Himachal
-
వక్ఫ్ బోర్డును రద్దు చేయాలంటూ ర్యాలీ
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలీలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని కోరుతూ దేవభూమి సంఘర్ష్ సమితి హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీనిలో పాల్గొన్న 46 ఏళ్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడొకరు గుండెపోటుతో కన్నుమూశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్పూర్, మండీ, చంబా, నహాన్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. హమీర్‌పూర్‌లో ఆందోళనకారులు అధికారులకు మెమోరాండం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్‌పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే పోలీసు వాహనంలో హమీర్పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తెలిపారు.నిరసన ప్రదర్శనలో పాల్గొన్న దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్ మాట్లాడుతూ, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ ఐదు వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామని, ఆ తరువాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామన్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి -
హిమాచల్‌లో అకాల ఎండలు.. 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సిమ్లా: గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో వాతావరణం వేడిగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే, జూన్ నాటి వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారింది. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు.మరికొద్ది రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజానికి హిమాచల్ ప్రదేశ్‌లో సెప్టెంబర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈనెల 15 తర్వాత హిమాచల్‌లో రెండు రోజుల పాటు వాతావరణం చల్లగా మారింది. మనాలి, కిన్నౌర్, లాహౌల్ స్పితి తదితర ప్రాంతాల్లోని పర్వతాలపై మంచు కురిసింది. అయితే గడచిన కొద్దిరోజులుగా వర్షాలు తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగాయి. సిమ్లా, మనాలిలో ప్రస్తుతం ఏర్పడిన ఉష్ణోగ్రతలు పదేళ్ల రికార్డును బద్దలు కొట్టాయి.సిమ్లా వాతావరణ కేంద్రం విడుదల చేసిన డేటాలోని వివరాల ప్రకారం ఈ నెల 23, 24 తేదీల్లో సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదైంది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం. 1994లో సెప్టెంబర్ 30న సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెంట్రీగ్రేడ్గా నమోదయ్యింది. అదేవిధంగా మనాలిలో కూడా సెప్టెంబర్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సెప్టెంబర్ 23న 27.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.మరోవైపు సెప్టెంబర్ నెలలో కాంగ్రాలో ఆల్ టైమ్ ఉష్ణోగ్రతల రికార్డు బద్దలైంది. ఈ నెలలో ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 35 డిగ్రీలకు చేరుకోలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 24న ఇక్కడ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యంత వేడిగా ఉండే హిమాచల్ జిల్లాలోనూ పరిస్థితి ఇలానే ఉంది. సెప్టెంబర్‌లో ఉనాలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ధర్మశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం ఇక్కడ అత్యధికంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇది కూడా చదవండి: నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు -
నేడు హిమాచల్ బంద్.. హిందూ సంస్థల పిలుపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు శుక్రవారం లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (సెప్టెంబర్ 14) హిమాచల్ బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.హిమాచల్ బంద్ నేపధ్యంలో రాష్ట్రంలోని వ్యాపారులంతా తమ దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి ఉంచాలని హిందూ సంస్థ నేత కమల్ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. సిమ్లాలోని సంజౌలీలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతామని హిందూ సంస్థలు హెచ్చరించాయి.సెప్టెంబర్ 11న ఉదయం సంజౌలిలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిమ్లా జిల్లా యంత్రాంగం సెక్షన్ 163ని అమలు చేసింది. ఇందులోభాగంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై పూర్తి నిషేధం విధించారు. అయితే ఆందోళనకారులు ఢిల్లీ టన్నెల్ దగ్గరున్న బారికేడింగ్‌ను బద్దలు కొట్టి, సంజౌలి వైపు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్ ప్రయోగించారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.ఇది కూడా చదవండి: అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్ -
ఆ రాష్ట్రంలో యువతుల వివాహ వయస్సు పెంపు
దేశంలో యువతుల వివాహ వయస్సు 18గా ఉంది. అంటే వారికి చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సవరించింది.హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 21 ఏళ్ల వయస్సు వచ్చాకనే ఆడపిల్లలకు వివాహం చేయాలనే నిబంధనను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ తాజాగా యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.ఈ సందర్భంగా మహిళా సాధికారత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిషేధించేందుకు బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు యువతుల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం ఆడపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు. -
మణిమహేష్ యాత్ర ప్రారంభం
హిమాచల్ ప్రదేశ్‌లో జన్మాష్టమికి మొదలై రాధాష్టమికి ముగిసే యాత్రను మణిమహేష్ యాత్ర అని అంటారు. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అటు ప్రకృతి ప్రేమికులకు, ఇటు సాహస ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఇది. అలాగే విహారయాత్రలు చేసేవారికి, ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టేవారికి హిమాచల్‌ప్రదేశ్ గమ్యస్థానంగా నిలిచింది.వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించవచ్చు. ముఖ్యంగా జన్మాష్టమి నుండి రాధాష్టమి వరకు మణిమహేష్ సరస్సును సందర్శించేందుకు ఉత్తమమైన సమయం. దాల్ సరస్సునే మణిమహేష్ సరస్సును అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి అనంతరం మణిమహేష్ సరస్సును చూసేందుకు యాత్రికులు తరలివస్తుంటారు.ఆగస్టు 26 నుండి మణిమహేష్ యాత్ర ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మణిమహేష్ సరస్సును సందర్శించవచ్చు. కైలాస శిఖరంపై నివసిస్తున్న మణిమహేషుడు(మహాశివుడు)ఈ సమయంలో దాల్ సరస్సునుంచి అద్భుతంగా కనిపిస్తాడని చెబుతారు. మణిమహేష్ యాత్ర ప్రతియేటా సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే జన్మాష్టమి నుంచి మొదలువుతుంది. తొమ్మదివ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మన్ ఇక్కడే శివుణ్ణి దర్శనం చేసుకున్నాడని చెబుతారు. సెప్టెంబర్ 11 రాధాష్టమితో మణిమహేష్ యాత్ర పరిసమాప్తమవుతుంది. -
Himachal: విరిగిపడిన కొండచరియలు.. 128 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో 128 రహదారులు మూతపడ్డాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మండీ, బిలాస్పూర్, సోలన్, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లో వరద ముప్పు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. బలమైన గాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి తాకిడి కారణంగా పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయని, బలహీనమైన నిర్మాణాలు, కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మండీలో 60, కులులో 37, సిమ్లాలో 21, కాంగ్రాలో ఐదు, కిన్నౌర్‌లో నాలుగు, హమీర్పూర్ జిల్లాలో ఒక రోడ్డును మూసివేశారు. అలాగే 44 విద్యుత్, 67 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది.మండీ జిల్లాలోని జోగిందర్‌నగర్‌లో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మశాలలో 125.4, కటౌలాలో 112.3, భరారీలో 98.4, కందఘాట్లో 80, పాలంపూర్‌లో 78.2, పండోహ్లో 76, బైజ్నాథ్లో 75, కుఫ్రీలో 70.8, కుఫ్రిలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 445.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది. ఇప్పుడు 321.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
Himachal: వరదలతో అతలాకుతలం.. 18 మంది మృతి, 37 మంది గల్లంతు
ముంచెత్తుతున్న వరదలతో హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరదల కారణంగా 18 మంది మృతిచెందగా, 37 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటూ వరద హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలోని బిలాస్పూర్, హమీర్పూర్, కులు, కాంగ్రా, మండీ, సోలన్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాలలో ఆగస్టు 7 నుండి 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో ఉనాలో 40.2, బిలాస్పూర్లో 25.8, సిమ్లాలో 19, కుఫ్రీలో 13.4, పాంటా సాహిబ్‌లో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో తలెత్తిన ప్రతికూల పరిస్థితుల కారణంగా 53 రహదారులలో రాకపోకలను నిలిపివేశారు.సిమ్లా, కులు, మండి జిల్లాల్లోని ఏడు చోట్ల వరదల కారణంగా పలువురు గల్లంతుకాగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అలాగే రాంపూర్‌లోని సమేజ్ నుండి సట్లెజ్ కాలువలోకి కొట్టుకుపోయిన ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. సిమ్లాలోని రాజ్‌భవన్ నుంచి కులు జిల్లాకు రెండు సహాయ సామగ్రి వాహనాలు తరలివెళ్లాయి. -
Himachal: హఠాత్తుగా ముంచెత్తిన వరద.. చాంగుట్- టింగ్రేట్ రోడ్డు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని మయాడ్ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మయాడ్ ఘాటీలోని చాంగుట్ కాలువలోకి అకస్మాత్తుగా వరదలు రావడంతో చాంగుట్ నుండి టింగ్రేట్ వరకుగల రహదారిని అధికారులు మూసివేశారు.ఈ వరదల కారణంగా ఇంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కులు, మండీ జిల్లాల్లో సంభవించిన వరదల్లో సుమారు 45 మంది గల్లంతు కాగా, వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, పోలీస్, హోంగార్డు బృందాలకు చెందిన మొత్తం 410 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. pic.twitter.com/rPvdpWnTvo— Lahaul & Spiti Police (@splahhp) August 3, 2024 -
రాహుల్ ఒక కార్టూన్ క్యారెక్టర్: కంగన
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె నాచన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సియాంజ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కార్టూన్ క్యారెక్టర్ అంటూ అభివర్ణించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో మౌంటెన్ క్యాప్ ధరించడంలో రాహుల్ గాంధీ చేసిన చిన్న పొరపాటును కంగనా ఎద్దేవా చేశారు. ఆయనకు మౌంటెన్ టోపీ ఎలా ధరించాలో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. రాహుల్ ఆ క్యాప్ పట్టుకుని వేదిక అంతా తిరిగారని, కొద్దిసేపటి తరువాత అక్కడున్న ఒక వ్యక్తి సాయంతో రాహుల్ ఆ క్యాప్ ధరించగలిగారని కంగన అన్నారు.రాహుల్ గాంధీ ఒక కార్టూన్ క్యారెక్టర్ అంటూ, ఏ విషయాలను అర్థం చేసుకోలేనివారు తనను ఎగతాళి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాహుల్, ప్రియాంక ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారని, వారికి మౌంటెన్ క్యాప్ ఎలా ధరించాలో కూడా తెలియదని కంగనా వ్యాఖ్యానించారు. చంద్రునిపై బంగాళదుంపలు పండించడం గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆమె వ్యంగ్యంగా అన్నారు.తాను ముంబై వెళ్లినప్పుడు కొందరు తన పహాడీ క్యాప్‌ను చూసి ఎగతాళి చేశారని, తనకి ఇంగ్లీషు రాదని చాలా మంది జోకులు వేసేవారని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఇంగ్లీషు నేర్చుకున్నానని, ముంబైలో కూడా నివసించానని, అయినా తన ప్రాంతంతో అనుబంధాన్ని కోల్పోలేదని కంగన పేర్కొన్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా తాను అత్యధిక మెజారిటీతో గెలుస్తానని కంగనా ఆశాభావం వ్యక్తం చేశారు. -
నేటితో ‘హిమాచల్’కు 76 ఏళ్లు!
హిమాచల్ ప్రదేశ్ ఈరోజు 76వ ఏట అడుగుపెట్టింది. ఈ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15న ఆవిర్భవించింది. నేడు హిమాచల్ దినోత్సవాన్ని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అనేక మైలురాళ్లను దాటిన హిమాచల్ ప్రదేశ్ నేడు అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. 1948లో హిమాచల్ ప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు ఏడు శాతంగా ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య సున్నా. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్‌లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్, ఐదు వైద్య కళాశాలలు, ఐదు డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. 1948వ సంవత్సరంలో హిమాచల్ ప్రజల తలసరి ఆదాయం రూ.240 కాగా, ప్రస్తుతం రూ.2,35,199కి చేరుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుండి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్ లాల్ 1977, 1980లలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంత కుమార్ 1977, 1990లో రెండుసార్లు అధికారంలో కొనసాగారు. వీరభద్ర సింగ్ 1985, 1993, 2003, 2012,2017లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరాం ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్విందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు. -
గడ్డకట్టే చలిలో మెడిటేషన్ చేస్తున్న యోగి! వీడియో వైరల్
హిమాలయాల్లో చలి ఎలా ఉంటుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చలికి తగ్గా బట్టలు కొన్ని రక్షణ పద్ధతలు పాటించకపోతే అంతే సంగతులు. అలాంటిది ఓ వ్యక్తి గడ్డకట్టే మంచులో హాయిగా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. ఓ పక్కన మంచు కురుస్తుంది. అయినా అవేమి పట్టనట్లు చాలా ప్రశాంతంగా యోగి పుంగవుడిలా మెడిటేషన్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. అతన ఆహార్యం సైతం యోగిశ్వరుడిలానే ఉంది. మన పురాణాల్లో కొందరు యోగులు, సిద్ధులు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటారని విన్నాం కానీ చూడలేదు. కానీ ఈ యోగి దర్శనంతో అది నిజం అనేందుకు ఈ ఘటన బలం చేకూర్చింది. 'వాల్మికి మహర్షి' కావడానికి ముందు బోయవాడని తెలుసు కదా!. ఆ తర్వాత ఆయన రామ్.. రామ్ అంటూ వేలయేళ్లు తపస్సు చేసి వాల్మికి మహర్షి అయ్యాడు. ఎందుకంటే అన్నేళ్లు తపస్సు చేస్తున్నప్పుడూ ఆయన చుట్టు పుట్టలు కట్టాయి. తపస్సు పూర్తి చేసుకుని పుట్ట(వల్మీకం) నుంచి బటయకు వచ్చాడు కాబట్టి ఆయన్ను వాల్మీకి మహర్షి అన్నారు. మరీ ఇలా మంచులో తపస్సు చేస్తూ... అతని చూట్టూ మంచులా గడ్డకట్టుకుపోతున్న ఈ వ్యక్తిని హిమ మహర్షి అని పిలుస్తారో ఏమో గానీ చూడటానికి ప్రశాంత వదనంతో ఉన్న గొప్ప యోగిలా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Piyush Goyal (@goyalpp) (చదవండి: తవ్వకాల్లో రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యి..దానిపై మిస్టీరియస్..!) -
హిమాచల్ ఉపముఖ్యమంత్రికి సతీ వియోగం
హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సతీమణి ప్రొఫెసర్ సిమి అగ్నిహోత్రి కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఉపముఖ్యమంత్రి స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ దంపతుల కుమార్తె ఆస్థా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సిమి అగ్నిహోత్రి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం చండీగఢ్‌కు తీసుకెళ్తుండగా, కురలి సమీపంలో ఆమె కన్నుమూశారు. हमारी प्रिय प्रोफेसर सिम्मी अग्निहोत्री हमारा और आस्था का साथ छोड़कर चली गई। — Mukesh Agnihotri (@Agnihotriinc) February 9, 2024 -
అటల్ టన్నెల్లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్!
హిమాచల్ ప్రదేశ్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హిమాచల్‌తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు. రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్‌లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
మందుబాబులకు వీఐపీ ట్రీట్మెంట్.. హిమాచల్ సీఎం ఆదేశాలు!
హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతరాణిగా పేరొందిన సిమ్లాలో తొలిసారిగా సిమ్లా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు కొనసాగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్‌తో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సాంస్కృతిక కవాతును వీక్షించారు. కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రౌండ్, మాల్ రోడ్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్నివాల్లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా కనిపించారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్‌లో కాకుండా హోటల్‌కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి వీఐపీ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. సిమ్లా వింటర్ కార్నివాల్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్‌ను 24 గంటలూ తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తుంచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సిమ్లా, మనాలిలకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలో బస చేస్తున్నారు. కాగా మనాలిలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. కొందరు పర్యాటకులు మద్యం సేవించి లోయల్లో హల్చల్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి!
హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది. సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం పలు హోటళ్ల యజమానులకు సూచించింది. ఇది కూడా చదవండి: బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్త గంగాదేవి శర్మ(106) కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఉంటున్న ఆమె తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈరోజు (సోమవారం) ఉదయం 7 గంటలకు గంగాదేవి కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం వ్యాస నది ఒడ్డున ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వృద్ధురాలు గంగాదేవి శర్మ మృతితో కులులోని శాస్త్రి నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. జేపీ నడ్డా అత్త ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఆమెను సంరక్షించేందుకు ఇద్దరు కేర్టేకర్లు ఉన్నారు. నడ్డా బాల్యం అంతా అతని అత్త ఇంట్లోనే గడిచింది. అందుకే నడ్డా.. కులును తన రెండవ స్వస్థలం అని చెబతుంటారు. తాను హిమాచల్‌ను సందర్శించినప్పుడల్లా తన అత్త ఇంటికి వెళ్తానని నడ్డా తెలిపారు. జేపీ నడ్డా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాసర్‌పూర్ జిల్లా నివాసి. కాగా ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వయోవృద్ధ ఓటరుగా గంగాదేవి శర్మ గుర్తింపు పొందారు. నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడ్డా తన అత్తను కలుసుకున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకల్లేవ్!
దేశం మొత్తం(ఆ రాష్ట్రం మినహాయించి) అంగరంగ వైభవంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. కానీ, పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని జెండా పండుగకు దూరంగా ఉంచేశాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సైతం మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రమాద ఘటనల్లో 55 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. Visual of Pandoh Himachal Pradesh right now pic.twitter.com/KQ2Tn9sz9B — Go Himachal (@GoHimachal_) August 14, 2023 రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరిగాయని సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలాన్, సిమ్లా, మండి, హమిర్పూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విపత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంఢీగర్-సిమ్లా జాతీయ రహదారితో సహా ప్రధాన రహదారులు మూతపడ్డాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో విపత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొదట ఏడుగురు మరణించారు. శివమందిర్ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 17 మంది కాపాడామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు. That has happened in #Himachal to build a 4 Lane road the Govt. Bulldoze houses, shops, bussiness establishment in the name of development but In this Himalayan Ranges. But now Nature is taking revenge. The Roads are crumbling down. Location NH 5 , Solan India pic.twitter.com/hQii08aoTl — Ravi Rana (@RaviRRana) August 11, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
గౌలిగూడ టు సిమ్లా
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఈ మేరకు కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడంతో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.నగరంలోని గౌలిగూడలో పుట్టిపెరిగిన దత్తన్న మరోసారి ఉన్నత పదవి చేపడుతుండడం గర్వకారణమనిపలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ముషీరాబాద్: గౌలిగూడ బస్తీలో పుట్టి పెరిగి రాంనగర్ కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించిన బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడంతో బీజేపీ శ్రేణులు, అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దత్తన్న నగరం కేంద్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనా సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి అత్యధిక సార్లు విజయం సాధించటంతో పాటు రెండుమార్లు కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. తాజాగా మరో మెట్టు ఎదిగి గవర్నర్ కావడంతో నగర బీజేపీ శ్రేణులు ఆదివారం ఆయనను అభినందనలతో ముంచెత్తాయి. సింపుల్ మ్యాన్... గౌలిగూడలో ఓ సాదాసీదా ఇంటిలో నివాసం ఉన్న దత్తాత్రేయ మొదటిసారిగా 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 1998లో రాంనగర్‌కు మకాం మార్చారు. అదే సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. రాంనగర్‌లోనే నివసిస్తూ ఒక కిరాయి ఇంట్లో సుమారు రెండేళ్లు ఉండి అదే ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటూ దాదాపు 22 ఏళ్లుగా రాంనగర్‌తో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఎంపీ అయినా, కాకపోయినా అందరితో కలిసిపోవడం, ఎలాంటి ఆర్భాటాలకు పోక పోవడం ఆయన నైజం. ఎప్పుడు చూసినా సౌమ్యంగా కనబడడం, ముఖ్యంగా మధ్యతరగతి, పేదలకు అందుబాటులో ఉండ డం అతని సహజ లక్షణం. అం దుకే మినిస్టర్ కాగానే ఎంతో మం ది సన్నిహితులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లకు వెళ్దామని ఒత్తిడి తెచ్చినా లొంగకుండా పేదలకు అందుబాటులో ఉండాలనే ఒకే ఒక్క కారణంతో రాంనగర్ను విడిచి వెళ్లలేదు. కూతురు వివాహ రిసెప్షన్లో ప్రధాని మోదీతో దత్తాత్రేయ ఆలస్యంగా వివాహం... ఆర్ఎస్ఎస్లో, సేవా కార్యక్రమాల్లో మునిగితేలిన దత్తాత్రేయ వివాహం చేసుకోవాలనే ఆసక్తి కనపర్చలేదు. వివాహం తన పార్టీ కార్యక్రమాలకు విఘాతం కల్గిస్తుందని భావించారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి సూచన మేరకు ఆర్ఎస్ఎస్ నుంచి 1980లో బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా చురుకైన పాత్ర పోషించి 1981–89 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో పార్టీ పెద్దలు, సహచరులు వివాహం చేసుకోవాలని ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా.. మరోవైపు సమీప బంధువైన వసంత దత్తాత్రేయనే చేసుకుంటానని, లేకపోతే పెళ్లి చేసుకోనని చెప్పడంతో చివరికి తన 42వ ఏటా పెండ్లి చేసుకున్నారు. ఆయన కూతురిని బీజేపీ ముఖ్యనాయకుడు బి.జనార్ధన్‌రెడ్ది తనయుడు డాక్టర్ జిగ్నేష్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సంవత్సరం క్రితం గుండెపోటుతో మరణించడంతో దత్తాత్రేయ మానసికంగా కుంగిపోయారు. అయినా తేరుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలో హిమచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అభినందనల వెల్లువ బీజేపీ అగ్రనేత బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఆదివారం ఉదయం వార్త వెలువడగానే ఆయన నివాసం అభిమానులతో నిండిపోయింది. అధికారిక ప్రకటన వచ్చే సమయానికి దత్తాత్రేయ నాంపల్లిలో గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉత్సవ సమితి సభ్యులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. కొత్త బాధ్యతల్లోకి వెళుతున్న దత్తాత్రేయను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్లు నరసింహన్, విశ్వభూషణ్ హరిచందన్, విద్యాసాగర్‌రావు, కల్రాజ్ మిశ్రా, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కె.కేశవరావు, రామ్మోహన్రావు,సుజనాచౌదరి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కేంద్ర మంత్రులు జవదేకర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంఎల్సీ చుక్కా రామయ్య, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు అభినందించారు. అమ్మవారికి బోనం చాంద్రాయణగుట్ట: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయకు పాతబస్తీ ఆషాఢ మాసం బోనాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏటా ఉత్సవాలకు హాజరై లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంతో పాటు ఈ ఏడాది కూడా అమ్మవారి ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓయూలో మార్నింగ్ వాక్ ఉస్మానియా యూనివర్సిటీ: బండారు దత్తాత్రేయ నియామకం పట్ల ఓయూలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ క్యాంపస్‌కు ప్రతి రోజు మార్నింగ్ వాకింగ్‌కు వచ్చి అనేక మంది ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించేవారు. కేంద్ర మంత్రిగా ఓయూలో ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయాన్ని ప్రారంభించారు. లేడీస్ హాస్టల్లో ప్రతి ఏటా విద్యార్థినులు జరుపుకును బతుకమ్మ పండుగలో పాల్గొనేవారు. ఏబీవీపీ నాయకులను పేరుపెట్టి పిలిచేంత చనువుగా ఉండేవారు. సికింద్రాబాద్ ఎంపీగా, మంత్రిగా దత్తాత్రేయ ఓయూలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. కళా పురస్కారాల ప్రదానం వివేక్‌నగర్:మోహన్ ట్రస్ట్, కీర్తన ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయ గానసభలో 12గంటల పాటు తెలుగు కళా సంరంభం, సంగీత నృత్య సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు మాజీ గవర్నర్ డా.కె.రోశయ్య వివిధ రంగాల ప్రముఖుల్ని కళా పురస్కారాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సాంçస్కృతిక సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బీసీ కమిçషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహనరావు, దైవజ్ఞశర్మ, కొత్త కృష్ణవేణి, మహ్మద్ రఫీ, వై.రాజేంద్రప్రసాద్, మోహన్ గాంధీ, శ్రీనివాసగుప్తా, శశిబాల తదితరులు పాల్గొన్నారు. కుమ్మేసింది వర్షం కుమ్మేసింది. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద పోటెత్తింది. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుస్సేన్‌సాగర్ (ట్యాంక్‌బండ్) నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి +513.410 అడుగులకు చేరింది. ట్యాంక్‌బండ్ సామర్థ్యం +514.910 అడుగులు కావడంతో భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. -
సీఎం అభ్యర్ధి ధుమాల్ ఓటమి
-
హిమాచల్‌లో 74% పోలింగ్
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.45 శాతం పోలింగ్ నమోదయిందని ప్రధాన ఎన్నికల అధికారి పుష్పేందర్ రాజ్‌పుత్ తెలిపారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 73.5 శాతం పోలింగ్ నమోదయిందని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పోలింగ్ సజావుగా సాగడానికి వీలుగా 37,605 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 17,850 మంది పోలీసులు, హోంగార్డులు, 65 కంపెనీల పారామిలటరీ బలగాలను వినియోగించామన్నారు. మొత్తం 68 నియోజకవర్గాల్లోని 7,525 పోలింగ్ కేంద్రాల్లో 11,283 రసీదు ఇచ్చే ఓటింగ్ యంత్రాల (వీవీపీఏటీ)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో సాంకేతిక కారణాలతో 297 వీవీపీఏటీ ఓటింగ్ యంత్రాలను మార్చినట్లు తెలిపారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటిస్తామన్నారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ రామ్‌పూర్‌లో, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమాల్ సమీర్పూర్ల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 50,000 మంది టిబెటన్లు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు. 1950–87 మధ్యకాలంలో భారత్‌లో జన్మించిన వీరంతా 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఓటు హక్కును పొందారు. దేశంలోనే తొలి ఓటరైన శ్యామ్ శరణ్ నేగీ(101) కిన్నౌర్ జిల్లాలోని కల్పాలో 15వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 68 సీట్లకు పోటీ పడుతుండగా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) 42 చోట్ల, సీపీఎం 14 చోట్ల, స్వాభిమాన్ పార్టీ, లోక్ ఘడ్బంధన్ పార్టీ చెరో ఆరు స్థానాల్లో, సీపీఐ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, వీరిలో 19 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు
-
హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు
న్యూఢిల్లీ: భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ధల్లీ ప్రాంతంలో 8 వాహనాలు శిథిలాల్లో కూరుకుపోయినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ రోహన్ చంద్ ఠాకూర్ తెలిపారు. ధల్లీ– షోగీ రహదారిపై కొండ చరియలు కుప్పకూలడంతో భారీ సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోయాయన్నారు. ప్రమాదం లో మూడు ఇళ్లు, ఓ గుడి దెబ్బతిన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నహన్, పొంటా సాహెబ్ పట్టణాల్లో సరా సరి 137 మి.మీ, నైనాదేవీలో 118 మి.మీ. వర్షపాతం నమోదైందన్నారు. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. గడచిన 12 గంటల్లో బెంగళూరులో 35 మి.మీ. వర్షం కురియడంతో బెగుర్ సరస్సు గట్టు తెగి పోయిందని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవ కాశముందని అధికారులు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్, అస్సాం, బిహార్‌లో వరద ప్రభావంతో కొత్తగా ప్రజ లెవరూ మరణించలేదని తెలిపారు. -
గ్యాంగ్‌రేప్‌పై భగ్గుమన్న హిమాచల్‌ప్రదేశ్
షిమ్లా: పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించి హిమాచల్‌ప్రదేశ్‌లో ఆందోళనలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అసలైన కారకులు ఉన్నత వర్గాలకు చెందినవారు కావడం, తప్పించుకొని హాయిగా తిరుగుతుండటంతో కడుపుమండిన బాధితులకు తోడు పలువురు తోడై పెద్ద మొత్తంలో ఆందోళన లేవనెత్తారు. షిమ్లాలో పాఠశాలకు వెళ్లొస్తున్న ఓ బాలికను లిఫ్ట్ కావాలా అని అడిగి మరీ వాహనంలో ఎక్కించుకొన్న కొంతమంది యువకులు అనంతరం ఆ యువతిని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం దారుణంగా చంపేశారు. ఈ ఘటన ఈ నెల (జూలై 4)న చోటుచేసుకోగా రాష్ట్రాన్ని కుదిపేసింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయిస్తామని హామీ ఇచ్చింది. అయితే, అనూహ్యంగా పోలీసులు ఆరుగురుని అరెస్టు చేయగా అందులో నలుగురు కూలీలు. వారిలో ఇద్దరు ఉత్తరాఖండ్ వారు కాగా, మరో ఇద్దరు నేపాల్‌కు చెందినవారు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, మహిళా సంఘాలు మాత్రం అసలు దోషులను వదిలేసి మిగితా వారిని అరెస్టు చేస్తున్నారని, అసలైన దోషులు ఉన్నత కులాలకు చెందినవారు కావడం వల్లే వారిని ఏమనలేకపోతున్నారని, వారిని అరెస్టు చేసే వరకు తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. వెయ్యిమంది నిరసనల్లో పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా.. స్వీట్ వార్నింగ్!
శ్రీనగర్: నేలతల్లి ఇంటికి మంచుమామ విచ్చేశాడు. భారీగా హిమపాతం కురిపిస్తూ ఉత్తరభారతాన్ని గిలిగింతలు పెట్టాడు. అసలే అందంగా ఉండే కశ్మీర్‌ను ఇంకాస్త రసవత్తరంగా మార్చేశాడు. ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ ధవళవర్ణంలో మెరిపోతూ కనిపించాడు. ఈ శీతాకాలపు అతిథి ఇంకా కొన్ని రోజులు మాత్రమే అక్కడ కొలువైఉంటాడు. తన మ్యాజిక్ కరిగిపోయి నీరులా మారకముందే చూడటానికి రమ్మంటూ పర్యాటకులను ఆహ్వానిస్తున్నాడు.‘సమయంలేదు మిత్రమా..’ అంటూ ‘స్వీట్ వార్నింగ్’ ఇస్తున్నాడు. మధ్యధరా ప్రాంతంలో ఆవిర్భవించి, వాయువ్య దిశగా కదులుతూ హిమాలయాల వద్ద మంచు వర్షాన్ని కురిపించే Western Disturbance(పశ్చిమ కలవరాలు) జనవరి 3 నుంచి ఉత్తరభారతంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా హిమం, వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి ఇళ్లు, చెట్లు, రోడ్లు, వాహనాలు.. అన్నింటిపైనా ఇంచులకొద్దీ మంచు పేరుకుపోయింది. ఆ దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివెళుతున్నారు. రాగల 24 గంటలూ హిమపాతం కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఛండీగఢ్) అధికారి మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. (మంచుదుప్పటిలో ఉత్తరభారతం: ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మంచుదుప్పట్లో ఉత్తరభారతం