wild fire
-
USA: రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలో రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. కాలిఫోర్నియా, నెవాడల్లో వేలాది ఎకరాలను కార్చిచ్చు మంటలు దహించివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల గవర్నర్లు అత్యవరస్థితి ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కౌంటీలో ఒక్కరోజులోనే 20,553 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను కార్చిచ్చుకాల్చి బూడిద చేసింది.మంటల భయంతో చాలా మంది కార్చిచ్చు ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు. కార్చిచ్చు ప్రభావంతో ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత నమోదువుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 8) రాత్రికి రాత్రే కార్చిచ్చు భారీగా విస్తరించింది. కార్చిచ్చును అదుపు చేసేందుకు వందలకొద్ది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడంతో గవర్నర్ గవిన్ న్యూసమ్ అత్యవసర స్థితి ప్రకటించారు. కార్చిచ్చును అరికట్టేందుకు అగ్నిమాపక శాఖకు అదనపు సిబ్బంది, నిధులు, పరికరాలను అందజేశారు. గ్రీన్ వ్యాలీ, సీడర్ గ్లెన్, లేక్యారో హెడ్, క్రిస్ట్లైన్, వ్యాలీ ఆఫ్ ఎన్క్యాచ్మెంట్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.బేస్‌లైన్, అల్పిన్ స్ట్రీట్ వద్ద గురువారం రాత్రి అడవిలో పిడుగు పడడం వల్ల కార్చిచ్చు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత గాలి తోడవడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం మూడు వేల ఎకరాలు, శనివారం ఏడు వేల ఎకరాలను కాల్చి బూడిద చేసింది. మరోవైపు నెవాడ రాష్ట్రంలో కూడా కార్చిచ్చుల కారణంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు గవర్నర్ జోయి లాంబర్డో ప్రకటించారు. ఇదీ చదవండి.. మూడేళ్ల చిన్నారిని రక్షించడంలోడ్రోన్ సాయం -
USA: టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కార్చిచ్చు రెండింతలవడానికి కారణమైందని వాతావరణ శాఖ తెలిపింది. 780 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 2 లక్షల ఎకరాల్లో వృక్షాలు కార్చిచ్చుకు ఆహుతయ్యాయని ఎఅండ్‌ఎమ్ ఫారెస్ట్ సర్వీస్ తెలిపింది. వీటిలో అతి పెద్ద కార్చిచ్చు స్మోక్ హౌస్ క్రీక్ ఫైర్ లక్ష ఎకరాలు, గ్రేప్ వైన్ క్రీక్ ఫైర్ 30 వేల ఎకరాలు, విండీ డ్యూసీ ఫైర్ 8 వేల ఎకరాలను దహించి వేసింది. కార్చిచ్చు బీభత్సం కారణంగా పలు కౌంటీల్లో ప్రజలను తరలిస్తున్నారు. తూర్పు టెక్సాస్, ద మిల్స్ క్రీక్, సాన్‌జాసిన్టోల్లో కార్చిచ్చు ఎగిసిపడుతోంది. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు పరిస్థితిని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ సమీక్షించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. I have a prayer request for y’all. The Texas Panhandle is on fire with zero containment. I don’t live in the panhandle but Texas is the home I live in currently and been in. Please pray for all in the path of this. Pray for Texas 🙏♥️ pic.twitter.com/U9R5Syb2kE — Rachel Wilson (@RachelWilson94) February 28, 2024 ఇదీ చదవండి.. మాలిలో ఘోర బస్సు ప్రమాదం -
కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌయి ప్రమాద బాధితులను కలిసి ఓదార్చే క్రమంలో కార్చిచ్చును 15 ఏళ్ల క్రితం తన వంటింట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పోల్చారు. ఆనాడు తాను తన భార్య ఇలాంటి ప్రమాదంలోనే ఇంటిని కోల్పోయిన సంఘటనను గుర్తుచేస్తూ ఆ బాధని వివరించే ప్రయత్నం చేశారు. . ఆగస్టు 8న హవాయిలోని మౌయి ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చు పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 114 మంది మరణించగా ఎందరో నిరాశ్రయులయ్యారు. జో బైడెన్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన వారిని కలిసి ఓదార్చారు. బాధితులతో జో బైడెన్ మాట్లాడుతూ ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత విషాదకరమైనదిగా వర్ణించారు. నేను ఈ పరిస్థితులను పోల్చడం లేదు కానీ ఉన్న ఇంటిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. 15 ఏళ్ల క్రితం నేను నా భార్య జిల్ బైడెన్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాము. నా నివాసానికి సమీపంలోని ఒక చెరువులో పిడుగు పడటంతో ఎయిర్ కండీషన్ వైరు ద్వారా ఆ మంటలు మా ఇంటిలో కూడా వ్యాపించాయి. ఇల్లు మొత్తం తగలబడింది. ప్రమాదంలో నా కారును, నా పెంపుడు పిల్లిని కోల్పోయానని.. ఆరోజు అగ్నిమాపక దళాలు సమయానికి స్పందించడంతో నేను నా కుటుంబం ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొలిన్ రగ్ అనే మీడియా ప్రతినిధి అమెరికాఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తన ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎందరో ప్రాణాలను హరించిన దావానలాన్ని అమెరికా అధ్యక్షుడు ఒక కట్టు కథ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లో జరిగిందని చెప్పిన అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందిని అడిగితే అదంతా వట్టి కట్టు కథని అలాంటిదేమీ జరగలేదని తోసిపుచ్చారని తెలిపారు. ఈ ప్రమాదాన్ని నియంత్రించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ చాలా నిదానంగా వ్యవహరించిందని ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన లాహైన్ నగరంలో ఎక్కడ చూసినా శిధిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రమాదంలో 114 మంది మరణించగా కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోగా ఎందరో నిరాశ్రయులై అత్యవసర సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు. NEW: President Biden once again tries to make the Maui fire that killed ~500 people about himself by telling a story about how he almost lost his corvette in a house fire. You can always count on Biden to tell a story that didn’t happened. “I don't want to compare difficulties,… pic.twitter.com/FI4bR85erR — Collin Rugg (@CollinRugg) August 22, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోద -
హవాయి ద్వీపంలో కార్చిచ్చు.. బుగ్గిపాలైన నగరం (ఫొటోలు)
-
Hawaii: కార్చిచ్చు కమ్మేసి 36 మంది దుర్మరణం!
సుందర హవాయి దీవుల్లో కార్చిచ్చు ప్రాణ నష్టం.. ఊహించని రీతిలో పెను నష్టం మిగిల్చింది. నలువైపులా నుంచి అగ్ని కీలలు ఎగసి పడగా.. అదే సమయంలో పెనుగాలులు తోడవ్వడంతో పెను విషాదం మిగింది. 36 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. మౌయి ద్వీపంలోని రిసార్ట్ నగరం లహైనా బుగ్గిపాలైన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడవుల్లో కార్చిచ్చు రాజుకోగా.. హరికేన్ గాలులతో ఆ మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు తలోదిక్కు పరుగులు తీశారు. మరోవైపు మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడుతూ.. గాలుల కారణంగా మరింత త్వరగా వ్యాపించుకుంటూ పోయాయి. దీంతో.. భారీ నష్టం సంభవించింది. సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి బృందాలు. ‘‘ఇప్పటివరకు చూడని ఘోరమైన విపత్తును మేము ఎదుర్కొన్నాము. లహైనా మొత్తం కాలిపోయింది. ఇది ఒక అపోకలిప్స్(ఘోర విపత్తు) లాంటిది అని ప్రాణాలు రక్షించుకున్న లహైనా వాసులు చెబుతున్నారు. చాలామంది మంటలు, పొగ నుంచి రక్షించుకునేందుకు పసిఫిక్ మహాసముద్రంలోకి దూకేశారు. ఒక బాంబు పడితే.. ఒక యుద్దం జరిగితే ఎలా ఉంటుందో.. అలా మారిపోయింది ఆ నగరం పరిస్థితి. హవాయ్ దీవుల్లోనే మౌయి Maui అతిపెద్ద ద్వీపం. చారిత్రకంగానూ దీనికి ఓ గుర్తింపు ఉంది. అందులో ప్రధాన పర్యాటక ప్రాంతం(నగరం) లహైనానే. మంగళవారం రాత్రి అడవుల్లో ప్రారంభమైన మంటలు.. వేల ఎకరాలను నాశనం చేశాయి. దీనికి తోడు తుపాను గాలుల ప్రభావంతో అగ్నికీలలు అన్నివైపులా శరవేగంగా వ్యాపించాయి. పశ్చిమ భాగం ద్వీపం దాదాపు తుడిచిపెట్టుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు అలజడి
వాషింగ్టన్ : కాలిఫోర్నియాను కార్చిచ్చు దహించివేస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపకదళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మంటల కారణంగా ఆరెగాన్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు ప్రజలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ కోతలను అధిగమించటానికి వీలైనంత తక్కువగా విద్యుత్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఇందుకోసం ఐదు గంటల ‘ప్లెక్స్ అలర్ట్’ను ప్రకటించారు. ఈ అలర్ట్ సాయంత్రం 4 గంటలనుంచి ప్రారంభమవుతుంది. కాగా, ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు అలజడి రేపుతోంది. శనివారం మొహావే కౌంటీలో అగ్ని తీవ్రతపై సర్వే నిర్వహిస్తున్న చిన్న విమానం పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిని ఎయిర్ టాక్టికల్ గ్రూప్ సూపర్వైజర్ జెఫ్ పిచుర్రా, మాజీ టక్సన్ ఏరియా ఫైర్ చీఫ్ మాథ్యూ మిల్లర్లుగా గుర్తించారు. ఈ కార్చిచ్చు ఆదివారం నాటికి 83,256 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. దాదాపు 20 ఇళ్లను నాశనం చేసింది. కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. శనివారం మొజావే డెసెర్ట్‌లో 53 డిగ్రీల సెల్సియస్(127 ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఫర్నెస్ క్రీక్ డెసెర్ట్‌లో ఏకంగా 57 డిగ్రీల సెల్సియస్(135ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1913 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉష్టోగ్రతలు నమోదు కావటం ఇదే ప్రథమం. -
అగ్ని గుండంలా మారిన కాలిఫోర్నియా
-
వేరే దేశాలకు ఈ సమస్య లేదు: ట్రంప్
సాక్షి, వాషింగ్టన్: అమెరికా అడవులలో రాజుకున్న అగ్ని రోజురోజుకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మంటలు అనేక రాష్ట్రాలకు విస్తరించి 35 మందికి పైగా ప్రాణాలు కోల్పొయిన సంగతి తెలిసిందే. దీని గురించి విపక్షాలు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించాయి. తన ప్రచారంలో ఎక్కడా కాలిఫోర్నియా ఫైర్ గురించి మాట్లాడలేదని నిలదీశాయి. దీంతో ట్రంప్ స్పందించారు. మంటలు అనేది వాతావరణానికి సంబంధించిన విషయం కాదని, మేనేజ్మెంట్కు సంబంధించిన విషయం అని ట్రంప్ పేర్కన్నారు. త్వరలోనే మంటలు చల్లబడతాయని తెలిపారు. మంటలపై విపక్షాలు ప్రశ్నించగా ఆయన ఫైర్ ఫైటర్స్‌ని కలిశారు. వాతావారణ మార్పే దీనికి కారణమా అని ఒక రిపోర్టర్ ట్రంప్‌ని ప్రశ్నించగా వేరే దేశాలకు ఈ సమస్య లేదని, ఆ దేశాలలో తొందరగా మంటలు అంటుకునే చెట్లు ఉన్నాయని, కానీ వారు అలాంటి సమస్యలు ఎదరుర్కోవడంలేదని ట్రంప్ తెలిపారు. అందుకే ఇది వాతావరణ మార్పులకు సంబంధించిన మార్పు కాదు, మేనేజ్మెంట్కు సంబంధించిన విషయం అని తెలిపారు. త్వరలోనే మంటలు చల్లబడతాయి మీరే చూడండి అని ట్రంప్ తెలిపారు. ఆ విషయం సైన్స్‌కు సంబంధించిన విషయం కాదని తాను అనుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు. చదవండి: మొత్తం పోయింది: కాలిఫోర్నియా బాధితుల ఆవేదన -
మొత్తం పోయింది: కాలిఫోర్నియా బాధితుల ఆవేదన
వాషింగ్టన్: యూఎస్‌లోని కాలిఫోర్నియా అడవులలో ఆగస్టులో చెలరేగిన మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 24 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. అపార ఆస్తి నష్టం జరిగింది. అమెరికాలోని మూడు వెస్ట్ కోస్ట్ రాష్ట్రాలలో ఈ మంటలు వ్యాపించాయి. దీంతో ఒరెగానేలో ఐదు లక్షల మందిని ఆ ప్రాంతం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. ఒరెగానేలో చిన్నగా మంటలు చెలరేగాయని, రాష్ట్ర అత్యవసర నిర్వహణ అధికారులు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక మెలిల్లా నగరం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో అక్కడ ఉంటున్న 9000 మందిని ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వీరిలో అందరూ నగరాన్ని విడిచి వెళ్లడానికి అంగీకరించినా కేవలం 30 మంది మాత్రమే తమ ఇళ్లను ఖాళీ చేయడానికి అంగీకరించలేదు. వర్షం మాత్రమే ఈ మంటలు ఆగటానికి సహకరించగలదని, గాలి వేగం తగ్గడం, తేమశాతం పెరిగితే ఫైర్ ఫైటర్స్‌కు కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ప్రకృతి తమకు అనుకూలిస్తుందని భావిస్తున్నట్లు అటవీ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: చల్లారని కాలిఫోర్నియా కార్చిచ్చు -
చల్లారని కాలిఫోర్నియా కార్చిచ్చు
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు చెలరేగిపోతోంది. ఇప్పటి వరకు ఈ మంటల్లో చిక్కుకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు. వేలాది గృహాలు, ఇతర నిర్మాణాలు దగ్థమయ్యాయి. ఈ సంవత్సరం కాలిఫోర్నియా అడవిలో ఏర్పడిన మంటల్లో ఇప్పటివరకు 11 మంది మరణించారు. మూడు వారాలకుపై నుంచి ఉత్తర కాలిఫోర్నియా అడవులలో మంటలు చెలరెగుతున్నాయి. గాలులు బలంగా, వేగంగా వీస్తుండటంతో మంటలు దావానంలా అంటుకుంటున్నాయి. ఈ మంటల కారణంగా అనేక గృహాలు దగ్ధమయ్యాయి. ఒరోవిల్లే సమీపంలో ఉన్న కమ్యూనిటీలలోని వేలాది మందిని అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయమని కోరారు. బుధవారం అగ్నికీలలు తీవ్ర రూపం దాల్చి భిన్నమైన నారింజ రంగు మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు అక్కడి వారిని ఖాళీ చేయాలని ఆదేశించారు. పారడైజ్‌లో రెండేళ్ల క్రితం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఘోరమైన మంటలు చెలరేగి పట్టణం సర్వనాశనమైంది. దీంతో అక్కడ ఉన్నవారందరూ బెంబేలెత్తుతున్నారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్ స్తంభించింది. లాస్ఏంజెలెస్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని వాతావరణ శాస్త్రవేత్త డేనియల్ స్వైన్ మాట్లాడుతూ, 24 గంటల్లో మంటలు సుమారు 400 చదరపు మైళ్ళు (1,036 చదరపు కిలోమీటర్లు) వ్యాపించాయని, అక్కడ ఉన్నవన్ని కాలిపోయాయని తెలిపారు. వాష్టింగ్టన్లో కూడా ఇప్పటి వరకు చూడని విధంగా ఒక్కరోజులో అనేక ఎకరాలు కాలిపోయాయి అని ఫైర్ ఫైటర్స్ చెప్పారు. కాలిఫోర్నియాలో ఈ ఏడాది ఇప్పటికే 2.5 మిలియన్ ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. చదవండి: ఆగని కార్చిచ్చు.. పైలట్ మృతి -
ఆగని కార్చిచ్చు.. పైలట్ మృతి
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో చేలరేగిన కార్చిచ్చు చల్లారడం లేదు. మంటలను ఆర్పడానికి పోరాడుతున్న ఒక హెలికాప్టర్ కూలడంతో పైలట్ చనిపోయాడు. గడిచిన 72 గంటల్లో కాలిఫోర్నియా దాదాపు 11,000 మెరుపు దాడులకు గురయ్యింది. ఫలితంగా 367 మంటలు చెలరేగాయి. ఉత్తర కాలిఫోర్నియా వైన్ ప్రాంతంలో 50 కి పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అక్కడ నివసిస్తున్న వేలాది మంది తమ ఇళ్ల నుంచి పారిపోయారు. సెంట్రల్ కాలిఫోర్నియాలో, శాన్ఫ్రాన్సిస్కోకు దక్షిణాన 160 మైళ్ళు (258 కి.మీ) దూరంలో ఫ్రెస్నో కౌంటీలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న ఒక హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో అందులో ఉన్న పైలట్ మృతి చెందాడని కాలిఫోర్నియా అటవీ,అగ్నిమాపక రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శాన్ఫ్రాన్సిస్సోకు ఉత్తరాన, వాకావిల్లే నగరానికి సమీపంలో 46,000 ఎకరాల (18,615 హెక్టార్ల) విస్తీర్ణంలో కొండలు, పర్వత ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. ఫలితంగా 50 గృహాలు, ఇతర నిర్మాణాలు కాలి బూడిద అయ్యాయి. సాక్రమెంటోకు నైరుతి దిశలో 30 మైళ్ళ దూరంలో 100,000 మంది నివసిస్తున్న నగరంలో పాక్షిక తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్ఎన్యు లైట్ కాంప్లెక్స్ ఫైర్‌గా పిలవబడే అగ్ని కీలలు పడమటి వైపున ఉన్న గృహాలను తగలబెట్టాయి. జనాలు తమ పశుసంపదను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. చనిపోయిన పశువులు, ఆస్తులకు సంబంధించిన ఫోటోలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘గతంలో ఎన్నడు ఇంత తీవ్రమైన మంటలను చూడలేదు. ఎన్నడు లేని వినాశకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాము’ అని తెలిపారు. (వైరల్ వీడియో: మంటలార్పడానికి వెళ్తే..) 2017 లో ఉత్తర కాలిఫోర్నియా అంతటా మంటలు సంభవించాయి. ఫలితంగా 44 మంది చనిపోయారు. అనేక వైన్ తయారీ కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 9,000 గృహాలు, ఇతర నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. పాలో ఆల్టోకు తూర్పున 20 మైళ్ళ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఎస్సీయూ ఫైర్ కాంప్లెక్స్‌గా పిలువబడే మంటలు రాత్రికి రాత్రే రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం 85,000 ఎకరాలకు పైగా మంటలు విస్తరించాయి. ఆగస్టు సీజడ్యూ ఫైర్ కాంప్లెక్స్ వల్ల చేలరేగిన మంటలు సుమారు 10,000 ఎకరాలకు పైగా వ్యాపించాయి. అలానే పశ్చిమాన, కరువుతో బాధపడుతున్న కొలరాడో బుధవారం చరిత్రలో రెండవ అతిపెద్ద అడవి మంటను ఎదుర్కొంది. పైన్ గుల్చ్ బ్లేజ్ 125,100 ఎకరాలలో కాలిపోవడమే కాక ఉరుములు, మెరుపులు సంభవించాయి. ఈ మంటల విస్తీర్ణం వ్యాప్తి డెన్వర్ నగరం కంటే అధికంగా ఉందని అధికారులు తెలిపారు. -
ఆస్ట్రేలియాలో ఆరని కార్చిచ్చు
-
కార్చిచ్చు మృతులు 59
ప్యారడైజ్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పే ప్రయత్నాలు ఏడో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. కార్చిచ్చు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య మొత్తంగా 59కి పెరిగింది. 130 మంది ఆచూకీ లేకుండా పోవడంతో వారి జాడను కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. ప్యారడైస్ పట్టణంలోని బుటె కౌంటీలో అత్యధిక మంది తప్పిపోయినట్లు సమాచారం. సియార్రా నెవడా పర్వతాల దిగువన 26 వేల మంది జనాభా నివసించిన ప్యారడైజ్ పట్టణం కార్చిచ్చు ధాటికి పూర్తిగా దగ్ధమైపోవడం తెలిసిందే. ఈ పట్టణంలో ఎక్కువగా ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన వృద్ధులే నివసిస్తారు. -
కాలిఫోర్నియాను చుట్టేసిన కార్చిచ్చు
-
25కు చేరిన కార్చిచ్చు మృతులు
ప్యారడైజ్: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు వ్యాప్తి స్తోంది. కార్చిచ్చు బారినపడి ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు అధికారులు ప్రకటిం చారు. శనివారం మరో 14 మృతదేహాలను గుర్తించారు. ఇందులో 10 మృతదేహాలు ఒక్క ప్యారడైజ్ నగరంలోనే స్వాధీనం చేసుకున్నారు. ప్యారడైజ్‌లో ఇప్పటివరకు 6,700కు పైగా ఇళ్లు అగ్ని అహుతి కాగా, మొత్తం 19 మంది మరణించారు. కార్చిచ్చు ధాటికి లక్ష ఎకరాలకు పైగా అడవి అగ్నికి ఆహుతి కాగా, ఒక్క వెంచురాకౌంటీ ప్రాంతంలోనే 15వేల ఎకరాలు బూడిదయింది. మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు మరో 3 వారాలు పడుతుందని అధికారులు అంటున్నారు. -
స్పెయిన్ యంత్రాంగం ఉరుకులు పరుగులు
మాడ్రిడ్(స్పెయిన్): అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు స్పెయిన్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. వెర్డాంట్ గలీసియా ప్రాంతంలోని వెరిన్ పట్టణ సమీపంలో గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన మంటలు ఇప్పటి వరకు మూడువేల ఎకరాల్లో అడవిని బూడిదగా మార్చేశాయి. ఎండలు, వేడి గాలులు దీనికి తోడుకావటంతో మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు 400మంది ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వీరితోపాటు 12 హెలికాప్టర్లు, ఏడు ప్రత్యేక విమానాలతో నీళ్లు చల్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంటలు అదుపులోకి రానప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకున్నామని ఫైర్ అధికారులు తెలిపారు. పొరుగునే ఉన్న పోర్చుగల్ అడవుల్లో గత జూన్‌లో చెలరేగిన మంటలు 64మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. వీరంతా మంటల బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నవారే కావటం గమనార్హం.