లాస్ ఏంజెల్స్: కాలిఫోర్నియాకు చెందిన ఒక జడ్జి బాగా మద్యం సేవించిన తర్వాత భార్యతో వాగ్వాదానికి దిగారు. గొడవ అంతకంతకు పెద్దది కావడంతో మద్యం మత్తులో జడ్జి తనవద్ద ఉన్న తుపాకీని తీసి భార్యను కాల్చి చంపేశాడు. అనంతరం తన సహచరుడికి మెసేజ్ పెడుతూ.. రేపు నేను కోర్టుకి రాలేను.. నేను జైలులో ఉంటానని సందేశం పంపించినట్లు తెలిపారు పోలీసులు.
కాలిఫోర్నియాకు చెందిన ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జి జెఫ్రీ ఫెర్గ్యూసన్(72) ఆగస్టు 3న తన భార్య షెరిల్(65) ఒక రెస్టారెంటుకు వెళ్లగా అక్కడ వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. అలా వారి మధ్య జరిగిన వివాదం కొద్దిసేపటికి బాగా ముదిరిపోయింది.
ఆరెంజ్ కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ క్రిస్టోఫర్ అలెక్స్ తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా గొడవ సద్దుమణగకపోవడంతో షెరిల్.. పదే పదే వేలు చూపించే బదులు ఒక తుపాకీ చూపించి కాల్చేయొచ్చు కదా అని అరిచింది. వెంటనే ఫెర్గ్యూసన్ తన వద్ద ఉన్న తుపాకీని తీసి తన భార్య గుండెల్లో చాలా దగ్గర నుండి కాల్చేశారు. అనంతరం తన స్నేహితుడికి ఫోనులో.. నేను సహనం కోల్పోయి, నా భార్యను చంపేశాను.. రేపు నేను రాకపోవచ్చు, బహుశా పోలీసుల అదుపులో ఉంటానేమోనని సందేశం పంపారు.
అనంతరం ఫెర్గ్యూసన్ స్వయంగా తానే 911కి ఫోన్ చేసి పోలీసులకు విషయాన్ని వివరించారు. పోలీసులు అతడి ఇంటిని సోదా చేయగా ఆయన ఇంట్లో మొత్తం 47 తుపాకులు, 26,000 వరకు మందుగుండు సామాన్లు లభించినట్లు తెలిపారు. అరెస్టు చేసిన సమయంలో జడ్జి ఫెర్గ్యూసన్ బాగా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలపగా ఫెర్గ్యూసన్ నేరాన్ని అంగీకరించలేదు. ఆయన తరపు లాయర్ పాల్ మేయర్ ఈ హత్య ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని పొరపాటున జరిగిందని దీన్ని నేరంగా పరిగణించవద్దని అన్నారు. కోర్టు లాయర్ వాదనంతో ఏకీభవించి జడ్జికి బెయిల్ మంజూరు చేయడమే కాదు మద్యం సేవంచవద్దని హితవు కూడా పలికింది.
ఇది కూడా చదవండి: ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్
Comments
Please login to add a commentAdd a comment