ముంచెత్తుతున్న వరదలతో హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరదల కారణంగా 18 మంది మృతిచెందగా, 37 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటూ వరద హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలోని బిలాస్‌పూర్, హమీర్‌పూర్, కులు, కాంగ్రా, మండీ, సోలన్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాలలో ఆగస్టు 7 నుండి 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో ఉనాలో 40.2, బిలాస్‌పూర్‌లో 25.8, సిమ్లాలో 19, కుఫ్రీలో 13.4, పాంటా సాహిబ్‌లో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో తలెత్తిన ప్రతికూల పరిస్థితుల కారణంగా 53 రహదారులలో రాకపోకలను నిలిపివేశారు.
సిమ్లా, కులు, మండి జిల్లాల్లోని ఏడు చోట్ల వరదల కారణంగా పలువురు గల్లంతుకాగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అలాగే రాంపూర్‌లోని సమేజ్ నుండి సట్లెజ్ కాలువలోకి కొట్టుకుపోయిన ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. సిమ్లాలోని రాజ్‌భవన్ నుంచి కులు జిల్లాకు రెండు సహాయ సామగ్రి వాహనాలు తరలివెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment