
American Tycoon Robert Durst Conviction: ప్రాణ స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన కేసులో అమెరికన్ వ్యాపారదిగ్గజం రాబర్ట్ ఎలన్ డర్స్ట్కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 20 ఏళ్ల క్రితం నాటి ఈ హత్య కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. చివరకు ఇప్పుడు డర్స్ట్ పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లబోతున్నాడు.
స్నేహితురాలు సుసాన్ బర్మన్తో సహా ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోవడం(మిస్సింగ్.. హత్య చేశాడనే ఆరోపణలు) వెనుక రాబర్ట్ ప్రమేయం ఉందని లాస్ ఏంజెల్స్ న్యాయస్థానం బలంగా నమ్మింది. పెరోల్‌కు కూడా ఆస్కారం లేకుండా తక్షణ శిక్షను అమలు చేసింది.
అమెరికన్ రియల్ ఎస్టేట్ దిగ్గజం రాబర్ట్ డర్స్ట్కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. హెబీవో డాక్యుమెంటరీ ‘ది జింక్స్’ ద్వారా ఆయన జీవితం ప్రపంచానికి పరిచయమే!. ఈ డాక్యుమెంటరీలో ఆయన విలాసవంతమైన జీవితం, హత్యలు, ఆరోపణల ప్రస్తావన ఉంది.
2000 సంవత్సరంలో ప్రాణ స్నేహితురాలు సుసాన్ బర్మన్ హత్యకు కారణమనే ప్రధాన ఆరోపణ ఆయనపై ఉంది.
ఈ ఆరోపణలు నిజమని నమ్మిన లాస్ ఏంజెల్స్ జ్యూరీ.. 78 ఏళ్ల డర్స్ట్కి గురువారం జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది.
1982లో డర్స్ట్ మొదటి భార్య క్యాథీ మోక్కార్మాక్ డర్స్ట్ కనిపించకుండా పోయింది. ఆమెను తానే హత్య చేశానని ప్రాణ స్నేహితురాలు సుసాన్ బర్మాన్‌తో డర్స్ట్ చెప్పాడు.
ఆపై ఈ వ్యవహారానికి సంబంధించి అసలు నిజం పోలీసులకు చెబుతుందనే భయంతో సుసాన్ బర్మాన్ను బర్స్ట్ తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు, ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది.
అంతేకాదు 2001 టెక్సాస్ గాల్వెస్టన్లో పొరుగింటి వ్యక్తి మోరిస్ బ్లాక్‌ను హత్య చేసిన ఆరోపణలు రాబర్ట్ బర్స్ట్ మీదా ఉంది. కానీ, ఆత్మరక్షణ కోసమే ఆ హత్య చేసినట్లు ఆ టైంలో రాబర్ట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
మొత్తం మూడు రాష్ట్రాల్లో మూడు హత్యలకు సంబంధించిన కేసులు డర్స్ట్పై నమోదు అయ్యాయి.
డర్స్ట్కు మరణశిక్ష విధించే ఆస్కారం ఉన్నప్పటికీ.. సాక్ష్యులపై అగాయిత్యాలకు పాల్పడితే అక్కడి చట్టాల ప్రకారం జీవిత ఖైదు విధిస్తారు. ఈ క్రమంలో భార్య మిస్సింగ్ కేసు, పొరుగింటి వ్యక్తి హత్య కేసు కంటే సుసాన్ కేసుకు సంబంధించి కేసునే పరిగణనలోకి తీసుకుని డర్స్ట్కి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు.
వృద్ధాప్యం, పైగా అనారోగ్యంతో ఉన్నాకూడా కోర్టు కనికరం చూపించలేదు. రాబర్ట్ బర్స్ట్‌ను వీలైఛైర్లోనే ఉంచి.. 38 గంటలపాటు విచారణ చేపట్టింది న్యాయస్థానం.
చివరగా.. తాను ఏ పాపం చేయలేదని స్వయంగా రాబర్ట్ బర్స్ట్ గంటకు పైగా వాదనలు వినిపించడం విశేషం.
న్యూయార్క్ నగరానికి చెందిన రాబర్ట్ ఎలన్ డర్స్ట్.. వారసత్వంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అతని మొత్తం ఆస్తి విలువ 8.1 బిలియన్ డాలర్లకుపైనే. ఇక మూడు హత్యల ఆరోపణలపై ఇప్పుడు జీవిత ఖైదు అనుభవించబోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment