ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా విచారం వ్యక్తం చేసింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని అన్నారు. మా పొరుగువారంతా ఇలా బాధపడతారని అనుకోలేదంటూ ట్వీట్ చేశారు ప్రీతి జింటా. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ప్రీతి జింటా తన ట్వీట్‌లో రాస్తూ.' లాస్ ఎంజిల్స్‌లో మా చుట్టూ ఉన్న వారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయ బరువెక్కింది. అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి విషాదం సమయంలో మేమ సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ మంటల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తున్న అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి' అని పోస్ట్ చేశారు.
కాగా.. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఇళ్లు మంటల్లో బూడిదయ్యాయి. ఈ మంటలు దాదాపు వెయ్యి ఎకరాలకు వ్యాపించాయి. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు లక్షకు పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషాద ఘటనలో దాదాపు 13 మంది మరణించగా.. 12,000 కంటే ఎక్కువ ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
కాగా.. నటి ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి అక్కడే నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్‌తో రిలేషన్‌లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. తాజాగా అమెరికాలో వీరు నివసిస్తున్న లాస్ ఎంజిల్స్‌లోనే కార్చిచ్చు ఘటన జరగడంతో ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కాగా.. ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
I never thought I would live to see a day where fires would ravage neighbourhoods around us in La, friends & families either evacuated or put on high alert, ash descending from smoggy skies like snow & fear & uncertainty about what will happen if the wind does not calm down with…
— Preity G Zinta (@realpreityzinta) January 11, 2025
Comments
Please login to add a commentAdd a comment