fans meet
-
చికాగో ఫ్యాన్స్ మీట్లో శృతిహాసన్ సందడి
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లోకనాయకుడు కమల్‌హాసన్ గారాలపట్టిగా బోల్డెంత పేరు ఉన్నప్పటికి ..తన సొంత టాలెంట్, గ్లామర్‌తో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. టాప్ హీరోయిన్గా వెలుగుతోంది. పలు సేవా కార్యక్రమంలో పాలుపంచుకునే శృతిహాసన్ రీసెంట్గా అమెరికాలో పర్యటించారు. చికాగోలోని ఫ్యాన్స్ మీట్లో పాల్గొని..సందడి చేశారు.సాక్షి, HR PUNDITS పార్టనర్షిప్ గా.. పక్కాలోకల్ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో శృతి హాసన్ బార్బీ డాల్‌గా మెరిసిపోతూ.. అభిమానులను కుష్ చేశారు. ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాసన్ ను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. వేదికపై శృతిహాసన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా వారి కోరిక మేరకు సాంగ్స్ కూడా పాడారు. అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. శృతి హాసన్ తన సినీ కెరీర్ కు సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. చికాగో తనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైనా స్టయిల్ లో సమాధానం ఇచ్చారు.ఈ ఈవెంట్ లో శృతి హాసన్ సినిమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆమె సినిమాలకు సంబంధించి పలు ప్రశ్నలను అభిమానులను అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి శృతిహాసన్ ఆటోగ్రాప్ చేసిన టీషర్ట్లను అందజేశారు. ఇక ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాన్కు సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ఇక అందమైన ఫోటో ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించిన నిర్వహకులకు.. శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. -
అభిమానులతో గైటీ గెలాక్సీలో సందడి చేసిన సోనాక్షి సిన్హా (ఫోటోలు)
-
Samantha Fans Meet Photos: ఫ్యాన్స్ మీటింగ్‌లో సమంత సందడి (ఫొటోలు)
-
అల్లు అర్జున్ ఇంటివద్ద భారీగా అభిమానులు.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు(శనివారం)41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా స్టైలిష్ స్టార్‌గా తనకు తాను ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు బన్నీ. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ మొన్నటి పుష్ప సినిమా వరకు తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. పుష్పరాజ్‌గా పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక తన ఫ్యాన్స్‌ను ఆర్మీ అని ముద్దుగా పిలిచుకుంటారు బన్నీ. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ను కలిసేందుకు పలువురు అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్‌ను ఆప్యాయంగా పలకరించారు బన్నీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
అమెరికా అయినా.. ఆంధ్రా అయినా ఎన్టీఆర్ అంతే.. అభిమాని అడిగిన వెంటనే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో లాస్ ఎంజిల్స్‌లో ఉన్నారు. మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అమెరికా చేరుకున్న తారక్‌కు విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అభిమానులు నిర్వహించిన ఫ్యాన్స్ మీట్లో ఎన్టీఆర్ పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన వెంటనే వీడియో కాల్లో మాట్లాడి అతని కోరిక తీర్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా లాస్ ఎంజిల్స్‌లో అభిమానులతో కాసేపు సరదాగా గడిపారు. ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న వాళ్లందరితో ఫొటోలకు ఫోజులిచ్చాపు. ఈ కార్యక్రమంలో ఓ అభిమాని తారక్‌ను రిక్వెస్ట్ చేశాడు. మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టం అన్నా. ఒక్కసారి మాట్లాడతారా? అని అడిగిన వెంటనే ఓకే చెప్పారు. దీంతో ఆ అభిమాని తన తల్లికి వీడియో కాల్ చేయగా ఎన్టీఆర్ ఓ కుటుంబసభ్యుడిలా మాట్లాడారు. 'ఎలా ఉన్నారమ్మా. నేను బాగున్నాను. తప్పకుండా కలుద్దాం అమ్మా' అని అప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన జూనియర్ అభిమానులు ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. Jr.NTR - Down To Earth Star ❤️❤️ .#JrNTR #NTR #ManOfMassesNTR #NaatuNaatu #NTR30 #RvcjTelugu pic.twitter.com/pMkK91sTjF — RVCJ Telugu (@rvcj_telugu) March 7, 2023 -
శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నా.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో సందడి చేస్తున్నారు. ఈనెల 12న జరగనున్న ప్రతిష్ఠాత్మక అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే లాస్ ఎంజిల్స్ చేరుకున్నారు. యూఎస్‌లో అడుగుపెట్టిన యంగ్ టైగర్‌కు అభిమానులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అమెరికా చేరుకున్న తారక్ అక్కడి ఫ్యాన్స్‌తో మీట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఫాన్స్ మీట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నా. మరో జన్మంటూ ఉంటే మీ అభిమానం కోసమైనా పుట్టాలని కోరుకుంటున్నా. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పది. అంతకంటే ప్రేమ నా లోపల ఉంది. నేను చూపించలేకపోతున్నా.' అంటూ ఎమోషనలయ్యారు. ఎన్టీఆర్‌ను కలిసిన ఫాన్స్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. తారక్ ఫాన్స్ మీట్‌కు వెళ్లేముందు ఎన్టీఆర్, పులి బొమ్మతో ఉన్న టీ షర్ట్ ఫోటోలో కనిపించాడు. తాజాగా ఎన్టీఆర్ ధరించిన ఆ టీ షర్ట్ ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కాగా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈనెల 12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. -
'చిరంజీవిని కలిశాడు.. చూడగానే ఏడ్చేశాడు'
ఎవరైనా తమ అభిమాన హీరోని కలవాలని కలలు కనడం సహజం. మరి అందరికీ అలాంటి అవకాశం వస్తుందా? చాలామంది అభిమానులకు తాము దేవుడిలా ఆరాధించే అభిమాన హీరోను కలవాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఒకవేళ మీ అభిమాన హీరోని కలుసుకుని ఆతిథ్య స్వీకరిస్తే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. చిరకాల కోరిక నేరవేరితే మా కళ్లలో ఆనందం మాటల్లే వర్ణించలేం. ఆ కల సాకారమైన క్షణాన మాటలు రావు. అలాంటి అరుదైన అవకాశమే ఏపీలోని అనకాపల్లి గవరపాలెంకు చెందిన మెగాస్టార్ అభిమానికి దక్కింది. గవరపాలెంకు చెందిన కొణతాల విజయ్‌కు చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని డ్యాన్సర్‌గా మంచి తెచ్చుకున్నారు. పలు టీవీ షోల్లో డ్యాన్సర్‌గా కూడా చేశారు. డ్యాన్స్‌మాస్టర్‌గా, పలు ఈవెంట్లకు ఆయన న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఓ డ్యాన్స్ ఈవెంట్లోనూ విజయ్ బృందం ప్రథమ స్థానం పొందింది. ఈ డ్యాన్స్ షోకు దర్శకులు రాజమౌళి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆ సమయంలో బహుమతి ప్రదానం చేసేందుకు చిరంజీవి రావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో హాజరు కాలేదు. దీంతో చిరును కలవాలన్న విజయ్ కోరిక తీరలేదు. చైనాలో స్థిరపడిన విజయ్ డ్యాన్స్ మాస్టర్ విజయ్ తన భార్య జ్యోతితో కలిసి 12 ఏళ్లుగా చైనాలో స్థిరపడ్డారు. విజయ్ దంపతులు అత్యంత కష్టమైన యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ అభిమాన హీరోని కలవలేదన్న లోటు ఆయన జీవితంలో కనిపించింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. ఇండియాకు వచ్చాక పలు ఛానెల్స్ విజయ్ను ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా చిన్నతనం మెగాస్టార్‌పై ఉన్న అభిమానం, విజేతగా నిలిచినా ఆయన చేతులమీదుగా బహుమతి తీసుకోలేకపోవడం వంటి విషయాలను వివరించారు. ఈ విషయం హీరో చిరంజీవి దృష్టికి వెళ్లింది. అయితే అప్పటికే విజయ్ చైనా తిరిగి వెళ్లిపోయారు. స్వయంగా కబురు పంపిన మెగాస్టార్ ఆ తర్వాత మరోసారి ఇండియా వచ్చినప్పుడు చిరంజీవి కబురు పంపారు. అభిమాన హీరో ఆహ్వానం పంపితే అంతకన్నా ఆనందం ఏముంది. ఇక వెంటనే భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఆయన తన కుటుంబంతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. చిరంజీవితో కేవలం ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా. అలాంటిది వారి కుటుంబాన్ని కలవడం నా జీవితంలో మరువలేను. ఆయన మాట్లాడితే ఎంతో ప్రేరణనిచ్చింది. గిన్నిస్ బుక్ రికార్డు సాధించినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. చిరంజీవి దంపతులు మాకు భోజనం పెట్టి నూతన వస్త్రాలు, బహుమతులు ఇచ్చారు. మా పిల్లలను ఆడించారు. ఈ మధుర క్షణాలు ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనివి. - విజయ్ -
రామ్ చరణ్‌ను చూసి బోరున ఏడ్చేసిన అభిమాని..!
మెగా హీరో రామ్‌చరణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో ఓ చిట్టి అభిమాని కోరిక తీర్చిన చెర్రీ మరోసారి తన ఉదారత ప్రదర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో అభిమానులతో మీట్ నిర్వహించారు. అయితే సెక్యూరిటీ కారణాలతో కొంతమందిని అనుమతించపోవడం సహజం. కానీ అభిమాన హీరోతో ఫోటో దిగాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అలాగే చెర్రీ ఫ్యాన్స్ మీట్ జరుగుతుందని తెలుసుకున్న చిట్టి అభిమాని వేదిక వద్దకు చేరుకున్నాడు. ఫ్యాన్స్ మీట్లో బిజీగా ఉన్న చెర్రీని చూడగానే అభిమాని కన్నీటి పర్యంతమయ్యాడు. అభిమాన హీరోను చూడగానే కన్నీళ్లు తన్నుకొచ్చేశాయేమో గానీ బోరున విలపించాడు. దీంతో అబ్బాయిని రామ్ చరణ్ దగ్గరికీ పిలిచి మరీ వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత సెక్యూరిటీకి అతన్ని సురక్షితంగా ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో చెర్రీ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. దటీజ్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఆర్సీ15లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే కర్నూలు, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న చిత్రబృందం తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ చేరుకుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Man with Golden Heart❤️ A little fan Boy of @AlwaysRamCharan garu came to Hyderabad after hearing the news about the fans meet. He felt emotional after seeing him, charan garu enquired about his details & made arrangements to send him back safe.#ManOfMassesRamCharan #RamCharan pic.twitter.com/1EsiNpPa8g — SivaCherry (@sivacherry9) February 13, 2023 -
'వారిసు' చిత్ర వివాదం.. అభిమానులతో విజయ్ భేటీపై సర్వత్రా ఆసక్తి
తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన నేరుగా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకపోయినా ఆయన అభిమానులు కొందరు తమిళనాడులోని పలు నియోజకవర్గాల్లో ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇకపోతే విజయ్ తన అభిమానులను కనీసం ఏడాదికి ఒకసారైనా కలుస్తూ ఉంటారు. అలాంటిది కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన తన అభిమానులతో ప్రత్యేకంగా భేటీ కాలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం విజయ్ స్థానిక పనైయూర్‌లోని తన కార్యాలయంలో అభిమాన సంఘ నిర్వహకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కారణం విజయ్ తాజాగా నటిస్తున్న వారిసు చిత్ర తమిళం, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా అదే సందర్భంగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడే పరిస్థితి నెలకొనడంతో తెలుగు సినీ నిర్మాతల మండలి పండగ రోజుల్లో తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రకటనను ఇటీవల చేసింది. ఇది తమిళ చిత్రశ్రమంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ వంటి వారు తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నటుడు విజయ్ తన అభిమానులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏఏ విషయాలను గురించి చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వారిసు చిత్ర విడుదల వివాదం గురించి అభిమానులతో చర్చిస్తారా..? ఈ వ్యవహారంలో వారు ఎలా వ్యవహరించాలనే సూచనలు చేస్తారా? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, వారిసు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఆదివారం తన ట్విట్టర్లో స్పష్టం చేయడం గమనార్హం. -
డబుల్ ధమాకా
అభిమానులు తమ ఫేవరెట్ యాక్టర్స్‌ని స్క్రీన్‌పై తరచూ చూడాలనుకుంటారు. కానీ ఒక్కో సినిమాకు నాలుగైదు నెలలు గ్యాప్ వస్తుంది. కొన్ని సార్లు సంవత్సరం కూడా పట్టొచ్చు. ఒకే నెలలో రెండు సార్లు తమ అభిమాన యాక్టర్‌ను థియేటర్స్‌లో చూసే చాన్స్ వస్తే? అది ఖచ్చితంగా డబుల్ ధమాకానే. నయనతార తన అభిమానులకు ఒకే నెలలో కనిపించి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆగస్ట్ నెలలో రెండుసార్లు స్క్రీన్ పై కనిపించి అభిమానులను ఖుషీ చేయనున్నారామె. నయనతార ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు నెల్సన్ రూపొందించిన చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను ఆగస్ట్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అలాగే రాశీ ఖన్నా, అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న థ్రిల్లర్ మూవీ ‘ఇమైక్క నొడిగళ్’ని ఆగస్ట్ 24న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం అనౌన్స్ చేసింది. సో.. ఒకే నెలలో, అది కూడా పదిహేను రోజుల గ్యాప్‌లో రెండు సార్లు నయనతార కనిపించనున్నారన్నమాట. నయన ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. -
వస్తాను వస్తాను.. చెప్తాను చెప్తాను
రజనీ ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు! ఇది సినిమాల్లో. రజనీ వందసార్లు చెప్పినా ఒకే మాట చెబుతుంటే?! ఇది పాలిటిక్స్‌లో. ఇరవై ఏళ్లుగా ఆయన ఒకటే మాట చెబుతున్నారు. ‘వస్తాను.. వస్తాను’ అని. ఎప్పుడు వస్తారు? అని అడుగుతున్నా ఒకే మాట చెప్తున్నారు.. ‘చెప్తాను. చెప్తాను’ అని! చివరికి చెప్పారు.. డిసెంబర్ 31న అట! ఏంటి డిసెంబర్ 31న? రజనీ పాలిటిక్స్‌లోకి వస్తున్నారా? కాదు. ఎప్పుడు వచ్చేదీ ఆ రోజు చెప్తారట. అది కూడా కాదు. అసలు వచ్చేదీ లేనిదీ ఆ రోజు చెప్తారట. ఏదో ఒకటి చెప్పారులే సూపర్‌స్టార్ అని ఫ్యాన్స్ సర్దుకుపోయినా, వారిలో కొంతమంది ఇంకా సందేహంగానే ఉన్నారు. ఏదో ఒక డేట్ ఇచ్చి, ఆ డేట్‌కి ఇంకో డేట్ చెప్పి అప్పటి వరకు వెయిట్ చెయ్యమని చెప్పరు కదా అని వారి డౌట్. ఎవరెవరో ‘ఫట్’మని పాలిటిక్స్‌లోకి వచ్చి, ‘ఫట్’మని గెలిచి విక్టరీ సింబల్ చూపిస్తుంటే.. ‘బాషా’ మాత్రం మాణిక్యంలా ఉండిపోవడం తెలుగు ఫ్యాన్స్‌కి కూడా నచ్చడం లేదు. చూద్దాం.. రజనీ ఏం చెబుతారో? ఇంకో మూడు రోజులే కదా! -
యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాలి
సాక్షి, చెన్నై : తాను రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ వచ్చిన వార్తలపై సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం స్పందించారు. చెన్నైలో ఫ్యాన్స్ మీట్‌కు వచ్చిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంపై ఈ నెల 31న ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు జరగనున్న ఫ్యాన్స్ మీట్‌ను చెన్నైలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీ ప్రారంభించారు. ‘మీట్ అండ్ గ్రీట్’ పేరిట లాంచ్ అయిన ఈవెంట్ ఈ నెల 31 వరకూ కొనసాగనుంది. ఫ్యాన్స్ మీట్లో మాట్లాడిన రజనీ.. తనకు రాజకీయాలు కొత్త కాదని పేర్కొన్నారు. యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాలని అన్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. హీరో అయ్యానంటే తనకే ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. కెరీర్ తొలినాళ్లలో హీరోగా చేయాలంటే భయపడ్డానని వెల్లడించారు. తొలి సినిమా హిట్ తర్వాత హేళన చేసిన వారే తనను అభినందిచారని చెప్పారు. నటనలో తనను మరోస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మహేంద్రన్ అని వివరించారు. మరోవైపు రజనీ కచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని రిపోర్టులు వస్తున్నాయి. ఆయన సొంత పార్టీని స్థాపన చేస్తారని వాటి సారాంశం. కాగా, ఆరు రోజుల ఫ్యాన్స్ మీట్లో రోజుకు వెయ్యి మందిని రజనీకాంత్ కలుస్తారు. వారితో ఫొటో దిగనున్నారు. -
రొంబ సంతోషం... కండీషన్స్ అప్లై
ఇయర్ ఎండింగ్లో రజనీకాంత్ అభిమానుల మనసు ‘రొంబ సంతోషం’తో నిండిపోనుంది. అంతేకదా.. అభిమాన కథానాయకుణ్ణి కలిసే అవకాశం వస్తే... రొంబ సంతోషమే కదా. ఇంతకీ రొంబ అంటే ఏంటి? అంటే.. ‘చాలా’ అని అర్థం. ఈ ఏడాది మేలో రజనీ తన అభిమానులను కలసిన విషయం తెలిసిందే. మళ్లీ ‘ఫ్యాన్స్ మీట్’ ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి 31 వరకు ఫ్యాన్స్ మీట్‌ను కోడంబాక్కంలోని తన రాఘవేంద్ర మ్యారేజ్ హాల్లో అభిమానులను కలవనున్నారు. ప్రతి రోజు సుమారు వెయ్యి మంది అభిమానులను మీట్ అవుతారట. 26న కాంచీపురం, తిరువళ్లూర్, కృష్ణగిరి, ధర్మపురి, నీలగిరి ఫ్యాన్స్‌ని, 27న తిరువారూర్, నాగపట్టణం, పుదుకోటై్ట, రామనాథపురం అభిమానులను, 28న మధురై, నామక్కల్, సేలమ్ ఫ్యాన్స్‌ను, 29న కోయంబత్తూర్, ఈరోడ్, వెల్లూర్ ఫ్యాన్స్‌ను, నార్త్ మరియు సెంట్రల్ చెన్నై ఫ్యాన్స్‌ను 30న, సౌత్ చెన్నై ఫ్యాన్స్‌ను 31న కలవనున్నారు. అయితే కొన్ని కండీషన్స్ పెట్టారు. ఫ్యాన్స్ క్లబ్ నుంచి ముందుగానే ప్రతి అభిమాని తమ ఐడీ కార్డ్‌ను తీసుకోవాలి. కార్డ్ లేని వారిని లోపలకి అనుమతించరట. అలాగే, మద్యం సేవించిన వారికి ప్రవేశం లేదట. రజనీ దగ్గరగా వచ్చి కౌగిలించుకోవటం, కాళ్ల మీద పడటంలాంటివి చేయకూడదనే కొన్ని సూచనలూ అభిమానులకు జారీ చేశారని చెన్నై టాక్. ఈ మీట్లో అయినా రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఏదైనా ప్రకటిస్తారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
మళ్లీ ఫ్యాన్స్ మీట్.. ఆగస్ట్‌లో అనౌన్స్మెంట్?
‘‘ఆ దేవుడు ఆదేశిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు’... రజనీకాంత్ నటించిన ‘అరుణాచలం’లోని డైలాగ్ ఇది. ఇటీవల అభిమానులను కలిసినప్పుడు ఈ డైలాగ్‌ని మార్చి, వేరే రకంగా మాట్లాడారాయన. ‘మీరు రాజకీయాల్లోకి వస్తారా?’ అని అభిమానులు అడిగితే.. ‘ఒకవేళ అది దేవుడి నిర్ణయమైతే అదే జరుగుతుంది’ అన్నారు. ఉన్నట్టుండి అభిమానులను రజనీకాంత్ కలవడం, అది కూడా వరుసగా నాలుగు రోజులు వాళ్లని కలిసి, ఫొటోలు దిగడం చర్చనీయాంశమైన విషయం విదితమే. రజనీ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారని, అందుకే ఇలా ఫ్యాన్స్‌ని కలిశారని పలువురి నమ్మకం. ఆ నమ్మకం నిజమయ్యే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయని చెన్నై వర్గాలు అంటున్నాయి. మరోసారి రజనీ తన అభిమానులను కలవనున్నారట. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కాలా’ చిత్రం షూటింగ్ ఇటీవల ముంబైలో మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన నేపథ్యంలో రజనీ చెన్నై రిటర్న్ అయ్యారట. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనాలనుకుంటున్నారట. ఈ గ్యాప్‌లో మళ్లీ ‘ఫ్యాన్స్ మీట్’ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని భోగట్టా. ఈ ఏడాది ఆగస్ట్‌లో రజనీ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తారని కోడంబాక్కమ్ వర్గాలు అంటున్నాయి. -
'రజనీ.. మోదీ సేమ్ టు సేమ్'
రాజకీయాల్లో చేరే విషయమై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్.గురుమూర్తి స్వాగతించారు. బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే సూపర్‌స్టార్ ఆచితూచి మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలినాళ్లలో ప్రధాని మోదీ 'నేను తినను, ఎవరినీ తిననివ్వను' అని అవినీతి విషయంలో చెప్పారని, అచ్చం అలాగే ఇప్పుడు రజనీకాంత్ కూడా మాట్లాడుతున్నారని, వాళ్లిద్దరి మాటతీరు ఒకేలా ఉందని గురుమూర్తి అన్నారు. ''దేవును నన్ను ఇప్పుడు ఒక నటుడిగా ఉపయోగించుకుంటున్నాడు. కానీ, భవిష్యత్తు గురించినేను ఏమీ చెప్పలేను. నేను రాజకీయాల్లోకి చేరాలని దేవుడు నిర్ణయించుకుంటే, అప్పుడు నేను అలాగే చేస్తాను'' అని అభిమానులతో సమావేశం సందర్భంగా రజనీకాంత్ వ్యాఖ్యానించారు.''ఒకవేళ నేను రాజకీయాల్లో చేరాలని నిర్ణయించుకున్నా, తప్పుడు మనుషులు నాతో చేరడానికి ఒప్పుకోను. వాళ్లను దూరంగానే పెడతా'' అంటూ విలువలతో కూడిన రాజకీయాలే చేస్తానన్నారు. 21 ఏళ్ల క్రితమే తనకు రాజకీయాల్లో చేదు అనుభవం ఎదురైందంటూ అప్పట్లో డీఎంకే-టీఎంసీ కూటమికి మద్దతు ఇచ్చిన విషయాన్ని రజనీకాంత్ ప్రస్తావించారు. దాన్ని ఒక రాజకీయ ప్రమాదంగా రజనీ అభివర్ణించారు. ఈ విషయాన్ని కూడా గురుమూర్తి ప్రస్తావించారు. 1990ల తొలినాళ్లలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రజనీకాంత్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే, ఆ పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించడంతో దాన్నుంచి వైదొలగి డీఎంకే - తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి అండగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై వెళ్లినప్పుడు రజనీకాంత్‌ను కలిశారు. అయితే అది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని ఇద్దరూ స్పష్టం చేశారు. -
ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్..
చెన్నై: ఎనిమిదేళ్ల తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌ను కలవనున్నారు. ఇందుకు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపం వేదిక కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు రజనీకాంత్ ఫ్యాన్స్‌ను కలుస్తారు. చివరగా 2007లో శివాజీ సినిమా విడుదల తర్వాత రజనీ అభిమానులను కలుసుకున్నారు. ఈ మీట్లో విడిగా ఒక్కొక్కరితో రజనీ సెల్ఫీ దిగుతారు. అయితే, రజనీతో విడిగా మాట్లాడే అవకాశం మాత్రం లేదు. వాస్తవంగా ఏప్రిల్‌లోనే ఫ్యాన్స్ మీట్ జరగాల్సివుంది. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.