
సాక్షి, వెంకటాపురం: పక్కా ప్లాన్‌తో భార్యను హతమార్చి తప్పించుకు తిరుగుతన్న భర్తను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సంచలనం సృష్టించిన వివాహిత హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమె భర్త తోట రమేష్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భార్యను హత్యచేసి పరారీలో ఉన్న నిందితున్ని వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు రమేష్ వద్ద నుంచి బంగారు గొలుసు, చెవిదుద్దులు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యను తనే హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అతడిని కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment