
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని మయాడ్ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మయాడ్ ఘాటీలోని చాంగుట్ కాలువలోకి అకస్మాత్తుగా వరదలు రావడంతో చాంగుట్ నుండి టింగ్రేట్ వరకుగల రహదారిని అధికారులు మూసివేశారు.
ఈ వరదల కారణంగా ఇంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కులు, మండీ జిల్లాల్లో సంభవించిన వరదల్లో సుమారు 45 మంది గల్లంతు కాగా, వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), ఎస్‌డీఆర్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, పోలీస్, హోంగార్డు బృందాలకు చెందిన మొత్తం 410 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
— Lahaul & Spiti Police (@splahhp) August 3, 2024