యావత్ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలని నటీనటులు కలలు కంటారు. మరికొద్ది గంటల్లో ఆస్కార్ 2023 వేడుకలు గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో చిత్రాలు ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. అందులో భారత్ నుంచి మన తెలుగు చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చూడటానికి బంగారంలా మెరిసిపోయే ఆస్కార్ ప్రతిమ నిజానికి బంగారంతో చేసింది కాదు. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు.
ఈ అవార్డు తయారు చేసేందుకు సుమారు 400 డాలర్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. కానీ దీన్ని అమ్మితే మాత్రం కేవలం ఒకే ఒక్క డాలర్ వస్తుందట. అదేంటీ? ఇంత ప్రాధాన్యత ఉన్న ఆస్కార్ అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా అనే కదా మీ సందేహం. 1950కు ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆస్కార్ అవార్డును అమ్ముకోలని చూశాడట.
ఇందుకు తగ్గట్లే వేలం వేయగా ఏకంగా ఆరున్నర కోట్లు వచ్చాయట. అయితే ఈ విషయం తెలిసి ఆగ్రహించిన అకాడమీ అవార్డ్స్ కమిటీ ఎవరూ ఆస్కార్ అవార్డు అమ్మకుండా ఓ నిబంధన పెట్టింది. ఆస్కార్ విన్నర్స్ తమ అవార్డులను ఇతరులకు అమ్మడానికి వీల్లేదట. తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే… ఒక డాలర్ ఇస్తామనే నిబంధన తెచ్చారు. దీంతో ఒక డాలర్‌కి ఆశపడి ఎవరు అవార్డు అమ్ముకోరు కాబట్టి, ఆస్కార్ అవార్డు అమ్మకాన్ని అలా నిరోధించారు.
Comments
Please login to add a commentAdd a comment