disaster
-
నిజమవుతున్న నోస్ట్రాడమస్, బాబా వంగా హెచ్చరికలు?
న్యూఢిల్లీ: భూకంపం.. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోతున్న ఒక ప్రకృతి విపత్తు. కొన్ని వేల ఏళ్లుగా భూకంపాలు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 17)న దేశరాజధాని ఢిల్లీలో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను భయకంపితులను చేసింది. అయితే భవిష్యత్ అంచనాల గురించి తెలిపిన నోస్ట్రాడమస్, బాబా వంగా భూకంపాలు, ప్రకృతి విపత్తులపై ఎటువంటి హెచ్చరికలు చేశారు?నోస్ట్రాడమస్ తన కవితలలో తరచుగా ప్రకృతి వైపరీత్యాల గురించి తెలిపేవాడు. భూమి కంపించటం, నదులు ఉప్పొంగటం లాంటి పర్యావరణ సంక్షోభ హెచ్చరికలను ముందుగానే తెలియజేశాడు. 2025లో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని నోస్ట్రాడమస్ ముందుగానే తెలిపాడు. ఈయన చెప్పినట్లే సముద్ర మట్టాలు పెరగడం, మంచు వేగంగా కరగడం, వాతావరణంలో వేగవంతమైన మార్పుల గురించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. నోస్ట్రాడమస్ తన పుస్తకంలో కార్చిచ్చు, కరువు, భారీ వరదలు మొదలైన వాటి గురించి రాశాడు. భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని నోస్ట్రాడమస్ పేర్కొన్నాడు.2025లో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రాడమస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సూడాన్‌లో కరువు, పరిమిత సహాయం, పెద్ద ఎత్తున వలసలు లాంటి మానవతా సంక్షోభం ఎదురవుతుందన్నాడు. దీనికి అనుగుణంగానే బషర్ అల్-అసద్ పతనం తర్వాత సిరియాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది.బాబా వంగా 2025లో సంభవించే విపత్తుల గురించి కొన్న అంచనాలు అందించారు. యూరప్‌లో భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఈ ఖండంలోని అధిక జనాభా నాశనమవుతుంది. బాబా వంగా జోస్యం ఒకవేళ నిజమైతే 2025లో రష్యా.. ప్రపంచాన్నంతటినీ శాసిస్తుంది. బాబా వంగా చెప్పినదాని ప్రకారం 2025లో అమెరికా పశ్చిమ తీరంలో భూకంపం వస్తుంది. పలు అగ్నిపర్వతాలు పేలే అవకాశాలున్నాయి. నోస్ట్రాడమస్ 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. అతని అంచనాలు కొన్ని శతాబ్దాలుగా నిజమవుతున్నాయి. బల్గేరియన్ మహిళ బాబా వంగా చెప్పిన 9/11 దాడి, యువరాణి డయానా మరణం లాంటి అంచనాలు నిజమయ్యాయి.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
భారీ బడ్జెట్ చిత్రాలు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్!
కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో పాటే మనం పరిగెత్తాల్సిందే కానీ నీకోసం ఈ ప్రపంచంలో ఏది వేచి ఉండదు. అలా కర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కాలం. చూస్తుండగానే మరో ఏడాది కనుమరుగవుతోంది. ఈ కాలమనే భూగర్భంలో 2024 కలిసిపోనుంది. కొత్త ఆశలతో మరో ఏడాది అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ ఏడాది అయినా సక్సెస్ సాధించాలని కోరుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. మరి ఈ ఏడాది సినీ పరిశ్రమకు కలిసొచ్చిందా? లేదా? అనేది చూద్దాం.మరి ఈ ఏడాది సినీ పరిశ్రమ కొంతవరకు సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్తీ-2 లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరికొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అనూహ్యంగా చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. మరి 2024లో విడుదలై బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో మనం ఓ లుక్కేద్దాం. ఇండియన్-2- నిరాశపరిచిన సీక్వెల్28 ఏళ్ల క్రిత శంకర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఇండియన్(భారతీయుడు). ఈ మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కమల్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. కమల్ హాసన్ నటనతో మెప్పించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.సూర్య కంగువాకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది.రామ్ పోతినేని- డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అదే కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్‌ను తీసుకొచ్చారు పూరి జగన్నాధ్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ నటన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా పేరును దక్కించుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.మోహన్ లాల్- మలైకోట్టై వాలిబన్మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ మూవీ మలైకోట్టై వాలిబన్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం వీజువల్ ఫీస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కథ, మోహన్ లాల్ నటన మెప్పించినప్పటికీ స్క్రీన్‌ప్లే మైనస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వాలిబన్ అనే ఓ యోధుని కథ ఆధారంగా ఈ మూవీని తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించారు.మహేశ్ బాబు- గుంటూరు కారంఈ ఏడాది సంక్రాంతికి రీలీజైన టాలీవుడ్ చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈచిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గతంలో సూపర్ హిట్స్ కావడంతో అదేస్థాయిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా అభిమానులను ఆకట్టుకుంది.మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, క, వాజై, మెయిజగన్ వంటి చిత్రాలు పెద్ద కమర్షియల్ హిట్ సాధించాయి. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. -
ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
గడ్డకట్టే చలిలో గజగజలాడిపోయిన ప్రజలు అని వార్తల్లో వింటుంటాం. అంతెందుకు అందరూ ఇష్టపడే టైటానిక్ మూవీలో 1912 నాటి విపత్తు ఘన చూపించారు. ఆ మూవీలో అంట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతం ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయిన సీన్లోని హృదయవిదారక దృశ్యాలు అందర్ని కంటతడి పెట్టిస్తాయి. అయితే దీని గురించి సినిమాల్లోనూ, వార్తల్లో వినటమే గానీ గడ్డకట్టే చలి ఎలా ఉంటుందో అనేది రియల్‌గా తెలియదు. ఆ ఫీల్ కావాలనుకుంటే ఈ మ్యూజియం వద్దకు వెళ్లిపోండి. అమెరికాలో టెన్నెస్సీలోని టైటానిక్ మ్యూజియం ఈ సరికొత్త అనుభూతిని సందర్శకులకు అందిస్తోంది. టైటానిక్ ఓడ మునిగినప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఉష్ణోగ్రత(రెండ డిగ్రీల సెల్సియస్)ని చవిచూడొచ్చు. 400కి పైగా టైటానిక్ ప్రామాణిక కళాఖండాలు కలిగి ఉన్న మ్యూజియం సందర్శకులకు ఓ గొప్ప అనుభూతిని అందిస్తోంది. గడ్డకట్టే నీటిలో అనుభవాన్ని పొందుతున్న సందర్శకులు వీడియోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ప్రతి సందర్శకుడు మంచుకొండను తాకిని ఫీల్ కలుగుతుందని చెబుతుండటం చూడొచ్చు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి టైటానిక్ ఓడ మునిగిపోయినప్పుడూ చనిపోయిన యాత్రికులు ఎంత బాధ అనుభవించి ఉంటారో అని తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి అంటూ పోస్టులు పెట్టారు.At the Titanic Museum you can find this basin filled with water, set to the exact temperature that the people in the surrounding waters would have had to swim in after the ship sank. The ocean temperature was about 30°F.pic.twitter.com/38e9jjXjEh— Massimo (@Rainmaker1973) September 11, 2024 (చదవండి: ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!) -
Himachal: వరదలతో అతలాకుతలం.. 18 మంది మృతి, 37 మంది గల్లంతు
ముంచెత్తుతున్న వరదలతో హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరదల కారణంగా 18 మంది మృతిచెందగా, 37 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటూ వరద హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలోని బిలాస్పూర్, హమీర్పూర్, కులు, కాంగ్రా, మండీ, సోలన్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాలలో ఆగస్టు 7 నుండి 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో ఉనాలో 40.2, బిలాస్పూర్లో 25.8, సిమ్లాలో 19, కుఫ్రీలో 13.4, పాంటా సాహిబ్‌లో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో తలెత్తిన ప్రతికూల పరిస్థితుల కారణంగా 53 రహదారులలో రాకపోకలను నిలిపివేశారు.సిమ్లా, కులు, మండి జిల్లాల్లోని ఏడు చోట్ల వరదల కారణంగా పలువురు గల్లంతుకాగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అలాగే రాంపూర్‌లోని సమేజ్ నుండి సట్లెజ్ కాలువలోకి కొట్టుకుపోయిన ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. సిమ్లాలోని రాజ్‌భవన్ నుంచి కులు జిల్లాకు రెండు సహాయ సామగ్రి వాహనాలు తరలివెళ్లాయి. -
అమెరికాలో సుడిగాలుల బీభత్సం
వ్యాలీ వ్యూ (టెక్సాస్): అమెరికాలో టెక్సాస్, ఒక్లహామా, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో భీకర సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ట్రక్కుల పార్కింగ్ స్టేషన్, ఇళ్లను తుడిచిపెట్టేస్తూ సాగిన విధ్వంసకాండలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్లహామాలో టోర్నడోలు భీకర వినాశనానికి కారణమయ్యాయి. భీకర గాలుల ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ఇళ్లలో జనం అంధకారంలో మగ్గిపోయారు. -
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో కొండచరియలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. శుక్రవారం(మే24) సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో తొలుత 100 మందికిపైగా మృతి చెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి(యూఎన్) తాజాగా అంచనా వేసింది. ఈ విపత్తులో సుమారు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్)’తెలిపింది. గ్రామాలకు గ్రామాలే కొండచరియల కింద కూరుకుపోయినట్లు సమాచారం. మొత్తం 150 ఇళ్లు కొండ చరియల కింద శిథిలమయ్యాయని తేలింది. దీంతో 670 మంది సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. -
స్టార్ హీరో లేటేస్ట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బిగ్ షాక్!
మలయాళ స్టార్ మోహన్‌లాల్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని షాకిచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఝలక్ ఇచ్చింది. కేవలం రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో మలయాళంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది మలైకోట్టై వాలిబన్. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
సాధారణ బీమా మరింత విస్తరించాలి
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలు మరింత విస్తృతం కావాల్సిన ఆవశ్యకతపై ఇక్కడ జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశం చర్చించింది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. బీమా వ్యాప్తి, కవరేజీని పెంచడానికి రాష్ట్ర బీమా ప్రణాళికల కింద రాష్ట్రాలతో నిరంతర పరస్పర చర్యలు, చర్చల ద్వారా అవగాహన పెంపొందించడం అవసరమని సమావేశం భావించింది. సాధారణ బీమా రంగానికి సంబంధించిన అనేక క్లిష్టమైన అంశాలను వివరంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య బీమా వృద్ధిని పెంచడానికి నగదు రహిత సదుపాయాలను విస్తరించాలని, చికిత్స ఖర్చులను ప్రామాణీకరించడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమన్వయం పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఆస్తి, పారామెట్రిక్ బీమా కవర్ల స్వీకరణను ప్రోత్సహించడం... అలాగే సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని కవర్ చేయడానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించడం కీలకమని ఆర్థిక సేవల కార్యదర్శి ఉద్ఘాటించారు. బీమా మోసాలను నిరోధించడానికి సిబిల్ స్కోర్‌తో అనుసంధానించే అవకాశంపై కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఆయా అంశాల అమలుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్ సేవల అధికారులకు కార్యదర్శి సూచించారు. నిరంతర సహకారం, ప్రయత్నాలతో బీమా రంగం వృద్ధి సులభతరం కావడానికి చర్యలు అవసరమని పేర్కొన్న ఆయన, ఈ బాటలో ప్రైవేట్– ప్రభుత్వ రంగ పరిశ్రమలతో తరచూ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. -
కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌయి ప్రమాద బాధితులను కలిసి ఓదార్చే క్రమంలో కార్చిచ్చును 15 ఏళ్ల క్రితం తన వంటింట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పోల్చారు. ఆనాడు తాను తన భార్య ఇలాంటి ప్రమాదంలోనే ఇంటిని కోల్పోయిన సంఘటనను గుర్తుచేస్తూ ఆ బాధని వివరించే ప్రయత్నం చేశారు. . ఆగస్టు 8న హవాయిలోని మౌయి ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చు పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 114 మంది మరణించగా ఎందరో నిరాశ్రయులయ్యారు. జో బైడెన్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన వారిని కలిసి ఓదార్చారు. బాధితులతో జో బైడెన్ మాట్లాడుతూ ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత విషాదకరమైనదిగా వర్ణించారు. నేను ఈ పరిస్థితులను పోల్చడం లేదు కానీ ఉన్న ఇంటిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. 15 ఏళ్ల క్రితం నేను నా భార్య జిల్ బైడెన్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాము. నా నివాసానికి సమీపంలోని ఒక చెరువులో పిడుగు పడటంతో ఎయిర్ కండీషన్ వైరు ద్వారా ఆ మంటలు మా ఇంటిలో కూడా వ్యాపించాయి. ఇల్లు మొత్తం తగలబడింది. ప్రమాదంలో నా కారును, నా పెంపుడు పిల్లిని కోల్పోయానని.. ఆరోజు అగ్నిమాపక దళాలు సమయానికి స్పందించడంతో నేను నా కుటుంబం ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొలిన్ రగ్ అనే మీడియా ప్రతినిధి అమెరికాఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తన ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎందరో ప్రాణాలను హరించిన దావానలాన్ని అమెరికా అధ్యక్షుడు ఒక కట్టు కథ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లో జరిగిందని చెప్పిన అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందిని అడిగితే అదంతా వట్టి కట్టు కథని అలాంటిదేమీ జరగలేదని తోసిపుచ్చారని తెలిపారు. ఈ ప్రమాదాన్ని నియంత్రించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ చాలా నిదానంగా వ్యవహరించిందని ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన లాహైన్ నగరంలో ఎక్కడ చూసినా శిధిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రమాదంలో 114 మంది మరణించగా కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోగా ఎందరో నిరాశ్రయులై అత్యవసర సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు. NEW: President Biden once again tries to make the Maui fire that killed ~500 people about himself by telling a story about how he almost lost his corvette in a house fire. You can always count on Biden to tell a story that didn’t happened. “I don't want to compare difficulties,… pic.twitter.com/FI4bR85erR — Collin Rugg (@CollinRugg) August 22, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోద -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్‌రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్‌కు బిగ్ ఫెయిల్యూర్..?
111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి మంగళవారం గల్లంతయ్యింది. ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే.. ప్రముఖ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సర్వీస్ టైటాన్ యాత్రకు కమ్యునికేషన్ సర్వీస్‌ను అందిస్తోంది. దీంతో స్టార్‌లింక్ సర్వీస్ నిర్వాహణ తీరుపై కూడా విమర్శలు ఎదురువుతున్నాయి. Despite being in the middle of the North Atlantic, we have the internet connection we need to make our #Titanic dive operations a success - thank you @Starlink! pic.twitter.com/sujBmPr3JD — OceanGate Expeditions (@OceanGateExped) June 1, 2023 సాంకేతిక సమస్యా..? జలాంతర్గామి గల్లంతవడానికి ఇంటర్నెట్ ఒకటే సమస్య అని ఖచ్చితంగా చెప్పలేం. ఇతర సాంకేతిక సమస్యలు కూడా ఉండొచ్చు. కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత కూడా సబ్‌మెరైన్ పైకి రావడానికి కావాల్సిన వ్యవస్థ అందులో ఉంది. కానీ ఇప్పటివరకు జలాంతర్గామి జాడ తెలియకపోవడం ఇతర టెక్నికల్ సమస్యలను సూచిస్తోంది. The wreck of the Titanic lies about 400 miles off the coast of Newfoundland. Without any cell towers in the middle of the ocean, we are relying on @Starlink to provide the communications we require throughout this year’s 2023 Titanic Expedition. More: https://t.co/F7OtKI0En7 pic.twitter.com/wr7HeKlGjj — OceanGate Expeditions (@OceanGateExped) June 14, 2023 ఈ ప్రమాదంపై కమాండ్ షిప్లో విధులు నిర్వహించిన డేవిడ్ పోగ్ మరో కోణాన్ని వెల్లడించారు. జలాంతర్గామికి కమ్యూనికేషన్ పోయిన తర్వాత కూడా షార్ట్ మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుందని పోగ్ తెలిపారు. కానీ అదేమీ జరగలేదని చెప్పారు. అయితే.. సబ్‌మెరైన్ పరిస్థితులను బయటకు చెప్పకుండా కమాండ్ షిప్లో ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తారని చెప్పారు. ఇదీ చదవండి: టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ గల్లంతు.. అందులో పాక్ అత్యంత ధనవంతుడు ఖాతరు చేయలేదు..? జలాంతర్గామి వెల్లదలచిన లోతుపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఓషన్‌గేట్‌కు చెందిన ఉద్యోగి డేవిడ్ లిచర్డ్ తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షాంపిల్స్‌లో కూడా ఆయన అనేక లోపాలను గుర్తించినట్లు చెప్పారు. 4 వేల మీటర్ల వరకు జలాంతర్గామిని తీసుకువెళ్లడానికి సంస్థ నిర్ణయించింది. కానీ 1300 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై మాట్లాడిన ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు డేవిడ్ తెలిపారు. చర్చలతో ఆ వివాదం ముగిసినట్లు వెల్లడించారు. Wow. OceanGate, the company that owns the missing submersible, fired an employee a few years ago after he filed safety complaints against them. The employee specifically said the sub was not capable of descending to such extreme depths before he was fired.https://t.co/c3s2H3eVEr — Caroline Orr Bueno, Ph.D (@RVAwonk) June 20, 2023 స్టార్ లింక్కూ వైఫల్యమే..? ఏదేమైనా ప్రస్తుతం జలాంతర్గామి గల్లంతవడంతో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఈ అంశంపై స్టార్ లింక్ సంస్థ గానీ, ఎలాన్ మస్క్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి.. కమ్యునికేషన్ అంశంలో లోపాలపై ఎలాన్ మస్క్ సంస్థ స్టార్ లింక్‌కు కూడా ఇది పెద్ద వైఫల్యంగా మారుతుంది. ఇదీ చదవండి: టైటాన్ మిస్సింగ్‌కి రెండురోజులు.. ఆక్సిజన్ అయిపోతోంది.. కొన్ని గంటలే! వాళ్ల జాడేది? -
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
ఏలూరు జిల్లాలో తుఫాన్ బీభత్సం
-
విరూపాక్ష భారీ డిజాస్టర్
-
ఓహియో రాష్ట్రంలో వాతావరణం విషపూరితం
-
టర్కీ భూకంపం.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు..
టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భూకంపం ముందు ఓ వ్యక్తి తీసిన లైవ్ వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ముందుగా మెరుపులు వచ్చి ఆ తర్వాత ప్రకంపనలు రావడంతో విద్యుత్ సరఫరా స్తంభించిపోయి అంతా చీకటిమయం అయింది. ఆ తర్వాత క్షణాల్లోనే భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 🎥1 Scary footage of how the #earthquake struck #Turkey last night. 🎥2 A 6-story building in Urfa, Turkey falls over after earthquake As per estimate over 1700 buildings have been destroyed with over 800 deaths PM Modi extends condolences and offers help to all effected pic.twitter.com/B9CSpvRh2J — Megh Updates 🚨™ (@MeghUpdates) February 6, 2023 రెండో భూకంపం.. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. మొదటిసారి భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8గా నమోదు కాగా.. రెండోసారి భూకంపం వచ్చినప్పుడు తీవ్రత 7.6గా నమోదైంది. 1700మందికిపైగా మృతి.. టర్కీ చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా చెబుతున్న ఈ భూకంపంలో ఇప్పటివరకు 1498 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. శిథిలాలు తవ్వేకొద్ది మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. అటు సిరియాలో 430 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సిరియా ప్రభుత్వ నియంత్రణలో లేని ప్రాంతాల్లో 380 మంది చనిపోయారు. మొత్తంగా 2300 మందిపైగా మృత్యుఒడికి చేరారు. Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023 ఈ వీడియోల్లో కన్పిస్తున్న దృశ్యాల్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు కళ్లుముందే పేకమేడల్లా కూలిపోవడం హృదయాలను కలచివేస్తోంది. వందల మంది చనిపోయారు. వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. తమను కాపాడమని ఆర్తనాదాలు పెడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీస్తున్నారు. February 6, 2023 ....There are reports of several hundred dead. The Entire buildings collapsed in South #Turkey the epicenter of 7.8 magnitude earthquake in last hour,#Turkey #earthquake pic.twitter.com/pJtFoJlWfK — Naveed Awan (@Naveedawan78) February 6, 2023 భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కన్పిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. #Turkey #earthquake #Syria #Iraq #Turkey #Iran#earthquake #Turkey Prayers for Turkey 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/Eh6ny5qYut — vipin singh (@vipin_tika) February 6, 2023 టర్కీలో 2,818 భవనాలు నేలమట్టం.. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది. In #Kahramanmaras the moment #earthquake rocking #Turkey recorded by security camera of a pharmacy. #deprem #PrayForTurkey pic.twitter.com/6oNPPQHEnY — JournoTurk (@journoturk) February 6, 2023 #earthquake in #Turkey and #Lebanon Ya Allah save everyone 7.8 GOD bless Everyone #Syria pic.twitter.com/UYOsZAbwLo — waqar haider (@whaiderr25) February 6, 2023 The impact of the massive #earthquake in the streets of Gaziantep, southern Turkey. Update- 1006 Killed & 5590 injured.#deprem #Idlib #Syria #DEPREMOLDU #TurkeyEarthquake #Turkey pic.twitter.com/n4ejuCz28l — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 చదవండి: అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. వెయిటింగ్ అక్కర్లే 14 రోజుల్లోనే వీసా! -
Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..
శాన్టియాగో: చీలి దేశంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వేసవిలో వేడిగాలులకు అగ్గి రాజుకొని అడువులు తగలబడిపోతున్నాయి మొత్తం 151 చోట్ల కార్చిచ్చు ఘటనలు వెలుగుచూశాయి. వాటిలో 65 చోట్ల మంటలను అదపుచేశారు. బుధవారం నుంచి వ్యాపిస్తున్న కార్చిచ్చు కారణంగా 35 వేల ఎకరాలు బూడిదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో 13 మంది మరణించినట్లు వివరించారు. మృతుల్లో ఓ హెలికాప్టర్ పైలట్‌తో పాటు మెకానిక్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరు ఓ ప్రాంతంలో మంటలను అదుపు చేసేందుకు వెళ్లి హెలికాఫ్టర్ క్రాష్ అయి చనిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. హెలికాఫ్టర్ ట్యాంకర్లతో సహాయక చర్యలు చేపట్టింది. కార్చిచ్చు నేపథ్యంలో చీలి అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తన వెకేషన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ అత్యవసర పరిస్థితిలో 24 గంటలు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కార్చిచ్చును విపత్తుగా ప్రకటించారు. దీంతో సైన్యం కూడా రంగంలోకి సహాయక చర్యలు చేపట్టింది. 2017లో కూడా చీలిలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అప్పుడు 11 మంది వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. 1500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,15,000 ఎకరాల అటవీప్రాంతం కాలిబూడిదైంది. చదవండి: సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు.. -
12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం
డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ జోషిమఠ్ రోజుకు రోజుకు కుంగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం చాలా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రమాదకరంగా మారిన ఇళ్లు, భవనాలను కూల్చివేసింది. అయితే జోషిమఠ్ నిర్వాసితులకు సాయం విషయంపై ఉత్తరాఖండ్ కేబినెట్ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జోషిమఠ్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అద్దె సాయంగా రూ.5వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 6 నెలల పాటు విద్యుత్ బిల్లులకు రాయితీ ఇవ్వనుంది. నవంబర్ 2022 నుంచి ఇది వర్తిస్తుంది. ఇళ్లు ఖాళీ చేసి హోటళ్లు, రిసార్టుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న వారికి గదికి రూ.950 చొప్పున చెల్లించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంటున్న వారికి ఒక్కొక్కరికి రూ.450 ఇవ్వనుంది. ఇస్రో ఫొటోలు.. జోషిమఠ్ గత 12 రోజుల్లోనే 5.4 సెంటిమీటర్లు కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఛాయాగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఇక్కడి పరిస్థితిపై కేంద్ర హొంమంత్రి అమిష్ షా గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందించాలని అధికారులకు సూచించారు. జోషిమఠ్‌లో ఇప్పటివరకు 169 కుటుంబాలకు చెందిన 589 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పగుళ్ల వల్ల తీవ్రంగా ప్రభావితమైన 42 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5లక్షలు తాత్కాలిక సాయంగా అందించింది. చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
ముంచెత్తిన వరదలు.. ఎటు చూసినా నీరే! 600 మంది మృతి
అబుజా: దక్షిణ ఆఫ్రికా దేశం నైజీరియాను వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 600 మంది మరణించారు. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విపత్తు అని అధికారులు తెలిపారు. Nigeria is experiencing a flooding crisis, but the government is not taking any immediate action. It has become an ‘overwhelming’ disaster, killing over 500 people and displacing 1.4 million people. #NigeriaFloods pic.twitter.com/vNvJNXPjXV — EiE Nigeria (@EiENigeria) October 17, 2022 వరదల కారణంగా దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2 లక్షల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల పంట నీటమునిగింది. సహాయక బృందాలు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అయితే వరదల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, మౌలిక వసతుల లేమి, పేలవ ప్రణాళిక కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. నైజీరియాలో ప్రతి ఏటా వర్షాకాలంలో వరదలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం భారీ విపత్తు వచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. Large parts of 31 States are affected by massive flooding. Over 500 dead. Unimaginable pain and suffering. Urgent Help Needed! Begging Mr President to: -Declare a state of emergency in the affected areas - Address the flood victims@toluogunlesi @nemanigeria @MBuhari https://t.co/oxL5WFjVjj pic.twitter.com/CSBEcvziIV — Dr Aloy Chife (@ChifeDr) October 16, 2022 వర్షాకాలం పూర్తయ్యే నవంబర్ చివరి వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని నైజీరియా వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని మొత్తం 36కు గాను 26 రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉన్నట్లు చెప్పింది. It doesn't seem like we have a National Crisis at hand, probably because #Lagos and #Abuja are not flooded. #NigeriaFloods pic.twitter.com/9ji4OWW7xz — #LeaveNoOneBehind (@Temple_Oraeki) October 15, 2022 చదవండి: తాలిబన్ల చేతితో దారుణమైన చావు తప్పదని తెలిసి..! -
చైనాలో తీవ్ర భూకంపం, 46 మంది మృతి.. ఫోటోలు, వీడియోలు వైరల్
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం సంభవించిన భూకంపంతో 46 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్ సరఫరా, రవాణ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కరువు పరిస్థితులు, కోవిడ్ ఆంక్షలతో ఈ ప్రావిన్స్ జనం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. చైనాలో భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #earthquake in #Sichuan Province captured by car monitor lens. You can see the date and time of the quake. pic.twitter.com/y5V4x7nUk8 — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) September 5, 2022 🇨🇳#CHINA 🚨#URGENTE | Más imágenes de como se percibió el #sismo de magnitud 6.6 con epicentro a 43 km al SE de Kangding, en la provincia de #Sichuan. #RochexRB27#earthquake #Terremoto #Temblor pic.twitter.com/odk9fFlR1v — Rochex Rababel Robinson Bonilla (@RochexRB27) September 5, 2022 Imágenes del fuerte #sismo M6.8 en Ganzi, #Sichuan #China 🇨🇳 El movimiento telúrico ocurrió el 5 de septiembre a las 04:52 UTC (M6.6 según el USGS) Video vía @TripInChina pic.twitter.com/g7upfqwX19 — Geól. Sergio Almazán (@chematierra) September 5, 2022 6.6 magnitude earthquake hits Western #Sichuan,China#Sismo #China. #Sichuan #China #earthquake #ChinaEarthquake pic.twitter.com/98xS7zq8mA — Prateek Pratap Singh (@PrateekPratap5) September 5, 2022 Forty-six people have been #killed in a 6.8-magnitude #earthquake that jolted Luding County in #southwest #China's #Sichuan Province on Monday#Chinaearthquake pic.twitter.com/R6hWEWgzKz — Himanshu Purohit (@Himansh256370) September 6, 2022 చదవండి: UK PM Election Results 2022: బ్రిటన్ పీఠం ట్రస్‌దే -
నాన్‌స్టాప్‌గా ప్రయాణించిన హెలికాప్టర్‌గా రికార్డు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ నాన్‌స్టాప్‌గా ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఈ హెలికాప్టర్ సోమవారం చండీగఢ్ నుంచి అస్సాంలోని జోర్హాట్ వరకు ఏడున్నర గంటలపాటు 1910 కి.మీ ప్రయాణించి సుదీర్ఘమైన నాన్ స్టాప్ హెలికాప్టర్ సోర్టీగా రికార్డు సృష్టించిందని రక్షణ అధికారులు తెలిపారు. చినూక్ హెలికాప్టర్ సామర్థ్యం తోపాటు వైమానికదళం కార్యాచరణ, ప్రణాళిక అమలుతోనే ఈ రికార్డు సాధ్యమైందని రక్షణ ప్రతినిధి పేర్కొన్నారు. ఇది యుద్ధరంగంలో బహువిధాలుగా సేవలందించనుందని తెలిపారు. ఈ హెలికాప్టర్ దళాలను, ఫిరంగులు, యుద్ధ సామాగ్రి, ఇంధనాన్ని రవాణ చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. మానవతా విపత్తు సహాయ కార్యకలాపాల్లో ముఖ్య భూమిక పోషించనుందని తెలిపారు. శరణార్థులను పెద్దఎత్తున తరలించడం వంటి మిషన్లలో కూడా ఉపయోగపడునుందని చెప్పారు. భారత వైమానిక దళం అవసరమైన మేరకు హెలికాప్టర్‌ను సముచితంగా మోహరించేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ అధికారి తెలిపారు. అంతేకాదు దాని వేగవంతమైన మొబిలిటీ అవసరమైన విధంగా వినియోగించుకునే సౌలభ్యం కూడా ఉందని పేర్కొన్నారు. అయితే భారత్ 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్స్ ఛాపర్లను అమెరికా నుండి కొనుగోలు చేసేందుకు 2015లో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. An @IAF_MCC Chinook undertook the longest non-stop helicopter sortie in India, flying from Chandigarh to Jorhat (Assam). The 1910 kms route was completed in 7 hrs 30 min and made possible by the capabilities of Chinook along with operational planning and execution by @IAF_MCC. pic.twitter.com/n2aSZ3tRp4 — PRO Defence Palam (@DefencePROPalam) April 11, 2022 (చదవండి: గాలిలో ప్రాణాలు) -
బాప్రే!.. ఎంత పెద్ద భయానక దృశ్యం!
న్యూఢిల్లీ: కొన్ని ప్రకృతి వైపరిత్యాలు అత్యంత భయానకంగా ఉంటాయి. పైగా వాటిని మళ్లీ చూడాలనే సాహాసం కూడా చేయలేనంత భయం వేస్తుంది. అచ్చం అలాంటి భయానక ప్రకృతి వైపరిత్యం నేపాల్‌లో సంభవించింది. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) అసలు విషయంలోకెళ్లితే... నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో మంచుతో కప్పబడిన పర్వతాలు చూపురులను ఆకర్షించేలా ఎంతో ప్రశాంతంగ కనిపిస్తుంది. అంతే ఇంతలో ఒక్కసారిగా అతి పెద్ద హిమపాతం సంభవిస్తుంది. దీంతో అక్కడున్నవారందరూ భయంతో అరుస్తూ పరుగులు పెడుతుంటారు. అంతే అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన ప్రాంతం కాస్త ఒక్కసారిగా భయంకరంగా మారిపోతుంది. ఒక వైపు నుంచి వేగవంతంగా మంచు అక్కడున్న ప్రజలను తరుముతున్నట్లుగా తెల్లటి బిళ్ల వలే చుట్టుముట్టేస్తుంటుంది. అయితే ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులతో సహా 11 మంది గాయపడ్డారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ముస్తాంగ్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఎంత భయానక దృశ్యం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్) View this post on Instagram A post shared by Everest Base camp 2022 (@mountain.trekking) -
జల విలయం: ఆ రాళ్ల కుప్ప కుప్పకూలిందా ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ జల విలయంలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది. విద్యుత్ ప్రాజెక్టు సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడడానికి సహాయ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం నాడు మరో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 175 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. రైణి గ్రామంలోని శిథిలాల్లో రెండు మృతదేహాలు లభించినట్టుగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధి కారి ఒకరు చెప్పారు. గల్లంతైన వారంతా ఎన్టీపీసీకి చెందిన నిర్మాణంలో ఉన్న తపోవన్–విష్ణుగఢ్, రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నవారు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలే ఉన్నారు. శిథిలాలు తొలగించడానికి భారీ మిషన్లు 12 అడుగుల ఎత్తు, 2.5 కి.మీ. పొడవైన సొరంగ మార్గంలో వరద నీటిలో కార్మికులు చిక్కుకొని ఉండడంతో సహాయ చర్యలు క్లిష్టంగా మారాయి. ఐటీబీపీ, ఎన్డీఆర్ఫ్లతో పాటు రాష్ట్ర సహాయ సిబ్బంది ఆ సొరంగ మార్గంలోని శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలను తీసుకువచ్చి విరామమెరుగకుండా పని చేస్తున్నారు. ‘‘రాత్రి నుంచి నిరంతరాయంగా పని చేస్తూ ఉంటే సొరంగ మార్గంలో 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించగలిగాం’’అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే చెప్పారు. ఇక వంతెనలు ధ్వంసం కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. మొత్తం 13 గ్రామాలకు చెందిన 2,500 మంది బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. వారందరికీ హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నారు. సీఎం ఏరియల్ సర్వే వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆస్పత్రిని సందర్శించారు. మరణం అంచుల వరకు వెళ్లి సురక్షితంగా వచ్చిన 12 మంది కార్మికులతో మాట్లాడారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా సీఎం తెలిపారు. వరద ప్రాంతాల్లో చికక్కుకున్న కొన్ని గ్రామాల్ని కూడా సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆ పరికరమే కొంప ముంచిందా ..? 1960 దశకంలో చైనాపై నిఘా కోసం నందాదేవి పర్వత ప్రాంతాల్లో అమర్చడానికి తీసుకువెళ్లిన అణు ధార్మిక పరికరం ఇప్పుడు జలవిలయానికి దారి తీసిందని రైణి గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన రోజు భయంకరమైన వాసన వచ్చిందని, ఆ సమయంలో ఊపిరి తీయడం కష్టంగా మారిందని వరద బీభత్సంలో అత్యధికంగా నష్టపోయిన రైణి గ్రామవాసులు చెబుతున్నారు. కేవలం మంచుపెళ్లలు, శిథిలాల వల్ల అంత ఘాటైన వాసన రాదని ఆ పరికరం నందాదేవి పర్వత ప్రాంతాల్లోనే ఎక్కడో ఉందని తమ పెద్దలు చెబుతూ ఉండేవారని, బహుశా దాని కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని దేవేశ్వరి దేవి అనే మహిళ అనుమానం వ్యక్తం చేశారు. నందాదేవి పర్వత ప్రాంతాల్లో ఇలాంటి పరికరం ఏదో ఉందని ఇప్పటికే పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చైనా కదలికలపై నిఘా ఉంచడానికి సీఐఏ, ఐబీలు సంయుక్తంగా అణు శక్తి కలిగిన ఒక పరికరాన్ని నందాదేవి పర్వతాల్లో అమర్చడానికి 1965లో తీసుకువెళ్లారని, అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ పరికరాన్ని అక్కడే వదిలేసి వచ్చారని అంటారు. ఏడాది తర్వాత ఒక పర్వతారోహక బృందం అక్కడికి వెళ్లి చూస్తే ఆ పరికరం కనిపించలేదు. గల్లంతైన ఆ పరికరం జీవిత కాలం వందేళ్ల వరకు ఉంటుందని అంచనా. అయితే దీనిపై అధికారికంగా వివరాలు లేవు. రాళ్ల కుప్ప పడిపోయిందా ? ఉత్తరాఖండ్‌లో నందాదేవి పర్వత శ్రేణుల్లోని రాళ్ల కుప్ప బలహీనపడి కుప్పకూలిపోవడంతో ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో చిక్కుకొని ఉండవచ్చునని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జువాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ) అంచనా వేసింది. పర్వతంలోని రాళ్లు ఏళ్ల తరబడి మంచుతో కప్పబడి ఉండడంతో బాగా నాని బలహీనపడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు రాళ్ల కుప్ప బలహీనపడడమే వరదలకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కలచంద్ సెయిన్ చెప్పారు. ఈ పర్వత ప్రాంతం అత్యంత లోతున ఏటవాలుగా ఉంటుందని అందువల్ల మంచు చరియలు కరిగి పడిపోగానే వరదలు పోటెత్తాయని తెలిపారు. చదవండి: (విలయం మిగిల్చిన విషాదం) -
శభాష్.. పోలీస్
సాక్షి, అరావతి: శాంతి భద్రతల పరిరక్షణతోపాటు విపత్తు వేళ వరద ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవలు శభాష్ అనిపించుకుంటున్నాయి. నాలుగు రోజులుగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ నిర్విరామంగా సేవలందిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. గురువారం వరద ప్రాంతాల్లో పోలీసులు అందించిన సేవలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో.... వరద నీటిలో చిక్కుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరులంకలో బిడ్డకు జన్మనిచ్చిన వాసిమల్ల ప్రసన్న అనే మహిళను పోలీసులు ప్రత్యేక రోప్ (బలమైన పెద్ద తాళ్లు) సాయంతో ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందేలా సహకరించారు. వరద నుంచి తల్లీ బిడ్డను కాపాడిన ఎస్ఐ ఉమేష్, సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట విద్యానగర్‌లో వరదలో చిక్కుకున్న బాధితులను ఎస్ఐ చిన్నబాబు సిబ్బంది సహకారంతో కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. విజయనగరం జిల్లా పాచిపెంట పరిధిలో కొండ చరియలు విరిగి ప్రధాన రహదారిపై బండరాళ్లు పడటంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తక్షణం స్పందించి వీటిని తొలగించిన స్థానిక పోలీసులను ప్రజలు అభినందించారు. విశాఖ–అరకు రోడ్డులో దముకు, శివలింగాపురం ప్రాంతాల్లో కూలిపోయిన భారీ వృక్షాలను ఎస్ఐ అనంతగిరి, సిబ్బంది స్థానికుల సహకారంతో తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు ఎస్ఐ ఎన్ఆర్ఎల్ రావు తన సిబ్బందితో కలసి వరద ప్రాంతాల్లో బాధితులకు 200 వెజ్ బిర్యానీ, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలోని రామవరంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని హైవే మొబైల్ టీమ్ డ్రైవర్(హోంగార్డు) అర్జున్ బుధవారం కాపాడిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. -
విరిగిపడ్డ కొండచరియలు, 25 మంది గల్లంతు
కఠ్మాండు: నేపాల్‌లోని సింధూపాల్‌చౌక్ జిల్లాలో గతరాత్రి కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా గల్లంతయ్యారు. బర్హాబిసి గ్రామీణ మున్సిపాలిటీ-7లోని భిర్ఖార్కా ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, 9 ఇళ్లు మట్టి కింద కూరుకుపోయాయని మున్సిపాలిటీ చైర్మన్ నిబ్ ఫిన్జో షెర్ఫా తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్ ఆర్మీ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారని వెల్లడించారు. -
ప్రేమను పంచండి
‘‘ప్రస్తుతం మనందరం ఓ పెద్ద సమస్యను (కరోనా) ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ప్రేమని పంచాలి కానీ ద్వేషాన్ని కాదు’’ అంటున్నారు తమన్నా. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగటివిటీ ఎక్కువ అవుతోందని, అందరూ పాజిటివ్ గా ఆలోచించాలని తమన్నా పేర్కొన్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘మనమెప్పుడూ చూడని ఓ విపత్తు ఇప్పుడు మన ముందు ఉంది. ఇలాంటి సమయంలో మనందరం పాజిటివ్ గానే ఉండాలి. సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా అంటే చాలా ద్వేషం కనిపిస్తోంది. అది చాలా మందిని ఇబ్బందికి గురిచేసేలా ఉంది. మరీ ముఖ్యంగా ట్రోలింగ్ ఎక్కువైంది. కానీ ఇలాంటి సమయంలో కావాల్సింది ద్వేషం కాదు.. ప్రేమ. ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. సోషల్ మీడియా అనేది ఒకరికొకరం కనెక్ట్ అవ్వడానికి. దాన్ని సరిగ్గా వినియోగించుకుందాం. ఒకప్పుడు సోషల్ మీడియాలో ‘మంచి’ కనిపించేది. మళ్లీ ఇంతకు ముందులాగానే సోషల్ మీడియాలోనూ పాజిటివిటీనే పంచుదాం’’ అన్నారు. -
కోవిడ్ ఒక మహా విపత్తు
వాషింగ్టన్/లండన్/రోమ్: కోవిడ్ రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. ఈ వైరస్ ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ తీవ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ కేసులు, మృతుల సంఖ్యలో అమెరికా అన్ని దేశాలను దాటేసి పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ మృతులు ఇటలీని మించిపోయి 20 వేలు దాటిపోవడంతో అమెరికా ప్రభుత్వం మహా విపత్తుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారంతో వ్యోమింగ్ రాష్ట్రాన్ని కూడా కోవిడ్ విపత్తు పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితులు విధించినట్టయింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కోవిడ్‌ను మహా విపత్తుగా గుర్తించడం వల్ల వైరస్ ముప్పు ఉన్నంతకాలం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిధులను అన్ని రాష్ట్రాలూ, స్థానిక ప్రభుత్వాలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విపత్తును ఎదుర్కొనేం దుకు నేరుగా వైట్ హౌస్ నిధులు అన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుంది. అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. కోవిడ్ ప్రభావం అత్యధికంగా న్యూయార్క్, న్యూజెర్సీలపై ఉంటే, ఇప్పుడిప్పుడే షికాగో వంటి రాష్ట్రాలకూ వ్యాధి విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కూడా 5 లక్షల 50 వేలకు చేరుకుంది. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి అధ్యక్షుడు ట్రంప్ 50 వేల మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. 60 వేల మంది మరణిస్తారని అంచనాలు కోవిడ్ మహమ్మారితో అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షల మంది మరణిస్తారని తొలి దశలో అంచనా వేశారు. కానీ దేశం యావత్తూ లాక్డౌన్లో ఉండడం, 95 శాతానికి పైగా ఇళ్లు వదిలి బయటకు రాకుండా అత్యంత కఠినంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉండడంతో మృతుల సంఖ్య ఆ స్థాయిలో ఉండదని కోవిడ్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ భావిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడే సమయానికి మృతుల సంఖ్య 60 వేలు దాటకపోవచ్చునని టాస్క్ ఫోర్స్ సభ్యులు అంచనా వేశారు. అమెరికాకు చేరుకున్న క్లోరోక్విన్ మాత్రలు కరోనా వైరస్‌ను నిరోధించడంలో అత్యంత కీలకంగా భావిస్తున్న మలేరియా వ్యాధికి వాడే క్లోరోక్విన్ మాత్రలు భారత్ నుంచి అమెరికాకు చేరుకున్నాయి. అమెరికా కోరినట్టుగా 35.82 లక్షల మాత్రలతో పాటు ఇతర ఔషధాల తయారీలో వినియోగించే ముడిపదార్థం 9 మెట్రిక్ టన్నుల్ని ప్రత్యేక కార్గో విమానంలో అమెరికాకు పంపింది. అవన్నీ శనివారం న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ ట్వీట్ చేశారు. ► సింగపూర్‌లో సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించినప్పటికీ 24 గంటల్లో 191 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 51 మంది భారతీయులు ఉన్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ► యూకేలో మృతులు 10 వేలు దాటేశాయి. ఒకే రోజు 657 మంది మృతి చెందడం ఆందోళన పెంచుతోంది. ► యూరప్ దేశాల్లో మృతుల సంఖ్య 75 వేలు దాటింది. స్పెయిన్‌లో ఆదివారం 610 మంది ప్రాణాలు కోల్పోయారు. ► చైనాలో మళ్లీ కరోనా కలవరం రేపుతోంది. మరో 100 కేసులు నమోదయ్యాయి. ► ప్రపంచ దేశాలన్నీ మరికొన్ని రోజులు లాక్డౌన్ పాటించాలని, లేదంటే రెండో విడత వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు హెచ్చరించింది. ఆస్పత్రి నుంచి బోరిస్ జాన్సన్ డిశ్చార్జి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆరోగ్యం బాగుపడడంతో లండన్‌లో సెయింట్ థామస్ నుంచి ఆయనను డిశ్చార్చి చేశారు. వైద్య సిబ్బంది తన ప్రాణాలు కాపాడారని, వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉంటానని ఇంటికి వెళ్లే సమయంలో జాన్సన్ పేరు పేరునా ఆస్పత్రిలో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారని, ఆయన విధులకు హాజరుకావడానికి మరి కొద్ది రోజుల సమయం పడుతుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ వెల్లడించారు. -
విపత్తు వేళ..
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత వర్షాకాల సీజన్‌తో పాటు ఆకస్మికంగా సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు వివిధ శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వర్షాకాల విపత్తుల నివారణ ప్రణాళిక సమావేశంలో పలు శాఖల ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ, జలమండలి, మెట్రో రైలు, విద్యుత్ తదితర విభాగాల్లో దాదాపు 300 విపత్తు నివారణ ప్రత్యేక బృందాలు ఉన్నాయని తెలిపారు. నగరంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నగరవాసుల్లో విశ్వాసం నింపాలని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో ప్రధానంగా 195 ప్రదేశాలను నీటిముంపు ప్రాంతాలుగా గుర్తించామని, వర్షాల సమయంలో ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ ప్రదేశాల్లోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్పిట్లను మరోసారి తనిఖీలు చేయాలని, సమీప నాలాల్లో పూడిక, వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రహదారులపై 150 ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు చేయాలని ట్రాఫిక్ విభాగం అడిషనల్ కమిషనర్ అనీల్ కుమార్ సూచించారు. మెట్రో రైలు వంతెనల పైనుంచి రోడ్లపైకి ప్రవహిస్తున్న వర్షపు నీటిని నివారించాలని కోరారు. వారంలోగా రోడ్ల తవ్వకాలు పూడ్చాలి.. నగరంలో వివిధ ఏజెన్సీలకు గతంలో జారీచేసిన రోడ్డు తవ్వకాల అనుమతులకు సంబంధించి ఆయా రోడ్ల నిర్మాణ పనులను వారం రోజుల్లోగా పూర్తిచేయాలని కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు. రోడ్లు తవ్వి పునరుద్ధరణ చేయని ఏజెన్సీలపై చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఆయా శాఖ వద్ద ఉన్న ఎమర్జెన్సీ బృందాలను సమావేశపరచి విపత్తుల సమయంలో సమన్వయంతో పనిచేసేందుకు తగు శిక్షణనివ్వాలని దానకిశోర్ సూచించారు. çసమావేశానికి హైదరాబాద్ జేసీ రవి, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీ అనీల్‌కుమార్, సైబరాబాద్ డీసీపీ విజయ్‌కుమార్, జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి, జలమండలి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, వాతావరణ శాఖ, నీటి పారుదల శాఖ, ఫైర్ సర్వీసులు, ఆర్టీసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రూ. 17.50 లక్షల విలువైన పరికరాల అందజేత.. ప్రస్తుత వర్షాకాల సీజన్లో ఆకస్మిక వర్షాలు, ఇతర విపత్తుల సమయంలో ఉపయోగించడానికి వీలుగా రూ.17.50 లక్షల విలువైన పరికరాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగానికి జీహెచ్ఎంసీ అందజేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్, సిటీ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ íసీపీ అనీల్‌కుమార్‌లు వీటిని అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్, సైబరాబాద్ డీసీపీ విజయ్‌కుమార్, జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
విపత్తులు విరుచుకుపడతాయి!
మానవుడు నిరంతరం ప్రకృతిని గాయపరుస్తూ కొత్త కష్టాలు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే ప్రకృతి ప్రకోపం ముందు పలుమార్లు ఓడిపోయాడు. అయినా లెక్కచేయకుండా ప్రకృతి సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. ఇంకా వందేళ్లకు ప్రకృతి పూర్తిగా సహనం కోల్పోయే అవకాశం ఉందట! 2100 నాటికి వాతావరణ మార్పుల కారణంగా మానవాళిపై ఒకేసారి పలు ప్రకృతి విపత్తులు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని మనోవాలోని హవాలీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది. వడగాడ్పులు, కార్చిచ్చులు, వరదలు, ఉప్పెనలు తదితర విపత్తులు శతాబ్దాంతానికి విధ్వంసం సృష్టిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, ఇతర గ్రీన్హౌస్ వాయువుల రూపంలో వాతావరణంపై అంతకంతకు పెరిగిపోతున్న భారం జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టే విపత్కర పరిణామాలకు దారితీస్తోంది. ఇది ఉష్ణోగ్రతల పెరుగుదలతో మొదలై.. క్రమంగా కరువు కాటకాలు, వడగాడ్పులకు, కాలిఫోర్నియా తరహా ప్రాణాంతక కార్చిచ్చులకు కారణమవుతుంది. తడి వాతావరణం వున్న చోట.. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి. వింత పోకడలు సంభవిస్తాయి గతేడాది ఫ్లోరిడా తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంది. ముందెన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వందకు పైగా కార్చిచ్చులు రాజుకున్నాయి. తీవ్రమైన తుపాను (హరికేన్ మైఖేల్) కూడా తన ప్రతాపం చూపింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలో కార్చిచ్చు రేగింది. గత వేసవిలో ఆ ప్రాంతం దీర్ఘ కరువు– తీవ్ర వడగాడ్పులతో అతలాకుతలమైంది. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ ఘోర ఉదంతాలను లక్ష్యపెట్టకుంటే.. భారీ వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత మోతాదులోనే కర్బన ఉద్గారాలు వ్యాప్తి చేస్తే.. ఏకకాలంలో అనేక విపత్తులు ఎదుర్కొనక తప్పదని, అధిక ఉద్గారాల కారణంగా పెరిగిపోతున్న భూతాపం గతంలో మనం అనుకుంటున్న దాని కంటే భారీ ముప్పుకు కారణమవుతుందని, నత్తలు, పాములు సహా జంతువుల ప్రవర్తనలో మార్పులు రావడం లాంటి వింత పోకడలు సంభవిస్తాయని వారు వివరిస్తున్నారు. కాగా, ప్రకృతి విపత్తుల నుంచి మానవ సమాజాన్ని పరిరక్షించుకునేందుకు 195 దేశాలు ‘పారిస్ ఒప్పందం’కుదుర్చుకున్నాయి. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేయాలని నిర్ణయించుకున్నాయి. దీని అమలుపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడివుందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణ మండల తీర ప్రాంతాలకు మరింత ముప్పు.. భూతాపోన్నతి వల్ల సముద్రాలపై విధ్వంసకర తుపాన్లు వస్తాయి. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల దీని తీవ్రత మరింత పెరుగుతుంది. ఎండిపోయిన నేలలు వాతావరణంలో ఉహించలేనన్ని మార్పులకు కారణమవుతాయి. తక్కువ జీవులున్న దేశాల్లో 2100 నాటికి వాటి జనాభా పెరుగుతుంది. విపత్తుల తీవ్రత ధనిక దేశాలతో పాటు పేద దేశాలనూ ప్రభావితం చేస్తుంది. ఉష్ణమండల తీర ప్రాంతాల్లో నష్టం భారీగా వుంటుంది. ప్రపంచదేశాలు వేగంగా స్పందించి, కర్బన ఉద్గారాలను తగ్గించగలిగినట్టయితే భవిష్యత్తు నష్టాన్ని నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 2095 నాటికి సిడ్నీ, లాస్ ఏంజిలెస్ ఒకేసారి 3 ప్రకృతి విపత్తుల వలయంలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని, మెక్సికో నగరం 4 విపత్తులతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదముందని, బ్రెజిల్ అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతం 5 ఉపద్రవాల బారిన పడొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ విపత్తులు మానవుల ఆరోగ్యం, ఆహారం, నీరు, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, భద్రతపై చూపే ప్రభావం గురించి వారు విశ్లేషించారు. -
కేరళ వరదలు : తీవ్ర విపత్తుగా గుర్తించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేరళను వణికించిన వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులు కాగా, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వరద బీభత్సం కేరళను అతలాకుతలం చేయడంతో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేరళ వరద పరిస్థితిని గుర్తించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. వరదలతో 247 మంది మరణించారని, 17 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని, వేలాది ఎకరాల పంట నీటమునిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలతో పాటు స్వయంగా ప్రధాని, హోంమంత్రి కేరళ వరద పరిస్థితిని సమీక్షించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. దీంతో కేరళలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో దీన్ని తీవ్ర ప్రకృతి విపత్తుగా గుర్తిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రకటనతో కేరళకు ఇతోధిక సాయంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాలకు ముమ్మరంగా చేపట్టేందుకు కేంద్రం అన్ని విధాలా చొరవ చూపనుంది.పలు రాష్ట్రాలు ఇప్పటికే పెద్ద ఎత్తున సాయం ప్రకటించగా, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు కష్టసమయంలో కేరళకు బాసటగా నిలుస్తామంటూ తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటించారు. -
చెత్త సినిమాగా తేల్చేశారు
బాలీవుడ్లో గత శుక్రవారం రిలీజ్ అయిన చిత్రాల్లో ఒకటి సంజయ్ దత్ నటించిన సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ -3. ఉన్నంతలో కాస్త పెద్ద చిత్రంగా భావించిన ఈ చిత్రం ఏ దశలోనూ బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపం చూపించలేకపోయింది. టిగ్మాన్షూ ధూల్హియా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో జిమ్మీ షెయిర్గిల్, మహి గిల్, సంజయ్ దత్, చిత్రాంగద సింగ్ కీలకపాత్రలు పోషించారు. లీడ్ పాత్రల ఫెర్ఫార్మెన్స్ మాట పక్కన పెడితే కథలో పెద్దగా పసలేకపోవటంతో పూర్ రివ్యూలు దక్కాయి. క్రిటిక్స్ పరమ చెత్త మూవీగా తేల్చేశారు. రెండు రోజులకే డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్లలోనూ ఢీలా పడిపోయింది. కేవలం రూ. 5 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి.. మేకర్లకు భారీ నష్టాన్ని అందించింది. లాంగ్ రన్లో ఈ చిత్రం కలెక్షన్లు సింగిల్ డిజిట్ దాటడమే కష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సంజయ్ దత్ బయోపిక్ సంజు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై కలెక్షన్లను దాటేసి వసూళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో పీకే రికార్డును కూడా క్రాస్ చేసే మూడో స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా హయ్యెస్ట్ గ్రాసర్ దంగల్, బాహుబలి-2 లు టాప్ 2 స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే. -
అల
‘‘విపత్తులు రాబోతున్నప్పుడు పక్షులు ఇండికేషన్స్ ఇస్తాయట! మనుషుల మధ్య రిలేషన్స్ ఏర్పడబోయే ముందు కూడా అలా ఏవైనా ఇండికేషన్స్ ఉంటే బావుండేది’’ ‘‘ఏమంటున్నావ్ కార్తీక్! నేను నీకు విపత్తులా దాపురించాననేనా?’’.. పెద్దగా అరిచేసింది హేమ. కార్తీక్ చికాగ్గా చూశాడు. ‘‘లుక్. మన రెండేళ్ల స్నేహాన్ని గోనెసంచిలో కట్టేసి ఈ సముద్రంలో పడేద్దాం. ఇవాళే, ఇప్పుడే. నువ్వు నాకు నచ్చట్లేదు హేమా. యు ఆర్ సెల్ఫిష్’’ అన్నాడు. హేమ సీరియస్‌గా చూసింది. ‘‘యా! స్నేహం చచ్చిపోయింది కదా. గోనెసంచిలో కట్టేద్దాం. బట్ కార్తీక్. మన స్నేహాన్ని చంపింది నువ్వా, నేనా అన్నది ముందు తేలాలి’’. లాగి పెట్టి ఆ పిల్ల చెంప మీద కొట్టాలనిపించింది కార్తీక్‌కి. ‘‘పోనీ, నేనే చంపాననుకో హేమా.. మన స్నేహాన్ని! సంతోషమే కదా నీకు. నిన్నెప్పటికీ నేను అర్థం చేసుకోలేనని అంటుంటావ్ కదా.. అందుకు శిక్షగా నా ప్రేమ చచ్చిపోవాల్సిందే.’’ ‘‘స్నేహం అన్నావ్.. ప్రేమ అంటున్నావ్.. ఏంటి కార్తీక్ నీ కన్ఫ్యూజన్?’’‘‘ఎస్. నాది కన్ఫ్యూజన్. నీది క్లారిటీ. నేను ప్రేమ అనుకున్నాను. నువ్వు స్నేహం అనుకున్నానన్నావు’’ అన్నాడు కార్తీక్.హేమ నెత్తి కొట్టుకుంది. ‘‘ముందే చెప్పాను కార్తీక్.. నీ మీద నాకున్నది ప్రేమ కాదని’’ అంది.‘‘దెన్.. ముందే ఎందుకు వెళ్లిపోలేదు హేమా.. నా నుంచి’’ పెద్దగా అరిచేశాడు కార్తీక్. హేమ ఉలిక్కిపడి చూసింది.‘‘నా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేశాను కదా.. అప్పుడే ఎందుకు వెళ్లిపోలేదు హేమా నువ్వు ’’ అని మళ్లీ గట్టిగా అరిచాడు.‘‘నీ స్నేహం నన్ను వెళ్లనివ్వలేదు కార్తీక్’’ అంది హేమ.పిచ్చిపట్టిపోయింది కార్తీక్‌కి ఆ మాటకు. ‘‘అందుకే అంటున్నా.. నువ్వు సెల్ఫిష్ అని. నీ స్నేహాన్నే నువ్వు చూసుకున్నావ్. నా ప్రేమను కన్ఫ్యూజన్ అంటున్నావ్’’.హేమ మాట్లాడలేదు. ‘‘ఇలాగే ఉండు హేమా. ఎప్పటికీ నాతో మాట్లాడకుండా! అదే నాకు బాగుంటుంది. ఇంకెప్పుడూ నాకు కాల్ చెయ్యకు. పలకరించకు’’.. హేమ ఇంకా మౌనంగానే ఉంది. ‘‘ఏమీ తోచనప్పుడు నా దగ్గరకు వచ్చేంత స్నేహం నాకు అక్కర్లేదు హేమా. నా దగ్గరకు రానిదే ఏమీ తోచనంత ప్రేమ నాకు కావాలి’’ అన్నాడు కార్తీక్.స్నేహం ఒడ్డున ఒకరు, ప్రేమ ఒడ్డున ఒకరు నిలబడిపోయినట్లుగా ఆ రాత్రి ఇద్దరూ ఒకే ఒడ్డు మీద చాలాసేపు ఉండిపోయారు. ‘‘హారర్ కథ చెప్తానని.. లవ్ స్టోరీ చెప్తున్నావేంటి?’’ అంది మల్లిక. పెద్దగా నవ్వాడు విష్ణు. ‘‘లవ్‌ని మించిన హారర్ ఉంటుందా జీవితంలో!’’ అన్నాడు. మల్లికకు కోపం వచ్చింది. ‘‘అంటే మన లవ్ కూడా హారరేనా?’’ అంది, విష్ణు భుజం మీద పిడికిలితో కొడుతూ. మళ్లీ నవ్వాడు విష్ణు. ‘కాదా మరి.. రావడం అరగంట లేట్ అయింద ఇందాక నువ్వు హారర్ సినిమా చూపించలా నాకు’ అన్నాడు. మల్లిక నవ్వలేదు.ఇద్దరూ సముద్రపు ఒడ్డున ఇసుకలో నడుస్తున్నారు. అలలు రొద పెడుతున్నాయి. చీకటి చిక్కనవుతోంది. బీచ్‌లో జనం పలచబడుతున్నారు. ‘‘తర్వాత ఏమైంది విష్ణూ’’ అని అడిగింది ‘‘స్టోరీ అయిపోయింది’’ అన్నాడు విష్ణు. ‘‘అదేంటీ.. కార్తీక్, హేమ గొడవ పడడంలో హారర్ ఏముందీ?’’‘‘గొడవ పడడంలో లేదు. వాళ్లిద్దరూ ఆ రాత్రి.. ఇదిగో.. ఈ సముద్రంలో దూకి సూసైడ్ చేసుకోవడంలో ఉంది’’. షాక్ తింది మల్లిక. ‘‘అవును. హేమ వెళ్లిపోయాక చాలాసేపు బీచ్‌లోనే ఉండిపోయాడు కార్తీక్. కార్తీక్‌ని వదిలి వెళ్లాక ఆ రాత్రి మళ్లీ బీచ్ దగ్గరికి ఒక్కతే వచ్చింది హేమ. ఉదయాన్నే స్నేహమూ, ప్రేమా రెండూ.. వేర్వేరుగా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’’.. చెప్పడం పూర్తి చేశాడు విష్ణు. మల్లిక కళ్లు చెమర్చాయి. ‘‘హేమ తనని లవ్ చెయ్యడం లేదని కార్తీక్ చనిపోయాడని అనుకుందాం. మరి హేమ ఎందుకు చనిపోయింది?’’ అని అడిగింది. ‘‘యశ్వంత్ ప్రేమను పొందలేక హేమ చనిపోయింది’’ అన్నాడు విష్ణు. ‘‘యశ్వంత్ ఎవరు?’’.. మల్లిక ఆశ్చర్యంగా అడిగింది‘‘హేమ ప్రేమించిన అబ్బాయి. బీచ్‌లో కార్తీక్ తనతో గొడవపడ్డాక అమె నేరుగా యశ్వంత్ రూమ్‌కి వెళ్లింది. లేట్‌గా వెళ్లినందుకు పరిహారంగా అతడిని గట్టిగా కావలించుకుంది. ‘‘ఈ అబ్బాయిలేంటో.. స్నేహాన్ని ప్రేమ అనుకుంటారు’’ అని నవ్వింది హేమ బ్యాక్ హుక్స్ పెట్టుకుంటూ. ‘‘అమ్మాయిలు కూడా..’’ అని నవ్వాడు యశ్వంత్ అలసటగా. ‘‘అంటే ఏంటీ.. నువ్వు నాతో స్నేహం మాత్రమే చేస్తున్నావా యశ్వంత్! నన్ను ప్రేమించట్లేదా?’’ అంది డౌట్‌గా.యశ్వంత్ మాట్లాడలేదు. ‘‘చెప్పు యశ్వంత్’’ అంది. ‘‘నీతో స్నేహం బాగుంటుంది హేమా’’ అన్నాడు. ఫోన్ మోగింది. ‘‘సౌమ్య కాల్ చేస్తోంది. ఒక్క నిముషం హేమా ప్లీజ్’’ అని అమెకు కాస్త దూరంగా వెళ్లాడు. కాలేజ్‌లో హేమకు జూనియర్ సౌమ్య. అక్కడి నుంచి హేమ నేరుగా బీచ్‌కి వచ్చింది. కార్తీక్, తను పోట్లాడుకున్న స్పాట్‌కు వచ్చింది. కార్తీక్ లేడు. కార్తీక్‌కి బదులుగా అలలు ఉన్నాయి. అలల్లో కలిసిపోయింది. విష్ణుని గట్టిగా అంటుకుపోయింది మల్లిక. ‘‘ఇదంతా కల్పితమే కదా. నిజం కాదు కదా’’ అంది. ‘‘కథల్లో జీవితం ఉంటుంది కానీ, జీవితంలో కథలు ఉండవు హేమా..’’ అని.. ఆమెను బలంగా హత్తుకున్నాడు విష్ణు. ‘‘హేమా.. అంటున్నావ్ ఏంటి విష్ణు’’ అంది మల్లిక. సమాధానం లేదు.ఆమె గుండెల్లోకి తన ముఖాన్ని గట్టిగా అదుముతూ.. ‘ఐ లవ్యూ హేమా.. ఐ లవ్యూ హేమా’ అంటున్నాడు విష్ణు. మల్లిక గుండె ఆగినంత పనైంది. ‘విష్ణూ ఎక్కడున్నావ్?’ అని గట్టిగా అరిచి పడిపోయింది. తేరుకున్నాక అమె చెప్పింది. ‘విష్ణు.. ఇంకెప్పుడూ మనం బీచ్‌కి రాకూడదు’’.‘‘సరే’’ అన్నాడు విష్ణు.. అమె పక్కనే నడుస్తూ. ‘‘ఈ బీచ్‌కే కాదు. అసలు ఏ బీచ్‌కీ వెళ్లకూడదు’’ అంది. మళ్లీ ‘సరే’ అన్నాడతడు. -
విప్లవం–విపత్తు
కృత్రిమ మేధస్సు, రేపటి మాట కాదు, ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లేదా కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించడం, మన అదుపు తప్పిపోవడం భవిష్యత్తులో ఎన్నడో జరగబోయేది కాదు, కాల్పనికత అంతకన్నా కాదు, వర్తమాన వాస్తవం. కృత్రిమ మేధ మాన వాళిని శాసించేదిగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన చాలా కాలంగానే వ్యక్తం అవుతోంది. అలాంటి భయాలు నిరాధారమైనవని కొట్టి పారేసే వారిలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ ఒకరు. ఫేస్‌బుక్‌కు చెందిన రెండు చాట్ బోట్లు (సంభాషణలు సాగించగల కృత్రిమ మేధో సాధనాలు లేదా ఏజెంట్లు) ఇంగ్లిష్‌కు బదులు అంతుబట్టని భాషను సృష్టించుకుని మాట్లాడుతూ కనబడటంతో జుకెర్ బర్గ్ సహా ప్రపంచమంతా ఉలిక్కిపడాల్సి వచ్చింది. సదరు బోట్లను షట్‌డౌన్ చేసి, ఇకపై అవి ఇంగ్లిష్‌లోనే మాట్లాడేటట్టు శాసించారు. కృత్రిమ మేధస్సు మన దేశంలో ఇంకా మనిషి చెప్పిన పనులను చేసే దశలోనే ఉన్నా, అభివృద్ధిచెందిన దేశాల్లో అది తనంతటతానుగా నిర్ణయాలు తీసుకునే దశలోకి ప్రవేశించింది. భావి పర్యవసానా లపై అంచనాలు లేకుండా పెంపొందుతున్న ఆ మలి దశ కృత్రిమ మేధస్సు అభి వృద్ధికి ఉన్న పరిమితులు, ప్రమాదాలపై చర్చను ఫేస్బుక్ ఘటన మళ్లీ ముందుకు తెచ్చింది. కృత్రిమ మేధో సాధనాలు సొంత ప్రోగ్రామింగ్ భాషలను తయారు చేసుకునే స్థాయికి చేరితే ఎలా? అనేది పెద్ద ప్రశ్నార్థకమై నిలిచింది. అయినా కృత్రిమ మేధస్సు ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించి, మనకు తెలియకుండానే మన జీవనశైలిని ఊహించని రీతిలో మార్చేస్తోంది. గూగుల్, తక్షణమే కోరిన సమాచారాన్ని ఇవ్వగలగడానికి కారణం అదేనని తెలియని వారే ఎక్కువ కావచ్చు. 2014లో ప్రమాదకరమైన ఈ–మెయిల్స్‌ను పంపే ఒక మాల్వేర్ కొందరు వ్యక్తులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కసారి లక్ష ఈ–మెయిల్స్‌ను పంపిస్తూ దాడి చేసింది. సదరు మాల్వేర్, ఇంటర్నెట్కు అనుసంధానితమైన లక్షకు పైగా సాధనాలను ‘ఉపయోగించుకుని’ తనకు తానుగా ‘బోట్ నెట్’ను తయారు చేసుకుంది. వాటిలో 25 శాతమే కంప్యూటర్లు, మిగతావన్నీ స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్‌ల వంటివే. 2020 నాటికి మానవ జోక్యం అవసరంలేని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ (ఐఓటీ)కు అనుసంధానితమయ్యే ఇలాంటి స్మార్ట్ వస్తువుల సంఖ్య 21.2 కోట్లకు చేరుతుందని అంచనా. వీటిలో ప్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లు, హోమ్ థియేటర్లు, సోలార్ హీటర్లు మొదలైన వాటి నుంచి కార్లు, నౌకలు, విమానాలు, ఎలక్ట్రిక్ గ్రిడ్ల వరకు సర్వం ఉంటాయి. ఇక రోబోలు వస్తుతయారీ రంగం నుంచి యుద్ధరంగానికి విస్తరించి, ఇంటింటి వస్తువులుగా మారుతున్నాయి. మానవ జోక్యం అవసరం లేకుండా స్వతంత్రంగా సరైన నిర్ణయాలను తీసుకోగల సూపర్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించే లక్ష్యంతోనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితంగా కృత్రిమ మేధస్సు మన ఊహకు అందనంత వేగంగా అభివృద్ధి చెందుతూ, ఇళ్లను, కార్యాల యాలనే కాదు, దేశాలను, ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కృత్రిమ మేధో సాధనాలన్నిటి అభివృద్ధి లక్ష్యం, అవి తమంతట తాముగా నిర్ణయాలను తీసుకోడానికి వీలుగా తమను తాము అభివృద్ధి పరచుకునేలా చేయ డమే. ‘దోషులు’గా నిలిచిన చాట్ బోట్లు రెండూ ఆ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తూనే ‘పట్టుబడ్డాయి’. ఒక్కొక్క ఇంగ్లిష్ వాక్యాన్ని ఒక బోట్ మరో బోట్‌కు చేర వేయడానికి బదులు, ఒక్కో వాక్యాన్ని ఒక సంకేతంగా లేదా ఒక్కో పదంగా గుర్తిస్తూ ‘మాట్లాడుకుని’ అవి తమ పని వేగాన్ని, సమర్థతను పెంచుకునే ప్రయత్నం చేశాయి. కృత్రిమ మేధస్సు స్వయం పరిపూర్ణతను సాధించేలా చేసి, సూపర్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించాలని కోట్ల డాలర్లను కుమ్మరిస్తున్న జుకెర్ బర్గ్‌ల కలలను నిజం చేయడానికి రెండు బోట్లు చేసిన చిన్న ప్రయత్నమే బెంబే లెత్తించడం విశేషం. ఇది, నేటి ఐటీ పరిశ్రమలోని కృత్రిమ మేధో విభాగం అభివృద్ధి క్రమంలో ఉన్న పరస్పర విరుద్ధత. కృత్రిమ మేధస్సు అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉన్నవి బహుళజాతి కార్పొరేషన్లు, సైన్యం మాత్రమే. కృత్రిమ మేధస్సు అభివృద్ధి ఏ మేరకు సమాజ హితానికి తోడ్పడుతుంది? ఎలాంటి ఆంక్షలు అవ సరం? అనే సామాజిక, నైతిక విలువలకు, ప్రాధాన్యాలకు సంబంధించిన సమ స్యలు వాటికి పట్టవు. ఫ్రిజ్ తనంతట తానుగా కూరగాయలు, పాలు వగైరాలను లెక్కగట్టేసి, అయిపోతున్నాయంటే తెప్పించి, సర్దించేయడం నిజంగా అవసర మేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎవరు ఎలా చెప్పినా, చెప్పకున్నా.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం తాజా నివేదిక ప్రకారం 2020 నాటికి 15 అభివృద్ధి చెందిన దేశా లలో కనీసం 50 లక్షల ఉద్యోగాల నైనా రోబోలు, ఆటోమేషన్ హరిస్తాయి. ఐఎల్ఓ తాజా అంచనా ప్రకారం కంబోడియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాంలలో 13.7 కోట్ల కార్మికులను లేదా 56 శాతం మొత్తం శ్రామికశక్తిని రోబోలు తొలగించే ప్రమాదం ఉంది. రోబోలు మా ఉద్యోగాలను హరించివేస్తు న్నాయి, మేం అప్పుడే వాటికి సిద్ధంగాలేమని అమెరికాలోనే మూడింట రెండు వంతుల మంది గగ్గోలు పెడుతున్నారు. వీటన్నిటితో ఉన్న ముప్పును ముందుకు తెచ్చి మరీ చూపే వారికి కొదవ లేదు. అట్టహాసంగా ప్రవేశించిన డ్రైవర్‌లేని కార్లను హ్యాకర్లు అతి సులువుగా హ్యాకింగ్ చేసేశారు. రోబో సైనికులు అమాయకులను హతమార్చిన వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అమెరికా సహా వివిధ దేశాల రక్షణ శాఖలకే హ్యాకర్ల సవాళ్లు తప్పడం లేదు. ఎన్ని సదుద్దేశాలతో రూపొందించిన సూపర్ ఇంటెలిజెన్స్ అయినా అవాంఛనీయ వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో పడ కుండా ఉంటాయన్న హామీ లేదు. అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలలో అత్యధికులు కృత్రిమ మేధస్సుతో ఉన్న భద్రతాపరమైన సమస్యల గురించి భయా లను వ్యక్తం చేస్తూనే, వాటివైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. తమ భద్రతనే కాదు, ప్రపంచం భద్రతనే గాలికొదిలి సాగుతున్న కృత్రిమ మేధస్సు అభివృద్ధిపై ఎవరు, ఎలాంటి ఆంక్షలు విధించాలో చెప్పేవారు లేరు, చెబితే వినేవారూ లేరు. ఈ సాంకేతిక విప్లవం పరిమితులు, విపరిణామాలపైకి, అవసరమైన ఆంక్షలపైకి అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా దృష్టి సారిస్తుందా? -
‘నోట్ల రద్దు అతిపెద్ద విపత్తు’
తిరువనంతపురం: నోట్ల రద్దు 2016 లోనే అతిపెద్ద విపత్తు అని, త్వరలో దీని దుష్ఫలితాలు కనిపిస్తాయని కాంగ్రెస్ సీనియర్‌నేత పి. చిదంబరం అన్నారు. ‘పూర్తి సమాచారం లేకుండా.. నల్లధనం, చలామణిలో ఉన్న 2,400 కోట్ల నోట్ల రద్దు ప్రభావం, కొత్త నోట్ల ముద్రణకు సంసిద్ధత, ఏటీఎంల పాత్రపై అవగాహన లేకుండా రద్దు నిర్ణయం తీసుకున్నారు’ అని ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వృద్ధి రేటు.. అంచనా రేటైన 7.6 శాతం నుంచి 6 శాతానికి తగ్గుతుందని, రూ. 2.40 లక్షల కోట్లు నష్టపోతామని వివరించారు. నగదు రహిత ఆర్థికవ్యవస్థ కోసం ప్రభుత్వ యత్నాలపై స్పందిస్తూ.. దేశంలో రోజూ జరుగుతున్న రూ. లక్ష కోట్ల లావాదేవీలను డిజిటల్ విధానాల్లోకి మార్చితే మూడో వ్యక్తి రోజుకు రూ. 1,500 కోట్ల లాభం పొందుతాడని చెప్పారు. -
విపత్తు పట్ల అప్రమత్తం
– ప్రమాద స్థలాలను చేరడంలో జాప్యం చేయొద్దు – సాంకేతికతను అందిపుచ్చుకోండి – సిబ్బందికి అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ రావు ఆదేశం కర్నూలు(రాజ్‌విహార్): విపత్తు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్ఎస్) కె. సత్యనారాయణ రావు సిబ్బందికి అదేశించారు. శుక్రవారం కర్నూలుకు తొలిసారిగా వచ్చిన ఆయన స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల డీఎఫ్ఓ, ఏడీఎఫ్‌ఓ, ఎస్‌ఎఫ్‌ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలాంటిదైనా అలసత్వం ప్రదర్శించరాదన్నారు రోజురోజుకు విస్తరిస్తున్న సాంకేతికను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని, ప్రమాద సమాచారం అందిన వెంటనే శరవేగంగా ఘటన ప్రాంతానికి చేరుకోవాలన్నారు. తక్కువ సమయాల్లో చేరుకునే మార్గాలను అనుసరిస్తే విపత్తు తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు. నదులు, రిజర్వాయర్లు తీర ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు జాకెట్ ప్రూప్స్, బోటులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సిబ్బందికి ఆధునిక శిక్షణ ఇచ్చేందుకు ఇతర రాష్ట్రాలకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఇకపై రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహించి పురోగతులపై చర్చిస్తామన్నారు. సమావేశంలో కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లా ఫైర్ అఫీసర్లు భూపాల్ రెడ్డి, విజయకుమార్, మూడు జిల్లాల సహాయ అధికారులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
విపత్తుల నివారణకు ప్రణాళిక
–జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): విపత్తుల నివారణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సూచించారు. అహ్మదాబాద్‌కు చెందిన ఆలిండియా డిజాస్టర్ మిటిగేషన్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రతి శాఖ వద్ద తగిన ప్రణాళిక ఉండాలన్నారు. జిల్లాలో గత 30 ఏళ్లలో సంభవించిన విపత్తులు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలలపై ఈ నెల 28లోగా నివేదికలు ఇవ్వాలన్నారు. విపత్తులు ఊహించని విధంగా వస్తాయని.. సమగ్రంగా ప్రణాళికలు లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంటు కో- ఆర్డినేటర్ ఆనంద్.. పవర్‌పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, సీపీఓ ఆనంద్‌నాయక్, విద్యుత్ ఎస్ఈ బార్గవరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘రైలు ప్రమాదానికి అదే కారణం కావొచ్చు’
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో రైలు పట్టాలు తప్పిన ఘటనలో 113 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 150 మందికి పైగా గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ రైలు ప్రమాదంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అయితే.. రైలు పట్టాలో పగులు ఏర్పడటం ఈ ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజనీర్లు, నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రమాదంపై విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
వెక్కి వెక్కి ఏడ్చిన షారుఖ్
-
విపత్తుల ముంపులో విశ్వనగరి
ఎన్ని ఆకాశహర్మ్యాలు నిర్మించినా, ఎన్ని స్కైవేలు కట్టినా నేల నీట మునుగుతుంటే అది విశ్వనగరం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయింట్మెంట్ పూస్తే, మందు గోలీ వేస్తే తగ్గే స్థితి దాటిపోయింది. జబ్బు ముదిరింది, ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరే షన్ మధ్యలో ఆపితే రోగి ప్రాణాలకే ముప్పు అని ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ప్రతిపక్షాలు, మీడియా కూడా ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకోవాలి, అందుకోసం ప్రభుత్వానికి సహకరించాలి. నాలుగు వందల ఇరవై ఐదేళ్ల పైబడిన చరిత్ర గల హైదరాబాద్ నగరం పదిరోజుల పాటు ఆగమాగమైంది. అతలాకుతలమైంది. అడ్డగోలు మాటలు పడ్డది. ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నది. అతి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలు జలమయమ య్యాయి. నగర జీవనం అస్తవ్యస్తమైంది. వేల సంఖ్యలో ప్రజలు రోజుల తరబడి ఆకలిదప్పులతో అలమటించవలసి వచ్చింది. భయంతో నిద్రాహారాలు మానుకుని గడపాల్సివచ్చింది. హైదరాబాద్‌కు గడచిన 108 ఏళ్ల చరిత్రలో ఇంత దారుణమైన పరిస్థితి కనీసం నాలుగు సందర్భాలలో ఎదురైంది. ఇది ఐదో అనుభవం. 1908లో మూసీ నదికి వచ్చిన వరదల్లో 15 వేలమంది చనిపోయారు. ఆ తరువాత 1970, 2000 ,2008 సంవత్సరాల్లో కూడా హైదరాబాద్ నగరం భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తమైంది. నూట ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా 108 సంవత్సరాల క్రితం ఇదే రోజున, అంటే 1908, సెప్టెంబర్ 28వ తేదీన మూసీకి వరదలు వచ్చి 15 వేలమందికి పైగా చనిపోయారు. భారీ వర్షాల కారణంగా 1908 కంటే ముందు కూడా దాదాపు 18 సార్లు మూసీ నది పొంగినా అంత తీవ్ర నష్టం వాటిల్లలేదు. 1908 నాటి ఘోర విపత్తు, ఆ తరువాత హైదరాబాద్ నగరం ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి బాటలు వేయ డానికి దారి చూపింది. జంట నగరాలకు మంచినీరు అందించేందుకు అవ సరమైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నిర్మాణం ఆలో చనా, కార్యాచరణ ఆ వరదల తరువాతే జరిగింది. 108 ఏళ్ల క్రితం నాటి ఆ ఉప ద్రవాన్ని చూసినవారు బహుశా ఇప్పుడు ఎవరూ లేక పోవచ్చు, కానీ చరిత్ర అయితే ఉంది. చినుకు చినుకుగా మొదలై, కుండపోతగా, ఆకాశం బద్దలయిన రీతిలో కురిసిన భారీ వర్షం కారణంగా మూసీకి వచ్చిన నాటి వరద అన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నది. 80 వేల మంది నిరాశ్రయు లయ్యారు. ఆనాటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన రాజ మహళ్ల ద్వారాలు తెరిచి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాడు. 15 రోజుల్లో ఆరు లక్షలమందికి ఆయన వంటశాలల్లో భోజనం తయారు చేయించి పెట్టాడు. ఆ తరువాత మూడు సందర్భాల్లో ఇటువంటి విపత్తు సంభవించిన ప్పుడు కూడా ప్రభుత్వాలు కొన్ని ఆలోచనలు చేశాయి, కొన్ని ప్రణాళికలు రచించాయి, కార్యక్రమాలు రూపొందించాయి, కమిటీలు వేశాయి. ఆ కమి టీల నివేదికలు కొన్ని అమలయ్యాయి, ఎన్నో యథావిధిగానే మూలన పడ్డారుు. 1970లో ఒక్కరోజులో పడిన భారీ వర్షానికే నగర జనజీవనం స్తంభించి పోయింది. అప్పటికైతే హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ‘పానీ ఆరా భాగో’(నీళ్ల్లొస్తున్నాయి, పరుగెత్తండి) అన్న మాటతో, గండిపేట తెగిందన్న పుకారు వ్యాపించి నగర ప్రజలంతా రోడ్ల మీదికి వచ్చి దిక్కుతోచక పరుగులు పెట్టారు. నగరం మునిగిపోతుందన్న భయంతో పెద్ద సంఖ్యలో జనం నౌబత్ పహాడ్ (ఇప్పుడు బిర్లా మందిర్ కట్టిన స్థలం) ఎక్కి కూర్చున్నారు. అది పుకారే అని జనాన్ని నమ్మించి మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి ఆనాటి ప్రభుత్వానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక బ్యూరో చీఫ్ ఈ పుకార్లను విశ్వసించి మద్రాస్‌లోని తన కేంద్ర కార్యాలయానికి వర్తమానం కూడా పంపేశాడు. హైదరాబాద్ కొట్టుకుపోతున్నది కాబట్టి ఆఫీసు మూసేస్తున్నా అనే సందేశం పంపించి తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఫలితంగా మరునాడు ఆయన ఉద్యోగం ఊడింది. అది పుకారో, నిజమో తెలుసుకుని ప్రజలకు సమాచారం అందించాల్సిన జర్నలిస్ట్ దుకాణం మూసేస్తే ఎట్లా అని ఆనాటి ఆ పత్రిక సంపాదకులు ఆగ్రహించారు. ఈ సంఘటన జరిగింది కూడా సెప్టెంబర్ నెల లోనే, అయితే 24న. గండిపేట తెగింది, నీళ్లొస్తున్నాయి పరుగెత్తండి అనే పుకారు ఎవరు సృష్టించారో కానీ జనం భయపడటానికి మాత్రం కారణం ఉంది. అంతకు మూడురోజుల ముందు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో హైదరా బాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా 100 మందికి పైగా చనిపోయారు. ఆ ఘటన నుండి తేరుకోక ముందే ఈ పుకారు పుట్టడంతో జనం నమ్మారు. నేడూ అదే దుస్థితి హైదరాబాద్ నగరాన్ని నేనే అభివృద్ధి చేశానని పదే పదే ఊదరగొట్టే చంద్ర బాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే, అంటే 2000 సంవత్స రంలో మరొకసారి ఆగస్టు 24న హైదరాబాద్ భారీ వర్షాలకు నీట ముని గింది. ఆయన మాట్లాడితే హైటెక్ సిటీ కేసి చూపిస్తారు తన మార్కు అభి వృద్ధికి కొండగుర్తుగా. అదే హైటెక్ సిటీ చుట్టుపక్కల ఇటీవలే నిర్మించిన లేదా అభివృద్ధి చెందిన విలాసవంతమైన ప్రాంతాలు కూడా నీట మునిగాయని ఆనాటి పరిస్థితి మీద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన నివే దికలో పేర్కొన్నారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం సమస్యను పట్టించుకో కుండా అరకొర, తాత్కాలిక చర్యలు చేపట్టిందే తప్ప శాశ్వత పరిష్కారాల మీద దృష్టి పెట్టలేదు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని బుకాయించడం తప్ప మౌలిక సమస్యల మీద ఆయన దృష్టి పెట్టిన దాఖలాలే లేవు. 2000 సంవత్సరం ఘటన తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ కమిటీ తన నివేదికను మూడేళ్ల తరువాత సమర్పించేసరికి ఆనాటి ప్రభుత్వం ఎన్నికల హడావుడిలో పడి, దాన్ని అటకెక్కించింది. 2008లో మరొకసారి భారీ వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌లో నీటిని వదలాల్సి వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మళ్లీ ఇటీవలి భారీవర్షాలకు, ఎనిమిదేళ్ల తరువాత మరొకసారి హుస్సేన్‌సాగర్ నీటిని వదలాల్సివచ్చింది. నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఆరులక్షల జనాభా కోసం ఉద్దేశించిన నగరం ఇవాళ కోటిమందికి ఆవాసమైంది. మరి పెరిగిన జనాభాకు అనుగుణంగానే మౌలిక సదుపా యాల కల్పన కూడా జరిగిందా? జరగలేదు. దానికి ఎవరు బాధ్యత వహిం చాలి? రెండున్నరేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ నాయ కత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ రాష్ట్రాన్ని పాలించిన రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలా? కొన్నిమాసాల క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల ఘన విజయం తరువాత మున్సిపల్ శాఖను చేపట్టిన యువమంత్రి కేటీ రామారావు బాధ్యత వహించాలా? అధికారుల అసంబద్ధ వైఖరి నిర్ణయాలు చేసేది రాజకీయ నాయకత్వమే అయినా, సరైన ప్రణాళికలు రూపొందించి వాటిని సక్రమంగా అమలు పరచాల్సిన అధికార యంత్రాంగం ఈ విపత్తులన్నిటికీ జవాబుదారీ కావాలి. హైదరాబాద్ నగరంలో చెరువులన్నీ ఆక్రమణలకు గురయ్యాయి, నాలాలు మూసేసి నిర్మా ణాలు జరిపారు, అనుమతిని మించి బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? ఈ నిర్మాణాలన్నిటికి అనుమతులు ఇచ్చింది ఎవరు? వారు కదా శిక్షార్హులు! ఆశ్చర్యం కలిగించే రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. అక్రమ నిర్మాణాల కారణంగా ఈ ఉప ద్రవం ఏర్పడిందని ఒకపక్క మొత్తుకుంటున్న సమయంలోనే, ప్రజలు ఇంకా ఇక్కట్లు పడుతున్న సమయంలోనే ఒక టౌన్ ప్లానింగ్ అధికారి భారీ వర్షా ల్లోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని వార్తలొచ్చారుు. కక్కుర్తికి హద్దులు న్నాయా? ప్రజాసేవ చెయ్యాల్సిన ఒక ఐపీఎస్ అధికారిణి తన అధికార బలం చూపి వాన నీటిని మళ్లించి ఒక కాలనీ నీట నానడానికి కారణమైందట. నాలాల మీద అక్రమ కట్టడాలను కూల్చబోతే ఒక అధికార పార్టీ కార్పొరేటర్ స్వయంగా అడ్డుపడ్డాడట. ఇటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఉంటే ముఖ్యమంత్రి ఎంత చండశాసనుడైతే మాత్రం ఏం లాభం? అక్రమ కట్టడా లకు బాధ్యుల మీద చర్యలు తీసుకుంటే జీహెచ్ఎంసీలో ఒక్క అధికారి కూడా మిగలడు అని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రజలు తప్పు దిద్దుకోవాలి, ఇల్లుకట్టుకున్నది మనం, ప్రభుత్వం కాదు కదా అని హితవు చెపుతున్నారు. నిజమే, మరి ప్రజలు ఆ తప్పు చెయ్యకుండా నిలు వరించడం కోసం ప్రజాధనాన్నే జీతాలుగా తీసుకుంటున్న అధికార యంత్రాంగం అవినీతికి అలవాటుపడి అడ్డగోలు నిర్మాణాలను చూస్తూ ఊరుకుంటే వారికేం బాధ్యత లేదా? గవర్నర్ గారు నిందించవలసినది వారిని కదా! నాలాల మీద ఇల్లు కట్టుకోడానికి పర్మిషన్ ఎందుకు తీసుకున్నా రని ప్రజలను ప్రశ్నించే బదులు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రభుత్వ అధి కారులనూ, సిబ్బందినీ గవర్నర్ గారు నిలదీస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఉత్పన్నమయిన పరిస్థితి నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటి? అని ప్రభుత్వ యంత్రాంగాన్నీ, మంత్రులనూ, నగర మేయర్‌నూ అడిగానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పాలకులు పదే పదే తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న. పరిస్థితి మారి మళ్లీ ఇటువంటి విపత్కర పరిస్థితి రాకుండా చూడటానికి కఠినంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం, ఎవరినీ వదలం అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన నిర్ణయాలన్నిటిని తరతమ భేదాల్లేకుండా, బీదా గొప్ప తేడాల్లేకుండా అమలు చేసినట్టయితే ఆయన పదే పదే చెపుతున్న విశ్వనగరం రూపుకడుతుంది. ఎన్ని ఆకాశహర్మ్యాలు నిర్మించినా, ఎన్ని స్కైవేలు కట్టినా నేల నీట మునుగు తుంటే అది విశ్వనగరం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయింట్మెంట్ పూస్తే, మందు గోలీ వేస్తే తగ్గే స్థితి దాటిపోయింది. జబ్బు ముదిరింది, ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరేషన్ మధ్యలో ఆపితే రోగి ప్రాణాలకే ముప్పు అని ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ప్రతిపక్షాలు, మీడియా కూడా ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకోవాలి, అందు కోసం ప్రభుత్వానికి సహకరించాలి. మరోసారి హైదరాబాద్ నీట నానడానికి వీల్లేదు. ఇది ఎవరూ విస్మరించకూడని సత్యం. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
వర్ష బీభత్సం
* జనజీవనం అతలాకుతలం * గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో కుంభవృష్టి * కరాలపాడులో మట్టిమిద్దె కూలి వృద్ధురాలి మృతి * పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు, కుంటలు * గురజాలలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ * లోతట్టు ప్రాంతాలు జలమయం * పల్నాడులో పంట నష్టంపై వైఎస్ జగన్ ఆరా సాక్షి, గుంటూరు : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతమైన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో కుంభవృష్టి కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏడు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారని ఆయా ప్రాంతాల్లోని వృద్ధులు చెబుతున్నారు. గురజాల మండలంలో దండెవాగు, ఎర్ర, నల్ల వాగులు, రెంటచింతల వద్ద గాడిదల వాగు, గోళి వాగు, ఏడు మంగళం వాగు, గడ్డివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గుంటూరు – మాచర్ల, గురజాల – కారంపూడి, గురజాల – దైద మధ్య రాకపోకలు స్తంభించాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. గురజాల రైల్వేస్టేషన్ సమీపంలో దండెవాగు ఉధృతికి రైల్వేట్రాక్ వంద మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు – మాచర్ల ప్యాసింజర్ రైలును నడికుడి వద్ద నిలిపివేశారు. మంగళవారం సాయంత్రం రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ పనులను గుంటూరు డీఆర్ఎం విజయ్‌శర్మ పరిశీలించారు. కొట్టుకుపోయిన దుకాణాలు... జంగమహేశ్వరపురం గ్రామంలో వరవకట్ట తెగడంతో ఎస్టీ కాలనీ, జెడ్పీ హైస్కూల్లోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురజాల పట్టణంలోని నందనం వెంకటరావు నగర్ పూర్తిగా జలమయం కావడంతో గురజాల ఆర్డీఓ మురళి, డీఎస్పీ నాగేశ్వరరావు కాలనీ వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి వసతి, భోజన సదుపాయం కల్పించారు. బస్‌స్టేషన్ సమీపంలో వరద ఉధృతికి ఎనిమిది షాపులు కొట్టుకుపోయాయి. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడులో వర్షానికి మట్టిమిద్దె కూలి పందెళ్ల కృష్ణవేణమ్మ (63) అనే వృద్ధురాలు మృతి చెందింది. కారంపూడి, రెంటచింతల మండలాల్లో సైతం చెరువులకు గండ్లుపడి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలో తంగిరాల చెరువుకు గండిపడి నాగిరెడ్డిపల్లి – తంగిరాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతుల ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు నిన్నమొన్నటి వరకు వర్షాలు లేక అల్లాడిపోయిన పల్నాడు రైతులు వేలకువేలు ఖర్చు చేసి మోటార్ల ద్వారా తడులు వేశారు. పల్నాడులో అధికంగా ప్రత్తి, మిర్చి పంటలు సాగు చేశారు. తడులు వేసిన తరువాత పది రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో పంటలు ఉరకెత్తి దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నాయనుకుంటున్న తరుణంలో సోమవారం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు అతి భారీ వర్షాలు కురవడంతో గురజాల, రెంటచింతల, కారంపూడి, దుర్గి, దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో వేలాది ఎకరాల పంట పూర్తిగా మునిగిపోయింది. ప్రత్తి పంట కాయలు కాసి చేతికి వస్తున్న దశలో వర్షాలు కురవడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క క్వింటా పత్తి కూడా చేతికిరాని పరిస్థితి. దీంతో రెండేళ్లుగా పంటలు లేక తీవ్ర నష్టాల పాలైన రైతులు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. పల్నాడులో పంట నష్టంపై జగన్ ఆరా... పల్నాడు ప్రాంతమైన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా పంట నష్టం జరగడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆరా తీశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు ఫోన్ చేసి రైతుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో రైతులకు అండగా నిలవాలని వారికి సూచించారు. వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. -
నిధులను మింగిన నిర్లక్ష్యం
♦ ఐదేళ్ల విపత్తు సాయానికి ♦ రూ.1,515 కోట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం కరువుసాయానికి గండి కొట్టింది. గత ఖరీఫ్‌లో తీవ్రమైన కరువు ఉందని, అందుకు రూ. 3,064.75 కోట్ల కరువుసాయం కావాలని రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా రూ.791 కోట్ల సహాయం ప్రకటించింది. అయితే, రూ.712 కోట్లనే విడుదల చేసింది. మన అధికారుల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యం కారణంగా మిగిలిన రూ.79 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది. 2015-2020 సంవత్సరాల కోసం 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి విపత్తు నిర్వహణ శాఖకు కేంద్రం రూ.1,515 కోట్లు కేటాయించింది. 12 రకాల ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఈ సాయాన్ని ప్రతి ఏడాది కేటాయిస్తుంది. కేటాయించిన సొమ్ము సరిపోకపోతే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించాలి. ఆ ప్రకారం కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుంది. 2015-16 సంవత్సరానికి 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి విపత్తు సాయం కింద రూ.274 కోట్లు కేటాయించింది. అందులో రూ.79 కోట్లు మిగిలిపోయాయని కొందరు అధికారులు కేంద్రానికి తప్పుడు సమాచారమివ్వడంతో కరువు సాయంలో కోత విధించింది. తాము పొరపాటు చేశామని, మిగిలిన సొమ్ము కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఒక రెవెన్యూ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. 2016-17 సంవత్సరానికి కేంద్రం 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎస్డీఆర్ఎఫ్కు రూ.288 కోట్లు కేటాయించింది. 2017-18 సంవత్సరానికి రూ.302 కోట్లు, 2018-19 ఏడాదికి రూ.318 కోట్లు, 2019-20 సంవత్సరానికి రూ.333 కోట్లు కేటాయించింది. 2016-17 సంవత్సరానికి విడుదల కావాల్సిన రూ.288 కోట్లను జూన్ మొదటి వారంలో విడుదల చేస్తారు. ఈ నెలలోనే విడుదల చేయాలన్న రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తోంది. -
తాగునీటి ఎద్దడి నివారణకు 55 కోట్లు
♦ కరువు మండలాలకు ‘విపత్తు’ నిధులు ♦ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కరువు మండలాల్లో తాగునీటి ఎద్దడి నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా మండలాలకు రూ.55 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధి నుంచి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాల్లోని 231 మండలాలను ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మండలాల్లో నీటిఎద్దడి ఉన్న ఆవాసాలన్నింటా వెంటనే తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం కమిషనర్ బి.ఆర్.మీనా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న వేసవి దృష్ట్యా కరువు మండలాల్లో తాగునీటి సరఫరాకు కంటిజెన్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రూ.310.61 కోట్లు కావాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్సీ ప్రభుత్వానికి ఇటీవలప్రతిపాదనలు సమర్పించారు. కొన్నిచోట్ల తాగునీటి సరఫరా, ప్రైవేటు వాహనాల అద్దె, బోర్ల మరమ్మతు, బోర్లు, బావుల లోతును పెంచాల్సిన అవసరముందని నివేదించారు. తాత్కాలిక అవసరాలకు తక్షణమే రూ.108.71 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యధికంగా రూ.15.70 కోట్లు, అత్యల్పంగా వరంగల్ జిల్లాకు రూ.2.59 కోట్లు కేటాయించింది. మెదక్ జిల్లాకు రూ.10.82, నిజామాబాద్‌కు రూ.8.47, రంగారెడ్డి జిల్లాకు రూ.7.77, నల్లగొండకు రూ.5.18, కరీంనగర్‌కు రూ.4.47 కోట్ల చొప్పున మంజూరు చేసింది. స్టేట్ ఆడిట్ అధారిటీ ధ్రువీకరించిన వినియోగ పత్రాలను ప్రభుత్వానికి అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. -
ఇది కనివినీ ఎరుగని విపత్తు: రోశయ్య
-
ఇది కనివినీ ఎరుగని విపత్తు: రోశయ్య
చెన్నై: తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తమిళనాడు గవర్నర్ రోశయ్య చెప్పారు. ఇది కనివినీ ఎరుగని విపత్తు అంటూ ఆయన అభివర్ణించారు. ఈ విపత్తు కారణంగా సామాన్యుల నుంచి అందరికి నష్టం జరిగిందని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సేవాతత్పరులు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. కేంద్రం నుంచి మరిన్ని నిధుల కోసం తాము ప్రయత్నిస్తామని రోశయ్య పేర్కొన్నారు. -
దేశం కోసం గ్రీన్ కార్డును రద్దు చేసుకున్నాడు..
మంచి చదువు, ఉద్యోగాల కోసం ఫారెన్ కంట్రీస్ కు వెళ్ళి.. అక్కడే గ్రీన్ కార్డును సంపాదించి స్థిరపడిపోయిన వాళ్ళ గురించి విన్నాం... కొన్నాళ్ళ తర్వాత సంపాదించిన దానికి సంతృప్తితో స్వదేశానికి తిరిగి వచ్చి.. దేశంలోని పేదలకు, అనాధలకు చేయూతనందించేవారినీ చూస్తుంటాం.... ఏకంగా మాతృభూమి కోసం తన స్టేటస్ ను, పౌరసత్వాన్ని వదులుకొని ఇండియాకు వచ్చేశాడో ఎన్నారై. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు కావలసిన విద్యను కూడా అభ్యసించి... మానవత్వాన్ని చాటుతూ భారతదేశాన్ని విపత్తు స్థితి స్థాపకంగా చేయడమే ధ్యేయంగా తనవంతు సాయం అందించేందుకు నడుం బిగించాడు. అమెరికాలోని ఇంటర్నేషనల్ హోటల్ చైన్ జనరల్ మేనేజర్ గా పూర్తిస్థాయి వృత్తిని, పౌరసత్వాన్ని వదిలి ఇండియాకు వచ్చేసిన హరి బాలాజీ.. సెప్టెంబర్ 11, 2001 న్యూయార్క్ ఉదంతం సమయంలో జూరిచ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోకి రెండు జెట్ లైనర్స్ దూసుకెళ్ళిన ఘటనలో దాదాపు మూడు వేలమంది మృతి చెందగా... ఆమెరికా నడిబొడ్డున టెర్రరిస్టుల దాడితో అల్లకల్లోలం అలుముకుంది. అదేరోజు జురిచ్ నుంచి అట్లాంటా బయల్దేరిన హరి ప్రయాణిస్తున్నవిమానం ఉన్నట్టుండి దారి మళ్ళించారు. ప్రయాణీకులెవరికీ ఏం జరిగిందో తెలియలేదు. చివరికి జురిచ్ లోని హోటల్ రూమ్ కు చేరిన హరికి... వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ గురించి తెలిసింది. మానవ నిర్మిత విపత్తుపై స్వానుభవమైంది. ఆతర్వాత న్యూయార్క్ మేయర్ గిలియానీ గెట్ మోటివేటెడ్ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు హరిని ప్రేరేపించాయి. దీంతో విపత్తు సంసిద్ధత గురించి వాస్తవాలను అధ్యయనం చేసేందుకు హరి ఆకర్షితుడయ్యారు. ఇండియాలోని చెన్నైకి చెందిన హరి బాలాజీ... స్విజ్జర్లాండ్ లోని స్విస్ హోటల్ మేనేజ్ మెంట్ లో చదివి, భారత్, స్విజ్జర్లాండ్, కువైట్ సంయుక్త ప్రముఖ బ్రాండ్లకు అనేక నిర్వహణ హోదాల్లో పనిచేశాడు. లూసియానాలో ఉన్నప్పుడు సహజ విపత్తు అయిన హరికేన్ ను కళ్ళారా చూసి, తీవ్రంగా స్పందించాడు. ఇలా సునామీ వంటి పలు ప్రకృతి బీభత్సాలను చూసిన హరి... డిజాస్టర్ మేనేజ్ మెంట్ పై స్వంత దేశంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యుల మద్దతుతో గ్రీన్ కార్డ్ రద్దు చేసుకున్నాడు. భారతదేశానికి పూర్తిగా తరలివచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత హరి ఆరోగ్య సంప్రదాయ విద్యను చెన్నై శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. హాస్పిటల్ అండ్ హెల్త్ సిస్టమ్స్ మేనేజ్ మెంట్ లో ఎంబిఎ చేశాడు. కోర్సులో భాగంగా చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో విపత్తుల అంచనాపై అధ్యయనం చేశాడు. చెన్నై ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లో ఓ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడుగా పనిచేశాడు. పలు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్వహిస్తూ విపత్తు నిర్వహణలో స్వతంత్ర కార్ఖానాలు నిర్వహించడం ప్రారంభించాడు. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సమయాల్లో వ్యూహాలపై తాను నిర్వహిస్తున్న కార్ఖానాల్లో దృష్టి పెట్టారు. భౌతిక నష్టాన్నే కాక, మానసికంగా కూడ వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కావలసిన శిక్షణ ఇవ్వడంపై అవగాహన కల్పించాడు. ఒక్క విపత్తులపైనే కాక హరి బాలాజీ... మానవత్వాన్ని చాటుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణాకు గురౌతున్న మహిళలు, బాలికలకు అవగాహన కల్పించడం, వివక్షను నిర్మూలించే ప్రయత్నాలతో పాటు... విపత్తు సమాయాల్లో ఎదుర్కొనే పలు సమస్యలపై దృష్టి సారిస్తూ... అడుగు ముందుకేస్తున్నాడు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు విపత్తులపై అవగాహన కల్పించేందుకు ఇన్సెంటివిటి తరగతులను కూడ నిర్వహిస్తున్నారు. విపత్తు నిర్వహణలో ప్రపంచంలోనే భారత్ ముందుండేందుకు కృషి చేస్తూ... ప్రత్యేక కార్యక్రమాలతో ఉత్సాహంగా దూసుకుపోతున్నాడు. -
అన్నదాతకు ‘ఏడు’పే!
జిల్లాలో కరువు మండలాలు ఏడేనట లెక్క తేల్చిన విపత్తుల నిర్వహణ విభాగం త్వరలో అధికారిక ప్రకటన రంగారెడ్డి జిల్లా: అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అతలాకుతలమైన రైతాంగాన్ని విపత్తుల నిర్వహణ విభాగం నట్టేట ముంచింది. కరువు ప్రభావంతో పెట్టుబడులు సైతం దక్కని పరిస్థితి నెలకొనగా.. కనీసం కరువు మండలాల వల్ల పెట్టుబడి రాయితీయైనా దక్కుతుందనుకున్న కర్షకులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో కేవలం ఏడు మండలాలే కరువుకు అర్హత పొందినట్లు విపత్తుల నిర్వహణ విభాగం తేల్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో శేరిలింగంపల్లి, బాలానగర్, ఉప్పల్, శామీర్‌పేట, దోమ, మంచాల, కందుకూరు మండలాలున్నాయి. గ్రామీణ మండలాలు నాలుగే.. జిల్లాలో 37 మండలాలకుగాను 33 గ్రామీణ మండలాలున్నాయి. మరో నాలుగు మండలాలు పట్టణ మండలాలు. జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కరువు మండలాల నివేదికలో ఏకంగా 37 మండలాలను పేర్కొంది. పంటల సాగు, దిగుబడి, వర్షపాతం వివరాలను జోడించి ఈమేరకు నివేదికలు పంపింది. అయితే విపత్తుల నిర్వహణ విభాగం మాత్రం జిల్లాలో ఏడింటిని మాత్రమే కరువు మండలాలుగా నిర్ధారించింది. ఇలా గుర్తించిన ఏడు కరువు మండలాల్లో కేవలం నాలుగు మండలాలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలు. శేరిలింగంపల్లి, ఉప్పల్, బాలానగర్ మండలాల్లో సాగు విస్తీర్ణం పెద్దగా లేదు. అక్కడక్కడా పశుగ్రాసం తప్ప ఇతర పంటల సాగు కనిపించదు. అలాంటి మండలాలను కరువు మండలాలుగా గుర్తించడం విశేషం. మరోవైపు శామీర్‌పేట మండలం ఎక్కువగా పట్టణ ప్రాంతమే. అయితే గ్రామీణ మండలాల్లో కేవలం నాలుగు మాత్రమే కరువు పీడిత ప్రాంతాలుగా ఆ విభాగం నిర్ధారించడంతో జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులకు భారీ నష్టం వాటిల్లనుంది. -
భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు
లండన్: భూమికి ఇప్పుడప్పుడే అంతం లేదని.. ప్రళయం వంటి విపత్కర పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారం హామీ ఇచ్చింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గ్రహశకలం భూమిపైకి దూసుకువస్తున్నదని.. దీని వేగం.. సాంద్రతను అంచనా వేసినప్పుడు..ఒకవేళ అది భూమిని ఢీకొంటే విశ్వ వినాశనం తప్పదన్న వార్తలను నాసా కొట్టిపారేసింది. ఆస్టరాయిడ్86666 అనే పేరు గల ఈ గ్రహశకలం శనివారం భూమికి అతి సమీపం నుంచి వెళ్తుందని ముందుగానే నాసా శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. అది భూమిని ఢీకొంటుందని.. దానివల్ల ప్రపంచం క్షణాల్లో నాశనమవుతుందని గత నెలరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. దీని ప్రయాణం గురించి నాసా శనివారం తెలిపింది. ‘ఆస్టరాయిడ్ 86666 అక్టోబర్ 10న భూమిని 15 మిలియన్ మైళ్ల దూరం నుంచి సురక్షితంగా దాటుతుంది.’’ అని పేర్కొంది. రానున్న వందేళ్లలో గ్రహశకలాల వల్ల భూమికి ప్రమాదం 0.01శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. -
కొత్త ఆశల వైపు..
సాగర సోయగాలను అణువణువునా సింగారించుకున్న సుందర నగరం మనది. ఉజ్వల భవిష్యత్తు దిశగా పరుగులు తీసే అద్భుత ప్రదేశం మనది. అయితే అనుకోని విపత్తు ఈ సౌందర్యాన్ని చిందరవందర చేసింది. అనూహ్యంగా ఎదురైన అవాంతరం ఈ ప్రయాణానికి అవరోధం సృష్టించింది. నిజమే.. ప్రకృతి మునుపెన్నడూ లేని రీతిలో విశాఖపై పగబట్టింది. అంతమాత్రాన ఈ పయనం ఆగదు కదా.. ఉరకలేసే జలపాతాన్ని గండశిల అడ్డుకుంటే ప్రవాహం దానిపై నుంచి పొంగిపొర్లక తప్పదు కదా! దీపశిఖ వంటి విశాఖను సుడిగాలి చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన వెలుగుల వెల్లువ నిలిచిపోదుగా! సంకల్పబలం ముందు ప్రకృతి సైతం తలదించక తప్పదని విశాఖ ఇప్పటికే నిరూపించింది. ఆ మనోబలంతోనే ఈ మహానగరం పురోగమిస్తుంది. రాష్ట్ర ముఖచిత్రం మారిన నేపథ్యంలో విశాఖ ప్రాధాన్యం ఇంతింతై పెరుగుతోంది. స్మార్ట్ సిటీ చాన్స్, ఐటీఐఆర్ ఇంపార్టెన్స్ విశాఖ భవిష్యత్తుకు ఆలంబనగా నిలిస్తే, సహజసిద్ధమైన సౌందర్యం కారణంగా లభించబోయే పర్యాటక మహర్దశ విశాఖ స్వరూపాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతుంది. అందుకు ఈ కొత్త సంవత్సరమే ఆలంబన కానుంది. విశాఖ వాకిట మళ్లీ కళకళలాడనున్న మామిడాకుల తోరణం ఉజ్వల భవితకు సంకేతం కాకుంది. నేటి సూరీడి సాక్షిగా రేపటి వెలుగు కాంతులీనబోతోంది. -
వృత్తిపరమైన సంతృప్తికి.. డిజాస్టర్ మేనేజ్మెంట్
సుందర నగరం విశాఖతోపాటు ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం మాటలకందనిది. ఈ విపత్తుతో నగరం అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రూ.వేల కోట్ల నష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తూ.. సర్వం కోల్పోయి వీధిన పడ్డ ప్రజలకు అండగా నిలుస్తూ నగరాన్ని ఒక దారికి తీసుకొస్తున్న నిపుణులు కనిపిస్తున్నారు. పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్న ఈ సిబ్బందే.. విపత్తుల నిర్వహణ(డిజాస్టర్ మేనేజ్మెంట్) నిపుణులు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ప్రకృతి బీభత్సాలతోపాటు ప్రేరేపిత విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు శిక్షణ పొందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సేవలు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి. అందుకే ఈ రంగాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభ్యమవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు తుఫాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విలయాలతోపాటు ఉగ్రవాద, తీవ్రవాదుల దాడుల్లో అపారమైన నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు విపత్తుల నిర్వహణ సిబ్బంది కృషి చేస్తుంటారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణ బాధ్యతలను చేపడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర(ఎన్జీవో) సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న భారీ పరిశ్రమలు, భవనాల్లో వీరి సేవలు అవసరం. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రిసార్ట్‌ల్లో వీరిని నియమించుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లోనూ అవకాశాలున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ), ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ), రెడ్ క్రాస్, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందికి కొలువులను కల్పిస్తున్నాయి. ఈ రంగంలో నిపుణుల కొరత వేధిస్తోంది. భారత్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో రీసెర్చ్ స్కాలర్స్ సంఖ్య స్వల్పంగానే ఉంది. మరోవైపు విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా అవకాశాలున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్కు కేంద్ర హోంశాఖతోపాటు రాష్ర్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో నిపుణులకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో చేరితే నిర్వాసితులకు సేవలు అందించామన్న వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది. కావాల్సిన నైపుణ్యాలు: అన్ని రకాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. సకాలంలో వేగంగా స్పందించే గుణం అవసరం. అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలగాలి. కొత్త బాధ్యతలను చేపట్టి, పూర్తిచేసే సామర్థ్యం ఉండాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. అర్హతలు: డిజాస్టర్ మేనేజ్మెంట్పై మన దేశంలో డిప్లొమా, సర్టిఫికెట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్, అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరొచ్చు. ఏవైనా సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంది. వేతనాలు: డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. వృత్తిలో నాలుగైదేళ్ల అనుభవం ఉంటే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సొంతం చేసుకోవచ్చు. అంతర్జాతీయ ఎన్జీవోల్లో చేరితే నెలకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వేతనం పొందొచ్చు. ప్రభుత్వ సంస్థల్లో ప్రాజెక్ట్ మేనేజర్‌కు నెలకు రూ.35 వేల వేతనం ఉంటుంది. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా చేరితే హోదాను బట్టి జీతభత్యాలుంటాయి. కన్సల్టెన్సీల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెబ్సైట్: http://nidm.net/ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్ వెబ్సైట్: www.nbu.ac.in ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ వెబ్సైట్: www.unom.ac.in డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.dmibhopal.nic.in నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ వెబ్సైట్: http://ncdcnagpur.nic.in/ -
ఎబోలాపై తాజా యుద్ధం
మరో రెండునెలల్లోపు ఎబోలా వైరస్‌ను నిర్మూ లించలేకపోతే మన తరంలోనే అతి పెద్ద మానవ విపత్తును ఎదుర్కోవలసి ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించిన ఎబోలా ఇప్పటికే 4,500 మందిని బలి తీసుకుంది. మానవ శరీరంలోని ద్రవపదార్థాల (రక్తం, వాంతి, విరోచనం,) ద్వారా శరవేగంగా ఇది వ్యాపిస్తోంది. ఈ వ్యాధికి గురైన వారిలో 70 శాతం మంది నిస్సహాయంగా మరణిస్తున్నారు. దీని బారినపడిన గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాల్లో వ్యాధి నివారణ కోసం అవసరమైన సైనిక సామగ్రి, ఆర్థిక సహాయం అందకపోతే అంతర్జాతీయ సమాజం తర్వాత వగచీ ప్రయోజనం లేదని అమెరికా, బ్రిటన్లు తాజాగా హెచ్చరించడం ఎబోలా తీవ్రతను సూచిస్తోంది. 60 రోజులలోపు ఎబోలా వైరస్‌ను అదుపు చేయలేకపోతే ఒక ప్పుడు పోలియో, తర్వాత హెచ్ఐవీ మహమ్మారిలా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుందని అమెరికా స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ శనివారం హెచ్చరించారు. పశ్చిమాఫ్రికాలో ఎబోలా వైరస్ బయటపడిన తొలి దశ లో దాంతో సరిగా వ్యవహరిం చలేకపోయామని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించిన నేపథ్యంలో ఆ ప్రాంతంపై దశాబ్దాలుగా ప్రభావం చలాయిస్తున్న పాశ్చాత్య దేశాల్లో కలవరం మొదలైంది. ఎబోలా వైరస్ అదుపు వాటి సామూహిక బాధ్యతగా మారుతోంది. పశ్చిమాఫ్రికాకు పరిమితం కాకుండా విస్తరిస్తున్న ఎబోలా బారిన తాను కూడా చిక్కుకోకతప్పదని పాశ్చాత్య ప్రపంచం వేగంగానే గుర్తించింది. సరిగ్గా తుపాను కేంద్రం (కన్ను)లో పోయి పడ్డామనీ, ఎబోలా వ్యాప్తిని ఊరకే చూస్తూ చేష్టలుడిగే దశకు మనం చేరుకోకూడదనీ, పరిస్థితి విషమం కాకముందే ఉమ్మడి లక్ష్యంతో దాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలని పశ్చిమా ఫ్రికాలో ఎబోలా రోగులకు వైద్య సేవలందిస్తున్న ఆక్స్ ఫామ్ చారిటీ సంస్థ పేర్కొంది. వైరస్ విస్తరించిన మూడు దేశాలకు సైనిక దళాలను, వైద్యులను పంపించి, తగినన్ని నిధులు కేటాయించడంలో వెనుకబడితే యావత్ యూరప్, అమెరికా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని సంస్థ సీఈఓ మార్క్ గోల్డ్ రింగ్ తీవ్రంగా హెచ్చరించారు. ఎబోలా వ్యాధి అదుపుకోసం సమాజం కనీవినీ ఎరుగని రీతిలో సత్వరమే స్పందించాలన్న ఆక్స్ ఫామ్ హెచ్చరిక తనదైన ప్రభావం చూపుతోంది. అమెరికా ఇప్పటికే భారీమొత్తాన్ని ఎబోలా అదుపునకు కేటాయించగా ఇంగ్లండ్ ఇటీవలే 125 మిలియన్ పౌండ్ల సహాయం ప్రకటించింది. మరో బిలియన్ డాలర్లను సహాయం అందించడానికి ఈయూ త్వరలో సమావేశం కానుంది. పశ్చిమాఫిక్రాలోని ఎబోలా చికిత్సా కేంద్రాలలో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు అవసరం. పైగా వైద్యుల మోహరింపునకు, వైద్య సామగ్రి తరలింపునకు పెద్ద ఎత్తున సైనిక దళాల అవసరం ఏర్పడింది. ఆ ప్రాంతంలో వ్యాధి నివారణలో మునిగి ఉన్న ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు ప్రధానంగా స్వచ్ఛ జలం, పారిశుధ్యం, ప్రజలను జాగరూకులను చేయడంపై దృష్టి పెడుతు న్నాయి. చికిత్స ఎంత అవసరమో ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడం అంత అవస రం. దీనికి నిధులు పెద్ద ఎత్తున అవసరం. ఈ తరంలోనే అతి పెద్ద విపత్తు చెలరేగుతున్నా దాంతో వ్యవహరించేందుకు ప్రపంచం ఇప్పటికీ పెద్దగా సిద్ధపడలేదని విమర్శ. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా 4,000 మం దిని, బ్రిటన్ 750 మంది బలగాలను పంపించాయి. ఈయూ నుంచి మరో 2 వేల మంది వైద్య సిబ్బందిని పంపించాలని బ్రిటన్ ప్రధాని ఈయూను కోరను న్నారు. సిబ్బందిని, సహాయ సామగ్రిని శరవేగంగా పంపించడం ద్వారానే పశ్చిమాఫిక్రాలో ఎబోలాను అరికట్టవచ్చు. ప్రతి 20 రోజులకు ఎబోలా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. డిసెంబర్ నాటికి కొత్తగా 10 వేల కేసులు నమోదు కానున్నాయి. గణాంకాలకు సంబంధించిన ఈ భయ విహ్వల నేపథ్యం పాశ్చాత్యదేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఎబోలాపై సామూహిక బాధ్యతను ఈ క్షణం చేపట్టకపోతే పశ్చిమాఫ్రికా ప్రాంత రాజకీయ, ఆర్థిక, సామాజిక చట్రం కుప్పకూలుతుంది. అక్కడి నుంచి వ్యాపించే వ్యాధి ప్రభావం తమ పౌరులను కూడా వదిలిపెట్టదని పాశ్చాత్య సమాజం భీతిల్లుతోంది. -
ముంచెత్తిన మునేరు
ఒక్కసారిగా వచ్చిపడ్డ వరద నీరు లంకల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు, 38 గొర్రెలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు మునేరు గేట్లు ఎత్తివేత నందిగామ రూరల్/ పెనుగంచిప్రోలు/ వత్సవాయి : తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ కృష్ణలోని మునేరు వాగు ఉగ్రరూపం దాల్చి లంకలను ముంచెత్తింది. శనివారం ఉదయం ఒక్కసారిగా వచ్చి పడిన వరద నీరు సమీప ప్రాంత వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నందిగామ మండలం రాఘవాపురం సమీపంలో మునేటి మధ్యలోనున్న లంకలో చిక్కుకుపోయిన ముగ్గురు గొర్రెల కాపర్లు, 38 గొర్రెలను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు తీసు కొచ్చారు. అలాగే పశువులను మేపడానికి వెళ్లి లంకలో చిక్కుకున్న కంచికచర్ల మండలంలోని మోగులూరుకు చెందిన దున్నా జాన్ అనే వ్యక్తిని స్థానిక అధికారులు నాటుపడవ సాయంతో రక్షించారు. వరద ప్రవాహానికి పెనుగంచి ప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద మునేరులో వ్యాపారులు వేసుకున్న పాకలు కొట్టుకుపోయాయి. మునేరు కాజ్వే వద్ద వరద నీరు దాదాపు 8 అడుగుల పైన ప్రవహిస్తోంది. వరదనీరు ఎక్కువ కావడంతో వత్సవాయి మండల పరిధిలో ఉన్న మునేరు కాలువ గేట్లను ఎత్తివేశారు. గొర్రెల కాపర్లు సురక్షితం... నందిగామ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన మంచ్యాల వెంకటేశ్వరరావు, మంచ్యాల పవన్, యరగొర్ల శ్రీను తెల్లవారు జామున 4.40గంటలకు 38 గొర్రెలు, మేకలు వాటి పిల్లలను నందిగామలో జరిగే సంతలో విక్రయించేందుకు మునేటి మార్గం ద్వారా కాలినడకన బయల్దేరారు. మునేటిలో కొంత దూరం వచ్చిన తరువాత ఒకేసారి సుమారు 5అడుగుల ఎత్తున మునేరుకు వరద నీరు వచ్చింది. దీంతో వారు సమీపంలోని లంక వద్దకు చేరుకుని బంధువులకు సమాచారమిచ్చారు. స్థానిక అధికారులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు డీఎస్పీ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది సహాయంతో ఎయిర్‌బోట్ ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకు రాగలిగారు. అయితే మునేరులో వరదనీరు తాగడం వల్ల 38 గొర్రెలలో రెండు మృతి చెందాయి. కాగా మునేరుకు వరద నీటిని కాలువలకు వదలడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, కూలీలు పొలాల బాట పట్టారు. నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు, సీఐ భాస్కరరావు, ఎస్ఐ ఏసుబాబు, ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సహాయక చర్యలు పూర్తయ్యేంతవరకు మునేటి వద్దే ఉండి పర్యవేక్షించారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సందర్శన... రాఘవాపురం సమీపంలో మునేటి లంక వద్ద వరద నీటిలో గొర్రెలు, మేకలతో పాటు వాటి యజమానులు చిక్కుకున్నారనే సమాచారం తెలియగానే వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు రాఘవాపురం గ్రామానికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలికి బలమైన గాయాలైనప్పటికీ ఆపదలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు చాలా సేపు మునేటి వద్దే ఉండిపోయారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు పెసరమల్లి సురేష్, మంచ్యాల చంద్రశేఖర్, రామకృష్ణ, పరిమికిషోర్ ఉన్నారు. -
ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు.. నిలిచిన యాత్ర
ఉత్తరాఖండ్.. వర్షాలు.. ఈ మాటలు వింటే చాలు ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది. గత సంవత్సరం సరిగ్గా ఇదే సమయానికి అక్కడ భారీ వర్షాలు సృష్టించిన విలయం కళ్లముందు కదలాడుతుంది. తాజాగా మరోసారి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. దాంతో చార్ధామ్ యాత్రకు తీవ్ర ఆటంకం కలిగింది. కొండచరియలు, పెద్దపెద్ద చెట్లు విరిగి పడటంతో కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. గడిచిన రెండు రోజులుగా చంపావత్, చమోలి, నైనిటాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చమోలి జిల్లాలోని లాంబాగఢ్, చిరోబాగఢ్, విజయ్‌నగర్, అగస్తముని లాంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాబోయే 24 గంటల్లో కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రుద్రప్రయాగ, ఉత్తరకాశీ, పితోరాగఢ్ లాంటి ప్రాంతాలకు విపత్తు నివారణ బృందాలను పంపారు. హిమాలయ క్షేత్రాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ హెచ్చరించింది. గత సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా వేలాదిమంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. -
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం
-
వికాసం: సమస్యని చంపటానికి మూడు బాణాలు
మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం. వింధ్యారణ్య ప్రాంత లోయలో ఒక చిన్న పల్లె ఉంది. పచ్చటి చెట్ల మధ్య సంతోషంగా కాలం గడిపే ఆ గిరిజనులకి అకస్మాత్తుగా ఒక విపత్తు వచ్చి పడింది. గుంపులుగుంపులుగా పులులు వచ్చి వాళ్ల ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకోవటమే కాక, ఇళ్లమీద కూడా దాడి చేయసాగాయి. ఆ గ్రామస్థులు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి శరణు వేడారు. వాళ్లని రక్షించడం కోసం ద్రోణుడు ధర్మరాజుని పంపాడు. ధర్మరాజు వెళ్లి పులుల తాలూకు తరువాతి దాడి కోసం ఆ గ్రామంలో ఎదురుచూశాడు. అవి వచ్చినప్పుడు వాటి నాయకుణ్ని చంపి, మిగతా వాటిని అడవిలోకి పారదోలాడు. విజయోత్సాహంతో గిరిజనులు నాట్యాలు చేశారు. ధర్మరాజుకి ఘనంగా సత్కారం చేసి పంపారు. కానీ వాళ్ల సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగే సరికి ఆ క్రూర మృగాలు ఈసారి మరింత పెద్ద గుంపుగా గ్రామం మీద పడ్డాయి. ద్రోణుడు భీముణ్ని పంపాడు. భీముడి ఆయుధం ‘గద’. ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో ఒకటి. అయితే అది ఏనుగుని సంహరించగలదు, రథాల్ని బద్దలగొట్టగలదే తప్ప ‘చురుకైన’ పులుల మీద ఏ ప్రభావమూ చూపించలేకపోయింది. భీముడు క్షతగాత్రుడై పడిపోయాడు. అప్పుడు ద్రోణుడు అర్జునుణ్ని పంపగా, అతను వెళ్లి తనకున్న విలువిద్యా నైపుణ్యంతో అన్ని పెద్దపులుల్ని చంపి తన సోదరుడిని రక్షించి వెనక్కి తెచ్చాడు. ద్రోణుడు అర్జునుణ్ని అభినందించాడు. అయితే సమస్య తీరలేదు. ఏడాది తిరిగే సరికి యవ్వనంతో బలిసిన తరువాతి తరం పులులు గ్రామం మీద భయంకరంగా దాడి చేశాయి. గ్రామస్తులు మళ్లీ వెళ్లి ద్రోణున్ని శరణు వేడారు. అతడు ఈసారి ఆఖరి ఇద్దరిని పంపించాడు. నకుల సహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు పరిసర ప్రాంతాలని పరిశీలించారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, తగినంత ధైర్యాన్నిచ్చి పులులతో ఎలా యుద్ధం చేయాలో వాళ్లకి సహదేవుడు నేర్పి యుద్ధానికి సంసిద్ధం చేశాడు. ఈసారి పులులు దండెత్తినప్పుడు ఏమాత్రం ప్రాణనష్టం లేకుండా గ్రామస్థులే వాటిని ధైర్యంగా ఎదుర్కొని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకుల సహదేవుల్ని ‘ఇది నిశ్చయంగా మీ విజయం’ అంటూ ద్రోణుడు పొగిడాడు. ఈ కథ మూడు సూత్రాల్ని చెబుతుంది. 1. ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు. 2. సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే. 3. మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం. ‘సమస్య’ అంటే ఏమిటి? ఆర్థిక, గృహ, వృత్తిపరమైన రంగాల్లో బాధనీ, ఇబ్బందినీ కలుగజేసేది. ఇది శారీరకం కావొచ్చు. మానసికం కావొచ్చు. ఇంట్లో జీవిత భాగస్వామితో బాధలు, బయట అవమానాలు, రేపటి పట్ల భయం, దగ్గరివారి మరణం మొదలైనవి ‘మానసిక’ కష్టాలు. అనారోగ్యం, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో వెహికల్ ఆగిపోవటం, అర్ధరాత్రి ఏసీ పనిచెయ్యకపోవటం, ‘శారీరక’ బాధలకి ఉదాహరణలు. ‘సమస్యలు క్లిష్టమైనవి కాబట్టి వాటిని మనం ధైర్యంతో ఎదుర్కొనలేము’ అన్న సిద్ధాంతం తప్పు. మనం ధైర్యంతో ఎదుర్కోలేకపోబట్టే సమస్యలు క్లిష్టమౌతాయి. నరకం (సమస్య)లో ఉన్నప్పుడు అక్కడే ఆగిపోతే, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాం. అడుగు ముందుకు వేస్తే, బయటపడటానికి కనీసం ‘సగం అవకాశం’ ఉంటుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
విపత్తుల జాబితాలోకి వడదెబ్బ మరణాలు!
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ మృతులను కూడా విపత్తు మరణాల జాబితాలో చేర్చి జాతీయ/రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ. 1.5 లక్షల సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5వ తేదీ మధ్య 1,377 మంది వడదెబ్బతో మృతిచెందారని, 2003 వేసవిలో మూడు వేల మంది వడదెబ్బతో చనిపోయారని, ఈ దృష్ట్యా వడదెబ్బ మరణాలను విపత్తుల కిందకు చేర్చాలని తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే చలిగాలి మరణాలు విపత్తుల జాబితాలో ఉన్నాయని, అలాగే వడదెబ్బను కూడా విపత్తుగానే పరిగణించాలని కోరారు.