
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్‌లో రామ్ చరణ్ అభిమానులు.. సర్ ప్రైజ్ గ్రీటింగ్స్ తెలిపారు. ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ సైన్ పై.. ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసినందుకు.. వినూత్నంగా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కి గ్రీటింగ్స్ తెలియజేస్తూ USA మెగా కన్వీనర్ విజయ్ రేపల్లె ఈ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
రామ్ చరణ్ పై అభిమానంతో ఇలా ఎయిర్ ప్లేన్ బ్యానర్ ను ఆకాశంలో ప్రదర్శించినట్లు తెలిపారు. ఇక అమెరికా వ్యాప్తంగా అభిమానులు కేక్ కట్ చేసి.. చెర్రీకీ విషెస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment