రాయ్‌పూర్ : ఎన్నికల విధులకు వెళ్లనివ్వడంలేదని భార్యను హత్య చేశాడు ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఈ నెల 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ గురువీర్ సింగ్ జగదల్‌పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తన భార్య అనుప్రియ గౌతమ్‌తో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 17న ఎన్నికల విధులకు కానిస్టేబుల్ వెళ్లాల్సి ఉంది. ఎన్నికల విధులకు వెళ్లొద్దని భార్య ఈ నెల 16వ తేది రాత్రి గురువీర్‌తో గొడవ పడ్డారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మపలికాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య చేసినట్లుగా తేలడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అనుప్రియను తానే గొంతునులిపి చంపినట్లుగా కానిస్టేబుల్ ఒప్పుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment