ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మెగాస్టార్ ఆగ్రహం | Megastar Chiranjeevi Responds On UK Fans Meet Issue Slams Pay-To-Meet Scam Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివీ సహించను: చిరంజీవి

Published Thu, Mar 20 2025 9:13 PM | Last Updated on Fri, Mar 21 2025 9:09 AM

Megastar Chiranjeevi Responds On UK Fans Meet Issue

యూకే పర్యటనపై మెగాస్టార్ చిరంజీవి మరో ట్వీట్ చేశారు. తన పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని పోస్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలో కొందరు డబ్బులు వసూలు చేశారని నాకు సమాచారం వచ్చిందన్నారు. అభిమానుల సమావేశాల పేరుతో ఇలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మెగాస్టార్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సందేశమిచ్చారు. లండన్‌లో తనని కలిసేందుకు ఫ్యాన్స్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరు తన ట్వీట్‌లో రాస్తూ..'నా ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలవాలనుకునే మీ అందరి ప్రేమ, ఆప్యాయత నా మనస్సును తాకింది. అయితే కొంతమంది వ్యక్తులు అభిమానుల సమావేశాల కోసం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు సమాచారం అందింది. ఇలాంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా డబ్బులు వసూలు వస్తే వెంటనే వారికి తిరిగి ఇవ్వండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడా కూడా ఇలాంటి చర్యలను అనుమతించను. మీ ప్రేమ, ఆప్యాయత, బంధం వెలకట్టలేనిది. దీన్ని ఎవ్వరూ ఏ విధంగానూ వ్యాపారంగా మార్చలేరు. ఇలాంటి దోపిడీకి దూరంగా ఉందాం' అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

(ఇది చదవండి: నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి)

కాగా.. చిరంజీవిని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు. లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement