Deepika Padukone Flaunts Her New Tattoo As She Makes Her Oscar Debut, Deets Inside - Sakshi
Sakshi News home page

Deepika Padukone: దీపికా మెడపై టాటూ.. ఏంటా అని నెటిజన్ల డౌటు!

Published Wed, Mar 15 2023 4:56 PM | Last Updated on Wed, Mar 15 2023 7:14 PM

Deepika Padukone flaunts her new tattoo as she makes her Oscar debut - Sakshi

అమెరికా లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె సందడి చేసింది. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రస్తావించింది. ప్రపంచ వేదికపై ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంది. దీపికను నటి కంగనా రనౌత్ సైతం మెచ్చుకుంది. విశ్వవేదికపై మనదేశ గొప్పదనాన్ని చాటారని ప్రశంసించింది. అయితే ఈ వేడుకల్లో దీపికా డ్రెస్‌తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ ఫోటోల్లో కనిపించిన టాటూపై అభిమానులు ఆరా తీస్తున్నారు. 


 

ఆస్కార్‌ వేదికపై దీపిక ధరించిన నలుపు రంగు గౌను అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా డ్రెస్‌తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపిక మెడపై  82°E  అని ఉన్న టాటూ కనిపించింది. ఇంతకీ ఆ టాటూకు అర్థం ఏంటా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. 

అయితే టాటూకు  82 డిగ్రీస్‌ ఈస్ట్‌ అని అర్థం వస్తుంది. ఇది దీపికా పదుకొణె తన స్కిన్‌ కేర్ బ్రాండ్ పేరు. ఈ పేరుతో గత కొన్ని నెలలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. దీపిక తన సొంత బ్రాండ్‌ పేరును టాటూగా వేయించుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్‌ కమిట్‌మెంట్‌ అంటే దీపికదే అని కామెంట్స్‌ చేస్తున్నారు. లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్‌ వేడుకలో దీపిక తన స్పీచ్‌తో అదరగొట్టింది. ఈ వేదికపై నుంచే ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటును అందరికీ పరిచయం చేసింది. 

కాగా.. దీపికా ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్  చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో తొలిసారి దీపికా కనిపించనుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ కె'లో నటిస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement