ఆస్కార్ వేడుకల్లో దీపికా పదుకొణె.. దారుణంగా అవమానించారు భయ్యా! | US Media Organizations Miss Lead Deepika Padukone Name In Oscars | Sakshi
Sakshi News home page

Deepika Padukone: 72 మిలియన్ల ఫాలోవర్స్.. అయినా గుర్తుపట్టలేదా?

Published Wed, Mar 15 2023 9:10 PM | Last Updated on Wed, Mar 15 2023 9:42 PM

US Media Organizations Miss Lead Deepika Padukone Name In Oscars - Sakshi

అమెరికా లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను విశ్వవేదికపై పరిచయం చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వేడుకల్లో ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంది. కానీ అక్కడి మీడియా తీరు మాత్రం ఆమె అభిమానులకు కోపం తెప్పించేలా చేసింది. 

బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అక్కడున్న వారిలో దీపికను ఎవరూ చూసిన ఇట్టే గుర్తు పట్టేస్తారు. కానీ కొన్ని మీడియా సంస్థలు దీపికాను గుర్తించడంలో దారుణంగా విఫలమయ్యాయి. దీపికా పేరుకు బదులు మరో నటి కెమిలా ఏవ్స్ పేరును రాశారు. దీపికా పేరు స్థానంలో మరొకరి పేరు రావడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపికా హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ.. ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు. అంతే కాకుండా ఇన్‌స్టాలో 72 మిలియన్ల మంది  ఫాలోవర్స్‌ ఉన్న దీపికాను గుర్తు పట్టకపోవడం దారుణమని అంటున్నారు. ఆ మీడియా సంస్థలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో భారతీయ చిత్రాలకు రెండు అవార్డులు దక్కాయి. టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement