ఖైదీ నెం.150 సెట్స్ లో అఖిల్ సందడి | Akhil at 'Khaidi no.150' sets | Sakshi
Sakshi News home page

ఖైదీ నెం.150 సెట్స్ లో యువహీరో సందడి

Published Tue, Aug 30 2016 8:05 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

ఖైదీ నెం.150 సెట్స్ లో అఖిల్ సందడి

ఖైదీ నెం.150 సెట్స్ లో అఖిల్ సందడి

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150' సెట్స్లో అక్కినేని అఖిల్ సందడి చేశారు. మెగాస్టార్కి వీరాభిమాని అవ్వడమేకాకుండా చరణ్కు మంచి స్నేహితుడు కూడా కావడంతో అఖిల్ షూటింగ్ స్పాట్ కి వెళ్లాడు. చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించడంపై ఇదివరకు ఓ సారి అఖిల్ మాట్లాడుతూ.. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఇండస్ట్రీకి కంగ్రాట్స్ అని చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు. మంగళవారం సెట్స్కు వెళ్లి సరదాగా గడిపాడు. 'ఖైదీ నెం.150'  సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వి.వి.వినాయక్.. అఖిల్ను టాలీవుడ్కి పరిచయం చేసిన విషయం తెలిసిందే. తన ఫస్ట్ డైరెక్టర్తో కలిసి సరదాగా సెల్ఫీ తీసుకున్నాడు.

కాగా 'ఖైదీ నెం.150' సెట్స్కు సినీ ప్రముఖుల తాకిడి ఎక్కువగానే ఉంది. మెగాస్టార్ 150వ సినిమా చిత్రీకరణ  చూసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement