నార్నూర్(ఆసిఫాబాద్) : మండలంలోని ఉమ్రి గ్రామంలో జాదవ్ మమత (వందనబాయి) (25)ను వరకట్నం కోసం వేధించి భర్త, అత్త మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఉట్నూర్ సీఐ జాదవ్ గణపతి తెలిపిన వివరాల ప్రకా రం.. బేల మండలం సాంగ్వి గ్రామ పం చా యతీ పరిధిలోని సైద్‌పూర్ శాసాతండాకు చె ందిన రాథోడ్ ప్రేందాస్, పూలబాయి దంపతు ల కూతురు మమతను ఉమ్రి గ్రామానికి చెం దిన జాదవ్ సుధామ్‌కు ఇచ్చి 2010 మే నెలలో పెళ్లి జరిపించారు. సుధామ్ వ్యవసాయం చేసు ్తండగా.. కొన్నాళ్లు కుటుంబంలో అందరూ కలిసిమెలసి ఉన్నారు. గతకొన్నేళ్లుగా అత్త కాశీ బాయి, భర్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పదిహేను రో జుల క్రితమే గ్రామపెద్దల సమక్షంలో పంచాయి తీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దంపతులకు కౌన్సెలింగ్ ఇ చ్చారు.
అయినా వారిలో మార్పు రాలేదు. ఇదే క్రమంలో గురువారం రాత్రి మమతను భర్త సుధామ్, అత్త కాశీబాయి అదే గ్రామానికి చెం దిన కిషన్, మానిక్‌రావులతో కలిసి పథకం ప్ర కారం ఇంట్లో నిద్రిస్తుండగా హత్య చేశారని సీఐ తెలిపారు. కత్తితో గొంతుకోసి, రోకలితో తలపై మోదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సీఐ, ఎస్‌ఐ తమ సిబ్బందితో వెంటనే సంç œుటన స్థలానికి చేరుకున్నారు. నలుగురు నింది తులను అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహంతో ఉన్న మృత్యురాలి బంధువులు మమతను దా రుణంగా హత్య చేసిన వారిని శిక్షించాలని డిమా ండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సీఐ జాదవ్ గ ణపతి వారితో మాట్లాడి శాంతింపచేశారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమి త ్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు రెండేళ్ల కూతురు, ఆరునెలల కుమారు డున్నారు. ఆమె తండ్రి ప్రేందాస్ ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తుననట్లు సీఐ తెలిపారు.
కట్నం కోసం కడతేర్చారు
Published Sat, Sep 23 2017 2:36 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
Advertisement