SS Rajamouli's RRR Movie Ready To Re Release Over 200 Theaters In US Ahead Of Oscar 2023 - Sakshi
Sakshi News home page

RRR Re Release: 200 థియేటర్లో రిరిలీజ్‌కు సిద్ధమైన ఆర్‌ఆర్‌ఆర్‌.. కొత్త ట్రైలర్‌ చూశారా?

Published Fri, Feb 24 2023 9:14 AM | Last Updated on Fri, Feb 24 2023 9:41 AM

RRR Movie Ready to Re Release Over 200 Theaters In US Before Oscar 2023 - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు చేరువలో ఉంది. హాలీవుడ్‌ దిగ్గజాలు జేమ్స్‌ కామెరూన్‌,  స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌తో పాటు ఇతర నటీనటులు ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసలు కురిపించారు. 

చదవండి: ఆ గుడ్‌న్యూస్‌ని ముందు తారక్‌తో పంచుకున్నా: రామ్‌ చరణ్‌

ఇందులోని నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌గా సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముందే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని మళ్లీ భారీ స్థాయిలో రిరిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఇది ఇండియాలో మాత్రం కాదు. అమెరికన్ థియేటర్లో.

చదవండి: కేరళ హైకోర్టులో మోహన్‌ లాల్‌కు చుక్కెదురు!

అక్కడ దాదాపు 200 థియేటర్లలో రిరిలీజ్‌ చేస్తున్నట్లు యూఎస్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ డిస్ట్రీబ్యూషన్‌ సంస్థ వేరియెన్స్‌ ఫిలింస్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కొత్త ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తూ ఈ ప్రకటన ఇచ్చింది. ఈ కొత్త ట్రైలర్‌లో పలు యాక్షన్‌ సీన్స్‌, నాటు నాటు పాటతో పాటు హాలీవుడ్‌ దిగ్గజాలు జేమ్స్‌ కామెరూన్‌, స్టీవెన్‌ స్పీల్‌బర్ట్‌ సహా అంతర్జాతీయంగా ఈ సినిమా అందుకున్న అన్ని ప్రశంసల క్లిప్పింగ్స్‌ జత చేసి రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం మార్చి 3న అమెరికాలో 200 థియేటర్లో రిరిలీజ్‌ కానుండటం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement