ప్రియాంక ల‌గ్జ‌రీ విల్లా ఎలా ఉందో చూశారా | Priyanka Chopra And Nick Jonas Luxury Villa Inside Pictures In Los Angeles | Sakshi
Sakshi News home page

ప్రియాంక విలాస‌వంతమైన‌ ఇంటిని చూశారా

May 16 2020 9:19 AM | Updated on May 16 2020 10:58 AM

Priyanka Chopra And Nick Jonas Luxury Villa Inside Pictures In Los Angeles - Sakshi

గ‌తేడాది గ్లోబ‌ల్‌స్టార్ ప్రియాంక చోప్రా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో విలాస‌వంత‌మైన భ‌వ‌నం కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. దాదాపు 20 మిలియ‌న్ డాల‌ర్లు(రూ.144 కోట్ల) వెచ్చించి లాస్ ఏంజెల్స్‌లోని స్థానిక ఎన్సివో ప్రాంతంలోని ఈ విల్లాను త‌మ‌ సొంతం చేసుకున్నారు. కొన్ని ఏళ్లపాటు ప్రేమించుకుని 2018 డిసెంబ‌ర్‌లో వివాహ బంధంతో ఒక్కటయిన‌ బాలీవుడ్‌ నటి ప్రియాంక, హలీవుడ్‌ గాయకుడు నిక్‌ జోనాస్‌. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం ఈ ఇంట్లోనే ఉంటు‌న్నారు. రోజంతా వ‌ర్కవుట్‌లు, పెంపుడు కుక్క‌తో ఉల్లాసంగా గడుపుతున్నారు. నిక్ సోదరుడు జో జోనాస్‌, అతని భార్య‌ సోఫీ టర్నర్ కూడా ప్రియాంక ఇంటికి  కేవలం మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇంటిని కొను‌కున్నారు. దీనిని కూడా ఇంచుమించు 14 మిలియ‌న్ల డాల‌ర్ల‌తో  కొనుగోలు చేశారు. (చిరంజీవి కూడా వెబ్‌సిరీస్‌లో..)

లాస్ ఏంజెల్స్‌లోని ప్రియాంక చోప్రా ల‌గ్జ‌రీ ఇల్లును చూసిన ఎవ‌రికైనా క‌ళ్లకు మైకం క‌మ్మాల్సిందే. ఇంటిలోని ఒక్కో గ‌ది చూస్తుంటే మ‌తి పోయేంత అందంగా, స్టైల్‌గా  ఉంటుంది మ‌రి. విశాల‌వంత‌మైన గ‌దులు, ఆధునాత‌న టెక్నాల‌జీతో నిర్మించిన ఈ ఇల్లు స్వ‌ర్గంలా ఉంటుంది. ఇది మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. రెండు అంత‌స్తుల‌లో, అద్దాలు, గోడ‌ల‌తో సుంద‌రంగా తీర్చిదిద్దారు. గార్డెన్, స్విమ్మింగ్ ఫుల్‌, జిమ్‌, ఐమాక్స్‌తో స‌హా అన్ని సౌక‌ర్యాలు కలిగి ఉన్నాయి. మ‌రి ఇంత‌టి అంద‌మైన ఇం‌టిని మీరు కూడా చూడండి..(మిస్‌ ఇండియాగా నేను: ఎవరో గుర్తుపట్టారా?! )

అందగత్తెలంతా ఒక్కచోట చేరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement