RRR Movie Re Releasing on US Theaters With Uncut Version on June 1st - Sakshi
Sakshi News home page

RRR Movie: అన్‌సీన్స్‌తో మళ్లీ థియేటర్లోకి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ!

Published Thu, May 19 2022 1:49 PM | Last Updated on Thu, May 19 2022 5:56 PM

RRR Movie Re Releasing On US Theaters With Uncut Version On June 1st - Sakshi

RRR Movie Re Releasing On Theaters With Uncut Version: జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎస్‌ఎస్‌ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ సినిమాను రూపొందించాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా కనిపించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది.

చదవండి: తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు

అయితే రిలీజ్‌ సమయంలో మూవీ నిడివిని తగ్గించేందుకు చిత్రం బృందం కొన్ని సన్నివేశాలను కట్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులో తారక్‌,చరణ్‌కు సంబంధించిన కొన్ని ఎలివేషన్‌ సీన్స్‌ కూడా పోయాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా తొలగించిన సన్నివేశాలను అలాగే ఉంచి మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తున్నారట. అయితే ఇది ఇక్కడ కాదు అమెరికాలో. 

చదవండి: గుడ్‌న్యూస్‌ అందించిన జీ5, ఫ్రీగా ఆర్‌ఆర్‌ఆర్‌ చూడొచ్చు!

జూన్‌ 1న దాదాపు 100 థియేటర్లలో ఈ సినిమాను  ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది.స్పెషల్‌ స్క్రీనింగ్‌ పేరుతో సినిమాలో తొలగించిన సన్నివేశాలను యథాతథంగా ఉంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం తెలిపింది. అయితే ఇది ఆ ఒక్క రోజు నైట్‌ షో మాత్రమే  ఉండనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ సెకండ్‌ రిలీజ్‌ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement