హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది.
సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం పలు హోటళ్ల యజమానులకు సూచించింది.
ఇది కూడా చదవండి: బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?
Comments
Please login to add a commentAdd a comment