Killed wife
-
భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి..
లాస్ ఏంజెల్స్: కాలిఫోర్నియాకు చెందిన ఒక జడ్జి బాగా మద్యం సేవించిన తర్వాత భార్యతో వాగ్వాదానికి దిగారు. గొడవ అంతకంతకు పెద్దది కావడంతో మద్యం మత్తులో జడ్జి తనవద్ద ఉన్న తుపాకీని తీసి భార్యను కాల్చి చంపేశాడు. అనంతరం తన సహచరుడికి మెసేజ్ పెడుతూ.. రేపు నేను కోర్టుకి రాలేను.. నేను జైలులో ఉంటానని సందేశం పంపించినట్లు తెలిపారు పోలీసులు. కాలిఫోర్నియాకు చెందిన ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జి జెఫ్రీ ఫెర్గ్యూసన్(72) ఆగస్టు 3న తన భార్య షెరిల్(65) ఒక రెస్టారెంటుకు వెళ్లగా అక్కడ వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. అలా వారి మధ్య జరిగిన వివాదం కొద్దిసేపటికి బాగా ముదిరిపోయింది. ఆరెంజ్ కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ క్రిస్టోఫర్ అలెక్స్ తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా గొడవ సద్దుమణగకపోవడంతో షెరిల్.. పదే పదే వేలు చూపించే బదులు ఒక తుపాకీ చూపించి కాల్చేయొచ్చు కదా అని అరిచింది. వెంటనే ఫెర్గ్యూసన్ తన వద్ద ఉన్న తుపాకీని తీసి తన భార్య గుండెల్లో చాలా దగ్గర నుండి కాల్చేశారు. అనంతరం తన స్నేహితుడికి ఫోనులో.. నేను సహనం కోల్పోయి, నా భార్యను చంపేశాను.. రేపు నేను రాకపోవచ్చు, బహుశా పోలీసుల అదుపులో ఉంటానేమోనని సందేశం పంపారు. అనంతరం ఫెర్గ్యూసన్ స్వయంగా తానే 911కి ఫోన్ చేసి పోలీసులకు విషయాన్ని వివరించారు. పోలీసులు అతడి ఇంటిని సోదా చేయగా ఆయన ఇంట్లో మొత్తం 47 తుపాకులు, 26,000 వరకు మందుగుండు సామాన్లు లభించినట్లు తెలిపారు. అరెస్టు చేసిన సమయంలో జడ్జి ఫెర్గ్యూసన్ బాగా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలపగా ఫెర్గ్యూసన్ నేరాన్ని అంగీకరించలేదు. ఆయన తరపు లాయర్ పాల్ మేయర్ ఈ హత్య ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని పొరపాటున జరిగిందని దీన్ని నేరంగా పరిగణించవద్దని అన్నారు. కోర్టు లాయర్ వాదనంతో ఏకీభవించి జడ్జికి బెయిల్ మంజూరు చేయడమే కాదు మద్యం సేవంచవద్దని హితవు కూడా పలికింది. ఇది కూడా చదవండి: ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్ -
మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త..
-
మైనర్‌పై లైంగిక దాడి, జైలుకెళ్లి వచ్చాక పెళ్లి.. భార్యపై అనుమానంతో
సాక్షి, హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి చేయడంతో త్రీవంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నందనవనంలో ఉండే సబా ఫాతీమా(22) మైనర్‌గా ఉన్నపుడు బైరామల్‌గూడలోని అల్లాఫ్ నగర్లో ఉంటూ కూలీ పని చేసే పాతనేరస్తుడు దాసరి సురేందర్ (30) ఆమెపై అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు అతడిపై ఫోక్సో తదితర కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బాధితురాలినే సురేందర్ కులాంతర వివాహం చేసుకున్నాడు. సురేందర్ తల్లి యాదమ్మ, భార్య సబా ఫాతీమాతో కలిసి అల్లాఫ్నగర్లో ఉంటున్నాడు. వీరికి 9 నెలల పాప ఉంది. 2021 డిసెంబర్లో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో మళ్లీ అరెస్టయి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచీ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. కూతురు పుట్టడంతో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కొట్టేవాడు. ఇదే క్రమంలో బుధవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. సురేందర్ భార్యపై చేయి చేసుకోవడం కింద పడి తీవ్ర రక్తస్రావమైంది. ఫాతీమా మెట్లపై నుంచి కిందపడి గాయపడిందని ఆమె తల్లిదండ్రులకు సురేందర్ సమాచారం ఇచ్చాడు. స్థానికులు వెంటనే ఫాతీమాను చికిత్స నిమిత్తం వనస్ధలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. మృతురాలి తల్లి షబానా బేగం తన కుతురును అల్లుడు సురేందర్, ఆమె తల్లి యాదమ్మ కలిసి హత్య చేశారని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: నీ కుమారుడి కంటే దారణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు -
అప్పగింతల కర్ర
అమ్మాయిని పంపిస్తున్నాం. ‘సర్దుకుపోవాలి తల్లీ..’ ‘గుట్టును గడప దాటనివ్వకు బుజ్జీ..’ ‘అణకువగా ఉండు బంగారం..’ ‘మాటంటే నొచ్చుకోకు బిడ్డా..’ అన్నీ చెప్పాల్సిన మాటలే. వీటితో పాటు.. ఇవ్వాల్సిన కర్ర కూడా ఒకటి ఉంది. అప్పగింతల కర్ర! ధీమాకు.. ధైర్యానికి. అతడింకా నోరు విప్పలేదు. ‘నువ్వేనా నీ భార్యను చంపింది?’ ‘అవును’. ఎలా చంపావు? ‘ఆమె పడుకుని ఉన్న మంచం మీదికి పామును వదిలి కాటేయించాను’. ‘పాము ఎక్కడిది నీకు?’ ‘పాములోళ్ల దగ్గర పదివేలకు కొన్నాను’. ‘పాములోళ్లు నీకెలా తెలుసు?’ ‘యూట్యూబ్‌లో అడ్రస్ పట్టుకున్నాను’ ఉన్నది ఉన్నట్లు ఇంత బాగా చెబుతుంటే అతడు నోరు విప్పకపోవడం ఏమిటి? అవును. విప్పడంలేదు. ‘నీ భార్యను ఎందుకు చంపావు?’ అనే ప్రశ్నకు అతడింకా నోరు విప్పలేదు. అయితే అతడు నోరు విప్పడం అన్నది పోలీసులకు అవసరమే కానీ.. మన స్టోరీకి కాదు. మనక్కావలసింది.. అలాంటి వ్యక్తిని భర్తగా అమ్మాయిలు ఎందుకు భరిస్తూనే ఉంటారని! అలాంటి వ్యక్తితో సర్దుకుని పొమ్మని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలకు ఎందుకు చెబుతూనే ఉంటారని! అలాంటి వ్యక్తి అంటే? ∙∙ కట్నంగా ఐదు లక్షల క్యాష్ ఇచ్చారు. కిలో బంగారం ఇచ్చారు. కారు కొనిపెట్టారు. వరుడి చెల్లి చదువుకు డబ్బిచ్చారు. చదువుకే కాదు, చదువుకోడానికి టూ–వీలర్ కావాలంటే ఆ చెల్లికి వీలర్‌ని కూడా కానుకగా ఇచ్చారు. ఇక వరుడి తండ్రిగారు.. ఆయనకు బాడుగలకు తిప్పే లోడ్–వ్యాన్ కావాలంటే దాన్నీ కొనిపెట్టారు. ఇన్ని చేశాక పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకెళ్లాడు. అదూర్ అతడిది. పట్టణంతిట్ట జిల్లాలో ఉంటుంది. వధువుది ఆంచల్. కొల్లం జిల్లాలో ఉంటుంది. కేరళలోని జిల్లాలివి. 2018 మార్చి 26న పెళ్లయింది. 2020 మే 7న భార్యను చంపేశాడు. ఈ రెండేళ్ల కాలంలో భార్యతో అతడు ఏం మాట్లాడినా ఒకేమాట.. డబ్బు! ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా. ఆ ఇంకా.. నెలవారీ అయింది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం అతడిది. ఆమె గృహిణి. ఉద్యోగంలో నెల నెల జీతం రాకపోయినా, భార్య నుంచి నెలనెలా ‘జీతాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు అతడు! అతడు సూరజ్. ఆమె ఉత్తర. ఏడాది వయసున్న కొడుకు. ‘పాపం ఇక మావాళ్లు డబ్బు ఇవ్వలేరండీ’ అన్నందుకు ఆ ఇంట్లోకి పాము దూరింది. మొదట ఆ పాము అతడి మెదడులోకి ప్రవేశించి, తర్వాత ఆమె బెడ్రూమ్లోకి పాకింది. మార్చి 2 ఆ రోజు. పాము చేత ఆమెను కాటేయించాడు. రెండునెలలు ఆసుపత్రిలో ఉంది. ‘అదృష్టం బాగుండి బతికింది. అది మామూలు పాము అయి ఉండదు’ అన్నారు డాక్టర్లు. అదూర్‌లోని ఆసుపత్రి నుంచి నేరుగా ఆంచల్‌లోని పుట్టింటికి తీసుకెళ్లారు ఉత్తరను ఆమె తల్లిదండ్రులు. రెండో అటెంప్ట్ ఆమె పుట్టింట్లోనే మే 7న చేశాడు సూరజ్. ఈసారి కోబ్రాను ప్రయోగించాడు. ఆమె చనిపోయింది. ∙∙ అల్లుడు ఎలాంటివాడో తెలుస్తూ ఉన్నప్పుడు కూతుర్ని అతడితో ఎందుకు ఉండనిస్తారు తల్లిదండ్రులు? కూతురు చెప్తూనే ఉంటుంది.. మెంటల్‌గా టార్చర్ పెడుతున్నాడనీ, చంపేస్తానని బెదిరిస్తున్నాడనీ, తను ఇంటికొస్తుంటేనే భయం వేస్తుందనీ..! అంతులేని డబ్బు ఆశ ఉన్నవాడి దగ్గర కూతురు ప్రాణాలకు ఎప్పటికైనా ప్రమాదమే అని ఎందుకు అనుకోరు తల్లిండ్రులు? అలాంటి భర్త లేకపోయినా ఏం కాదు.. మేమొస్తున్నాం, మాతో వచ్చేయ్. అతడిని వదిలేద్దాం అని ఎందుకు ధైర్యం ఇవ్వరు? ఒడ్డున ఉండి ప్రశ్నించినంత సులభం కాకపోవచ్చు వీటికి సమాధానాలు. ఎన్నో భయాలు ఉంటాయి. భర్తకు దూరంగా ఉందని తెలిస్తే పిల్ల పలచనై పోతుందన్న భయం ఉంటుంది. రేపు ఎప్పుడైనా.. బిడ్డకు తండ్రి లేడా అనే మాట వస్తుందన్న భయం ఉంటుంది. ఎన్ని భయాలున్నా.. పిల్ల ప్రాణం పోతుందేమోనన్న భయం కన్నా పెద్దవా?! దేశంలో రోజుకు 21 మంది భర్తలు డబ్బు కోసం తమ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి! అమ్మాయి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అమ్మాయికి కొంచెం సపోర్ట్‌గా ఉంటే ఇంట్లోకి పాము దూరక ముందే, ఆమె తన చేతిలోకి కర్రను తీసుకుంటుంది. ఆ కర్ర.. విడాకులే కానక్కర్లేదు. ‘నాకు నువ్వు అక్కర్లేదు’ అని చెప్పి బయటికి వచ్చే ధైర్యం కూడా కావచ్చు. పెళ్లినాటి ఫొటో : సూరజ్, ఉత్తర ఉత్తర ఫొటోతో ఆమె తల్లిదండ్రులు మణిమేఖల, విజయసేనన్ -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
సాక్షి, వెంకటాపురం: పక్కా ప్లాన్‌తో భార్యను హతమార్చి తప్పించుకు తిరుగుతన్న భర్తను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సంచలనం సృష్టించిన వివాహిత హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమె భర్త తోట రమేష్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భార్యను హత్యచేసి పరారీలో ఉన్న నిందితున్ని వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు రమేష్ వద్ద నుంచి బంగారు గొలుసు, చెవిదుద్దులు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యను తనే హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అతడిని కోర్టుకు తరలించారు. -
ఎలక్షన్ డ్యూటీకి వెళ్లనివ్వడం లేదని భార్యను..
రాయ్‌పూర్ : ఎన్నికల విధులకు వెళ్లనివ్వడంలేదని భార్యను హత్య చేశాడు ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఈ నెల 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ గురువీర్ సింగ్ జగదల్పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తన భార్య అనుప్రియ గౌతమ్‌తో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 17న ఎన్నికల విధులకు కానిస్టేబుల్ వెళ్లాల్సి ఉంది. ఎన్నికల విధులకు వెళ్లొద్దని భార్య ఈ నెల 16వ తేది రాత్రి గురువీర్‌తో గొడవ పడ్డారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మపలికాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య చేసినట్లుగా తేలడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అనుప్రియను తానే గొంతునులిపి చంపినట్లుగా కానిస్టేబుల్ ఒప్పుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్య,కొడుకును కడతేర్చిన భర్త
-
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
-
అనుమానమే ఆయువు తీసింది!
-
కుమారుడి బర్త్‌డే నాడే ఘటన..భార్యను కత్తితో..
అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో చాలాసార్లు గొడవలు జరిగాయి. ఇది భరించలేని ఆమె అతనిపై కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. అయినా అనుమానం తీరని అతను ఆమెను కత్తితో నరికి చంపాడు. ఫలితంగా ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. కర్నూలు,బనగానపల్లె: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం పట్టణంలోని తెలుగుపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సుమారు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన నాగన్న, మునెమ్మ దంపతుల కుమార్తె ఎం.మహేశ్వరి(35)ని పట్టణంలోని తెలుగుపేటకు చెందిన బాలనాగమ్మ కుమారుడు లింగమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలం పాటు వీరి సంసారం సాఫీగా జరిగింది. ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న లింగమూర్తి ఆమెను వేధించేవాడు. ఈక్రమంలో అతడిపై మహేశ్వరి తల్లిదండ్రులు 2014లో అలంపూర్ పోలీసు స్టేషన్లో అదనపు కట్నం వేధింపుల కేసు పెట్టారు. అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా ఇదే కాలనీలో అద్దె ఇంట్లో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే అమె గురించి ఇరుగుపొరుగు వారు రకరకాలు చెబుతుండడంతో మనస్థాపం చెందిన భర్త ఉదయం ఇంటికి వద్దకు వెళ్లి ఆమె మెడపై నరికి చంపాడు. అనంతరం మృతదేహాన్ని బయటకు తెచ్చి అక్కడే కూర్చున్నాడు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాకేష్ ఘటన స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్చార్జ్ సీఐ కంబగిరిరాముడు అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా కుమారుడు శివకుమార్ పుట్టినరోజు నాడే తల్లి హత్యకు గురికావడంతో కాలనీలో విషాదం నెలకొంది. -
అనుమానంతో భార్యను నరికిన భర్త
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని కబరస్తాన్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలి తండ్రి ఉసేని తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన బాషా, పర్వీన్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు పర్వీన్ మూడు నెలల గర్భిణి. బాషా తన భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం వేధిస్తుండేవాడు. కుటుంబ సభ్యులు నచ్చజెబుతూ వచ్చారు. కొంతకాలం క్రితం బాషా తన భార్యను బెంగళూరులో ఉండే సోదరుడి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవించేవారు. అక్కడ కూడా గొడవ పడుతుండటంతో బాషాను అతని సోదరుడు తిట్టి పంపాడు. అయితే..అతను ఎమ్మిగనూరుకు రాకుండా 20 రోజుల క్రితం కేరళకు తీసుకెళ్లాడు. కేరళలో నడిరోడ్డుపై భార్యతో గొడవ పడి.. చంపటానికి ప్రయత్నించటంతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు తెలుసుకొని పర్వీన్ తండ్రికి సమాచారమిచ్చారు. అతను కేరళకు వెళ్లి కుమార్తెను ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు. బాషా నాలుగు రోజుల క్రితం మళ్లీ భార్య దగ్గరకు రావటంతో మామ, కుటుంబ సభ్యులు సర్దిచెప్పారు. అయితే.. శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యపై గొడ్డలితో తలపై నరికాడు. శబ్దం రావటంతో çపర్వీన్ తండ్రి వచ్చి చూడగా.. గొడ్డలితో నరుకుతుండటం గమనించి కేకలు వేశాడు. దీంతో బాషా పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న కుమార్తెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
ఒంగోలులో దారుణం
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మంగమూరు రోడ్డులోని రామచంద్ర మిషన్ సమీపంలో సోమవారం రాత్రి 10:45 గంటల సమయంలో భార్యని భర్త చంపి పరారైన సంఘటన కలకలం సృష్టించింది. మంగమూరు రోడ్డులో అపార్ట్మెంట్ కూడలికి చివర ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న కొర్రపాటి అంజలి (33)ని భర్త ఏడుకొండలు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వివరాలు.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు తన కుటుంబంతో కలిసి ఏడాది కిందట బేల్దారి పనులు చేసుకునేందుకు ఒంగోలుకు వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని చదివించుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కాని సోమవారం రాత్రి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఏడుకొండలు తన భార్య అంజలిని అత్యంత కిరాతకంగా రాయితో నుజ్జునుజ్జు చేసి హతమార్చాడు. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు కుమార్తెలు భీతిల్లిపోయి విషయాన్ని ఇంటి యజమానులకు తెలిపారు. దీంతో ఏడుకొండలు తన కుమారుడిని బైక్‌పై ఎక్కించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న తాలుకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ డి.శ్రీనివాసరావు హత్య జరిగిన ఇంటిని పరిశీలించి అక్కడి నుంచే హత్యకు సంబంధించిన సమాచారం ఎస్పీ సత్య ఏసుబాబుకు ఫోన్ ద్వారా అందించారు. పోలీసులు హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం కోసం కడతేర్చారు
నార్నూర్(ఆసిఫాబాద్) : మండలంలోని ఉమ్రి గ్రామంలో జాదవ్ మమత (వందనబాయి) (25)ను వరకట్నం కోసం వేధించి భర్త, అత్త మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఉట్నూర్ సీఐ జాదవ్ గణపతి తెలిపిన వివరాల ప్రకా రం.. బేల మండలం సాంగ్వి గ్రామ పం చా యతీ పరిధిలోని సైద్పూర్ శాసాతండాకు చె ందిన రాథోడ్ ప్రేందాస్, పూలబాయి దంపతు ల కూతురు మమతను ఉమ్రి గ్రామానికి చెం దిన జాదవ్ సుధామ్కు ఇచ్చి 2010 మే నెలలో పెళ్లి జరిపించారు. సుధామ్ వ్యవసాయం చేసు ్తండగా.. కొన్నాళ్లు కుటుంబంలో అందరూ కలిసిమెలసి ఉన్నారు. గతకొన్నేళ్లుగా అత్త కాశీ బాయి, భర్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పదిహేను రో జుల క్రితమే గ్రామపెద్దల సమక్షంలో పంచాయి తీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దంపతులకు కౌన్సెలింగ్ ఇ చ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఇదే క్రమంలో గురువారం రాత్రి మమతను భర్త సుధామ్, అత్త కాశీబాయి అదే గ్రామానికి చెం దిన కిషన్, మానిక్రావులతో కలిసి పథకం ప్ర కారం ఇంట్లో నిద్రిస్తుండగా హత్య చేశారని సీఐ తెలిపారు. కత్తితో గొంతుకోసి, రోకలితో తలపై మోదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో వెంటనే సంç œుటన స్థలానికి చేరుకున్నారు. నలుగురు నింది తులను అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహంతో ఉన్న మృత్యురాలి బంధువులు మమతను దా రుణంగా హత్య చేసిన వారిని శిక్షించాలని డిమా ండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సీఐ జాదవ్ గ ణపతి వారితో మాట్లాడి శాంతింపచేశారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమి త ్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు రెండేళ్ల కూతురు, ఆరునెలల కుమారు డున్నారు. ఆమె తండ్రి ప్రేందాస్ ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తుననట్లు సీఐ తెలిపారు. -
కట్టుకున్నోడే కాలయముడు
► మద్యం మత్తులో భార్య గొంతు నులిమి కడతేర్చిన వైనం ► అదనపు కట్నం కోసమే ఘాతుకం ► పోలీసుల అదుపులో నిందితుడు ► మాల్ వెంకటేశ్వరనగర్‌లో దారుణం చింతపల్లి: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు.. జీవి తాంతం తోడూ నీడగా ఉండాల్సింది పోయి..అదనపు కట్నం కోసం గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఆపై ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈదారుణ ఘటన చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వరనగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్ వెంకటేశ్వరనగర్ గ్రామానికి చెందిన కడారి పర్వతాలు, శ్యామలమ్మల ఒక్కగానొక్క కుమార్తె స్వాతి(20)ని దేవరకొండ పట్టణానికి చెందిన పొగాకు మధుకు ఇచ్చి 16 నెలల క్రితం వివాహం చేశారు. మధు హైదరాబాద్‌లోని మిథాని డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మాల్లోనే మధు, స్వాతి దంపతులు సొంతిళ్లును కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వివాహం జరిగిన రెండు నెలల పాటు సజావుగా సాగిన దాంపత్య జీవితంలో మధు ప్రవర్తనతో తగాదాలు మొదలయ్యాయి. తరచూ మద్యం సేవించి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. మద్యం సేవించి.. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మధు భార్యను చితకబాదాడు. ఆపై స్వాతి గొంతు నులుమి హత్యచేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంట్లోని ఫ్యాన్‌కు స్వాతిని ఉరి వేశాడు. ఆపై వారి ఇంట్లో అద్దెకు ఉండే వారికి స్వాతి గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుందని చెప్పాడు. వారు వెళ్లి చూసే సరికి అప్పటికే స్వాతి మృతి చెంది ఉంది. ఇదిలా ఉండగా ఐదు నెలల క్రితం స్వాతి గర్భవతిగా ఉన్న సమయంలో కూడా చిత్రహింసలకు గురి చేయడంతో అబార్షన్ అయ్యిందని, తరచూ స్వాతిని మద్యం సేవించి చిత్రహింసలకు గురి చేసే వాడని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం స్వాతిని గొంతు నులుమి హతమార్చిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మధు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఇంట్లోని ఫ్యాన్‌కు స్వాతిని వేలాడతీసి ఉరిగా నమ్మించేందుకు ఇంటి ముందు తలుపును మూసివేశాడు. వెనుక తలుపుల నుంచి తాను ఇంటి బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి నా భార్య ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుందని సమాచారం అందించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అప్పటికే మృతిచెందిన స్వాతి మృతదేహాన్ని చూసే సరికి మధు సంఘటన స్థలంలో ఉండకపోవడంతో పాటు ఇంటి వెనుక నుంచి పరారవుతుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. వివాహేతర సంబంధమే కారణమా ..? మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వరనగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన హత్య ఘటనకు వివాహేతర సంబంధమే కారణమా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామానికి చెందిన ఓ మహిళతో మధు సఖ్యతగా ఉంటూ తన ఇంట్లోనే ఓ గదిలో అద్దెకు ఉంచినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇది లా ఉండగా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ హత్యకు సహకరించిందనే కారణంతో బుధవారం గ్రామస్తులు, మృతురాలి బంధువులు మహిళను చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని భీష్మించారు. చివరకు సాయంత్రం 4 గంటల సమయంలో మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత భార్యను భర్త హతమార్చడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాంపల్లి, కొండమల్లేపల్లి సీఐలు బాల గంగిరెడ్డి, శివరాంరెడ్డిలు బందోబస్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ రవికుమార్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ దేవదాసు పంచనామా నిర్వహించారు. చింతపల్లి ఎస్ఐ నాగభూషణ్‌రావు, మల్లేపల్లి ఎస్ఐ శంకర్‌రెడ్డి, నాంపల్లి ఎస్ఐ ప్రకాశ్‌రెడ్డి, మర్రిగూడ ఎస్ఐ రాజు బందోబస్తు నిర్వహిస్తున్నారు.