
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడంతో లాస్ ఎంజిల్స్‌లో ఉన్నారు. మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అమెరికా చేరుకున్న తారక్‌కు విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అభిమానులు నిర్వహించిన ఫ్యాన్స్ మీట్‌లో ఎన్టీఆర్ పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన వెంటనే వీడియో కాల్‌లో మాట్లాడి అతని కోరిక తీర్చారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా లాస్ ఎంజిల్స్‌లో అభిమానులతో కాసేపు సరదాగా గడిపారు. ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న వాళ్లందరితో ఫొటోలకు ఫోజులిచ్చాపు. ఈ కార్యక్రమంలో ఓ అభిమాని తారక్‌ను రిక్వెస్ట్ చేశాడు. మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టం అన్నా. ఒక్కసారి మాట్లాడతారా? అని అడిగిన వెంటనే ఓకే చెప్పారు. దీంతో ఆ అభిమాని తన తల్లికి వీడియో కాల్ చేయగా ఎన్టీఆర్ ఓ కుటుంబసభ్యుడిలా మాట్లాడారు. 'ఎలా ఉన్నారమ్మా. నేను బాగున్నాను. తప్పకుండా కలుద్దాం అమ్మా' అని అప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన జూనియర్ అభిమానులు ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.
Jr.NTR - Down To Earth Star ❤️❤️
— RVCJ Telugu (@rvcj_telugu) March 7, 2023
.#JrNTR #NTR #ManOfMassesNTR #NaatuNaatu #NTR30 #RvcjTelugu pic.twitter.com/pMkK91sTjF
Comments
Please login to add a commentAdd a comment