వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌయి ప్రమాద బాధితులను కలిసి ఓదార్చే క్రమంలో కార్చిచ్చును 15 ఏళ్ల క్రితం తన వంటింట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పోల్చారు. ఆనాడు తాను తన భార్య ఇలాంటి ప్రమాదంలోనే ఇంటిని కోల్పోయిన సంఘటనను గుర్తుచేస్తూ ఆ బాధని వివరించే ప్రయత్నం చేశారు. .
ఆగస్టు 8న హవాయిలోని మౌయి ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చు పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 114 మంది మరణించగా ఎందరో నిరాశ్రయులయ్యారు. జో బైడెన్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన వారిని కలిసి ఓదార్చారు.
బాధితులతో జో బైడెన్ మాట్లాడుతూ ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత విషాదకరమైనదిగా వర్ణించారు. నేను ఈ పరిస్థితులను పోల్చడం లేదు కానీ ఉన్న ఇంటిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. 15 ఏళ్ల క్రితం నేను నా భార్య జిల్ బైడెన్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాము. నా నివాసానికి సమీపంలోని ఒక చెరువులో పిడుగు పడటంతో ఎయిర్ కండీషన్ వైరు ద్వారా ఆ మంటలు మా ఇంటిలో కూడా వ్యాపించాయి. ఇల్లు మొత్తం తగలబడింది. ప్రమాదంలో నా కారును, నా పెంపుడు పిల్లిని కోల్పోయానని.. ఆరోజు అగ్నిమాపక దళాలు సమయానికి స్పందించడంతో నేను నా కుటుంబం ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొలిన్ రగ్ అనే మీడియా ప్రతినిధి అమెరికాఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తన ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎందరో ప్రాణాలను హరించిన దావానలాన్ని అమెరికా అధ్యక్షుడు ఒక కట్టు కథ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లో జరిగిందని చెప్పిన అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందిని అడిగితే అదంతా వట్టి కట్టు కథని అలాంటిదేమీ జరగలేదని తోసిపుచ్చారని తెలిపారు.
ఈ ప్రమాదాన్ని నియంత్రించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ చాలా నిదానంగా వ్యవహరించిందని ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
సుదీర్ఘ చరిత్ర కలిగిన లాహైన్ నగరంలో ఎక్కడ చూసినా శిధిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రమాదంలో 114 మంది మరణించగా కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోగా ఎందరో నిరాశ్రయులై అత్యవసర సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు.
NEW: President Biden once again tries to make the Maui fire that killed ~500 people about himself by telling a story about how he almost lost his corvette in a house fire.
— Collin Rugg (@CollinRugg) August 22, 2023
You can always count on Biden to tell a story that didn’t happened.
“I don't want to compare difficulties,… pic.twitter.com/FI4bR85erR
ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోద
Comments
Please login to add a commentAdd a comment