత్రీకరించారు. 👉 నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తాళ్లపూడిలోనే తీశారు. 👉 సాయికుమార్, ఆయన కుమారుడు ఆది కథా నాయకుడిగా నటించిన చుట్టాలబ్బాయ్ చిత్రంతో పాటు, మంచు మనోజ్, రెజీనా నటించిన శౌర్య చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఇక్కడే తెరకెక్కించారు. 👉 నాగార్జున, అనుష్క నటించిన ఢమరుకం చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను గోదావరి నది ఒడ్డున ఆంజనేయస్వామి గుడి వద్ద తీశారు. ప్రత్యేకంగా రుషుల కోసం ఒక సెట్ వేసి వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేశారు. 👉 సుమంత్ నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి, వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన సరదాగా కాసేపు చిత్రంలో కారులో వెళ్లే పాటను ఇక్కడే చిత్రీకరించారు. 👉 జగపతిబాబు, ప్రియమణి నటించిన పెళ్లైన కొత్తలో చిత్రంలో వారి స్నానపు సన్నివేశాన్ని ఇక్కడే తెరకెక్కించారు. 👉 ప్రక్కిలంకలో కృష్ణ నటించిన పాడిపంటలుతో పాటు, చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ ఈ ప్రాంతంలో చిత్రీకరించినవే. 👉 శ్రీకాంత్, చార్మి నటించిన చిత్రంలోని ఓ పాటను, శివాజీ హీరోగా నటించిన మిస్టర్ ఎర్రబాబులో మిత్రులతో కలిసి కథానాయికను ఆయన పరిచయం చేసుకునే సన్నివేశాన్ని, సునీల్‌పై హాస్య సన్నివేశాలను, ఆలీ నటించిన ఆషాఢం పెళ్లికొడుకులో ఒక పాటను ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించారు. 👉 కేవలం సినిమాలే కాకుండా కొన్ని ధారావాహికలు సైతం ఇక్కడి గోదారి ప్రాంతాల్లో చిత్రీకరించారు. హిట్ చిత్రాల భవనం సుమారు 110 ఏళ్ల క్రితం మలకపల్లిలో ఆ గ్రామానికి చెందిన కుంటముక్కల వీరభద్రరావు, వెంకటాద్రి, జానకిరామయ్య లోగిలిని అత్యాధునికంగా నిర్మించారు. ఈ గృహంలో సినిమా తీస్తే హిట్ గ్యారెంటీ అని చిత్రరంగ ప్రముఖుల్లో గట్టి నమ్మకం. 👉 జంధ్యాల దర్శకత్వంలో 1985లో వచ్చిన సీతారామకల్యాణం చిత్రం ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే తీశారు. 👉 ఆ చిత్రం విజయం సాధించడంతో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో డి.సురే‹Ùబాబు నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలిరాజా చిత్రంలోని కీలక సన్నివేశాలను కూడా ఈ ఇంట్లోనే తెరకెక్కించారు. 👉 అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, బాలకృష్ణ నటించిన సీతారామ కల్యాణం, నరేష్ నటించిన ప్రేమచిత్రం.. పెళ్లి విచిత్రం, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శోభన్‌బాబు నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంకా.. సీతారత్నం గారి అబ్బాయి, తాళి తదితర చిత్రాలన్నీ విజయం సాధించాయి. 👉 ఇదే గ్రామంలో దివంగత కుంటముక్కల భాస్కరరావు గృహానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రేమవిజేత అనే చిత్రం, రజనీకాంత్ నటించిన తమిళ సినిమా, జగదాంబ టూరింగ్ టాకీస్ తదితర సినిమాల్లో చాలా సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. అప్పట్లో డి.రామానాయుడు ఇక్కడి గ్రంథాలయానికి రూ.30 వేల విరాళం అందజేశారు. దీంతో గ్రామస్తులు ఆ భవనానికి మరమ్మతులు చేసి, రామానాయుడు గ్రంథాలయంగా పేరు పెట్టారు. రామచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తాజాగా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.150 ఏళ్ల నాటి సినిమా చెట్టుకుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 200 పైగా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. దీంతో, దీనికి ‘సినిమా చెట్టు’గా పేరొచ్చింది. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ చిత్రసీమలో స్థిరపడిపోయింది. ఈ నమ్మకంతోనే ఒక్క సీన్ అయినా ఈ చెట్టు కింద తీస్తారు. మొదటిగా కృష్ణ హీరోగా 1975లో పాడిపంటలు ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, శోభన్‌బాబు, బాలకృష్ణ, మోహన్‌బాబు, సుమన్, మహే‹Ùబాబు, రామ్‌చరణ్, రాజశేఖర్, నాని తదితర హీరోలతో పాటు, దర్శకులు వంశీ, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, సుకుమార్ ఈ చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం సెంటిమెంట్‌గా భావిస్తారు.షూటింగ్‌ల అడ్డా.. గోష్పాద క్షేత్రం కొవ్వూరు గోష్పాద క్షేత్రం పలు హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. జూనియర్ ఎనీ్టఆర్, భూమిక నటించిన హిట్ చిత్రం సింహాద్రిలో ఇంటర్వెల్ సీన్ ఇక్కడే తీశారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో 100 పర్సంట్ లవ్‌తో పాటు గుండెల్లో గోదారి, బెండు అప్పారావు ఆర్ఎంపీ తదితర అనేక చిత్రాలు ఇక్కడ తీశారు. ఇలా గోదావరి తీరంలో ఏటా చాలా చిత్రాల షూటింగులు జరుగుతూనే ఉంటాయి. -
షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం.. సిబ్బందికి తీవ్రగాయాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే చిత్రాల్లో గ్లాడియేటర్ సిరీస్ ఒకటి. గతంలో విడుదలైన గ్లాడియేటర్-1 సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌గా గ్లాడియేటర్-2 తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెట్లో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగింది. ( ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొరాకోలో జరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల పలువురు సిబ్బంది గాయపడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ప్రతినిధి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..'ఈ ప్రమాదంలో ఆనుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ఆరుగురు సిబ్బందిలో మరో నలుగురికి చికిత్స కొనసాగుతోంది. ఇంతటి భారీ అగ్నిప్రమాదం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్ సెట్లో భద్రతా పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.' అని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో నటీనటులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. కాగా.. 2000 సంవత్సరంలో వచ్చిన ‘గ్లాడియేటర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సర్ రిడ్లీ స్కాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు ఏకంగా 5 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 2024లో విడుదల కానుంది. ( ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్) -
వావ్ సూపర్.. వాల్తేరు వీరయ్య భారీ షూటింగ్ సెట్..!
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ మెగాస్టార్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్స్‌ను పంచుకున్నరు మేకర్స్. ఈ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్రం ఒడ్డున వేసిన సినిమా సెట్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సెట్లో చేసిన భారీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. బాస్ పార్టీ, శ్రీదేవి సాంగ్‌తో పాటు వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ మెగా ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2023న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. For the first time, the team of #WaltairVeerayya would be addressing the media today 🔥💥 Live begins soon!❤️🔥 - https://t.co/syyNK5hxZv#WaltairVeerayyaOnJan13th Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/iing61TRlH — Mythri Movie Makers (@MythriOfficial) December 27, 2022 -
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్: సీన్ ఉంటే.. సినిమా హిట్టే
సాక్షి, రంగారెడ్డి: తిమ్మాపూర్‌లో ఎనభై ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వేస్టేషన్ సినిమా షూటింగ్‌లకు ప్రఖ్యాతి గాంచింది. అగ్ర హీరోలు మొదలుకుని జూనియర్ల వరకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో సినిమా షూటింగ్‌లు చిత్రీకరించడానికి చాలా ఆసక్తి కనబర్చుతారు. వీరి సెంటిమెంటే ఇందుకు కారణం. పెద్ద హీరోలు నటించే సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్ ఉందంటే ముందుగా తిమ్మాపూర్నే ఎంచుకుంటారు. ఇక్కడ ఒక చిన్న సీన్ చిత్రీకరించినా సినిమా హిట్ అవుతుందని హీరోలతో పాటు డైరక్టర్లలో గట్టి నమ్మకం ఉంది. చిరంజీవి నటించిన అల్లుడా మజాకా, వెంకటేశ్ నటించిన సూర్యవంశం, పవన్ కల్యాణ్ సినిమా జానీ, బాలకృష్ణ మూవీ సమరసింహారెడ్డితో పాటు పలు చిత్రాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఆదర్శంగా.. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మిగితా స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు ఇలా ప్రయాణికులకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ మీదుగా నిత్యం 20 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుండగా 4 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. పండగలు ఇతర రద్దీ దినాల్లో ఈ స్టేషన్ నుంచి నిత్యం వంద మందికిపైగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. రెండుసార్లు ఉత్తమ అవార్డులు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో పనిచేసే స్టేషన్ మాస్టర్లు, మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండుసార్లు ఉత్తమ స్టేషన్‌గా అవార్డులు వరించాయి. ప్రస్తుతం పాత భవనాలు, ఫ్లాట్‌ఫాంలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. -
షూటింగ్ స్పాట్‌గా మారుతోన్న సింగరేణి.. ప్రభాస్ సలార్, నాని దసరా..ఇంకెన్నో
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: నల్లబంగారు నేల సింగరేణి షూటింగ్ స్పాట్‌గా మారుతోంది. ఎప్పుడూ ఎక్స్ప్లోజివ్ల మోతలు.. డంపర్ల హారన్లు.. అప్రమత్తత సైరన్లు వినిపించే గనులపై యాక్షన్.. కట్.. ప్యాకప్ మాటలు వినిపిస్తున్నాయి. సింగరేణి కార్మికులు, అధికారులతో బిజీగా ఉండే గనులు.. సినీ ప్రముఖులతో సందడిగా మారుతున్నాయి. మసి, బొగ్గు, దుమ్ముతో నిండిపోయిన మైనింగ్ ప్రాంతాలు మాస్ సినిమాలకు అందమైన లోకేషన్లుగా మారాయి. ఉద్యమ సినిమాల నుంచి కామెడీ.. ప్రేమకథ.. మాస్ సినిమాలు సైతం ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ‘సలార్’ యూనిట్ సందడి చేయగా.. ఇటీవల ‘దసరా’ టీం షూటింగ్ పూర్తిచేసుకుని వెళ్లింది. సింగరేణి గనులపై సినిమా షూటింగ్‌లపై సండే స్పెషల్. లొకేషన్స్‌కు ప్రత్యేకం కోల్‌బెల్ట్.. సినిమా షూటింగ్‌ల లొకేషన్‌కు కోల్‌బెల్ట్ ప్రాంతం పెట్టింది పేరు. సింగరేణి కార్మికుల ఇతి వృత్తాలతో పాటు పలు సినిమా షూటింగ్లో ఈప్రాంతంలో ఎక్కువగా జరిగాయి. భారీ బడ్జెట్ మొదలు కొన్ని చిన్న సినిమాల వరకు ఈప్రాంతం ఆదరిస్తూనే ఉంది. కళాకారులను అక్కున చేర్చుకుంటోంది. గోదావరిఖని పట్టణాన్ని ఆనుకుని ఉన్న జనగామ, సుందిళ్ల గ్రామాల్లో ఆర్.నారాయణమూర్తి అనేక సినిమా షూటింగ్‌లు చేశారు. ప్రధానంగా పదేళ్ల క్రితం సుందిళ్లలో పోరు తెలంగాణా చిత్ర సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు జరిగింది. అలాగే కోవిడ్‌కు ముందు బిత్తిరి సత్తి నటించిన తుపాకీ రాముడు సినిమా షూటింగ్ జనగామలో చాలా రోజుల పాటు జరిగింది. ఆర్.నారాయణమూర్తి నటించి నిర్మించిన నిర్భయభారతం, దండకారణ్యం సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. పిట్టగోడ సినిమా షూటింగ్ కూడా ఖని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. స్థానికులే కళాకారులుగా నిర్మించిన అగ్లీఫేసెస్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. గోదావరిఖని ప్రాంతంలోనే చిత్ర షూటింగ్ జరిగింది. ఓసీపీ–2 బేస్‌వర్క్ షాప్‌లో ‘సలార్’ షూటింగ్ (ఫైల్) సలార్.. దసరా సందడి సింగరేణి ప్రాంతంలో గత పదిహేనేళ్లుగా చాలా సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసకు ప్రాముఖ్యం, దర్శకుల సంఖ్య పెరిగింది. ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న “సలార్’ మొదటి షెడ్యూల్‌ను రామగిరిలోని ఆండ్రియాలా ప్రాజెక్టులో చిత్రీకరించారు. రామగిరి వాస్తవ్యుడు దర్శకుడిగా, నాని హీరోగా దసరా సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం కొంత షూటింగ్ పూర్తికాగా.. తదుపరి సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీసేందుకు షెడ్యూల్ రూపొందించారు. విజయ్‌దేవరకొండ తన తదుపరి చిత్రం షూటింగ్ గోదావరిఖని ప్రాంతంలోనే తీసేందుకు లోకేషన్స్ వెతుకుతున్నారు. చిత్ర బృందం ఇటీవల సింగరేణి ప్రాంతంలో పర్యటించి వెళ్లారు. ఎన్టీపీసీ, సింగరేణి గెస్టు హౌస్‌లో ఆధునిక సౌకర్యాలతో వసతి సౌకర్యాలు ఉండటంతో చిత్రీకరణ కోసం వచ్చిన నటినటులు సైతం ఆసక్తి చూపుతున్నారు. సలార్ సినిమా షూటింగ్ కోసం డమ్మీ ఆయుధాలను తయారు చేస్తున్న సిబ్బంది (ఫైల్) ప్రీవెడ్డింగ్ షూట్స్ మాస్ సినిమాల్లో వచ్చే ఫైట్స్, పాటలకు సింగరేణి గొగ్గు గనులు దర్శకులకు మొదటి చాయిస్‌గా కనిపిస్తున్నాయి. జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, పార్వతీ బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లిలో జలకళ సంతరించుకుంది. ఈ ప్రాంతాల్లో పెళ్లిళ్లకు సంబంధించిన ప్రీవెడ్డింగ్ షూట్స్, సాంగ్స్, పుట్టినరోజు వేడుకలకు చెందిన పాటలను చిత్రీకరిస్తున్నారు. -
150 అడుగుల ఎత్తులో ఎగిరిపడిన కారు!
-
ఉక్రెయిన్‌లో అందమైన ప్రదేశాలెన్నో, అక్కడ రూపుదిద్దుకున్న భారత సినిమాలు..
వరల్డ్ వైడ్‌గా అత్యంత సుందరమైన ప్రదేశాలున్న దేశాల్లో ఉక్రెయిన్ (Ukraine) ఒకటి. ఎప్పుడూ వివిధ దేశాల పర్యాటకులతో సందడిగా ఉండే ఉక్రెయిన్ పరిసర ప్రాంతాలు రష్యా యుద్దం ప్రకటించడంతో అతలాకుతలం అయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలు సరిహద్దులను దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి దాడులు చేస్తుండటంతో..ఉక్రెయిన్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత సినీ పరిశ్రమలు ఉక్రెయిన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాయి. ఎందుకంటే అంత్యంత సుందరమైన ప్రదేశాలను కలిగిన ఉక్రెయిన్‌లో మన భారతీయ సినిమాలు ఎన్నో అక్కడ షూటింగ్స్‌ను జరుపుకున్నాయి. అందుకే ఉక్రెయిన్‌తో మన భారత సినీ పరిశ్రమకు అందులో మన తెలుగు ఇండస్ట్రీకి మంచి అనుబంధం ఉంది. మరి అక్కడ రూపుదిద్దుకున్న మన తెలుగు సినిమాలు, భాతర చిత్రాలు ఏవో ఓ సారి చూద్దాం. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం, రణం, రుధిరం). దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లో ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ మూవీలోని పలు సన్నివేశాలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేసిన ‘నాటు నాటు’ సాంగ్ ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన నాటు నాటు పాట ఏ రేంజ్లో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. View this post on Instagram A post shared by K.K.Senthil Kumar (@dopkksenthilkumar) సెన్సెషన్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ రోబో. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన రోబో 2.0లోని చాలా సన్నివేశాలను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించారు. ఇందులో మెక్సికన్ బ్యూటీ అమీ జాక్సన్ లేడీ రోబోగా నటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. 2017లో వచ్చిన తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం విన్నర్. ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న మొదటి ఇండియన్ చిత్రమిదేనని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రకటించాడు. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సహనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 99 సాంగ్స్. ఈ సినిమా కూడా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇండియాలోనే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఉక్రెయిన్‌లో లాంగ్ షెడ్యూల్‌తో ముగిసింది. ఇహాన్భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ పోషించిన చిత్రం దేవ్. 2019లో విడుదలైన ఈ చిత్రాన్ని రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. -
చైతు కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత
‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘థ్యాంక్యూ’. ఇది చైతు 20వ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈస్ట్ గోదావరిలో జరుపుకుంటోంది. దీంతో షూటింగ్ సెట్స్‌కు అక్కినేని అభిమానులంతా క్యూ కడుతున్నారు. తమ అభిమాన హీరోను చూసేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్‌కి గుంపులు గుంపులుగా చేరారు. దీంతో నాగచైతన్య అక్కడికి వచ్చిన అభిమానులందరిని కలిసి వారితో ఫొటోలు దిగాడు. అయితే అక్కడ నదిలో నాగచైతన్యతో ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీరాభిమాని చైతును చూసేందుకు ఏకంగా నదిలోకే దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చిత్రీకరణ మధ్యలో అభిమాని నదిలో దూకడంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డైరెక్టర్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాడు. ఆ తర్వాత చైతు సదరు అభిమానిని కలిసి ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని చెప్పి, కాసేపు అతడితో మాట్లాడాడు. అనంతరం అభిమానితో ఫొటో దిగి తిరిగి పింపించాడు. ఇక తన అభిమాన హీరోని కలిసే అవకాశం వచ్చినందుకు సదరు అభిమాని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. Neekuna fanism ki avadhulu levu Anna @chay_akkineni ❤️🙏 Ne cult fanism level veru anthe 💥🤙#ThankYouTheMovie#LoveStoryOnApril16th pic.twitter.com/ImJjKZ4HOj — Aarya Prasad (@Aaryaprasad) March 2, 2021 చదవండి: ‘ఆచార్య’ సెట్లో సందడి చేయనున్న మెగా కోడలు తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా? -
‘పుష్ప’ అప్డేట్.. లీక్ చేసిన జానీ మాస్టర్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవలె జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. దీనికి సంబంధించి షూటింగ్ స్పాట్ ఫోటోలను జానీ మాస్టర్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అల్లూఅర్జున్, సుకుమార్‌లతో పాటు మొత్తం ‘పుష్ప’ టీంతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలోనూ అల్లు అర్జున్- జానీ మాస్టర్ కాంబినేషన్లో వచ్చిన పాటలు బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా త్రివక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురం సినిమాలోనూ బుట్ట బొమ్మ సాంగ్‌ను జానీ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. Loving to work with @alluarjun garu @aryasukku garu & entire team of #Pushpa 😍 DOP #MiroslawKubaBrozek Garu is too friendly to work with 😇@MythriOfficial pic.twitter.com/0OnxO5Whli — Jani Master (@AlwaysJani) February 26, 2021 కాగా సెట్స్ పైకొచ్చిన మొదటి రోజు నుంచి ఈ సినిమా లీకుల బారిన పడుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సన్నివేశాలు లీకైన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన క్లిప్పింగులు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా జానీ మాస్టర్ సైతం సినిమాకు సంబంధించిన సెట్స్‌ను లీక్ చేయడంతో..రిలీజ్‌కు ముందే ఇంకెన్ని లీకులు బయటికొస్తాయో అని చిత్ర బృందం కంగారు పడుతుందట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరో ఒకరు సన్నివేశాలను రహస్యంగా ఫోన్ కెమెరాలో షూట్ చేసి లీక్ చేసేస్తుండటం యూనిట్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ కావడంతో ఈ సినిమపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా బన్నీ కనిపించనున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు13 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చదవండి : (పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు) (పుష్ప రిలీజ్ డేట్‌పై సుకుమార్ అసంతృప్తి!) -
షూటింగ్ సెట్లో అయాన్, అర్హా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. బుధవారం సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా తొలి రోజు షూట్ సందర్భంగా తీసిన ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సెట్స్‌లో బన్నీ కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అర్హాలు కనిపించడం హైలెట్‌గా నిలిచింది. స్టైలిష్‌గా కారులో నుంచి దిగిన బన్నీ సెట్లోకి ఎంటర్ అయ్యారు. ఇంకా ఈ వీడియోలో త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, బన్నీ వాసు, సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్‌లతో పాటు చిత్ర యూనిట్‌ను చూపించారు. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. చాలాకాలం తర్వాత ప్రముఖ నటి టబు తెలుగులో నటిస్తుండటం విశేషం. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. -
నయన్‌తో ఆడుకుంటున్న చిన్నారిని చూశారా..!
2018 సంవత్సరం నయనతార ఖాతాలో మరిన్ని విజయాలు చేర్చింది. ఈ ఏడాది నయన్ నటించిన కొలమావు కోకిల, ‘ఇమైకా నొడిగళ్ వంటి చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించాయి. దాంతో నయన్ క్రేజ్‌కు తిరుగులేదని మరోసారి ప్రూప్ అయ్యింది. ప్రస్తుతం శివ మనసులో శక్తి ఫేమ్ ఎం రాజేష్ దర్శకత్వం వహిస్తోన్న ఎస్కే13 చిత్రంలో నటిస్తున్నారు నయన్. శివకార్తికేయ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అజెర్బైజాన్లో షూటింగ్ జరుపుకుంటోంది. #SK13onSpot Adorable 💝 pic.twitter.com/153IZ7GnDD — Nayanthara✨ (@NayantharaU) December 14, 2018 అయితే షూటింగ్ స్పాట్లో తీసిన ఓ వీడియో ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. షూటింగ్ స్పాట్లో నయన్ ఓ చిన్నారితో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి, నయన్‌తో కలిసి ఫోటోలకు పోజులిస్తూ తెగ అల్లరి చేస్తోంది. -
సెట్లో చెత్త ఎత్తిన సీనియర్ యాక్టర్
సినిమాల్లో తెరపై నీతులు చెప్పే స్టార్లు.. రియల్ లైఫ్‌లో అది పాటించటం చాలా అరుదు. అయితే విలక్షణ నటుడు నాజర్ మాత్రం అలా కాదు. స్వయంగా తానే సెట్లో చెత్త ఎత్తి చూపించారు. పంచె ఎగ్గట్టి స్పాట్లో టీ కప్పులు, చెత్త కవర్లను ఏరి డస్ట్ బిన్లో పడేశారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు అది పట్టించుకోకపోయినా.. ఓ వ్యక్తి మాత్రం ఆ ఘటనను తన మొబైల్లో షూట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్లో ఓ వ్యక్తి తెలుగు మాట్లాడటం గమనించొచ్చు. ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? వీడియో పాతదా? కొత్తదా? స్పష్టతలేదుగానీ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సీనియర్ నటుడు, పైగా నడిగర్ సంఘం ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి కూడా ఆయన అలా చేయటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం లో నాజర్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. -
ఆ హీరోయిన్ను భరించటం వల్ల కావట్లేదు!
సాక్షి, సినిమా : మోడల్ కమ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ సమయంలో ఆమె నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ఆమె మెయింటెనెన్స్ బిల్లు తడిసి మోపెడవుతుండటంతో భరించటం మా వల్ల కాదు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. స్పోర్ట్బాయే కథనం ప్రకారం... ‘సనమ్ రే’ ఫేమ్ ఊర్వశి ప్రస్తుతం భానుప్రియా అనే ఓ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ ప్రారంభమై కొద్ది రోజులే అవుతోంది. అయినప్పటికీ అప్పుడే ఆమె వ్యవహారంతో యూనిట్ సభ్యులు విసిగిపోతున్నారంట. షూటింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరిన సమయంలోనే ఆమె అసిస్టెంట్లు ఫోన్ ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారంట. అది అంతా ఇంతా కాదు. దాదాపు యూనిట్ సభ్యులకు సరిపడేంత. అందులో ఆమె, సహయక సిబ్బంది కాస్త మాత్రమే తిని.. మిగతాది ఆమె ఇంటికి పంపిచేస్తున్నారంట. ఊర్వశి వ్యవహారం రోజు రోజుకీ శృతి మించిపోతోందని.. షూటింగ్ మీరా రోడ్లో జరిగితే.. ఎక్కడో జూహులో ఉన్న కాస్ట్ లీ రెస్టారెంట్ నుంచి భోజనం ఆర్డర్ చేస్తోందని.. ఈ వ్యవహారంలో ప్రొడక్షన్ మేనేజర్‌తో ఆమె గొడవ పడినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమెపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. మరీ ఆరోపణలపై హేట్ స్టోరీ-4 బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
పెనకచెర్లడ్యాంపై షూటింగ్‌కు ఏర్పాట్లు
పెనకచెర్లడ్యాం(శింగనమల) : నేనే రాజు–నేనే మంత్రి సినిమాలోని ఒక సన్నివేశాన్ని గార్లదిన్నె మండలం పెనకచెర్లడ్యాంపై షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షూటింగ్ ఈ నెల 23వ తేదీన ఉండటంతో మంగళవారం ఈ సినిమా దర్శకుడు తేజ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. -
ఖైదీ నెం.150 సెట్స్ లో అఖిల్ సందడి
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150' సెట్స్‌లో అక్కినేని అఖిల్ సందడి చేశారు. మెగాస్టార్‌కి వీరాభిమాని అవ్వడమేకాకుండా చరణ్‌కు మంచి స్నేహితుడు కూడా కావడంతో అఖిల్ షూటింగ్ స్పాట్ కి వెళ్లాడు. చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించడంపై ఇదివరకు ఓ సారి అఖిల్ మాట్లాడుతూ.. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఇండస్ట్రీకి కంగ్రాట్స్ అని చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు. మంగళవారం సెట్స్‌కు వెళ్లి సరదాగా గడిపాడు. 'ఖైదీ నెం.150' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వి.వి.వినాయక్.. అఖిల్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేసిన విషయం తెలిసిందే. తన ఫస్ట్ డైరెక్టర్‌తో కలిసి సరదాగా సెల్ఫీ తీసుకున్నాడు. కాగా 'ఖైదీ నెం.150' సెట్స్‌కు సినీ ప్రముఖుల తాకిడి ఎక్కువగానే ఉంది. మెగాస్టార్ 150వ సినిమా చిత్రీకరణ చూసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. -
సెట్లో... టైమ్ బాంబ్
‘దేశముదురు’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడ బాగానే సినిమాలు చేశారు హన్సిక. అయితే. తెలుగులోకన్నా ఇప్పుడు తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. అక్కడ హన్సిక కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా ఉంది. చిన్న ఖుష్బూ అని తమిళ పరిశ్రమ, ప్రేక్షకులు హన్సికను ముద్దుగా పిలుస్తుంటారు. ఆమెకు ఇంకో పేరు కూడా ఉంది. ఆ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ - ‘‘నేను షూటింగ్‌కి కరెక్ట్ టైమ్‌కి వెళిపోతాను. ఏడు గంటలంటే ఓ పది నిమిషాలు ముందే లొకేషన్లో ఉంటాను. అందుకే అందరూ నన్ను ‘టైమ్ బాంబ్’ అని పిలుస్తారు’’ అని చెప్పారు. పంక్చువాల్టీని ఇష్టపడే హన్సిక ఇప్పుడా విషయంలో కొంచెం మారాలనుకుంటున్నారు. ‘‘నేను ముందు లొకేషన్‌కి వెళిపోతాను. కానీ, ఆలస్యంగా వచ్చేవాళ్ల వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ స్టార్ట్ కాదు. దాంతో నేను ముందు వెళ్లినా ప్రయోజనం ఉండదు. అందుకే, కొంచెం మారాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కానీ, నావల్ల కావడం లేదు’’ అని హన్సిక పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో హన్సిక యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తాను చేస్తున్న చిత్రాల వివరాలు తెలియజేస్తుంటారు. అప్పుడప్పుడూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. హన్సిక ట్విట్టర్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య ఇటీవలే 20 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఈ బ్యూటీ ధన్యవాదాలు తెలిపారు. -
షూటింగ్లో హీరోకి గాయాలు
చెన్నై: షూటింగ్లో నటుడు అజిత్ గాయపడ్డాడు. ఎన్నైఅరిందాల్ తరువాత అజిత్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుటోంది. అజిత్ 56వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.చిత్ర షూటింగ్ సముద్రతీర ప్రాంతలో జరుగుతోంది.అజిత్ దుండగులతో పోరాడే సన్నివేశాల్ని చిత్రీకరిస్తుండగా ఆయన కంఠానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రయత్నించగా అజిత్ వద్దంటూ వారించి గాయాల బాధతోనే షూటింగ్ పూర్తి చేశారు.కాగా అజిత్‌కు షూటింగ్లో గాయాలవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు ఆరంభం చిత్ర షూటింగ్ సమయంలోనూ కాలుకు బలమైన గాయాలయ్యాయి.ఆ తరువాత ఆయన స్టిక్ సాయంతోనే షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. -
హీరోయిన్ను రక్షించిన హీరో
షూటింగ్ స్పాట్లో హీరోయిన్ను కారులో ఎక్కించుకుని తీసుకుపోయిన రౌడీమూకను హీరో ఛేజ్ చేసి కాపాడారు. ఇది రీల్ సీన్ కాదు రియల్ సంఘటన అంటున్నారు దర్శకుడు లాలి. కన్నడ నటుడు రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఐదు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన ఈయన తొలిసారిగా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం అరియామై. షారోన్ గ్రూప్స్ పతాకంపై రాజ్ నిర్మించి హీరోగా నటించిన ఈ చిత్రంలో కన్నడ నటి కావ్య హీరోయిన్గా నటించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ముగ్గురు యువకుల పరిచయం స్నేహంగా మారుతుందన్నారు. ఆ ముగ్గురు అనూహ్యంగా ఒక సమస్యను ఎదుర్కొంటారని అందులో నుంచి బయటపడటానికి వారికి ఒక ఎమ్మెల్యే సాయం అవసరం అవుతుందన్నారు. ఆయన పంచన చేరిన వారి జీవితం ఎటు వైపు మళ్లిందన్నదే చిత్రం కథ అన్నారు. చిత్ర షూటింగ్‌ను మైసూరు - బెంగుళూరు హైరోడ్డులో నిర్వహిస్తుండగా అనూహ్యంగా కారులో వచ్చిన రౌడీమూక హీరోయిన్ను ఎత్తుకుపోయారన్నారు. చిత్ర యూనిట్‌కు ఏం జరిగిందో అర్థం అయ్యేలోపు ఆ కారు రయ్‌మని దూసుకుపోయిందన్నారు. ముందుగా తేరుకున్న చిత్ర హీరో రాజ్ విలన్, నటుడు ప్రతాప్ మరో కారులో రౌడీల కారును ఛేజ్‌చేసి మైసూర్ సమీపంలో పట్టుకుని వారి నుంచి హీరోయిన్ను రక్షించారని దర్శకుడు తెలిపారు. డీఎన్ దివాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతావిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్‌కెవి స్టూడియోలో నిర్వహించారు. -
షూటింగ్ స్పాట్ నుంచి దర్శకుడి అరెస్టు
అచ్చం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా.. ఓ కొత్త దర్శకుడిని సినిమా షూటింగ్ స్పాట్ నుంచి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఓ హత్యకేసులో ఆయన పాత్ర ఉండటంతో సివిల్ డ్రస్సులో వచ్చిన సీఐ, ఆయన బృందం కలిసి సంగీత్ లూయిస్ అనే దర్శకుడిని కేరళలోని కుందర ప్రాంతం నుంచి అరెస్టు చేశారు. ముందుగా లొకేషన్‌కు చేరుకున్న పోలీసులు ఇతర ప్రేక్షకులతో పాటు ఉండి, ఏమీ ఎరగనట్లుగా కాసేపు షూటింగ్ చూశారు. దాంతో సినిమా సిబ్బందితో పాటు ప్రేక్షకులకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. కాసేపటి తర్వాత వచ్చి, దర్శకుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీపు అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపిన కేసులో సంగీత్‌ను అరెస్టు చేశారు. గత సంవత్సరం జరిగిన ఈ సంఘటనలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అప్పుడే కేసు నమోదైంది. నిందితులలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే.. అప్పట్లో సంగీత్ ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడినుంచి అదృశ్యమయ్యాడు. ఇటీవల దర్శకుడి అవతారం ఎత్తాడు. దర్శకుడి నిజ స్వరూపం గురించి కొంతమంది స్థానికులకు అనుమానాలు రావడంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దాని ఆధారంగా షూటింగ్ ప్రదేశానికి వచ్చిన పోలీసులు, నిందితుడు అతడేనని నిర్ధారించుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ సినిమాలో జాతీయ అవార్డు విజేత సూరజ్ వెంజరమూడు లాంటి అగ్రనటులు నటిస్తున్నా, అరెస్టు సమయానికి పెద్దనటులెవరూ అక్కడ లేరు. -
ఎనీ టైమ్ రెడీ
కుర్రకారును పిచ్చెక్కించే అందం ఇలియూనా సొంతం. నిన్నటి వరకు దక్షిణాది ప్రేక్షకులను తన అందచందాలతో మురిపించిన ఈ గోవా సుందరి ప్రస్తుతం ఉత్తరాది అభిమానులను అలరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి వేదాంతం మాట్లాడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేమిటో ఈ బ్యూటీ మాటల్లోనే విందాం. ఁనటిగా ప్రవేశించిన తొలి రోజుల్లో చాలా పోరాడాల్సి వచ్చింది. ప్రతిభ కనబరిస్తే అభిమానులు ఆదరిస్తారు. లేకుంటే షూటింగ్ స్పాట్లో కూడా మర్యాద ఇవ్వరు. దక్షిణాదిలో ప్రముఖ నాయికగా వెలుగొందినా హిందీలో బర్ఫీ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఎవరూ గౌరవించలేదు. నా కఠిన శ్రమను గుర్తించిన తర్వాతే మర్యాద పెరిగింది. నటన అనేది ఒక వృత్తి మాత్రమే. దానిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉండాలి. అదే సమయంలో ప్రతి వారికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. యవ్వనం ఎల్లప్పుడూ ఉండదు. అది తగ్గుతున్నప్పుడు అభిమానుల్లోనూ మోజు తగ్గుతుంది. అందుకే నటనే జీవితమని భావించరాదు. ఏదో ఒక రోజు దానికి దూరం కావలసి వస్తుందని మా అమ్మ తరచూ చెబుతుంటారు. సినిమాకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వస్తే ఎప్పుడైనా దాన్ని సంతోషంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్తగా అందమైన హీరోయిన్లు వస్తే ప్రముఖ హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుంది. ఎంతటి హీరోయిన్ అయినా ఒక రోజు ది ఎండ్ కార్డు వేస్తారు. ఎలాంటి పయనానికైనా అంతం ఉంటుంది* అని అంది. ఇలియానాకు ఏమై ఉంటుందంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు సినీ వర్గాలు.