షిమ్లా: పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించి హిమాచల్‌ప్రదేశ్‌లో ఆందోళనలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అసలైన కారకులు ఉన్నత వర్గాలకు చెందినవారు కావడం, తప్పించుకొని హాయిగా తిరుగుతుండటంతో కడుపుమండిన బాధితులకు తోడు పలువురు తోడై పెద్ద మొత్తంలో ఆందోళన లేవనెత్తారు. షిమ్లాలో పాఠశాలకు వెళ్లొస్తున్న ఓ బాలికను లిఫ్ట్ కావాలా అని అడిగి మరీ వాహనంలో ఎక్కించుకొన్న కొంతమంది యువకులు అనంతరం ఆ యువతిని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం దారుణంగా చంపేశారు.
ఈ ఘటన ఈ నెల (జూలై 4)న చోటుచేసుకోగా రాష్ట్రాన్ని కుదిపేసింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయిస్తామని హామీ ఇచ్చింది. అయితే, అనూహ్యంగా పోలీసులు ఆరుగురుని అరెస్టు చేయగా అందులో నలుగురు కూలీలు. వారిలో ఇద్దరు ఉత్తరాఖండ్ వారు కాగా, మరో ఇద్దరు నేపాల్‌కు చెందినవారు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, మహిళా సంఘాలు మాత్రం అసలు దోషులను వదిలేసి మిగితా వారిని అరెస్టు చేస్తున్నారని, అసలైన దోషులు ఉన్నత కులాలకు చెందినవారు కావడం వల్లే వారిని ఏమనలేకపోతున్నారని, వారిని అరెస్టు చేసే వరకు తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. వెయ్యిమంది నిరసనల్లో పాల్గొన్నారు.
గ్యాంగ్‌రేప్‌పై భగ్గుమన్న హిమాచల్‌ప్రదేశ్
Published Tue, Jul 18 2017 7:16 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM
Advertisement