అమెరికాలో కార్చిచ్చు.. రాజకీయ మలుపు తీసుకుంది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్(డెమోక్రటిక్) కారణంగానే మంటలు విస్తరించాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్. అయితే దీనికి గావిన్ కౌంటర్‌గా ఒక లేఖ విడుదల చేశారు.
కాలిఫోర్నియా(California)లో మంటలు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాలంటూ డొనాల్డ్ ట్రంప్‌ను కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆహ్వానించారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితుల్ని పరామర్శించాలని కోరారు. అంతేకాదు.. ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దంటూ ట్రంప్‌కు చురకలంటించారు.
గతంలో ఆరేళ్ల కిందట ట్రంప్(Trump) అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఈ తరహా ఘటన చోటు చేసుకుందని, ఆ టైంలో బాధితుల్ని ఆయన పరామర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పుడు కాలిఫోర్నియా కష్టంలో ఉంటే.. రాజకీయం చేయడం సరికాదన్నారు. కాలిఫోర్నియా కార్చిచ్చు తర్వాత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సత్వరమే స్పందించారని గవర్నర్ గావిన్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్ నుంచి వెళ్లిపోయే ముందు బైడెన్ తనకు మిగిల్చింది ఇదేనంటూ కాలిఫోర్నియా కార్చిచ్చును ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. మంటల్ని ఆర్పడంలో ఘోరంగా వైఫల్యం చెందారంటూ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు డెమోక్రట్లకు, రిపబ్లికన్లకు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
మరోవైపు.. కెనడా(Canada)ను అమెరికా 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో తెలిసిందే. ఈ దరిమిలా.. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం తన ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. ‘‘అమెరికా, కెనడా కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు.. అంతకు మించి. కష్టకాలంలో మేం స్నేహితులమనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు.
I spoke with @GavinNewsom last night. We both know that Canada and the United States are more than just neighbours. We’re friends — especially when times get tough.
California’s always had our back when we battle wildfires up north. Now, Canada’s got yours.— Justin Trudeau (@JustinTrudeau) January 10, 2025
Comments
Please login to add a commentAdd a comment