Flood deaths
-
బుడమేరు వరదలో పడి మరో మహిళ మృతి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద ముంపులో వ్యక్తులు మృతి చెందిన ఘటనలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీన వరద ముంపులో కొట్టుకుపోయిన విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన వ్యక్తి 15 రోజుల తర్వాత మరణించి కనిపించారు. ఇప్పుడు తాజాగా అదే తరహాలో సింగ్‌నగర్ ఇందిరానాయక్నగర్లోని ఐదో రోడ్డులో బుడమేరు వెంబడి ఉన్న ముళ్ల చెట్ల మధ్య ఓ మహిళ మృతదేహాన్ని అజిత్ సింగ్‌నగర్ పోలీసులు గుర్తించారు.తీవ్ర దుర్వాసనఇందిరానాయక్నగర్ ఐదో రోడ్డులో ఉన్న బుడమేరు వెంబడి ప్రాంతం నుంచి రెండు రోజులుగా తీవ్ర దుర్వాసన వస్తోంది. స్థానికులు దీనిపై సింగ్‌నగర్ పోలీసులకు సమాచారమివ్వగా వారు సోమవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళ మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించి ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి తీవ్రంగా శ్రమించారు. చనిపోయి సుమారు 20 రోజుల పైనే కావడంతో ఆమె రెండు చేతుల ఎముకలు బయటకు వచ్చేశాయి. తల భాగం పురుగులు తినివేయడంతో గుర్తు పట్టలేనంత దారుణంగా తయారైంది. మృతురాలి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశలు సమాధి చేసి..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడు.. క్షేమంగా తిరిగొస్తాడు.. అని ఎదురు చూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. 15 రోజుల కిందట వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్ఆర్పేటకు చెందిన పోలినాయుడు ముఠా కూలీ. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం పది గంటల సమయంలో తన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వరద ముంపునకు గురవుతున్నాయని తెలుసుకున్నాడు.ఇంట్లో వారికి ఫోను చేసి మరో పది నిమిషాల్లో సింగ్‌నగర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి న్యూ ఆర్‌ఆర్‌పేటలోని బుడమేరుపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడి విషయాన్ని పోలినాయుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు, అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. వరద ప్రవాహానికి ఎక్కడైనా వెళ్లి బయటపడి ఉంటాడని, క్షేమంగా తిరిగొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు.అయితే ఆదివారం ఉదయం పోలినాయుడు గల్లంతైన ప్రదేశంలోని దేవినేని వెంకటరమణ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలినాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ముళ్ల చెట్ల మధ్యలో ఆయన ఒక చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని నీటిలో పడి ఉన్నాడు. చేతికి ఉన్న ఉంగరం, దుస్తులను బట్టి కుటుంబ సభ్యులు పోలినాయుడేనని నిర్ధారించుకున్నారు. విషయాన్ని సింగ్‌నగర్ పోలీసులకు తెలియజేయగా వారు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేత కాళ్ల ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి అంత్యక్రియలు జరిపించారు. వరద వదిలినా.. ఆ తల్లీ కొడుకుల్ని మృత్యువు వదల్లేదురామవరప్పాడు (విజయవాడ రూరల్): విజయవాడ పాత రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబాన్ని బుడమేరు వరద ముంచేసింది. ఆ ముంపునుంచి తప్పించుకున్నా.. చివరకు లారీ రూపంలో దూసుకొచి్చన మృత్యువు తల్లీ కొడుకుల్ని మింగేసింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో స్కూటర్‌పై వెళ్తున్న పాతరాజీవ్నగర్ వాసులు లింగమనేని కృష్ణకుమారి (63), ఆమె కుమారుడు ప్రభుకుమార్ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుడమేరు వరద కారణంగా పాత రాజీవ్‌నగర్‌లోని కృష్ణకుమారి ఇల్లు నీట మునిగింది.దీంతో ఆ కుటుంబం గుణదలలో ఉంటున్న కృష్ణకుమారి సోదరుడి ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. ప్రభుకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరద ముంపు తగ్గడంతో తమ ఇంటిని రెండు రోజుల నుంచి శుభ్రం చేసుకుంటున్నారు. ఆదివారం కూడా ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం తల్లీకుమారులు స్కూటర్‌పై గుణదల బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో లారీని గమనించక వారు కుడి వైపునకు మళ్లారు. లారీ ఆ స్కూటర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన తల్లీకుమారులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. -
అండర్‌పాస్ వరదలో కారు చిక్కుకొని.. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ మృతి
గురుగ్రామ్: దేశ రాజధాని ఢిల్లీతో సహా ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం కురిసిన వర్షాల కారణంగా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి, అనేక వీధులు, దారులు జలమయమయ్యాయి. అయితే హర్యానాలో భారీ వర్షానికి ఫరీదాబాద్‌లోని అండర్‌పాస్‌లో వరద నీటిలో కారు చిక్కుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాధితులను గురుగ్రామ్‌లోని పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులుగా గుర్తించారు.గురుగ్రామ్ సెక్టార్ 31లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న పుణ్యశ్రేయ శర్మ, క్యాషియర్ విరాజ్ ద్వివేది శుక్రవారం సాయంత్రం మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో ఫరీదాబాద్‌కు ఇంటికి బయల్దేరారు. అయితే ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్ వద్దకు చేరుకోగా.. వరద నీటితో నిండి పోయి ఉంది. అయితే నీటి ఎత్తు ఎక్కువ లేదని భావించిన ఇద్దరు.. కారును నీటిలో ముందుకు పోనిచ్చారు. దీంతో కారు పూర్తిగా మునిగిపోవడంతో ఇద్దరు వ్యక్తులు వాహనం దిగి ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.కానీ దురదృష్టవశాత్తు నీటిలో మునిగిపోయారు. కారు ఇరుక్కుపోయిందని సమాచారం అందుకున్న పోలీసులు అండర్‌పాస్‌కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కారు వద్ద శర్మ మృతదేహాం బయటకు తీయగా.. అనేక గంటల గాలింపు తర్వాత శనివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ద్విదేది మృతదేహాన్ని వెలికితీశారు.మరోవైపు ఢిల్లీ, దేశ రాజధాని పరిసర ప్రాంతంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. -
'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది!
కన్నీటికి కూడా ఇష్టం ఉన్నట్టుంది. కన్నీటికి కూడా ఒక మనిషి కంటినే అంటి పెట్టుకొని ఉండాలన్న కోరిక ఉన్నట్టుంది. కన్నీరు ఎందుకనో ఒకే మనిషిని పదే పదే ఆలింగనం చేసుకుంటూ ఆ మనిషికి మరింత ప్రేమను పంచాలని అనుకుంటున్నట్టుంది. కేరళలో ఒకమ్మాయి శ్రుతి. ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా కన్నీరు కారుస్తోంది. ఆమెను ఊరడించడానికి కేరళ ప్రభుత్వం, కేరళ ప్రజలు కదిలారు. ఈ ప్రేమ కోసమేనా కన్నీరుకు ఆమెపై ప్రేమ?‘బాధ పడకు. నీకు నేనున్నాను. నేను చనిపోయినా నువ్వు ఒంటరివి కావు. నీకంటూ ఒక భరోసా ఉండేలా చూస్తాను’ అన్నాడా యువకుడు ఆ అమ్మాయితో ఓదార్పుగా. ఇవాళ ఆ యువకుడు కన్నుమూశాడు. ఆ యువకుడి మాటలను గుర్తు చేసుకుంటున్న కేరళ ప్రజలు ‘మేమున్నాం’ అంటూ ఆ అమ్మాయికి తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన చాలా అరుదు.ఆ అమ్మాయి పేరు శ్రుతి..అందరు అమ్మాయిల్లాంటిదే శ్రుతి. కోజికోడ్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేయడం... సెలవులలో ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడపడం... తండ్రి చిన్న ఉద్యోగి... తల్లి చిన్న షాపు నడిపేది... చెల్లెలు కాలేజీ చదువుతోంది. వాళ్ల కుటుంబం వాయనాడ్‌లోని చూరలమలలో కొత్త ఇల్లు కట్టుకుని వరదలకు నెల ముందే షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రుతి నిశ్చితార్థం జరిపించారు. ఈ డిసెంబర్లో పెళ్లి చేయాలని 4 లక్షల డబ్బు. 15 సవర్ల బంగారం ఇంట్లో దాచారు. అంతా సంతోషమే. కాని...జూలై 30 రాత్రి..ఆ రాత్రి ఉద్యోగరీత్యా శ్రుతి చూరలమలకు రెండు గంటల దూరంలో ఉన్న కోజికోడ్‌లో ఉంది. వరద విజృంభించింది. శ్రుతి వాళ్ల కొత్త ఇల్లు ధ్వంసమైంది. తల్లి, తండ్రి, చెల్లెలు... పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం పోయాయి. ఎవరూ మిగల్లేదు. ఏమీ మిగల్లేదు. శ్రుతి కన్నీరు కట్టలు తెంచుకుంది. అది ఆగలేదు. ఆపేందుకు ఒక్కడు పూర్తిగా ప్రయత్నించాడు. అతని పేరు జాన్సన్. శ్రుతికి కాబోయే భర్త.నేనే తోడుంటా..‘శ్రుతికి ఇప్పుడు ఏమీ మిగల్లేదు. అంతమాత్రం చేత నేను వదిలేస్తానా? పదేళ్లుగా మేము స్నేహితులం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు ఆమె సర్వం కోల్పోయినా నేను వదలను. తోడుంటా. నేను చనిపోయినా ఆమె ఒంటరిదై పోకుండా మంచి ఉద్యోగం, ఇల్లు ఏర్పాటు చేస్తా’ అన్నాడు. ఆ మాటలు ఎందుకన్నాడో. అవి వాయనాడ్ విషాదాన్ని ప్రసారం చేసేటప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యాయి.ఆ తోడు కూడా పోయింది...శ్రుతికి ఇక ఏడవడానికీ కన్నీరు మిగల్లేదు. జాన్సన్ చనిపోయాడు. మొన్నటి మంగళవారం వాయనాడ్‌లో అతను, శ్రుతి, శ్రుతి బంధువులు కొంతమంది ప్రయాణిస్తున్న వ్యాను బస్సుతో ఢీకొంది. శ్రుతి, ఆమె బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. కాని జాన్సన్ మృత్యువుతో పోరాడి బుధవారం మరణించాడు. అన్నీ కోల్పోయిన శ్రుతికి ఆఖరి ఆసరా కూడా పోయింది. ఆమె ఏం కావాలి?మేమున్నాం..ఇక కేరళ జనం తట్టుకోలేకపోయారు. మేమున్నాం అంటూ శ్రుతి, జాన్సన్ జంట ఫొటోలను డీపీగా పెట్టుకోసాగారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నేనున్నానంటూ ఫేస్బుక్ పోస్ట్ రాశారు. ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మంత్రి ఒకరు శ్రుతికి మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది... కేరళ ప్రజలది అన్నారు. శ్రుతి కోసం కేరళ కన్నీరు కారుస్తోంది. శ్రుతి కన్నీటిని కేరళ పంచుకుంది. అయినవారిని లాక్కుని పరాయివారినెందరినో ఆమె బంధువులుగా మార్చింది కన్నీరు. ఈ కన్నీటిని ఏమని నిందించగలం. కన్నీరా కనికరించు... చల్లగా చూడు అనడం తప్ప.ఇవి చదవండి: బెయిలా? జైలా?.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు -
కిమ్ అరాచకం: 30 మంది ప్రభుత్వ అధికారులకు ఉరి.. ఎందుకంటే!
ఉత్తర కొరియాలో ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఆ ఘటనల్లో సుమారు 4 వేల మంది మరణించినట్లు, దాదాపు 5 వేల మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు.ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 మంది అధికారులను ఉరి తీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసిట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణ శిక్ష విధించినట్లు తమ కథనాల్లో వెల్లడించింది.కాగా ఇటీవల చాగాంగ్ ప్రావిన్సులో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు.ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అయితే గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. -
మాది చేతల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విపత్తుల సమయాన గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా అమలు చేయలేదని.. తమది చేతల ప్రభుత్వం కావడంతో గత హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరదలతో రూ.5,438 కోట్లు నష్టం జరిగినందున తక్షణమే సాయం చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు. కేంద్రం స్పందించకున్నా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు.మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారని.. తమతో పాటు ఆ పారీ్టకీ రాష్ట్రంలో ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచి్చనందున వారు కేంద్రం తరఫున రూ.25 లక్షలు పరిహారం ఇప్పించాలని సూచించారు. మంగళవారం ఉదయం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్లతో కలిసి సీఎం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. మేం ఇళ్లలో కూర్చోలేదు.. ‘వరదలు, వర్షాలు వచ్చిన సమయంలో మేము ఇళ్లలో కూర్చోలేదు. మా మంత్రులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేం పర్యటించినప్పుడు ప్రజలు కోపగించుకున్నా ఫర్వాలేదు.. ఓటు వేసిన వారు మమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు.. ఫామ్‌హౌస్‌లో కూర్చున్న వారిని అడగలేరు కదా.. ప్రభుత్వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా నష్టంపై అంచనా వేసి శాశ్వత సాయం అందజేస్తాం. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్ష కోట్లలో రూ.2 వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే బాధితులకు ఇంకా ఎక్కువ సాయం చేయొచ్చు..’అని సీఎం వ్యాఖ్యానించారు. ఆక్రమణలతోనే అనర్థాలు ‘నీళ్లలోకి మనం వెళ్లి ఇళ్లు కట్టుకుంటే నీళ్లు ఇళ్లలోకి వస్తాయి. ఖమ్మంలో అనేక ఆక్రమణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో పాత చెరువులు ఆక్రమించుకున్న వారిని వదిలేసి కొత్తగా చెరువులను నిర్మించడం ఎందుకు? కొత్త చెరువులకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అది కమీషన్ కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది నిజమే అయితే ఇప్పుడు చెరువులు ఎందుకు తెగుతున్నాయి? మిషన్ కాకతీయ అనేది కమీషన్ కాకతీయ అని గతంలో నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు. నాటి ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు దీన్ని కమీషన్ కాకతీయగా మార్చారు..’అని సీఎం ఆరోపించారు. రిటైనింగ్ వాల్‌పై ఇంజనీర్లతో చర్చిస్తాం ‘మున్నేరుపై రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపు అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి టెండర్లు ఆహా్వనించాం. కానీ ఇంతలోనే ఉపద్రవం ముంచుకొచి్చంది. ఇప్పుడు జరిగిన పరిణామాల ఆధారంగా సాంకేతికంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం..’అని రేవంత్ తెలిపారు. వెంటనే స్పందించాం.. ‘రాష్ట్రంలో వర్షాలతో ఉపద్రవం సంభవించినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించాం. 42 సెం.మీ. వర్షం గత 75 ఏళ్లలో ఎన్నడూ కురవలేదు. ఆ స్థాయిలో వర్షం పడినా తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో బయటపడ్డామంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం. మా మంత్రులు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఎప్పుడూ అండగా నిలిచింది. జిల్లాపై తమకు ఉన్న బాధ్యతతోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తనతో సహా ఇక్కడికి తరలి వచి్చంది. ఈ జిల్లాకు నష్టం జరగనివ్వం. పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది కాలనీల్లో బురద శుభ్రం చేయడానికి ట్యాంకర్లను పంపాం. పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. ప్రజలను ఆదుకోవడానికి పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది..’అని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని రేవంత్ అన్నారు. సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి న్యాయం చేస్తా కారేపల్లి: వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ వరదలో కొట్టుకుపోయి చనిపోవడం బాధాకరమని.. వారి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో అశ్విని, మోతీలాల్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అశ్విని తల్లి నేజీతో మాట్లాడారు. బిడ్డ కొత్త జీతంతో ఇల్లు కట్టుకుందామని మొదలుపెడితే ఇప్పుడు ఇలా జరిగిందంటూ ఆమె రోదించారు. సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్‌లో తమ కార్యాలయానికి వస్తే చర్చించి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.రూ.10 వేలు దేనికి సరిపోతాయి? సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద ముంపు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని, సామగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సా యంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి దేనికి సరిపోతాయంటూ బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరి ఇళ్లు కొట్టుకుపోగా, మరికొందరి ఇళ్లు కూలిపోయాయి.మరికొన్ని దెబ్బతిన్నాయి. ఇవికాకుండా ఒక్కో కుటుంబం సగటున రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామగ్రి కోల్పోయారు. ప్రభుత్వం అందించే రూ.10 వేల తక్షణ సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక నష్టాన్ని అంచనా వేసి సాయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని, సర్వే ఎప్పుడు పూర్తవుతుంది?, పరిహారం ఎప్పుడు అందుతుందని ప్రశ్నిస్తున్నారు. -
ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షం బీభత్సానికి వంతెనలు కూలిపోయాయి. రోడ్లు చిధ్రం అయ్యాయి. వీధుల్లో బోట్లు ప్రత్యక్షమయ్యాయి. పంటలు కొట్టుకుపోయాయి. రవాణా నిలిచిపోయింది. ఇళ్లల్లో నీరు చేరింది. ఏటా కురిసే ఇలాంటి అకాల వర్షాలకు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చెందుతోంది. కేవలం వర్షం వల్ల ఏర్పడే వరదలే కాకుండా, తుఫానులు, కరవులు, భూకంపాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీనదాలు ముంచెత్తడం వంటి ఎన్నో విపత్తులు ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగుతున్నాయి.ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, యువత సహకారం అందుతున్నప్పటికీ తిరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ కొలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చిరు వ్యాపారులు తీవ్ర అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అకాల వర్షాలకు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ఏటా పత్తి, మిరప, పనుపు..వంటి పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగి ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల దేశంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో భారతీయ స్టేట్ బ్యాంక్ గతంలో పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. 2021 వరకు దేశంలో 756 అతి తీవ్ర ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. దాంతో రూ.12.08 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.7.2 లక్షల కోట్లు, తుఫానుల వల్ల రూ.3.7 లక్షల కోట్లు, కరవుల వల్ల రూ.54 వేలకోట్లు, భూకంపాలు రూ.44 వేలకోట్లు, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రూ.4,197 కోట్లు, హిమానీనదాలు ముంచెత్తడం వల్ల రూ.1,678 కోట్ల నష్టం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దేశ ఆదాయం తిరిగి వెంటనే పుంజుకునేలా ఇరు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని చెబుతున్నారు. -
వరదల్లో ప్రైవేట్ బోట్ల దందా..
-
సూడాన్‌లో భారీ వర్షాలు.. 32మంది మృతి
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పలుచోట్ల వరదల సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో 32 మంది మృతిచెందారని, 107 మంది గాయపడ్డారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.దేశంలో కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. 5,575 ఇళ్ళు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా డయేరియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇదిలావుండగా కస్సాలా నగరం గుండా ప్రవహించే గాష్ నది నీటి మట్టం పెరుగుతోంది.దీంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సూడాన్‌లో సాధారణంగా జూన్, అక్టోబర్ మధ్య వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది మంది మృతి చెందగా, లెక్కలేనన్ని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. -
Himachal: వరదలతో విలవిల.. 87 రహదారులు మూసివేత
గత కొన్ని రోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ పరిస్థితులను గమనించిన అధికారులు మనాలి-లేహ్ జాతీయ రహదారితో పాటు 87 ఇతర రహదారులను మూసివేశారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రకటించిన వాతావరణ శాఖ ఆగస్టు 7, 8 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా చంద్రభాగ్ నది నీటిమట్టం పెరిగిందని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. లాహౌల్, స్పితి జిల్లాలో రెండు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. జింగ్ జింగ్బర్ సమీపంలో మనాలి-లేహ్ జాతీయ రహదారి మట్టిపెళ్లలు పేరుకుపోయాయి. దర్చా, సర్చు పోలీసు చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బ్రో) హైవేపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తోంది. కాగా కేదార్నాథ్ నడక మార్గంలో భారీ వర్షం కారణంగా వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన యాత్రికులు, స్థానికులను రక్షించే కార్యక్రమం ఐదవ రోజు కూడా కొనసాగింది. సోమవారం 1,401 మందిని రక్షించారు. గుజరాత్‌లోని నవ్సారి, వల్సాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
Himachal: హఠాత్తుగా ముంచెత్తిన వరద.. చాంగుట్- టింగ్రేట్ రోడ్డు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని మయాడ్ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మయాడ్ ఘాటీలోని చాంగుట్ కాలువలోకి అకస్మాత్తుగా వరదలు రావడంతో చాంగుట్ నుండి టింగ్రేట్ వరకుగల రహదారిని అధికారులు మూసివేశారు.ఈ వరదల కారణంగా ఇంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కులు, మండీ జిల్లాల్లో సంభవించిన వరదల్లో సుమారు 45 మంది గల్లంతు కాగా, వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, పోలీస్, హోంగార్డు బృందాలకు చెందిన మొత్తం 410 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. pic.twitter.com/rPvdpWnTvo— Lahaul & Spiti Police (@splahhp) August 3, 2024 -
వయనాడ్ మృత్యు ఘోష.. 123కు చేరిన మృతుల సంఖ్య.. మరో 600 మంది గల్లంతు
తిరువనంతపురం : వయనాడ్ ఘటన.. 123కు పెరిగిన మృతుల సంఖ్య చేరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వయనాడ్ విషాధంపై మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ ఎస్ శశిధరన్ మాట్లాడుతూ.. శిధిలాల కింద దాదాపు 50 మృతదేహాలు గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్ మార్టం జరుగుతున్నట్లు తెలిపారు. రేపుకూడా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిధిలాల కింద సహాయక చర్యల్ని ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. #WATCH | Kerala: Malappuram district police chief S Sasidharan says, "Today we conducted an in-depth search. We could find some 50 bodies or parts of bodies. The postmortem is going on. Tomorrow also we are going to search with NDRF and other police departments... We are trying… pic.twitter.com/hIH42zutTU— ANI (@ANI) July 30, 2024 భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌లు, డ్యాంలు నిండుకుండలా మారాయి. వరదల ధాటికి వయనాడ్ మృతుల సంఖ్య 94కి చేరింది. పదుల సంఖ్యలో డెడ్‌బాడీలను 30కిలోమీటర్ల దూరంలో ఉన్న చలయార్ నదిలో గుర్తించారు. ముండకై టీస్టేట్లో పనిచేస్తున్న 600 మంది కార్మికులు గల్లంతయ్యారు.దీంతో కార్మికుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. గాడ్స్ ఓన్ కంట్రీపై ప్రకృతి కన్నెర్ర చేసింది. రికార్డ్‌స్థాయిలో 24 గంటల్లో 37.7 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లాలో వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయ తాండవం చేసింది. అర్ధరాత్రి గ్రామాలపై కొండచరియలు విరుచుకుపడి అనేక మంది సజీవ జలసమాధి అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు శిధిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాధాలు చేస్తున్నారు. మట్టి, బురద కింద వందల మంది చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. గంటగంటకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.వయనాడ్ జిల్లా మెప్పాడీ సమీపంలోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపూ 400 ఇళ్లను మట్టిచరియలు కమ్మేశాయి. దీంతో ఇప్పటి వరకు 89మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ఆచూకీ లేకుండా పోయింది. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆటంకం కలుగుతోంది.Tamil Nadu CM MK Stalin had a telephone conversation with Kerala CM Pinarayi Vijayan regarding the landslide situation in Wayanad.M K Stalin offered his condolences to the deceased in landslides and assured, on behalf of the Tamil Nadu government, all possible help. CM also…— ANI (@ANI) July 30, 2024 కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి ఆర్మీ బలగాలు. ఎన్డీఆర్ఎఫ్ సహా 250 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు.ఆర్మీ,నేవీ,ఐఏఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగస్వామ్యమయ్యాయి. శిధిలాలు,బురదలో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది వెలికి తీస్తున్నారు.స్థానికంగా ఉన్న ఆలయాలు,మసీదులు,చర్చీల్లో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాడు చేసి బాధితులకు తక్షణ చికిత్సను అందిస్తున్నారు.వయనాడ్ విలయం నేపథ్యంలో కేరళకు బాసటగా నిలిచారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. కేరళ సీఎం సహాయ నిధికి రూ.5కోట్లు విడుదల చేశారు. 10మందితో కూడిన వైద్య బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. #WATCH | Wayanad landslide: A survivor Mustafa Ahmed says "At around 1:40 AM, there was a loud sound and a house around 30 metres away from my room completely collapsed. Since we were not sleeping, we ran out immediately. Several people have been trapped in this incident. People… pic.twitter.com/p9pLO2vb7i— ANI (@ANI) July 30, 2024వయనాడ్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేరళ సీఎం పినరయి విజయన్. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారాయన. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. విచారణకు కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్రప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారణ కోసం కమిటీని నియమించింది. ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తి సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం విచారణకు తాజాగా కమిటీని నియమించింది. -
సివిల్స్ కల జల సమాధి
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): ఎలాగైనా ఐఏఎస్ కావాలని ఆ యువతి కన్న కల జల సమాధి అయ్యింది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ముంచెత్తిన దుర్ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తానియా సోని (22) దుర్మరణం పాలయ్యింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..అందులో సోని ఉన్నట్లు అందిన సమాచారంతో శ్రీరాంపూర్‌లో విషాదం నెలకొంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సారీ్ప–1 గని మేనేజర్‌గా పని చేస్తున్నారు. నస్పూర్‌లోని సీసీసీ టౌన్షిప్ బీ–2 కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. విజయ్‌కుమార్– బబిత దంపతులకు ముగ్గురు సంతానం కాగా సోనిపెద్ద కుమార్తె. రెండో కూతురు పలక్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బీటెక్ చేస్తోంది.కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోని గతేడాదే ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పింది. తండ్రి ఆశ కూడా అదే కావడంతో మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్లో చేరి్పంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. శనివారం ఏం జరిగింది..? ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమయ్యింది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయతి్నంచారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయి బేస్మెంట్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. దీంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.చూస్తుండగానే 10–12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. 14 మందిని తాళ్ల సహాయతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్ (22), కేరళకు చెందిన నెవిన్ డాలి్వన్ (29) మృతదేహాలను వెలికితీశారు. స్పందించిన సింగరేణి అధికారులు సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్లు, శ్రీరాంపూర్‌లోని ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, కోల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ డీజీఎం అజయ్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సోని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అనంతరం మూడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రయాణంలో ఉండగా మరణ వార్త విజయ్‌కుమార్–బబిత దంపతులు రెండో కూతురు పలక్‌ను కాలేజీలో దింపడం కోసం శనివారం రైల్లో లక్నో బయల్దేరారు. కాగజ్‌నగర్‌కు చేరుకోగానే వారికి సోని మరణవార్త తెలిసింది. దీంతో వారు తీవ్ర విషాదంలోనే నాగ్‌పూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న సోనిని చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ఔరంగాబాద్‌కు తరలించారు. విజయ్‌కుమార్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారి కేరీర్ గురించి ఎప్పుడు తమతో చర్చిస్తూ ఉండేవాడని తోటి అధికారులు తెలిపారు. 10 మందికి పైగా గల్లంతు? ముంపు ఘటన నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచే ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్ యజమాని స్టడీ సర్కిల్ యజమాని అభిõÙక్ గుప్తాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బేస్మెంట్లోకి నీరు చేరిందని గుప్తా పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్పందించింది. రావూస్ సంస్థకు బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహణకు తాము అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్ర మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా ఢిల్లీ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బిహార్‌కు చెందిన సోని తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాలలో సింగరేణి సంస్థలో పని చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా విజయ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. -
చైనాలో భారీ వర్షాలు.. 11 మంది మృతి
చైనాలో కురుస్తున్న వర్షాలు, ఈ కారణంగా సంభవించిన వరదలు పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఆగ్నేయ చైనాలో ఒక ఇల్లు కూలడంతో 11 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతమంతా జలమయమైంది.షాంఘైలో ఓ చెట్టు కూలి స్కూటర్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్‌పై పడటంతో అతను మృతిచెందాడు. చైనాను చేరుకోకముందు ఈ తుపాను ఫిలిప్పీన్స్‌లో కూడా విధ్వంసం సృష్టించింది. ఫిలిప్పీన్స్‌లో వర్షాల కారణంగా 34 మంది మృతిచెందారు. టైఫూన్ జెమీ తుపాను తైవాన్ ద్వీపంలో కూడా విధ్వంసం సృష్టించింది. ఇక్కడ మృతుల సంఖ్య 10 దాటింది.హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్యాంగ్ నగర పరిధిలో కొండచరియలు విరిగిపడినట్లు రాష్ట్ర ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. భారీ వర్షాల కారణంగా పర్వతాల నుంచి నీరు ప్రవహించడం వల్లే కొండచరియలు విరిగిపడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఉష్ణమండల తుఫానుతో కూడిన వర్షపాతం హునాన్ ప్రావిన్స్‌లోని ఆగ్నేయ భాగాలను తాకినట్లు చైనా వాతావరణశాఖ తెలిపింది. More than 27,000 people in Northeast #China were evacuated and hundreds of factories were ordered to suspend production as #TyphoonGaemi brought heavy rains, the official Xinhua news agency reported on July 27.https://t.co/uIkKuknyTk— The Hindu (@the_hindu) July 27, 2024 -
యూపీలో వరదలు.. జలదిగ్బంధంలో వందల గ్రామాలు
భారీ వర్షాలకు తోడు నేపాల్ నుంచి వస్తున్న వరదనీరు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోని బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బలరాంపూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, బారాబంకి, సీతాపూర్ పరిధిలోని దాదాపు 250 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అలాగే లఖింపూర్ ఖేరీలోని 150 గ్రామాలు, షాజహాన్‌పూర్‌లోని 30, బదౌన్‌లోని 70, బరేలీలోని 70, పిలిభిత్‌లోని 222 గ్రామాలకు చెందిన ప్రజలు వరద నీటిలోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదల కారణంగా పూర్వాంచల్‌లోని బల్లియాలో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. వరుసగా రెండవ రోజు ఢిల్లీ-లక్నో హైవేపై గర్రా నది వరద నీరు నిలిచిపోవడంతో ఈ మార్గంలో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మొరాదాబాద్- లక్నో మధ్య 22 రైళ్లను నెమ్మదిగా నడుపుతున్నారు. షాజహాన్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోకి వరద నీరు చేరడంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.షాజహాన్‌పూర్ నగర శివార్లలోని హౌసింగ్ డెవలప్మెంట్ కాలనీతో సహా ఇతర లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 10 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం 225 మందిని రక్షించింది. ఎస్ఎస్ కళాశాల లైబ్రరీలోని వందల పుస్తకాలు నీట మునిగాయి. ఖేరీ, షాజహాన్‌పూర్, బరేలీకి చెందిన ఆరుగురు వరద నీటిలో కొట్టుకుపోయారు. గురువారం ఉదయం 11 గంటలకు షాజహాన్‌పూర్ హైవేపైకి వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
నేపాల్‌లో ప్రకృతి విపత్తులు.. 14 మంది మృతి
నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. గడచిన 24 గంటల్లో నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు ఘటనల కారణంగా 14 మంది మృతిచెందారు.నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడటం వల్ల ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు మృతిచెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఎన్‌డీఆర్‌ఎంఎ అధికార ప్రతినిధి దిజన్ భట్టారాయ్ తెలిపారు.నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో రుతుపవనాలు చురుకుగా మారినప్పటి నుండి అంటే గత 17 రోజుల్లో సంభవించిన పలు విపత్తుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలకు 33 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. గడచిన 24 గంటల్లో నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు ఘటనల కారణంగా 14 మంది మృతిచెందారు.నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడటం వల్ల ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు మృతిచెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఎన్‌డీఆర్‌ఎంఎ అధికార ప్రతినిధి దిజన్ భట్టారాయ్ తెలిపారు.నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో రుతుపవనాలు చురుకుగా మారినప్పటి నుండి అంటే గత 17 రోజుల్లో సంభవించిన పలు విపత్తుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలకు 33 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. -
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వరదలు.. 16 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లోని బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. తాజాగా సంభవించిన ఈ వరదల కారణంగా 16 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రాష్ట్రాల్లోని దండ్ ఎ ఘోరీ, దోషి, పుల్ ఎ ఖుమ్రీ, సెంట్రల్ బదక్షన్‌లోని మోర్చక్ తదితర ప్రాంతాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.గత వారంలో ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు, వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్డబ్ల్యుఎఫ్పీ) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది.యూఎన్డబ్ల్యుఎఫ్పీ ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, తమ సంస్థ ఉద్యోగులు బగ్లాన్కు అత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తున్నారని పేర్కొంది. బగ్లాన్ పోలీస్ కమాండ్ అధిపతి అబ్దుల్ గఫూర్ ఖాడెం మాట్లాడుతూ బగ్లాన్ రాష్ట్రంలోని దోషి జిల్లాలోని లర్ఖబ్ ప్రాంతంలో వర్షాల కారణంగా అత్యధిక నష్టం నమోదైందని చెప్పారు. లర్ఖబ్‌లో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ, ఇద్దరు పురుషులు మరణించారు. 500లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో ఒక కుటుంబానికి చెందిన పది మంది సభ్యులు, మరో వ్యక్తి గాయపడ్డారని బదక్షన్ ప్రకృతి విపత్తు నిర్వహణ అధిపతి మహ్మద్ కమ్గర్ తెలిపారు. -
'ఇదేం నివేదిక..?' వరదలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు..
హైదరాబాద్: వరదలపై నివేదికను సమర్పించిన ప్రభుత్వంపై న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రూ.500 కోట్ల పరిహారంలో ఎవరికి ఎంత సహాయం చేశారో వివరాలు సరిగా లేవని తెలిపింది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదికను న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించారు. నేడు దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. రూ.500 కోట్లు రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే.. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించిన పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. వరద ప్రభావం , నష్టంపై మరో నివేదిక మెమోను న్యాయస్థానానికి సమర్పించారు. అంటువ్యాధులతో భాదపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నివారణ, బాధితులకు సహాయం, పరిహారం అందజేత లాంటి వివరాలపై శాశ్వత నివారణ చర్యలు ఏం చేపట్టారో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది. దీనిలో రూ.500 కోట్లను నష్టపరిహారంగా బాధితులకు పంచినట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు 240 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6,443 ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లింది. 1,59,960 ఎకరాల్లో పంటలు వరద బారిన పడ్డాయని తెలిపింది. ఈ మేరకు తాజాగా పూర్తి నివేదిక న్యాయస్థానం ముందు పెట్టింది. ఇదీ చదవండి: Telangana Floods: సహాయక చర్యలేం చేపట్టారు..? -
వరద మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.లక్ష అదనంగా ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని వెల్లడించింది. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాలపై శాసనసభలో గురువారం జరిగిన లఘు చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బదులిచ్చారు. మృతుల్లో రైతులు ఉంటే రూ.4 లక్షల పరిహారంతో పాటు, తక్షణమే రూ.5 లక్షల రైతు బీమా అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో 139 గ్రామాల్లో వర్షాల వల్ల నష్టం జరిగిందని మంత్రి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 7,870 ఇళ్లకు చెందిన 27 వేల మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు తెలిపారు. 419 ఇళ్లు కూలిపోయాయని, 7,505 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తిగా కూలిన ఇళ్లను గృహలక్ష్మి పథకంలో చేర్చి కట్టించాలని సీఎం కేసీ ఆర్ ఆదేశించినట్టు చెప్పారు. పంటల నష్టాలపై అంచనాలు వేస్తున్నామని, వివరాలు వచ్చాక ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వేముల హామీనిచ్చారు. వరద సాయం చేయమని కోరితే కేంద్రం ప్రతిసారీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల వాకౌట్ వరదల నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో అలక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చర్చలో పాల్గొన్న ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తాము లేవనెత్తిన సందేహాలకు, ప్రజలను ఆదుకోమని చేసిన విజ్ఞప్తికి మంత్రి సరైన సమాధానం చెప్పలేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. -
నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్..
లక్నో: కొద్ది రోజులుగా వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. వరదలతో నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కోత్వాలీ నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. దీంతో యూపీ-ఉత్తరఖండ్ సరిహద్దుల్లో రోడ్డుపై వరద నీరు ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో హరిద్వార్ వెళ్తున్న ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం.. జేసీపీ మిషన్లతో సహాయక చర్యలు చెపట్టింది. #उत्तरप्रदेशः #बिजनौर के मंडावली में #कोटावाली नदी का जलस्तर बढ़ा, एक बस तेज बहाव में फंसी, बस में करीब 40 यात्री सवार, जेसीबी से सभी का रेस्क्यू किया गया#UttarPradesh #bus #river #Bijnor #NewsUpdate pic.twitter.com/ZVUghS0wYm — News of Rajasthan (@NewsRajasthani) July 22, 2023 జేసీబీ మిషన్లతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. ఆ తర్వాత బస్సును కూడా బయటకు లాగారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #बिजनौर में कोटा वाली नदी के बीच तेज बहाव में फंसी नजीबाबाद से हरिद्वार जा रही बस नदी में बस फंसने के बाद बस में मौजूद सवारियों को जेसीबी के सहारे सकुशल बाहर निकाला गया.#Bijnor #bijnorviralvideo #bijnorbus #bus #kotariver #haridwar #bijnaur #viralvideo #ManipurVideo pic.twitter.com/lEetwrOuGQ — Shailendra Singh (@Shailendra97S) July 22, 2023 ఇదీ చదవండి: తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి.. -
భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్న కారణంగా కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తున్న లోకల్ రైలు వంతెన మీద నిలిపివేశారు. ఇదే సమయంలో నాలుగు నెలల పసికందును పట్టుకుని ఓ తండ్రి రైలు దిగారు. అక్కడే నిలబడి ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పడంతో బిడ్డ వంతెన కింద కాలువలోకి జారిపోయింది. స్థానిక రైల్వే సిబ్బంది చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినా కాలువలో వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ఫలితం లేకపోయింది. దేశవ్యాప్తంగా నైరుతి పవనాల ప్రభావంతో ఒక్కసారిగా వర్షాలు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన అనేక ప్రాంతాలు వర్షాల ఉధృతికి జలమయం కాగా ముంబైలో కూడా వర్షాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై అతలాకుతలమైంది. అయినా కూడా జనం జీవనాన్ని యధాతధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ముంబైలో ఘోరం జరిగిపోయింది. కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తోన్న లోకల్ రైలు భారీ వర్షం కారణంగా రెండు గంటల పాటు ఒక వంతెన మీద నిలిచిపోయింది. రైలులోని వారంతా రైలు ఎప్పుడు కదులుతుందా అని సుదీర్ఘంగా నిరీక్షిస్తూ ఉన్నారు.అంతలో ఓ పసిబిడ్డకు అసౌకర్యంగా ఉందనో ఏమో ఆ తండ్రి నాలుగు నెలల పసికందును ఆడించేందుకు రైలు దిగారు. పట్టాలు పక్కన అలా ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పి బిడ్డ జారి కాలువలో పడిపోయింది. వెంటనే బిడ్డ తల్లి కిందకు దిగి.. కళ్ళ ముందు కాలువలో కొట్టుకుపోయిన బిడ్డ కోసం చేసిన ఆర్తనాదం చూపరుల హృదయాలను కలచివేసింది. Tragedy struck as a 4-month-old baby drowned in a nullah after slipping from his father's grasp. The parents had been stranded on a local train between Kalyan and Thakurli &while walking along the tracks, their little one slipped and fell into the nullah. Heartbreaking incident! pic.twitter.com/RAlN2lpPoU — Richa Pinto (@richapintoi) July 19, 2023 ఇది కూడా చదవండి: ఇకపై కుక్కలకు కూడా ఆధార్ కార్డు -
పోస్టుమార్టం రోజునే ప్రభుత్వ సాయం
పి.గన్నవరం: గోదావరి వరదల్లో ప్రమాదవశాత్తు గల్లంతై మరణించిన ఇద్దరి కుటుంబాలకు పోస్టుమార్టం పూర్తయిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం అందించింది. ఈ నెల 16న కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి పల్లిపాలేనికి చెందిన కడలి శ్రీనివాసరావు (48) ఏటిగట్టు నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నదిలో ఈదుకుంటూ వస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. 18వ తేదీన అదే గ్రామానికి చెందిన కారాడి రామకృష్ణ (68) శివాయలంకకు పడవపై గ్రామస్తులను తీసుకువెళ్లాడు. తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటంతో నదిలో కొట్టుకుపోయాడు. ఇతడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం అప్పనపల్లిలో వెలికితీశారు. ఇద్దరి మృతదేహాలకు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం సాయంత్రం పోస్టుమార్టం జరిగింది. ఇదే సమయంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. బాధితుల ఇళ్లకు మోకాలి లోతు వరద నీటిలో నడిచి వెళ్లి రూ.4 లక్షల చొప్పున ప్రభుత్వ సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ప్రభుత్వం స్పందించిన తీరును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాలినడకన 4 కిలోమీటర్లు నాతవరం (అనకాపల్లి జిల్లా): రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామానికి అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి బుధవారం కాలినడకన వెళ్లారు. కొండలు, గుట్టలు ఎక్కి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి నాతవరం మండలంలోని అసనగిరి గ్రామంలో గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. గ్రామంలో అన్ని వీధులూ కలియతిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తాటాకు గుడిసెల్లోకి కూడా వెళ్లి వారితో మాట్లాడారు. ఆ ఆదివాసీ గ్రామానికి వచ్చిన తొలి కలెక్టర్ కావడంతో గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సుందరకోట పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి, సరుగుడు సచివాలయంలో వలంటీర్లతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. ఇదీ చదవండి: సహాయం.. శరవేగం -
గాలింపు చర్యలు ముమ్మరం
శ్రీనగర్: అమర్నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్వేషణ, సహాయక చర్యల కోసం ఆర్మీకి చెందిన పర్వత గస్తీ బృందాలను, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 16 మృతదేహాలను బాల్టాల్ బేస్ క్యాంప్‌నకు తరలించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. టెంట్లు, సామూహిక వంటశాలల మీదుగా పోటెత్తిన వరద, బురదమట్టి కారణంగా గాయపడిన 25 మంది ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు, గుహాలయం సమీపంలో చిక్కుకుపోయిన మొత్తం 15వేల మందినీ దిగువనున్న పంజ్తరణి బేస్ క్యాంపునకు సురక్షితంగా తరలించారు. 11వ బ్యాచ్‌లోని 6వేల మంది యాత్రికులు శనివారం జమ్మూ నుంచి అమర్నాథ్ దిశగా బయలుదేరారని అధికారులు తెలిపారు. అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం 4.30–6.30 గంటల ప్రాంతంలో నమోదైంది 31 మి.మీ. వర్షపాతమేనని వాతావరణ విభాగం తెలిపింది. గంట వ్యవధిలో 100 మి.మీ. వాన నమోదైన సందర్భాల్లోనే కుండపోత వర్షంగా పరిగణిస్తామంది. అకస్మాత్తు వరదలకు ఎగువనున్న పర్వత భాగాల్లో కురిసిన వానలే కారణం కావచ్చని పేర్కొంది. -
ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సం
డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. ఘాట్ ప్రాంతాలున్న చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఆ శిధిలాల్లో చిక్కుకుని మహిళ, ఆమె 9 నెలల కూతురు సహా ఆరుగురు మృతి చెందారు. బద్రీనాథ్– పగల్నాలా, రిషికేష్– కేదార్నాథ్ రహదారుల్లో రవాణా సైతం కొండచరియలు విరిగిపడిన కారణంగా నిలిచిపోయింది. రాష్ట్రంలో పోటెత్తిన చాఫ్లాగద్ నది ధాటికి పక్కనే ఉన్న ఇళ్లు, భవనాలు, షాపులు కుప్పకూలి నీటిలో కొట్టుకుపోయాయి. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో ఓ పెద్ద బండరాయి విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరోవైపు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ ల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పై నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరద కారణంగా మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 199కి చేరగా, కేవలం కేరళలోనే 83 మంది చనిపోయారు. అయితే, మలప్పురంలో ఇంకా 50 మంది వరకు జాడ తెలియని నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో 2.87 లక్షల మంది ఇంకా సహాయ కేంద్రాల్లోనే ఉన్నారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన 125 మందిని భారత వైమానిక దళం కాపాడింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో వరదల కారణంగా గత 6 రోజులుగా మూసివేసి ఉన్న ముంబై– బెంగళూరు హైవేపై సోమవారం వాహనాలకు పాక్షికంగా అనుమతి ఇచ్చారు. వర్షాలకు భారీగా ధ్వంసమైన తన నియోజకవర్గం వాయినాడ్(కేరళ)లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించి, బాధితులను పరామర్శించారు. వరద సహాయ చర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులను కోరారు.