
ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ, ఉత్తమ నటి మైకీ మాడిసన్
‘అనోరా’కు ఐదు అవార్డులు
నాలుగు అవార్డులతో చరిత్ర సృష్టించిన దర్శకుడు సీన్ బేకర్
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన 97వ ఆస్కార్ అవార్డుల విజేతల వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ డాల్బీ థియేటర్‌లో ఆదివారం రాత్రి (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) 97వ ఆస్కార్ అవార్డు వేడుక ఘనంగా జరిగింది.
23 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. మొత్తం ఆరు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, నటి, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సపోర్టింగ్ యాక్టర్) నామినేషన్స్ దక్కించుకున్న అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘అనోరా’ చిత్రం ఉత్తమ సహాయ నటి విభాగం మినహాయించి, మిగిలిన ఐదు విభాగాల్లో అవార్డులు సాధించి, 97వ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఆ తర్వాత పీరియాడికల్ డ్రామా ‘ది బ్రూటలిస్ట్’కి మూడు (ఉత్తమ నటుడు, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) అవార్డులు దక్కాయి. ఇక ఈ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధికంగా 13 నామినేషన్లు దక్కించుకున్న స్పానిష్ మ్యూజికల్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఎమిలియా పెరెజ్’, 10 నామినేషన్లు దక్కించుకున్న అమెరికన్ మ్యూజికల్ ఫ్యాంటసీ ‘వికెడ్’, అమెరికన్ సైన్స్ ఫిక్షన్ ‘డ్యూన్ పార్టు 2’ చిత్రాలు రెండేసి అవార్డులతో సరిపెట్టుకున్నాయి.
అమెరికన్ ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ బాబ్ డైలాన్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా ‘ఏ కంప్లీట్ అన్‌నోన్’ చిత్రానికి ఎనిమిది నామినేషన్స్ దక్కినా ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేకపోయింది. ‘ది బ్రూటలిస్ట్’లోని నటనకుగాను అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా, ‘అనోరా’కి మైకీ మాడిసన్‌కి ఉత్తమ నటిగా అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంగా ‘అనోరా’ నిలవగా, అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డు సీన్ బేకర్‌కి దక్కింది. ఇంకా పలు విభాగాల్లో పలువురు అవార్డులు అందుకున్నారు.
భారతీయులకు నిరాశ
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారతదేశం చిత్రం ‘అనూజ’పోటీలో నిలిచినా అవార్డును గెలుచుకోలేకపోవడం భారతీయ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ విభాగంలో డచ్ ఫిల్మ్ ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ మూవీ అవార్డు ఎగరేసుకుపోయింది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి పంపగా నామినేషన్ దక్కించుకోలేకపోయిన విషయం గుర్తుండే
ఉంటుంది.
నల్ల జాతీయుడి రికార్డ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ‘వికెడ్’ సినిమాకు గాను, పాల్ తేజ్‌వెల్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి నల్ల జాతీయుడు పాల్ కావడం విశేషం. ‘‘కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో తొలి అవార్డు అందుకున్న తొలి నల్ల జాతి వ్యక్తిని నేనేనని గర్వంగా చెబుతున్నా. ఈ అవార్డుతో గౌరవించిన ఆస్కార్ అకాడమీకి థ్యాంక్స్. మా ‘వికెడ్’ లీడింగ్ లేడీస్, టీమ్‌కి కూడా థ్యాంక్స్’’ అని పాల్ పేర్కొన్నారు.
ఆస్కార్ విజేతలు...
→ ఉత్తమ చిత్రం – అనోరా
→ నటుడు – అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
→ నటి – మైకీ మాడిసన్ (అనోరా)
→ దర్శకత్వం – అనోరా (సీన్ బేకర్)
→ సహాయ నటుడు – కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్ )
→ సహాయ నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
→ స్క్రీన్ ప్లే – అనోరా (సీన్ బేకర్)
→ సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
→ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్ : పార్ట్2
→ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
→ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – కాన్ క్లేవ్ (పీటర్ స్ట్రాగన్ )
→ సౌండ్ – డ్యూన్ : పార్ట్2
→ మేకప్, హెయిర్ స్టైల్ – ది సబ్‌స్టాన్ ్స
→ ఎడిటింగ్ – అనోరా (సీన్ బేకర్)
→ కాస్ట్యూమ్ డిజైన్ – వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
→ ఒరిజినల్ స్కోర్ – ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – ఐయామ్ స్టిల్ హియర్ (వాల్టర్ సాల్లెస్– బ్రెజిల్)
→ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్– ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
→ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఐయామ్ నాట్ ఏ రోబో ప్రొడక్షన్ డిజైన్ – వికెడ్
→ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్ ∙
→ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో
→ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – నో అదర్ ల్యాండ్
→ ‘‘డొమినికన్ ఆరిజన్ కు చెందిన తొలి అమెరికన్ గా నేను ఆస్కార్ అవార్డు అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఇలా అవార్డు అందుకుంటున్న చివరి అమ్మాయిని నేను కాదని కూడా నాకు తెలుసు’’ అన్నారు ఉత్తమ సహాయ నటి సల్దానా.
మహిళలకు అంకితం
– దర్శకుడువాల్టెర్ సాల్లెస్
΄÷లిటికల్ బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్ ‘ఐయామ్ స్టిల్ హియర్’ చరిత్ర సృష్టించింది. 97 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో అవార్డు సాధించిన తొలి బ్రెజిల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. వాల్టెర్ సాల్లెస్ ఈ సినిమాకు దర్శకుడు. కథ రాసిన రూబెన్స్ నిర్మించారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర యూనిస్ పైవాగా బ్రెజిలియన్ నటి ఫెర్నాండా టోర్రెస్ నటించారు. అదృశ్యమైన తన భర్త కోసం ఓ మహిళ చేసే అసాధారణమైనపోరాటం నేపథ్యంలో ‘ఐయామ్ స్టిల్ హియర్’ మూవీ సాగుతుంది. ‘‘ఓ మహిళ అసాధారణపోరాటమే ఈ సినిమాకు అవార్డు తెచ్చిపెట్టింది. ఆపోరాటానికి ్రపాణంపోసిన ఫెర్నాండా టోర్రెస్, ఫెర్నాండా మోంటెనెగ్రోలకు ఈ అవార్డు దక్కుతుంది’’ అని వాల్టెర్ సాల్లెస్ పేర్కొన్నారు.
అమెరికన్ రికార్డు ప్రొడ్యూసర్–కంపోజర్ క్విన్సీ జోన్స్‌తో పాటు పలువురు ప్రముఖులకు ఆస్కార్ నిర్వాహకులు నివాళులు అర్పించారు. ఇక ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు హాక్‌మాన్ గురించి మెమోరియమ్ సెగ్మెంట్‌లో అమెరికన్ యాక్టర్,ప్రొడ్యూసర్ మెర్గాన్ ఫ్రీమాన్ మాట్లాడారు.
చూయింగ్ గమ్.. ఛీ... ఛీ
ఆస్కార్ విజేతలు వేదికపై మాట్లాడేందుకు నిర్వాహకులు 45 సెకన్ల నిడివిని నిర్ణయించారు. కానీ అడ్రియన్ దాదాపు మూడు నిమిషాలకు పైనే మాట్లాడుతుండటంతో నిర్వాహకులు మ్యూజిక్ ప్లే చేశారు. ఆ మ్యూజిక్‌ను ఆపాలని అడ్రియన్ పేర్కొన్నారు. అలాగే స్టేజ్ మీదకు వచ్చే ముందు నోట్లో ఉన్న చూయింగ్ గమ్‌ను తన గాళ్ ఫ్రెండ్ జార్జినా చాప్‌మాన్ (నటి, ఫ్యాషన్ డిజైనర్) æవైపు విసిరేశారు. ఈ వింత ప్రవర్తన చాలామంది వీక్షకులకు నచ్చలేదు. ‘ఇదేంటి... ఛీ ఛీ’ అన్నట్లుగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక అడ్రియన్‌కు ఇది రెండో ఆస్కార్ అవార్డు. 2003లో వచ్చిన ‘ది పియానిస్ట్’ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా తొలి ఆస్కార్ అందుకున్నారు అడ్రియన్. అప్పుడు తనకు అవార్డు అందజేసిన నటి హాలీ బెర్రీని ముద్దుపెట్టుకున్నారు. 75వ ఆస్కార్ అవార్డ్స్ లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనమైంది. తాజాగా 97వ ఆస్కార్ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై హాలీ బెర్రీని ముద్దాడి వార్తల్లో నిలిచారు అడ్రియన్.
→ ఆస్కార్ వేదికగా ‘కిల్‌బిల్’ (2003) ఫేమ్ డారిల్ హన్నా ఉక్రెయిన్ తరఫున తన స్వరం వినిపించారు. ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో విజేతను ప్రకటించేందుకు వేదికపైకి వచ్చిన, డారిల్ ఉక్రెయిన్‌కు విజయం వరించాలన్నట్లుగా విక్టరీ సింబల్’ చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment