los angeles
-
నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను...మీరే అసలైన హీరోలు: ప్రియాంక
అమెరికాలోని లాస్ ఏంజలెస్ కార్చిచ్చు( Los Angeles Wildfire ) సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ బూడిద పాలయ్యాయి. మంటలు ఇంకా చల్లారలేదు. ఎటు చూసినా విధ్వంసమే. లాస్ ఏంజెలెస్‌లోనే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra ) నివాసముంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్చిచ్చు సంక్షోభంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మంటలకు ఆహుతైన భవనాలను, అడవి ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.‘హృదయం భారంగా ఉంది. నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటాను. స్నేహితులు, సహచరులు ఎంతోమంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ మంటల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారు. మీరే నిజమైన హీరోలు’ అని ప్రియాంక రాసుకొచ్చింది.ఇంటితో సహా సర్వం కోల్పోయిన వారికి అంత అండగా ఉండాలని, విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి మకాంబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని హాలీవుక్కి మకాం మార్చింది. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. ‘సిటాడెల్ సీజన్– 1’వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె ప్రస్తుతం సీజన్ 2లో బిజీగా ఉన్నారు.రాజమౌళీ- మహేశ్ సినిమాలో హీరోయిన్గా ప్రియాంకమహేశ్బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు మహేశ్‌బాబు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా ప్రియాంకా చోప్రా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. 2002లో తమిళ చిత్రం ‘తమిళన్’ హీరోయిన్గా పరిచమైన ప్రియాంక.. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయింది. రామ్‌చరణ్‌కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఆస్కార్ నామినేషన్స్ మరోసారి వాయిదా.. అదే కారణం!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రకృతి ప్రకోపానికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు కాలి బూడిదైపోయాయి. ఈ ఘటనతో ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియ వాయిదా పడింది.ప్రతి ఏడాది నామినేషన్స్ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు జరుగుతుంది. కార్చిచ్చు వల్ల జనవరి 17న ప్రకటించాల్సిన నామినేషన్స్‌ను వాయిదా వేశారు. ఈనెల 23న పూర్తి నామినేషన్స్ చిత్రాల జాబితా వెల్లడిస్తామని ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. మంటల వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ తెలిపారు.భారత్ నుంచి ఆరు చిత్రాలుకాగా.. ఈ ఏడాది భారత్ నుంచి ఆరు చిత్రాలు నామినేషన్ల బరిలో చోటు దక్కించుకున్నాయి. సూర్య హీరో నటించిన కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (మలయాళం), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), సంతోష్ (హిందీ), గర్ల్స్ విల్ బి గర్ల్స్( హిందీ, ఇంగ్లిష్) నామినేషన్స్ ప్రక్రియలో నిలిచాయి.బాక్సాఫీస్ వద్ద ఫెయిల్..సూర్య హీరోగా నటించిన కంగువాను శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీ 2025 ఆస్కార్ నామినేషన్స్‌లో పోటీ పడుతోంది. సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.పాయల్ కపాడియా మూవీకి చోటు..పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.ముంబయిలోని ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సాధించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్‌లోనూ పోటీలో నిలిచింది. త్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు.పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్..గతేడాది వచ్చిన హిట్ చిత్రాల్లో మలయాళ మూవీ ది గోట్ లైఫ్ కూడా ఒకటి. ఈమూవీ తెలుగులో ఆడుజీవితం పేరిట విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ డబ్బు సంపాదించేందుకు సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నింటినీ బెన్యమిన్ అనే రచయిత గోట్ లైఫ్ అనే నవలలో రాసుకొచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆడు జీవితం మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో పోటీ పడుతోంది. -
మళ్లీ విజృంభించనున్న కార్చిచ్చు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ అటవీ ప్రాంతాలను బూడిదచేస్తున్న కార్చిచ్చు మళ్లీ కన్నెర్రజేయనుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని దావాగ్నిని ఇప్పటిదాకా కేవలం 14 శాతం మాత్రమే అదుపులోకి తెచ్చిన నేపథ్యంలో వాతావరణ విభాగ నివేదికలు స్థానికుల్లో భయాందోళనలను మరింత పెంచాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీంతో అడవిలో కార్చిచ్చు మరింత విస్తరించే ప్రమాదముందని అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ సోమవారం ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వీయనున్న శాంటా అనా పెనుగాలులతో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం దాకా ‘రెడ్ ఫ్లాగ్’ వార్నింగ్ అమల్లో ఉంటుంది. మరోవైపు అటవీప్రాంతాల్లో అగ్నికీలల సంబంధ అగ్నిప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా 24కు పెరిగింది. ఇంకా డజన్ల మంది జాడ తెలియాల్సిఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఒక్క లాస్ ఏంజెలెస్ సిటీ, కౌంటీ పరిధుల్లో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకువెళ్లాలని సూచించగా, మిగతా చోట్ల కలిపి మరో 87,000 మందికి సురక్షిత స్థలాలకు వెళ్లాలని స్థానికయంత్రాంగం హెచ్చరికలుచేసింది. ఆరు చోట్ల కార్చిచ్చు వ్యాపించగా పసిఫిక్ పాలిసేడ్స్, ఏటోన్ ప్రాంతాల్లోని దావాగ్ని మాత్రమే ఇంకా అత్యంత ప్రమాదకరస్థాయిలో కొనసాగుతు న్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 60 శాతం విస్తీర్ణానికి సమానమైన అటవీభూములను పాలిసేడ్స్, ఏటోన్, హర్స్ట్ కార్చిచ్చులు బూడిదకుప్పలుగా మార్చేశాయి. మొత్తంగా అన్ని కార్చిచ్చుల కారణంగా 40,000కుపైగా ఎకరాల్లో అటవీప్రాంతం పూర్తిగా కాలిపోయింది. 12,000కు పైగా ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు తగలబడ్డాయి. అయితే దుప్పటిలా కమ్మేసిన పొగ, దుమ్ము చాలా వరకు తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు తెరిచారు.బాణాసంచా వల్లే: వాషింగ్టన్ పోస్ట్నూతన సంవత్సర వేడుకల్లో జనం కాల్చిన బాణాసంచా కారణంగానే పసిఫిక్ పాలిసేడ్స్‌లో అగ్గిరాజుకుందని వాషింగ్టన్ పోస్ట్ వార్తాసంస్థ ఒక కథనంలో పేర్కొంది. రేడియో సంప్రదింపులు, ఆ ప్రాంతంలో బాణాసంచా కాల్చడానికి ముందు, ఆ తర్వాత తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు, స్థానికుల ఇంటర్వ్యూలతో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తన కథనంలో పేర్కొంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ప్రదేశంలో అగ్గిరవ్వలు అడవిలో పడి దావాగ్ని మొదలైందని, అయితే వెంటనే దానిని ఆర్పేశారు. కానీ దావాగ్ని తాలూకు నిప్పుకణికలు కొన్ని అలాగే ఉండిపోయి భీకరగాలుల సాయంతో నెమ్మదిగా మళ్లీ దావాగ్నికి ఆజ్యంపోశాయని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత మంగళవారం తొలుత పసిఫిక్ పాలిసేడ్స్‌లో మంటలు అంటుకున్నప్పుడు స్థానికులు ఫిర్యాదుచేసినా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో మంటలు అదుపుతప్పి చివరకు లాస్ ఏంజెలెస్ చరిత్రలోనే మరో అతిపెద్ద దావాగ్నిలా ఎదిగాయని ఆరోపణలున్నాయి. ‘‘ ఆరోజు మేం వెంటనే ఫోన్లుచేశాం. కానీ లాస్ఏంజెలెస్ ఫైర్ డిపార్ట్మెంట్(ఎల్ఏఎఫ్డీ) నుంచి స్పందన రాలేదు. 45 నిమిషాలతర్వాత ఒక హెలికాప్టర్ వచ్చి నీళ్లు పోసి వెళ్లిపోయింది. మంటలు మాత్రం ఆరలేదు’’ అని స్థానికులు మైఖేల్ వాలంటైన్ దంపతులు చెప్పారు.ప్రైవేట్ నీటిట్యాంక్లకు గిరాకీతమ ప్రాంతంలో చెలరేగుతున్న మంటల నుంచి తమ ఇళ్లను కాపాడుకునేందుకు స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ నీటిట్యాంక్లకు గిరాకీ అమాంతం పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్ వాటర్‌ట్యాంక్ సంస్థలుచార్జీలు మోతమో గిస్తున్నాయి. లాస్ ఏంజెలెస్‌లోని సంపన్నులు ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది వచ్చేదాకా ఆగకుండా ప్రైవేట్ ఫైర్ఫైటర్లను రప్పిస్తున్నారు. అయితే ఆ సేవలందించే సంస్థలు గంటకు 2,000 డాలర్లు అంటే రూ.1,73,000 చార్జ్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు రిక్ కరుసో, కీత్ వాసర్మ్యాన్ సహా చాలా మంది ఇదే బాటపట్టారు. ‘‘ నా ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. సంస్థ మొదలైననాటి నుంచి హాలీవుడ్లో ఇంతస్థాయి డిమాండ్ ఎప్పుడూ లేదు’’ అని కవర్డ్6 ఫైర్‌ఫైటింగ్ సేవల సంస్థ యజమాని క్రిస్ డన్ చెప్పారు. ‘‘ నగరపాలకులను నమ్మలేమని ఈవారం ఘటనతో తేలిపోయింది. నా దగ్గర డబ్బుంది. అయితేమాత్రం ఏం లాభం. ఇళ్లు తగలబడ్డాయి’’ అని ఒక హాలీవుడ్ ప్రముఖుడు వాపోయాడు. -
అమెరికా కార్చిచ్చు పెద్ద కుట్ర..?
-
కనీవినీ ఎరగని కార్చిచ్చుతో అల్లాడిపోతోంటే... మారువేషాల్లో దారుణం!
లాస్ ఏంజిల్స్‌లో రగిలిన కార్చిచ్చు అమెరికాను అతలాకుతలం చేసింది. కనీవినీ ఎరుగని ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది కనిపించకుండాపోయారు. సుమారు 50వేల ఎకరాలు నాశనమైపోయాయి. 12వేల నిర్మాణాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు బాధితులను ఆదుకునేందుకు సోషల్ మీడియా యూజర్లు,ఇతర దాతలు విరాళాలకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంత జరుగుతుంటే..ఘోర విపత్తు మధ్య జనం అల్లాడి పోతుంటే.. కనీస మానవత్వం మరిచిన కేటుగాళ్లు తన వక్రబుద్ధి చూపించిన దారుణ ఘటనలు వార్తల్లో నిలిచాయి.ఘోరమైన మంటల మధ్య అగ్నిమాపక సిబ్బందిలా మారువేషంలో దోపీడీలకు తెగబడ్డారు కొంతమంది కేటుగాళ్లు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా, మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఆదివారం (జనవరి 12) కనీసం 29 మంది అరెస్టులు జరిగాయని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా ధృవీకరించారు. ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఒకరిని పట్టుకున్నట్టు చెప్పారు. 25 అరెస్టులు ఈటన్ ఫైర్ ప్రాంతంలో జరగగా, మరో నాలుగు పాలిసాడ్స్ ఫైర్ ప్రాంతానికి సమీపంలో జరిగాయి.20250112 LOS ANGELES COUNTY CAWildfiresLA County District Attorney Nathan Hochman- Looting, Arson and Use of Drones- Scams: Internet Fundraising, Price Gouging, Bogus Government Benefits pic.twitter.com/qabZDXLaHN— Robert Waloven (@comlabman) January 12, 2025ఇదీ చదవండి: లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!ఈ నేపథ్యంలో భద్రతరీత్యా దోపిడీని అరికట్టడానికి ప్రభావిత ప్రాంతాలకు 400 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. సోమవారం సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ వరకు అమలులో ఉంటుందని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ జిమ్ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న బ్రెంట్‌వుడ్‌లోని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం సమీపంలో కర్ఫ్యూ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం మరిన్ని అరెస్టులు జరిగాయని కూడా అధికారులు వెల్లడించారు. -
అయ్యో.. లాస్ ఏంజెలెస్! 24కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమై ప్రాంతంపై వరుసగా ఆరో రోజు కూడా దాని ప్రతాపం చూపించింది. దీనికారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కి చేరింది. మరో పాతిక మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ‘‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం’’ అని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు. కార్చిచ్చు(Wildfires)తో ఇటిప్పదాకా 24 మంది బలయ్యారు. పాలిసేడ్స్‌లో 8 మంది, ఎటోన్లో 16 మంది మరణించారు. చనిపోయినవాళ్లలో ‘కిడ్డీ కాపర్స్’ ఫేమ్ నటుడు రోరీ సైక్స్ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటిల్లిన నష్టం 150 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇప్పటివరకూ కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. ఇక.. పాలిసేడ్స్ ఫైర్‌ను 11శాతం, ఎటోన్ ఫైర్‌ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.మరోవైపు.. లాస్ ఏంజెలెస్ కౌంటీలో 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశించిట్లు తెలిపారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.సంబంధిత వార్త: ఎందుకీ కార్చిచ్చు!ఇక వినాశం(Disaster movies) ఆధారంగా సినిమాలు తీసే హాలీవుడ్లో.. మంటలతో అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు తారలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంటోనీ హోప్కిన్స్, పారిస్ హిల్టన్, మెల్ గిబ్సన్, బిల్లీ క్రిస్టల్ లాంటి తారల ఇళ్లు కార్చిచ్చు ధాటికి బూడిదయ్యాయి. ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియా కార్చిచ్చు రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల చేతగానితనమేనని కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విమర్శించగా.. డెమోక్రట్ సెనేట్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. అంతేకాదు.. లాస్ ఏంజెలెస్ పూర్తిగా నాశనం కావడంతో.. ‘‘లాస్ ఏంజెలెస్ 2.0’’ పేరిట పునర్మిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారాయన. మరోవైపు.. ఫెడరల్‌తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కార్చిచ్చు రాజుకోవడానికి గల కారణాలను పసిగట్టే పనిలో ఉన్నాయి. హాలీవుడ్ స్టార్ల నిర్వాకంతో..ఇదిలా ఉంటే.. మంటల్ని ఆర్పేందుకు నీటి కోరత అక్కడ ప్రధాన సమస్యగా మారింది. అయితే.. హాలీవుడ్ స్టార్ల నిర్వాకం వల్లే లాస్ ఏంజెలెస్‌కి ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో.. మంటలను చల్లార్చేందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొందరు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకున్నారంటూ డెయిలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది.నటి కిమ్ కర్దాషియన్ ది ఓక్స్లోని తన ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీటి కంటే అధికంగా నీటిని వాడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. సిల్వస్టర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి.. ప్రైవేటు ఫైర్ఫైటర్లను నియమించుకున్నారని డెయిలీ మెయిల్ పేర్కొంది. ఇక ప్రస్తుతం పసిఫిక్ పాలిసేడ్స్‌లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ, 20శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ చాలకపోవడంతో.. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: అందుకే కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగా: అనిత -
మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో రగిలిన కార్చిచ్చు ఇళ్లు, చెట్లు, పుట్టలను కబళిస్తూ విలయతాండవం చేస్తోంది. అత్యంత ఖరీదైన గృహాలు బూడిద కుప్పలుగా మారిపోతున్నాయి. మనుషులతోపాటు పక్షులు, జంతువులు మంటల్లో పడి కాలిపోతున్నాయి. కార్చిచ్చులో మృతుల సంఖ్య 16కు చేరుకున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఈటాన్ ఫైర్‌లో 11 మంది, పసిఫిక్ పాలిసేడ్స్ ఫైర్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అగ్నికీలలు ఇప్పటికిప్పుడు ఆరిపోయే పరిస్థితి లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కార్చిచ్చు మొదలైన తర్వాత కొందరు కనిపించకుండాపోయారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బూడిద కుప్పల్లో అన్వేషిస్తున్నారు. ఇందుకోసం జాగిలాల సాయం తీసుకుంటున్నారు. మరోవైపు అదృశ్యమైన తమవారి కోసం బాధితులు అధికారులను సంప్రదిస్తున్నారు. అధికారులు పాసాడెనాలో ఫ్యామిలీ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్చిచ్చును అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ మంటలు మరికొన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జె.పాల్ గెట్టీ మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వరకూ మంటలు చొచ్చుకొస్తున్నాయి. మంటలకు బలమైన ఈదురుగాలులు తోడవుతుండడంతో పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదని అధికారులు చెప్పారు. ఆర్నాల్డ్ స్వార్జినెగ్గర్తోపాటు హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే మాండివిల్లే కాన్యాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలపై హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నారు. దట్టమైన పొగ అలుముకోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. అధిక జనాభాతో కిక్కిరిసి ఉండే హలీవుడ్ హిల్స్, శాన్ ఫెర్నాండో వ్యాలీ వైపు మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 12 వేలకుపైగా ఇళ్లు దగ్ధం లాస్ ఏంజెలెస్‌లో 145 చదరపు కిలోమీటర్ల భూభాగం కార్చిచ్చు ప్రభావానికి గురయ్యింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణం కంటే అధికం. కార్చిచ్చు మంగళవారం తొలుత లాస్ఏంజెలెస్ ఉత్తర డౌన్టౌన్లో మొదలైంది. క్రమంగా విస్తరించింది. మరో నాలుగు చోట్ల కార్చిచ్చులు రగిలాయి. ఇప్పటిదాకా 12 వేలకుపైగా ఇళ్లు మంటల్లో కాలిపోయి బూడిదగా మారాయి. విలాసవంతమైన గృహాలు, అపార్టుమెంట్ భవనాలు, వ్యాపార కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి. వాటిలో విలువైన వస్తువులు, గృహోపకరణాలు అగ్నికీలల్లో మాడిపోయాయి. కార్చిచ్చుకు కచి్చతమైన కారణం ఏమిటన్నది ఇంకా ధ్రువీకరించలేదు. మొత్తానికి ఇది కనీవిని ఎరుగని భారీ నష్టమేనని చెప్పొచ్చు. ఇప్పటిదాకా 150 బిలియన్ డాలర్ల (రూ.12.92 లక్షల కోట్లు) మేర నష్టం వాటిలినట్లు అక్యూవెదర్ అనే ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది. బాధితుల కోసం షెల్టర్లు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ 1.50 లక్షల మందికి ఆదేశాలు జారీ చేశారు. నిరాశ్రయుల కోసం తొమ్మిది షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 700 మందికిపైగా బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. 1,354 ఫైర్ ఇంజన్లు, 84 హెలికాప్టర్లు నిర్విరామంగా పని చేస్తున్నారు. 14,000 వేల మంది అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్నారు.అందని నీళ్లు, నిధులు కార్చిచ్చు నష్టపోయినవారిని అదుకోవడానికి మానవతావాదులు ముందుకొస్తున్నారు. డొనేషన్ కేంద్రాల్లో విరాళాలు అందజేస్తుందన్నారు. బాధితులకు కొందరు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఆహారం సైతం అందిస్తున్నారు. దగ్ధమైన తమ ఇళ్లను చూసుకోవడానికి బాధితులు వస్తున్నారు. సర్వం కోల్పోయామంటూ బోరున విలపిస్తున్నారు. అయితే, కాలిపోయిన ఇళ్ల వద్దకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. శిథిలాల నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయని, అవి పీల్చడం ప్రాణాంతకమని చెబుతున్నారు. మరోవైపు మంటలు ఆర్పడానికి చాలినంత నీరు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. కొందరు సంపన్నులు విచ్చలవిడిగా నీరు వాడేశారని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 440 మిలి యన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. అగ్నిమాపక శాఖకు తగినన్ని నిధులు కూడా అందడం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంటలు ఎలా ఆర్పాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. -
ఎందుకీ కార్చిచ్చు?!
లాస్ ఏంజెలెస్‌కు కార్చిచ్చుకు కారణం ఏమిటన్నది చర్చనీయంగా మారింది. ఇలాంటి విపత్తులకు ప్రకృతి కంటే మానవ తప్పిదాలే ఎక్కువగా కారణమవుతుంటాయి. అడవుల్లో సాధారణంగా పిడుగుపాటు వల్ల కార్చిచ్చులు రగులుతుంటాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగినప్పుడు చెలరేగే మంటలూ కార్చిచ్చుగా మారుతుంటాయి. ఇవిగాక మనుషుల నిర్లక్ష్యం కూడా ఈ ఉత్పాతానికి దారితీస్తుంటుంది. కాల్చిపడేసిన సిగరెట్ సైతం పెనువిపత్తుగా మారొచ్చు. తాజాగా లాస్ ఏంజెలెస్‌ను బుగ్గిపాలు చేస్తున్న కార్చిచ్చు సైంటిస్టులనే నిర్ఘాంతపరుస్తోంది. మంటలు ఇంత వేగంగా వ్యాప్తించడం మునుపెప్పుడూ చూడలేదని అగ్నిమాపక అధికారులు అంటున్నారు. వాతావరణ పరిస్థితులూ ఇందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. లాస్ ఏంజెలెస్‌లో చాలా రోజులుగా వానలే లేవు. దాంతో చెట్లు చేమలతోపాటు కొండల దిగువ ప్రాంతాల్లో గడ్డి పూర్తిగా ఎండిపోయింది. కనుకనే మంటలు సులభంగా అంటుకుని వ్యాపించాయి. బలమైన ఈదురు గాలులతో పరిస్థితి మరింత విషమించింది. ఏటా ఇదే సీజన్లో ‘శాంటా అనా’ గాలులు వీస్తుంటాయి. వీటి వేగం గంటకు 129 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్నికి ఆజ్యంలా కార్చిచ్చుకు ఈ గాలులు జతకలిశాయి. వాటి ధాటికి విమానాలు, హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో ఆకాశం నుంచి నీరు, అగ్నిమాపక రసాయనాలు చల్లే వీల్లేకుండాపోయింది. దాంతో మంటలను అదుపులోకి తేవడం మరింత కష్టసాధ్యంగా మారింది. మానవ తప్పిదాలతో భారీ మూల్యం లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు వంటివాటి రూపంలో వాతావరణ మార్పుల దు్రష్పభావాన్ని స్పష్టంగా చూస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. ‘‘మానవ తప్పిదాల వల్ల మున్ముందు ఇలాంటి విపత్తుల ముప్పు మరింత పెరుగుతుంది. అవి వ్యాప్తి చెందే వేగమూ పెరుగుతుంది’’ అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టకపోతే ప్రకృతి విపత్తులు మరింతగా విరుచుకుపడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ‘‘కార్చిచ్చు అమెరికాకు పరిమితమైంది. కాదు. నేడు ప్రపంచమంతా ఈ ముప్పు ముంగిట ఉంది’’ అని తేల్చిచెబుతున్నారు. చిన్న మంటగా మొదలయ్యే కార్చిచ్చులు క్షణాల్లోనే విస్తరించి నియంత్రించలేని స్థాయికి చేరుకుంటాయి. మానవ కార్యకలాపాల పుణ్యమా అని విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. → లాస్ ఏంజెలెస్‌లో 2022, 2023లో వరుసగా రెండేళ్లు భారీగా వర్షాలు కురిశాయి. ఏకంగా 133 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చెట్లు బాగా పెరిగాయి. పచ్చదనం పరుచుకుంది. 2024లో పరిస్థితి ఒక్క సారిగా తారుమారైంది. వర్షాల్లేక కరువు తాండవించింది. చెట్లు ఎండిపోయాయి. దక్షిణ కాలిఫోర్నియా మొత్తం కరువు ఛాయలే! కార్చిచ్చు ఊహాతీత వేగంతో వ్యాపించడానికి ఇదే ప్రధాన కారణమని సైంటిస్టు మాట్ జోన్స్ విశ్లేషించారు. → కాలిఫోరి్నయా వంటి నగరాల్లో జనాభా అధికం. ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ఇ లాంటి నగరాల్లో నివసించడం క్షేమమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. → ఇటీవలి కాలంలో బీమా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. లాస్ ఏంజెలెస్, పరిసర నివాసాలకు బీమా రక్షణ కలి్పంచేందుకు కొంతకాలంగా నిరాకరిస్తూ వస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే భారీ మొత్తంలో బీమా సొమ్ము చెల్లించాల్సి ఉండటమే ఇందుకు కారణం. → లాస్ఏంజెలెస్లో ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించబోతున్నారు. అందుకు ప్రభుత్వం సాయం అందించబోతోంది. కార్చిచ్చులను దృష్టిలో పెట్టుకొని వాటి నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. -
'ఆ దేవుడి దయతో బతికిపోయాం'.. విషాదంపై హీరోయిన్ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా విచారం వ్యక్తం చేసింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని అన్నారు. మా పొరుగువారంతా ఇలా బాధపడతారని అనుకోలేదంటూ ట్వీట్ చేశారు ప్రీతి జింటా. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.ప్రీతి జింటా తన ట్వీట్లో రాస్తూ.' లాస్ ఎంజిల్స్‌లో మా చుట్టూ ఉన్న వారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయ బరువెక్కింది. అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి విషాదం సమయంలో మేమ సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ మంటల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తున్న అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి' అని పోస్ట్ చేశారు.కాగా.. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఇళ్లు మంటల్లో బూడిదయ్యాయి. ఈ మంటలు దాదాపు వెయ్యి ఎకరాలకు వ్యాపించాయి. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు లక్షకు పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషాద ఘటనలో దాదాపు 13 మంది మరణించగా.. 12,000 కంటే ఎక్కువ ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.కాగా.. నటి ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి అక్కడే నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్‌తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. తాజాగా అమెరికాలో వీరు నివసిస్తున్న లాస్ ఎంజిల్స్లోనే కార్చిచ్చు ఘటన జరగడంతో ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేస్తోంది.కాగా.. ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. I never thought I would live to see a day where fires would ravage neighbourhoods around us in La, friends & families either evacuated or put on high alert, ash descending from smoggy skies like snow & fear & uncertainty about what will happen if the wind does not calm down with…— Preity G Zinta (@realpreityzinta) January 11, 2025 -
దుమ్ము దుప్పట్లో విలాస నగరం
వాషింగ్టన్: ఆరు చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధూళి మేఘాలు, నిప్పుకణికల స్వైరవిహారంతో లాస్ ఏంజెలెస్ నగర కొండప్రాంతాలు నుసిబారిపోతున్నాయి. వేల ఎకరాల్లో అటవీప్రాంతాలను కాల్చి బూడిదచేసిన వేడిగాలులు అదే బూడిదను జనావాసాల పైకి ఎగదోస్తూ మిగతా పరిసరాలను దమ్ముకొట్టుకుపోయేలా చేస్తున్నాయి. పొగచూరిన వాతావరణంలో సరిగా శ్వాసించలేక లక్షలాది మంది స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో జనం బయట తిరగొద్దని, హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నామని స్థానిక యంత్రాంగం శనివారం ప్రకటించింది. 10,000 భవనాలను కూల్చేసి, 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఇంకా చల్లారకపోగా తూర్పు దిశగా దూసుకుపోతుండటంతో స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమైంది. ఇప్పటికే మూడు లక్షల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఆస్తి నష్టం లక్షల కోట్లను దాటి లాస్ఏంజెలెస్ నగర చరిత్రలోనే అత్యంత దారుణ దావాగ్ని ఘటనగా మిగిలిపోయింది. పర్వత సానువుల గుండా వేడి గాలుల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో మంటలు మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించవచ్చన్న భయాందోళనలు పొరుగు ప్రాంతాలైన ఎన్సినో, వెస్ట్ లాస్ఏంజెలెస్, బ్రెంట్వుడ్వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మంటలు ఆపేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందికి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఫైరింజన్లకు సరిపడా నీటి సౌకర్యాలు లేకపోవడంపై కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంటా యెంజ్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవడంపైనా ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్న మంటలకుతోడు కొత్తగా గ్రనడా హిల్స్‌లో అంటుకున్న అగ్గిరవ్వలు ‘ఆర్చర్ ఫైర్’గా విస్తరిస్తూ ఇప్పటికే 32 ఎకరాలను దహించివేసింది. ఈ ప్రాంతంలోనే ఎంటర్టైన్మెంట్ దిగ్గజ కిమ్ కర్దాషియాన్ సోదరీమణుల ఇళ్లు, డిస్నీ కార్పొరేట్ ఆఫీస్ ఉన్నాయి. కార్చిచ్చులో కళాకారుల కలల సౌధాలు: వెనుక కొండలు, ముందు వినీలాకాశం, కింద సముద్ర తీరంతో అద్భుతంగా కనిపించే లాస్ ఏంజెలెస్‌లో చాలా మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో ఇష్టంతో ఇళ్లు కొన్నారు. వాటిల్లో చాలా మటుకు ఇప్పుడు కాలిపోయాయి. 76 ఏళ్ల అమెరికన్ కమేడియన్ బిల్లీ క్రిస్టల్ 1979లో పసిఫిక్ పాలిసేడ్స్‌లో కొనుగోలుచేసిన విలాసవంత భవనం తాజా మంటల్లో కాలిబూడిదైంది. మ్యాడ్ మ్యాక్స్ స్టార్ మేల్ గిబ్సన్, మరో నటుడు జెఫ్ బ్రిడ్జెస్, సెలబ్రిటీ టెలివిజన్ పర్సనాలిటీ ప్యారిస్ హిల్టన్, ‘ప్రిన్సెస్ బ్రైడ్’నటుడు క్యారీ ఎల్వీస్, ప్రముఖ నటుడు మ్యాండీ మూర్, మీలో వెంటిమిగ్లియా, లీటన్ మీస్టర్, ఆడమ్ బ్రాడీ, ఆంటోనీ హాప్కిన్స్, జాన్ గుడ్మాయ్న్, మైల్స్ టెల్లర్, అన్నా ఫారిస్, పాలిసేడ్స్ గౌరవ మేయర్ ఎజీన్ లేవీ, క్రిస్సీ టీగెన్, జాన్ లెజెండ్, మార్క్ మరోన్, మార్క్ హామిల్ల ఇళ్లు సైతం మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. లిడియా, హర్స్ట్, ఆర్చర్, ఈటన్, కెన్నెత్, పాలిసేడ్స్ ఫైర్ దావాగ్నులు మొత్తంగా 37,579 ఎకరాల్లో విస్తరించాయి. -
California wildfires: కార్చిచ్చుతో రాజకీయం
అమెరికాలో కార్చిచ్చు.. రాజకీయ మలుపు తీసుకుంది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్(డెమోక్రటిక్) కారణంగానే మంటలు విస్తరించాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్. అయితే దీనికి గావిన్ కౌంటర్‌గా ఒక లేఖ విడుదల చేశారు.కాలిఫోర్నియా(California)లో మంటలు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాలంటూ డొనాల్డ్ ట్రంప్‌ను కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆహ్వానించారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితుల్ని పరామర్శించాలని కోరారు. అంతేకాదు.. ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దంటూ ట్రంప్‌కు చురకలంటించారు. గతంలో ఆరేళ్ల కిందట ట్రంప్(Trump) అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఈ తరహా ఘటన చోటు చేసుకుందని, ఆ టైంలో బాధితుల్ని ఆయన పరామర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పుడు కాలిఫోర్నియా కష్టంలో ఉంటే.. రాజకీయం చేయడం సరికాదన్నారు. కాలిఫోర్నియా కార్చిచ్చు తర్వాత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సత్వరమే స్పందించారని గవర్నర్ గావిన్ తెలిపారు.ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్ నుంచి వెళ్లిపోయే ముందు బైడెన్ తనకు మిగిల్చింది ఇదేనంటూ కాలిఫోర్నియా కార్చిచ్చును ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. మంటల్ని ఆర్పడంలో ఘోరంగా వైఫల్యం చెందారంటూ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు డెమోక్రట్లకు, రిపబ్లికన్లకు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మరోవైపు.. కెనడా(Canada)ను అమెరికా 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో తెలిసిందే. ఈ దరిమిలా.. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫోన్లో మాట్లాడారు. అనంతరం తన ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. ‘‘అమెరికా, కెనడా కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు.. అంతకు మించి. కష్టకాలంలో మేం స్నేహితులమనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు. I spoke with @GavinNewsom last night. We both know that Canada and the United States are more than just neighbours. We’re friends — especially when times get tough.California’s always had our back when we battle wildfires up north. Now, Canada’s got yours.— Justin Trudeau (@JustinTrudeau) January 10, 2025 -
హాలీవుడ్ హిల్స్ పైనా వేగంగా వ్యాపించిన అగ్ని కీలలు
-
10 వేల ఇళ్లు బుగ్గి
లాస్ ఏంజెలెస్: కార్చిచ్చుల ధాటికి అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం అగ్ని కీలలకు ఆహూతవుతోంది. ఏకంగా 10 వేల ఇళ్లు బూడిద కుప్పలుగా మారిపోయాయి. మృతుల సంఖ్య శుక్రవారం నాటికి పదికి చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కేవలం పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోనే 5 వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. లాస్ ఏంజెలెస్ చరిత్రలో ఈ స్థాయిలో కార్చిచ్చులు రగలడం ఇదే మొదటిసారి. కోస్తా తీర ప్రాంతంలో 70 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం మంటల్లో చిక్కుకుంది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ స్థానిక కాలమానం ప్రకారం గురువారం నాటికి 1.80 లక్షల మందికి ఆదేశాలు అందాయి. కలాబాసాస్, శాంటా మోనికా, వెస్ట్ హిల్స్ తదితర ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. హలీవుడ్ నటులు మార్క్ హమిల్, మాండీ మూర్, పారిస్ హిల్టన్ తదితరులు ఇప్పటికే లాస్ ఏంజెలెస్ విడిచి వెళ్లిపోయారు. లాస్ ఏంజెలెస్ కౌంటీలో మొత్తం 117 చదరపు కిలోమీటర్ల మేర భూభాగంలో మంటలు వ్యాపించాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణంతో సమానం. ఇక్కడ ఎవరైనా అణుబాంబు ప్రయోగించారా? అనే అనుమానం కలుగుతోందని కౌంటీ సీఈఓ రాబర్ట్ లూనా చెప్పారు. కార్చిచ్చును అదుపు చేయడానికి 7,500 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తగినన్ని నిధులు, వనరులు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్చిచ్చు కారణంగా 150 బిలియన్ డాలర్ల(రూ.12.92 లక్షల కోట్లు) మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఓ ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వ అధికారిక గణాంకాలు ఇంకా బహిర్గతం కాలేదు. రగిలిన మరో కార్చిచ్చు లాస్ ఏంజెలెస్ సమీపంలో తాజాగా మరో కార్చిచ్చు మొదలైంది. వెంచురా కైంటీ సమీపంలోని శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంటలు ప్రారంభమయ్యాయని స్థానిక అధికారులు చెప్పారు. కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తుండడంలో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, అరికట్టడం కష్టంగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉండగా, కార్చిచ్చు బాధితులను ఆదుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ‘ఫండ్ ఆఫ్ సపోర్ట్’కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు హాలీవుడ్ నటి జేమీ లీ కర్టీస్ చెప్పారు. దక్షిణాదిన వణికిస్తున్న మంచు తుపాను లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇళ్లను దహనం చేస్తుండగా, అమెరికా దక్షిణాది రాష్ట్రాలైన టెక్సాస్, ఒక్లహోమాలో మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోతుండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోతున్నాయి. సాధారణ జనజీనవం స్తంభిస్తోంది. స్థానిక గవర్నర్లు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పాఠశాలలు మూసివేశారు. చల్లటి గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. అర్కన్సాస్, టెక్సాస్, జార్జియా, టెన్నెస్సీ, దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాల్లోనూ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లూసియానా, మిసిసిపీ, అలబామా రాష్ట్రాల్లో మంచు తుపానుకు తోడు వర్షాలు కురుస్తున్నాయి. అమెరికాలో గురువారం 4,500కుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 2 వేల విమానాలు రద్దయ్యాయి. -
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ దావానలంలో చిక్కుకుని ఇప్పటి వరకూ ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 30వేల మందికిపైగా నిరాశ్రయులు కావడం ఆందోళన రేపుతోంది.పాలిసాడ్స్ అగ్నిప్రమాదం మాలిబు, శాంటా మోనికా మధ్య సముద్రతీర ప్రాంతాన్నిదహించివేస్తోంది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, మంటలు 17 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి. వీటిని అదుపు చేసే ఆశలు కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇదే అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదంగా భావిస్తున్నారు. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.ఈ నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. వీరిలో చాలామంది తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్లను వీడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా,అతని భార్య జాస్మిన్ లాస్ ఏంజిల్స్‌లో ఇరుక్కున్న్టటు వార్తలొచ్చాయి. దీనిపై స్వయంగా సిద్దార్థ స్పందించాడు. ప్రస్తుతానికి తాను, తన భార్య జాస్మిన్, పెట్స్ సురక్షితంగా ఉన్నామని తెలిపాడు. అంతే కాదు, సహాయం కావాల్సిన వారు, దయ చేసి తమను సంప్రదించాల్సిందిగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోరాడు. సహాయం అలాగే అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అటు జాస్మిన్ కూడా తన వంతుగా, విపత్తులో ప్రభావితమైన వారికి సహాయ సామగ్రి గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. (బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!)విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ , అతని భార్య జాస్మిన్ లండన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఈ జంట లాస్ ఏంజిల్స్‌లో వెకేషన్లో ఉన్నారు. ఈ సమయంలో పాలిసాడ్స్ అగ్నిప్రమాదం సంభవించిందిమరోవైపు ఈ ప్రమాదంలో ప్రియాంక చోప్రా ,నోరా ఫతేహి కూడా ప్రభావితమయ్యారు. ప్రియాంక పాలిసాడ్స్ అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.అలాగే నోరా ఫతేహి తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "నేను LAలో ఉన్నాను , ఫారెస్ట్ మంటలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఇలాంటిది ఇంతకుముందు చూడలేదు. ఐదు నిమిషాల క్రితం తరలింపు ఆర్డర్ వచ్చింది. కాబట్టి నేను త్వరగా నా సామాను అంతా సర్దుకుని ఇక్కడి నుండి ఖాళీ చేస్తున్నాను. నేను విమానాశ్రయం దగ్గరకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటా’’ అంటూ వెల్లడించింది.కాగా విజయ్ మాల్యా , అతని మొదటి భార్య సమీరా త్యాబ్జీ మాల్యా కుమారుడే సిద్ధార్థ. గత ఏడాది జూన్‌లో తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను పెళ్లాడాడు. విలాసవంతమైన హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ఎస్టేట్‌లో చాలా కొద్దిమంది హితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!) -
ఓ మై గాడ్.. అణు బాంబు పడిందా?
ఈ భూమ్మీద అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో అదొకటి. సినీ ప్రముఖులు, ధనవంతులకు నెలవుగా ఉండేదది. అలాంటి ప్రాంతం మరుభూమిగా మారింది. ఎటు చూసినా.. కార్చిచ్చు, దాని ధాటికి పూర్తిగా దగ్ధమై బూడిద మిగిలిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలగజేసిన కార్చిచ్చుగా ఇది మిగిలిపోనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు రూ.12లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మునుముందు ఇది ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన గృహాలు ఇక్కడ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటిదాకా 9,000 నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. ఒక్క ఫసిఫిక్ పాలిసాడ్స్‌లోనే 5,300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి. అంటోనీ హోప్కిన్స్, పారిస్హిల్టన్, బిల్లీ క్రిస్టల్ లాంటి ప్రముఖుల ఇళ్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా.. గురువారం మరోసారి మంటలు చెలరేగాయి. దీంతో నేషనల్ గార్డ్(National Guard)ను రంగంలోకి దించాల్సి వచ్చింది. కార్చిచ్చు తర్వాతి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇక్కడ అణు బాంబు పడిందా? అనే రీతిలో పరిస్థితి ఉందని లాస్ ఏంజెల్స్ కౌంటీ షరీ రాబర్ట్ లూనా అభిప్రాయపడ్డారు. శాటిలైట్ చిత్రాలు ఆ పరిస్థితిని తలపిస్తున్నాయన్నారు. తీవ్రమైన పెనుగాలుల కారణంగా మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికి తోడు సరిపడా నీరు లేకపోవడంతో మంటలను ఆర్పడం కష్టతరంగా మారుతోంది.పసిఫిక్ పాలిసాడ్స్‌లో 19 వేల ఎకరాలు, ఈటొన్ ఫైర్ 13,600 ఎకరాలు, అల్టాడెనాలో 13వేల ఎకరాలు,కెన్నెత్ 791 ఎకరాలు, సన్‌సెట్ 60 ఎకరాలు, హురస్ట్ 855 లో ఎకరాలు బూడిదయ్యాయి.ఇక ఆల్టడెనా ప్రాంతంలో 83 సంవత్సరాల వృద్ధుడు ఈ కార్చిచ్చులో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటిదాకా ఏడుగురు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. కార్చిచ్చు తీవ్ర దృష్ట్యా ఆ సంఖ్యే ఎక్కువే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కార్చిచ్చు ధాటికి మరోపక్క మూగజీవాలు మరణిస్తున్నాయి. ఇళ్లను ఖాళీ చేస్తూ వెళ్తున్న వాళ్లు.. తమ వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాకు చేరుతున్నాయి. The boy saved the rabbit from being burned in the fire #LosAngelesFire #CaliforniaWildfires #LosAngelesWildfires #California #LosAngeles #PalisadesFire pic.twitter.com/g9IAtyStGh— Sara 🇵🇸 (@saraanwar45) January 9, 2025దొంగతనాలు.. కర్ఫ్యూ విధింపువిలువైన వస్తువుల కంటే తమ ప్రాణాలు ముఖ్యమనుకుంటూ కట్టుబట్టలతో జనాలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. . అయితే.. ఇదే అదనుగా ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఆ ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నాయి. తాజాగా అక్కడి షరీఫ్ డిపార్ట్మెంట్ 20మంది లూటర్లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి పహారా కాస్తున్నారు. సంక్షోభ సమయంలో దోచుకుకోవాలనే ఆలోచనలు రావడం సిగ్గుచేటు అని అక్కడి పోలీస్ అధికారి ఒకరు ప్రకటించారు.ఇంకా ఎక్కువే..అక్యూవెదర్ అంచనాల ప్రకారం.. నష్టం 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12లక్షల కోట్లు)గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధి, ప్రముఖ సైంటిస్ట్ జోనాథన్ పోర్టర్ మాట్లాడుతూ.. కేవలం 24 గంటల్లోనే ఈ అంచనాలు మూడింతలు పెరిగాయన్నారు మరోవైపు అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బాధిత ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు.ఒకరి అరెస్ట్కార్చిచ్చు(Wildfires) ఎందుకు రాజుకుంది అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన అధికారుల నుంచి రాలేదు. అయితే.. ఉడ్‌లాండ్ హిల్స్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్నిత్ కార్చిచ్చును అంటించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. Photo Credits: MAXAR, Planet -
లాస్ ఏంజిల్స్ ను చుట్టుముట్టిన భయంకర కార్చిచ్చు
-
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్‌తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్‌లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను. చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.ప్రెస్ మీట్‌కు ముందే...మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. -
ఆరని అగ్నికీలలు
లాస్ ఏంజెలెస్: ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మలైన లాస్ ఏంజెలెస్ అటవీప్రాంతాలు ఇప్పుడు అగ్నికీలల్లో మాడి మసైపోతున్నాయి. వర్షాలు పడక ఎండిపోయిన అటవీప్రాంతంలో అంటుకున్న అగ్గిరవ్వ దావానంలా వ్యాపించి ఇప్పుడు వేల ఎకరాల్లో అడవిని కాల్చిబూడిద చేస్తోంది. పసిఫిక్ తీరప్రాంతం మొదలు పాసడేనా వరకు మొత్తం ఐదు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని రాజుకుని వేల ఎకరాలకు వేగంగా వ్యాపించి వందల ఇళ్లు, ఆఫీస్ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలను భస్మీపటం చేసింది. ఈ ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పసిఫిక్ పాలిసాడ్స్, అల్టాడేనా ప్రాంతాల్లో దావాగ్ని భీకరంగా ఎగసిపడుతూ 17,234 ఎకరాల అటవీప్రాంతాన్ని ఇప్పటికే కాల్చేసింది. ఈటన్ ప్రాంతంలో 10,600 ఎకరాలకుపైగా అటవీభూములు దగ్ధమయ్యాయి. హర్స్ట్ ప్రాంతంలో 855 ఎకరాలు, లిడియా ప్రాంతంలో 348 ఎకరాల మేర అడవి ఇప్పటికే అగ్నికి ఆహుతైంది. పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలోని మలీబూ తీరం వెంటే హాలీవుడ్ సినీ దిగ్గజాల విలాసవంత నివాసాలున్నాయి. ఇందులో ఇప్పటికే చాలామటుకు కాలిబూడిదయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్‌కు చెందిన ఇంటినీ కార్చిచ్చు దహించివేసింది. దావాగ్నిలో దహనమైన నివాసాల్లో చాలా మంది హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు ఉన్నాయి. లాస్ ఏంజెలెస్ చరిత్రలో ఎన్నడూలేనంతటి భీకర అగ్నిజ్వాలల ధాటికి 1,79,700 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికార యంత్రాంగం సూచించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాత్రిళ్లు లక్షలాది కుటుంబాలు అంధకారంలో గడిపాయి. దాదాపు 3,10,000 మంది కరెంట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. పెనుగాలులతో వినాశకర స్థాయిలో విజృంభిస్తున్న మంటలను అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. మంటలను అదుపుచేయడం మా వల్ల కాదని కొందరు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే చేతులెత్తేశారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఉన్న మంటలకు తోడు కొత్తగా బుధవారం సాయంత్రం హాలీవుడ్ హిల్స్‌లో కొత్తగా అగ్గిరాజుకుని స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సన్‌సెట్ ఫైర్‌గా పిలుస్తున్న ఈ దావాగ్ని మాత్రమే అత్యల్పంగా 43 ఎకరాలను దహించింది. టీసీఎల్ చైనీస్ థియేటర్ మొదలు ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఉన్న వీధులనూ అగ్నికీలలు ఆక్రమించాయి. ఎన్నో సినిమాల్లో కనిపించిన ఫేమస్ పాలిసాడ్స్ చార్టర్ హైస్కూల్ భవనం కాలిపోయింది. సన్‌సెట్ బోల్వార్డ్సహా ఎన్నో కొండ అంచు కాలనీల్లో ఖరీదైన ఇళ్లను మంటలు నేలమట్టంచేశాయి. ప్రముఖుల ఇళ్లు నేలమట్టం హాలీవుడ్ సినీరంగ ప్రముఖుల ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. మ్యాండీ మూర్, క్యారీ ఎల్విస్, ప్యారిస్ హిల్టన్, స్టీవెన్ స్పీల్బర్గ్, టామ్ హ్యాంక్స్, బెన్ ఎఫ్లేక్, ఆడమ్ శాండ్లర్, యూజిన్ లేవీ, బిల్లి క్రిస్టల్, జాన్ గుడ్మాన్, విల్ రోజరెస్, జేమ్స్ లీ కర్టిస్, జేమ్స్ ఉడ్స్ సహా చాలా మంది ప్రముఖుల ఇళ్లు తగలబడ్డాయి. ‘‘వీధుల్లో ఎక్కడ చూసినా కాలిన చెక్క ఇళ్ల చెత్తతో నిండిన స్విమ్మింగ్ ఫూల్స్ కనిపిస్తున్నాయి. యుద్ధంలో బాంబు దాడుల్లో దగ్దమైన జనావాసాల్లా ఉన్నాయి’’అని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశాయి. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో మే నెల నుంచి చూస్తే కేవలం 0.1 అంగుళాల వర్షపాతమే నమోదైంది. ఎండిపోయిన పర్వత సానువుల అడవీ ప్రాంతం గుండా గంటకు 80 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు ఈ మంటలను మరింత ఎగదోస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు పడకపోతే శీతాకాలమంతా దావానలం దారుణ పరిస్థితులను ఎదుర్కోక తప్పదని వెస్టర్న్ ఫైర్ చీఫ్ అసోసియేషన్ హెచ్చరించింది. పాసడీనా, పసిఫిక్ పాలిసాడ్స్‌లో భీకర మంటల భయంతో పలు హాలీవుడ్ స్టూడియోలు మూతపడ్డాయి. యూనివర్సల్ స్టూడియోస్ తమ థీమ్ పార్క్‌ను మూసేసింది. ‘‘ వింతవింత కుందేలు బొమ్మలతో బన్నీ హౌజ్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న మా మ్యూజియం బుగ్గిపాలైంది. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద బన్నీ భవనం నెలకొల్పడానికి మాకు 40 ఏళ్లు పట్టింది. అది ఇప్పుడు నిమిషాల్లో కాలిపోయింది’’ అని ఆల్టాడేనాలోని సీŠట్వ్ లుబాన్‌స్కీ, కాండేస్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కార్లు, వస్తువులకు ఏమాత్రం ఇన్సూరెన్స్ వస్తుందోనని చాలా మంది దిగాలుగా కనిపించారు.ఆస్కార్‌కూ సెగ కార్చిచ్చు సెగ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులనూ తాకింది. దీంతో అకాడమీలో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. వాస్తవానికి బుధవారం నుంచి 14వ తేదీదాకా నామినేషన్ ప్రక్రియ కొనసాగాలి. అగ్నికీలలు వ్యాపించడంతో ఓటింగ్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 17వ తేదీన ప్రకటించాల్సిన ఆస్కార్ నామినేషన్లను జనవరి 19కు వాయిదా వేశారు.చేతివాటం చూపిన దొంగలు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఇళ్లు వదిలిపోతుండటంతో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దగ్ధ్దమవుతున్న ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. ఇలా లూటీ చేస్తున్న 20 మందిని అరెస్ట్‌చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్చిచ్చు ఘటనల్లో ఇప్పటిదాకా 4 లక్షల కోట్ల రూపాయల సంపద అగ్నికి ఆహుతైందని బైడెన్ సర్కార్ ప్రాథమిక అంచనావేసింది. తన చిట్టచివరి అధికారిక పర్యటనలో భాగంగా ఇటలీకి వెళ్దామనుకున్న బైడెన్ ఈ అనూహ్య ఘటనతో పర్యటనను అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. మరోవైపు కార్చిచ్చు ఉదంతంలో సరిగా స్పందించని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్న అగ్నికీలలు ప్రైవేట్ శాటిలైట్ ఛాయాచిత్రాల సేవలందించే మ్యాక్సర్ టెక్నాలజీస్ తదితర ఉపగ్రహ సేవా సంస్థలు తీసిన ఫొటోలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఫొటోల్లో.. కాలిఫోర్నియాలోని మాలిబు తీరపట్టణ ప్రాంత శాటిలైట్ ఫొటోల్లో ఇప్పుడంతా కాలిబూడిదైన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఆకాశమంతా దట్టంగా కమ్ముకున్న పొగలతో నిండిపోయింది. ఈస్ట్ ఆల్టాడీనా డ్రైవ్ ప్రాంతమంతా బూడిదతో నిండిపోయింది. శక్తివంతమైన శాంటా ఆనా వేడి పవనాలు తూర్పులోని ఎడారి గాలిని తీరప్రాంత పర్వతాలపైకి ఎగదోస్తూ మంటలను మరింత ప్రజ్వరిల్లేలా చేస్తున్నాయి. ఉచితాలు.. సాయాలు సర్వం కోల్పోయిన స్థానికులను ఆదుకునేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్కువ ధరకే వాహనాల్లో రైడ్ అందిస్తామని ఉబర్, లిఫ్ట్ సంస్థలు తెలిపాయి. ఉచితంగా స్నానాల గదులు, లాకర్ రూమ్, వై–ఫై సౌకర్యాలు అందిస్తామని ప్లానెట్ ఫిట్నెస్ తెలిపింది. తమ గదుల్లో ఉచితంగా ఉండొచ్చని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. హోటళ్లలో డిస్కౌంట్‌కే గదులిస్తామని విసిట్ అనహీమ్ వెల్లడించింది. అపరిమిత డేటా, కాల్, టెక్సŠస్ట్ ఆఫర్ ఉచితంగా ఇస్తామని ఏటీ అండ్ టీ, వెరిజాన్ సంస్థలు ప్రకటించాయి. -
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలలోని అడవుల్లో కార్చిచ్చు చల్లారడంలేదు. ఈ కార్చిచ్చుకు ప్రభావితమైన పదివేల మందిలో నటులు, సంగీతకారులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. పాలిసాడ్స్, ఈటన్ తదితర ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటంతో అటవీ మంటలు అదుపులోనికి రావడంలేదు. గడచిన 24 గంటల్లో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుండి 70 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఇళ్లను విడిచిపెట్టిన పదివేల మంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కాలిఫోర్నియా(California) ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు.అలాగే అనుభవం ఉన్న రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బందిని సహాయం కోసం పిలిపించారు. కాలిఫోర్నియా నగరం చుట్టూ చెలరేగిన మంటల కారణంగా వెయ్యికిపైగా భవనాలు కాలిబూడిదయ్యాయి. పదివేల మంది తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అటవీ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశాన్నంతా కమ్మేసింది. పరిస్థితిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.వందల మీటర్ల మేర ఎగిరిపడుతున్న నిప్పురవ్వలుహాలీవుడ్ ప్రముఖులు అమితంగా ఇష్టపడే కాలిఫోర్నియాలోని రియల్ ఎస్టేట్ నేలమట్టమయ్యింది. బలమైన గాలులు మంటలను మరింతగా వ్యాపింపజేశాయి. వందల మీటర్ల మేరకు నిప్పురవ్వలు ఎగిరి పడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంథోనీ మర్రోన్ తెలిపిన వివరాల ప్రకారం మంటలు విస్తరిస్తున్న తీరు అగ్నిమాపక సిబ్బంది(Firefighters)కే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినప్పటికీ సిబ్బంది ఏమాత్రం వెనక్కి తగ్గక అగ్నికీలలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.చుట్టుపక్కల ప్రాంతాలకు అగ్నికీలలుపసిఫిక్ పాలిసాడ్స్‌లో చెలరేగిన మంటలు బుధవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 16 వేల ఎకరాలను దగ్ధం చేశాయి. వెయ్యి ఇళ్లు , వ్యాపార స్థలాలు నాశనమయ్యాయి. నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడెనా సమీపంలోని 10,600 ఎకరాల అడవులు తగలబడిపోతున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదాల్లో తొలుత ఇద్దరు మరణించారని, మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సురక్షిత ప్రాంతాలకు నటులుహాలీవుడ్ ఈవెంట్లలో నిత్యం కళకళలాడే లాస్ ఏంజిల్స్(Los Angeles) లో పమేలా ఆండర్సన్ సినిమా ప్రీమియర్‌తో పాటు పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. ప్రముఖ గాయని, నటి మాండీ మూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో చాట్ చేస్తూ అల్టాడెనాలో వ్యాపిస్తున్న మంటలను చూసి తాను తన పిల్లలు, పెంపుడు జంతువులతో పాటు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లానని తెలిపారు. ఎమ్మీ విజేత, నటుడు జేమ్స్ వుడ్స్ తన ఇంటి సమీపంలోని చెట్లు దహనవడాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా చూపించారు. తాను తన ఇంటిని ఖాళీ చేశానని తెలిపారు.ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణ వాయిదా‘స్టార్ వార్స్’ స్టార్ మార్క్ హామిల్ తన ఇంటిని మంటలు చుట్టుముట్టే పరిస్థితులు ఉండటంతో తన భార్య, పెంపుడు కుక్కతోపాటు సురక్షిత ప్రాంతానికి వెళ్లానని తెలిపారు. ఆస్కార్ విజేత జామీ లీ కర్టిస్ కూడా అయిష్టంగా తన ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. కాగా అగ్నిప్రమాదాల బారిన పడిన అకాడమీ సభ్యులు తమ బ్యాలెట్లను వేయడానికి మరింత సమయం ఇచ్చారు. ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను జనవరి 19కి వాయిదా వేశారు.ఇది కూడా చదవండి: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు -
కార్చిచ్చు గుప్పిట్లో లాస్ ఏంజెలెస్
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో కార్చిచ్చు రగలింది. వేగంగా విరుచుకుపడిన దావానలం ధాటికి వందలాది నివాస గృహాలు కాలి బూడిదయ్యాయి. ఇద్దరు మృత్యువాత పడ్డారు. నాలుగు వైపుల నుంచి మంటలు దూసుకొస్తున్నాయి. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం లాస్‌ఏంజెలెస్‌కు ఈశాన్య ప్రాంతంలోని ఇన్లాండ్ ఫూట్హిల్స్లో ఉన్న చిట్టడవిలో మంటలు చెలరేగాయి. క్రమంగా నగరం వైపు దూసుకొచ్చాయి. బలమైన ఈదురు గాలులు వీచడంతో మంటల తీవ్రత మరింత పెరిగినట్లు తెలిసింది. బుధవారం ఉదయం కల్లా పరిస్థితి విషమించింది. మరికొన్ని ప్రాంతాల నుంచి మంటలు వ్యాప్తి చెందాయి. సముద్ర తీరం వెంబడి హాలీవుడ్ నటులు, సంపన్నులు నివాసం ఉండే పసిఫిక్ పాలీసేడ్స్ ఏరియాలోనూ మంటలు వ్యాపించాయి. ఈటాన్ కెన్యాన్ సమీపంలోని అల్టాడెనా, సిల్మార్ సబర్బ్ వరకు విస్తరించాయి. మొత్తానికి లాస్ఏంజెలెస్ సిటీని మంటలు చుట్టుముట్టాయి. 5,700 ఎకరాలకుపైగా భూమిపై కార్చిచ్చు ప్రభావం ఉండడం గమనార్హం. 1,400 మంది అగి్నమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆరి్పవేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసుపత్రుల్లోని రోగులను బయటకు తరలించారు. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్ద సంఖ్యలో చెట్లు అగి్నకి ఆహుతయ్యాయి. మరోవైపు జనమంతా ఒక్కసారిగా బయటకు రావడంతో రోడ్లపై రాకపోకలు స్తంభించాయి. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్స్‌లకు దారి లేకపోవడంతో బుల్డోజర్ల సాయంతో కార్లను పక్కకు తప్పించారు. గంటకు 97 కిలోమీటర్ల వేగంతో మంటలు వ్యాపించడం గమనార్హం. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని అగ్ని మాపక సిబ్బంది చెప్పారు. కొండల దిగువ ప్రాంతాల్లో మంటలు మరింత చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చాలారోజులుగా వర్షాలు పడకపోవడంతో గడ్డి, చెట్లు ఎండిపోయాయి. దాంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. లాస్ ఏంజెలెస్ కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అందోళన వ్యక్తంచేశారు. ఇన్లాండ్ రివర్సైడ్ కౌంటీ పర్యటనను రద్దు చేసుకొని, కార్చిచ్చుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆయన లాస్ ఏంజెలెస్‌లోని ఓ హోటల్లో మకాం వేశారు. హోటల్ గది నుంచి పొగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కార్చిచ్చు వల్ల ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. 13 వేలకుపైగా నివాసాలకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు అందాయి. కాలిఫోరి్నయా గవర్నర్ గవిన్ న్యూసమ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కార్చిచ్చును స్వయంగా పరిశీలించారు. చాలా ఇళ్లు దహనమయ్యాయని ప్రకటించారు. హాలీవుడ్ థీమ్ పార్క్, యూనివర్సల్ సిటీవాక్ను మూసివేసినట్లు యూనివర్సల్ స్టూడియో ప్రకటించింది. మంటల్లో చార్టర్ హైసూ్కల్ లాస్ ఏంజెలెస్‌లోని పసిఫిక్ పాలీసేడ్స్ ప్రాంతంలోని ప్రఖ్యాత చార్టర్ హైసూ్కల్ వరకు మంటలు వ్యాపించాయి. ధనవంతుల బిడ్డలు ఈ పాఠశాలలో విద్య అభ్యసిస్తుంటారు. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ ఈ స్కూల్‌ను చూడొచ్చు. కార్చిచ్చు కారణంగా పాఠశాలల్లో కొంత భాగానికి మంటలు అంటుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ సమయంలో స్కూల్లో కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. మంటలు వ్యాపించగానే వారిని బయటకు పంపించారు. స్కూల్‌ను వెంటనే మూసివేశారు. ఇటువైపు రావొద్దని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సూచించింది. ఇక్కడ క్రీడాపరికరాలు, బోధనా పరికరాలు కాలిపోయాయి. చార్టర్ హైసూ్కల్‌కు సమీపంలోనే ఉన్న పాలీసేడ్స్ చార్టర్ ఎలిమెంటరీ స్కూల్ సైతం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. లాస్ ఏంజెలెస్‌కు శివారు లాంటి పసిఫిక్ పాలీసేడ్స్ ప్రాంతంలో టామ్ హాంక్స్, జెన్నీఫర్ అనిస్టన్ వంటి హాలీవుడ్ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. లాస్ఏంజెలెస్ సిటీ కాలిఫోరి్నయా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ప్రతిఏటా జనవరిలో బలమైన ఈదురు గాలులు వీస్తుంటాయి. ఆగి్నకి ఆజ్యం తోడైనట్లు ఈ గాలులకు నిప్పు తోడైతే కార్చిచ్చుగా మారుతూ ఉంటుంది. కళ్ల ముందే విధ్వంసం లాస్ ఏంజెలెస్‌లో మంటల ధాటికి నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు కుప్పకూలాయి. కళ్ల ముందే జరుగుతున్న విధ్వంసాన్ని చూసి జనం భయంతో వణికిపోయారు. ప్రాణాలు దక్కించుకొనేందుకు పరుగులు తీశారు. తరుముకొస్తున్న మంటల నుంచి తప్పించుకోవడానికి కాలినడకనే ముందుకు కదిలారు. ఇళ్లలో ఉన్న కార్లు బయటకు తీసే వీల్లేకుండాపోయిందని బాధితులు చెప్పారు. చేతికందిన వస్తువులు తీసుకొని బయటకు వచ్చామని అన్నారు. వందలాది కార్లకు నిప్పంటుకుంది. అవి బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఇళ్లలోని పెంపుడు జంతువులు సైతం మరణించాయి. దట్టమైన పొగ అలుముకుంది. లాస్ ఏంజెలెస్‌లో గవర్నర్ గవిన్‌న్యూసమ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంటలను అదుపు చేయడానికి అగి్నమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అగ్ని మాపక యంత్రాలు, సిబ్బందిని రప్పిస్తున్నారు. -
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ... భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, ప్రతి ఏటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నాట్స్ లాస్ ఏంజెల్స్ బాలల సంబరాలు అత్యంత వైభవంగా అందరిని ఆకట్టుకునేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, హాస్య నాటికలు, ఫాన్సీ డ్రెస్ ప్రదర్శన, ఫ్యాషన్ షో, మాథమాటిక్స్ అండ్ చెస్ పోటీలు ఘనంగా జరిగాయి.అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన ఈ సంబరాలలో దాదాపు 900 మందికిపైగా తెలుగు వారు ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఈ బాలల సంబరాల్లో 300 మందికి పైగా చిన్నారులు సంప్రదాయ, జానపద, చలనచిత్ర నృత్యాల ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసారు. ఆద్యంతం ఆహ్లదభరితంగా సాగిన ఈ ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. బాలల సంబరాల్లో ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల దుస్తులు ధరించిన పిల్లలతో సాగిన ప్రదర్శన కన్నులపండుగగా ఆద్యంతం సాగింది. అదేవిధంగా ఫాన్సీ డ్రెస్ షో కూడా వివిధ ప్రముఖ పాత్రలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాట్స్ బాలల సంబరాలకు రాజ్యలక్ష్మి చిలుకూరి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఈ సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బాలల సంబరాల్లో భాగంగా ఫ్యాషన్‌తో, విద్య, సాంస్కృతిక అంశాల్లో వివిధ పోటీల్లో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. చదరంగం, గణిత పోటీలు విద్యార్ధుల్లో నైపుణ్యాలను వెలికి తీసి వారిని ప్రోత్సహించడమే నాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం.ఈ బాలల సంబరాల్లో భాగంగా గురు కృష్ణ కొంకా అండ్ రావిలిశెట్టి వెంకట నరసింహారావు లకు వారి సామాజిక , నాట్స్ సేవలను గుర్తించి కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్ తో పాటు సన్మాన పత్రాలు నాట్స్ బోర్డ్ గౌరవ సభ్యులు రవి ఆలపాటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మధు బోడపాటి, నాట్స్ కార్యక్రమాల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చిలుకూరితో వారికి సన్మానం చేశారు. లాస్ ఏంజిల్స్‌లో బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మల్లిన, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్స్ కిషోర్ గరికపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహార్, మెంటర్స్ హరి కొంక, వెంకట్ ఆలపాటి తదితరుల సహకారంతో ఈ బాలల సంబరాలు విజయవంతంగా జరిగాయి.బాలల సంబరాల నిర్వహణలో విశేష కృషి చేసిన లాస్ ఏంజిల్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళి ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, నాట్స్ టీం సభ్యులు గురు కొంక, శ్రీనివాస్ మునగాల, సిద్ధార్థ కోలా, అరుణ బోయినేని, శంకర్ సింగంశెట్టి, శ్రీపాల్ రెడ్డి, చంద్ర మోహన్ కుంటుమళ్ల, ముకుంద్ పరుచూరి, సరోజ అల్లూరి, పద్మ గుడ్ల, రేఖ బండారి, లత మునగాల, నరసింహారావు రవిలిశెట్టి, సుధీర్ కోట, శ్యామల చెరువు, మాలతి, నాగ జ్యోతి ముద్దన, హారిక కొల్లా, అనూష సిల్లా, హర్షవర్ధన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ ఆలపాటి, చంద్రర్క్ ముద్దనతో పాటు ఇతర వాలంటీర్లను నాట్స్ జాతీయ నాయకత్వం అభినందించింది. బాలల సంబరాలకు రుచికరమైన ఆహారాన్ని విష్ణు క్యాటరింగ్ గ్రూపుకు చెందిన రామ్ కడియాలను నాట్స్ అభినందించింది . సంబరాల ముగింపులో సాంస్కృతిక మహోత్సవం అందరికి సంతోషాలను, మధురానుభూతులను పంచింది.(చదవండి: ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన) -
Mystery: ఓ సరదా.. రెండు జీవితాలు..
అది 1983 జూలై 24, అమెరికా, లాస్ఏంజెలెస్ శివార్లలో డంప్‌యార్డ్‌లో అదే ఏడాదికి చెందిన ఒక డైరీ చెత్తకుప్పలో తెరిచినట్లుగా పడుంది. దానిలోని పేజీలు గాలికి రెపరెపలాడుతున్నాయి. అటుగా వచ్చిన అటెండెంట్ అప్రయత్నంగా ఆ డైరీ తీసి, పేజీలు తిప్పుతుంటే, అతడి చూపు ఒక వాక్యం దగ్గర ఆగిపోయింది. ‘ఈ అమెరికన్స్ సహృదయులు. వీరి మనసులు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి’ అనే లైన్ చదివి అతడు గర్వంగా నవ్వుకున్నాడు. ఆ డైరీలోని రాతలు జూలై 21తో ఆగిపోయాయి. వెంటనే అతడు తలెత్తి చుట్టూ చూశాడు. అప్పుడే కాస్త దూరంలో చెత్తకుప్పల మధ్య ఒక హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. దానిలో రెండు పాస్‌పోర్టులు, అంతకుముందు ట్రావెల్ చేసిన కొన్ని టికెట్స్ ఉన్నాయి. ఒక పాస్‌పోర్ట్, డైరీ రాసిన మారియా వాహిన్స్ అనే 25 ఏళ్ల అమ్మాయిది, రెండవ పాస్‌పోర్ట్ ఆమె స్నేహితురాలు మేరీ లిలియన్బర్(23)ది. ఇద్దరూ స్వీడిష్ యువతులే! ‘పొరబాటున వారెక్కడో వీటిని పారేసుకుంటే, ఇక్కడికి చేరి ఉంటాయి’ అని భావించిన ఆ అటెండెంట్ వాటిని పోలీసులకు ఇచ్చి, ఆ అమ్మాయిలకు అందించాలని కోరాడు.అయితే పదిరోజులు గడిచేసరికి మేరీ, మారియాలు ఏమయ్యారో తెలియడంలేదని స్వీడన్స్ నుంచి వారి పేరెంట్స్ అమెరికాకి వచ్చి, కాలిఫోర్నియా అధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో, పత్రికలు మొదటిపేజీ వార్తకు సిద్ధమయ్యాయి. అప్పటికే వారి వివరాలు రికార్డ్స్‌లో ఉండటంతో విచారణను డంప్‌యార్డ్ నుంచి మొదలుపెట్టారు.స్వీడన్ నుంచి వచ్చిన మేరీ, మారియా.. కొలరాడో, వైల్లోని ఒక రిసార్ట్ హోటల్లో చాంబర్ మెయిడ్స్‌గా పని చేసేవారు. ఒకే దేశానికి చెందినవారు కావడంతో స్నేహితులుగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. వారి స్నేహం ఇరు కుటుంబాలకు.. ఒకరికొకరు ఉన్నారన్న ధైర్యానిచ్చేది. అయితే వారిద్దరికీ పర్యాటకంపై ఆసక్తి ఉండటంతో, వారిలో హిచ్ హైకింగ్ (అపరిచితులను లిఫ్ట్ అడుగుతూ, పలు ప్రాంతాలను సందర్శించడం) చేయాలనే ఆశ మొదలైంది. హిచ్ హైకింగ్‌తో కాలిఫోర్నియా మొత్తం తిరగాలని ఇద్దరూ ప్లాన్స్ చేసుకున్నారు. పర్వతాలు, అడవులు ఉండే చోట హిచ్ హైక్ చేయడం అమ్మాయిలకు అసలు సురక్షితం కాదని తోటి స్వీడిష్ స్నేహితులతో పాటు పలువురు అమెరికన్లు కూడా వారిని హెచ్చరించారు. లాంటి ప్రమాదాన్నైనా, ఎవరి మోసాన్నైనా ముందే గ్రహించే శక్తి, తెలివి తమకున్నాయని వారు సమాధానమిచ్చేవారు. ఆత్మరక్షణ కోసం కత్తి కూడా ఉందని తీసి చూపించేవారు. అలాంటి ట్రిప్స్‌కి పోవద్దని మేరీని ఆమె తండ్రి ఓవ్ ఫోన్స్ లో బతిమాలాడు. ‘ఈ ఒక్క సారికే’నని మేరీ మాటివ్వడంతో ఓవ్ ఒప్పుకున్నాడు. జూలై 12 నుంచి వారి ట్రిప్ మొదలైంది.పోలీసుల విచారణకు మారియా డైరీ చాలా ఉపయోగపడింది. ఏరోజు ఎక్కడ తిరిగారో డైరీలో పరిశీలిస్తూ, చాలామంది డ్రైవర్స్‌ని అధికారులు ప్రశ్నించారు. వారిలో కొందరు మేరీ, మారియాల ఫొటోలు చూసి గుర్తుపట్టారు. మార్క్ అనే ఒక ట్రక్ డ్రైవర్.. ‘వీళ్లకు నేను శాన్స్ డియాగో నుంచి లాస్ ఏంజెలెస్‌లోని కాంప్టన్స్ వరకు లిఫ్ట్ ఇచ్చాను. ఇలాంటి ప్రయాణాలు అమ్మాయిలు చేయడం మంచిది కాదని సలహా కూడా ఇచ్చాను’ అని చెప్పాడు. అలా రకరకాల ఆధారాలను సేకరించిన పోలీసులు.. శాంటా మారియా సమీపంలో హైవే 166పై ఒకచోట వారి బట్టలు, ఇతర వస్తువులను కనుగొన్నారు. మరో 4 వారాల తర్వాత శాంటా బార్బరా సమీపంలో వేటగాళ్లకు కుళ్లిన రెండు మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందగానే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. అవి మేరీ, మారియాలవేనని, వారిపై లైంగిక దాడులు జరిగాయని, ఆపై కత్తితో పొడిచి చంపేశారని తేలింది. కానీ కేసు అంతకుమించి ముందుకు పోలేదు.సుమారు ఏడెనిమిదేళ్ల తర్వాత(1991లో) కాలిఫోర్నియాలోని శాన్స్ డియాగోలో ఉన్న స్వీడిష్ కాన్సులేట్‌కి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి.. ‘మేరీ, మారియాలను చంపిన కిల్లర్ ఎవరో నాకు తెలుసు!’ అనడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ‘కిల్లర్ పేరు లోరెన్స్ , అతడు కెనడాకు చెందినవాడు. ఆరడుగులుంటాడు. ప్రతి ఏడాది శీతకాలం అమెరికాలోని శాన్స్ డియాగో మీదుగా మెక్సికోకు తన వ్యాన్స్ లో ట్రెక్కింగ్‌కి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడే నాకు పరిచయమయ్యాడు. అతడు తీవ్రమైన స్త్రీ ద్వేషి. సుమారు ఆరేళ్ల క్రితం తాను నన్ను కలిసినప్పుడు ఇద్దరు స్వీడిష్ అమ్మాయిలకు తన వ్యాన్స్ లో లిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు. మేరీ, మారియాల మర్డర్ కేసు గమనిస్తుంటే.. లోరెన్ లిఫ్ట్ ఇచ్చిన స్వీడిష్ అమ్మాయిలు వీరే కావచ్చనిపిస్తోంది. అతడు స్త్రీ ద్వేషి కాబట్టి అతడే వారిని ఏమైనా చేసి ఉండొచ్చు’ అని అజ్ఞాత కాలర్ చెప్పాడు. అయితే అధికారులు అతడ్ని ‘మీ పేరేంటి?’ అని ఆరా తీయడంతో భయపడి ఫోన్ పెట్టేశాడు. కొంతకాలానికి అధికారులు టెక్నాలజీని ఉపయోగించి ఆ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తిని కనిపెట్టగలిగారు. మరోసారి ఆరా తీసి, అతడు అబద్ధం చెప్పడం లేదని నిర్ధారించుకున్నారు. అయితే అది కేవలం అతడి అనుమానం కావచ్చని భావించారు.1999లో స్పీడ్ ఫ్రీక్ కిల్లర్స్‌గా కాలిఫోర్నియాను వణికించిన ఇద్దరు నరరూప రాక్షసులను వేరే పలు కేసుల్లో అరెస్ట్ చేసి, నేర నిర్ధారణ చేయడంతో వారిద్దరికీ జీవిత ఖైదు పడింది. వారిద్దరూ కలిసి సుమారు 15 హత్యలు చేసినట్లు తేలింది. అయితే ఆ ఇద్దరు కిల్లర్స్‌లో ఒకడి పేరు లోరెన్స్ (అజ్ఞాత కాలర్ చెప్పిన పేరు). పూర్తి పేరు లోరెన్స్ హెర్జోగ్. ఇతడే మేరీ, మారియాలను చంపి ఉంటాడని అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈసారి సాక్ష్యమివ్వడానికి.. ఆ అజ్ఞాత కాలర్ అధికారులకు చిక్కలేదు. మరోవైపు అరెస్ట్ అయిన మూడేళ్లకే లోరెన్ జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఏదేమైనా పెద్దలు, శ్రేయోభిలాషుల హెచ్చరికలను పక్కనపెట్టి, సరదా కోసం మొండితనంతో మేరీ, మారియాలు జీవితాలనే పోగొట్టుకున్నారు. ‘ఈ అమెరికన్స్ చాలా స్నేహస్వభావులు’ అని మేరీ చాలాసార్లు తన తండ్రి ఓవ్తో చెప్పేదట. మారియా అవే మాటలు డైరీలో రాసుకుంది. నిజానికి వారి నమ్మకం అపనమ్మకమైన క్షణాల్లో.. వారి జీవితాన్ని మట్టుబెట్టిన అమెరికన్ క్రూరులెవరో నేటికీ ప్రపంచం తెలుసుకోలేకపోయింది. అసలు డైరీ, హ్యాండ్‌బ్యాగ్ డంప్‌యార్డ్‌లో ఎందుకు పడున్నాయి? హైవేపై బట్టలు, అడవిలో మృతదేహాలు దొరికాయంటే.. వారికి, కిల్లర్‌కి మధ్య ఎంతటి ఘర్షణ జరిగుంటుందో? అతడి నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించి ఉంటారో?! ఇలా వేటికీ సమాధానాలు లేవు.∙సంహిత నిమ్మన -
అమెరికాలో బస్సు హైజాక్ కలకలం
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో బస్ హైజాక్ కలకలం రేపుతోంది. అయితే ఆ బస్సులో హైజాకర్స్ ఎంత మంది ఉన్నారు. బందీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.పలు అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని 6వ స్ట్రీట్, సౌత్ అలమెడా స్ట్రీట్ సమీపంలో నిందితులు బస్సును హైజాక్ చేశారని, ప్రయాణికుల్ని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.హైజాక్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిసీలించారు. బస్సుల్లో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు తేలింది. అయితే హైజాకర్స్ నుంచి డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతుండగా.. హైజాక్ గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో సైతంఈ ఏడాది మార్చిలో సైతం లాస్ ఏంజెల్స్ డౌన్టౌన్లో బస్సును నిందితుడు బస్సును హైజాక్ చేశాడు. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న హైజాకర్ ఇతర వాహనాల్ని ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ⚡️ Los Angeles Police engaged in a standoff with a hijacked bus, the driver and passengers are reportedly being held insideOnline images show that a SWAT team is at the sceneFollow us on Telegram https://t.co/8u9sqgdo0n pic.twitter.com/jQlQQbiDN6— RT (@RT_com) September 25, 2024 -
అమెరికా వెళ్లిపోయిన ఎన్టీఆర్.. ఇక అది కష్టమే
'దేవర' కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లిపోయాడు. లెక్క ప్రకారం హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. కానీ ఊహించిన దానికంటే అభిమానులు ఎక్కువగా వచ్చారు. 5 వేల మందికి పట్టే చోటుకి ఏకంగా 25 వేల మందికి పైగా వచ్చారు. తోపులాటని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అలానే ఇంతమందిని తట్టుకోవడం కష్టమని చెప్పి కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో తారక్‌ని కళ్లారా చూడాలనుకున్న వాళ్లకు నిరాశ తప్పలేదు.(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)'దేవర' ప్రీ రిలీజ్ రద్దవడంతో అభిమానుల్ని ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ నుంచి వీడియో వచ్చింది. 'భద్రతాపరమైన కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశాం. మళ్లీ చెబుతున్నాను. మీతో పాటు నేనూ బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా' అని తారక్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.ముందు నుంచి ఉన్న ప్లాన్ ప్రకారం సోమవారం వేకువజామున అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కి ఎన్టీఆర్ బయలుదేరాడు. అక్కడ సెప్టెంబరు 26న ప్రీమియర్స్ పడతాయి. దీంతో అక్కడే జరగబోయే బియాండ్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొంటాడు. అలానే కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తాడు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తాడు. దీనిబట్టి చూస్తే 'దేవర' ప్రీ రిలీజ్ ఇక లేనట్లే. అభిమాన హీరోని చూడాలనుకునే ఫ్యాన్స్‌కి ఇది ఓ రకంగా బ్యాడ్ న్యూసే.(ఇదీ చదవండి: 'దేవర' కోసం జాన్వీ.. తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందో)We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans. 🙏🏻🙏🏻The biggest celebration awaits. See you in theatres on Sept 27th.#Devara #DevaraOnSep27th pic.twitter.com/oSXa2ga6Za— Devara (@DevaraMovie) September 22, 2024