Jr NTR Emotional Words at Fans Meet in Los Angeles, USA - Sakshi
Sakshi News home page

Junior NTR: మరో జన్మంటూ ఉంటే మీ అభిమానం కోసమైనా పుడతా: ఎన్టీఆర్

Published Tue, Mar 7 2023 3:44 PM | Last Updated on Tue, Mar 7 2023 4:58 PM

Junior NTR Emotional At Fans Meet In Los Angeles In USA - Sakshi

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో సందడి చేస్తున్నారు. ఈనెల 12న జరగనున్న ప్రతిష్ఠాత్మక అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే లాస్ ఎంజిల్స్‌ చేరుకున్నారు. యూఎస్‌లో అడుగుపెట్టిన యంగ్ టైగర్‌కు అభిమానులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అమెరికా చేరుకున్న తారక్ అక్కడి ఫ్యాన్స్‌తో మీట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 

లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన ఫాన్స్ మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నా. మరో జన్మంటూ ఉంటే మీ అభిమానం కోసమైనా పుట్టాలని కోరుకుంటున్నా. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పది. అంతకంటే ప్రేమ నా లోపల ఉంది. నేను చూపించలేకపోతున్నా.' అంటూ ఎమోషనలయ్యారు. ఎన్టీఆర్‌ను కలిసిన ఫాన్స్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. తారక్ ఫాన్స్ మీట్‌కు వెళ్లేముందు ఎన్టీఆర్, పులి బొమ్మతో ఉన్న టీ షర్ట్‌ ఫోటోలో కనిపించాడు. తాజాగా ఎన్టీఆర్ ధరించిన ఆ టీ షర్ట్‌ ఫోటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. కాగా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈనెల 12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఎన్టీఆర్‌ పాల్గొననున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement