లాస్ ఏంజిల్స్‌లో రగిలిన కార్చిచ్చు అమెరికాను అతలాకుతలం చేసింది. కనీవినీ ఎరుగని ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది కనిపించకుండాపోయారు. సుమారు 50వేల ఎకరాలు నాశనమైపోయాయి. 12వేల నిర్మాణాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు బాధితులను ఆదుకునేందుకు సోషల్ మీడియా యూజర్లు,ఇతర దాతలు విరాళాలకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంత జరుగుతుంటే..ఘోర విపత్తు మధ్య జనం అల్లాడి పోతుంటే.. కనీస మానవత్వం మరిచిన కేటుగాళ్లు తన వక్రబుద్ధి చూపించిన దారుణ ఘటనలు వార్తల్లో నిలిచాయి.
ఘోరమైన మంటల మధ్య అగ్నిమాపక సిబ్బందిలా మారువేషంలో దోపీడీలకు తెగబడ్డారు కొంతమంది కేటుగాళ్లు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా, మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఆదివారం (జనవరి 12) కనీసం 29 మంది అరెస్టులు జరిగాయని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా ధృవీకరించారు. ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఒకరిని పట్టుకున్నట్టు చెప్పారు. 25 అరెస్టులు ఈటన్ ఫైర్ ప్రాంతంలో జరగగా, మరో నాలుగు పాలిసాడ్స్ ఫైర్ ప్రాంతానికి సమీపంలో జరిగాయి.
20250112 LOS ANGELES COUNTY CA
Wildfires
LA County District Attorney Nathan Hochman
- Looting, Arson and Use of Drones
- Scams: Internet Fundraising, Price Gouging, Bogus Government Benefits pic.twitter.com/qabZDXLaHN— Robert Waloven (@comlabman) January 12, 2025
ఇదీ చదవండి: లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్‌డేట్ ఇదే!
ఈ నేపథ్యంలో భద్రతరీత్యా దోపిడీని అరికట్టడానికి ప్రభావిత ప్రాంతాలకు 400 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. సోమవారం సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ వరకు అమలులో ఉంటుందని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జిమ్ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు.
మరోవైపు మంటల్లో చిక్కుకున్న బ్రెంట్‌వుడ్‌లోని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం సమీపంలో కర్ఫ్యూ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం మరిన్ని అరెస్టులు జరిగాయని కూడా అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment