న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు, వరదలు సంభవించి దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 774 మంది చనిపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. వర్షాలు, వరదల కారణంగా కేరళలో అత్యధికంగా 187 మంది ప్రాణాలు కోల్పోగా.. ఉత్తరప్రదేశ్‌లో 171 మంది, పశ్చిమబెంగాల్‌లో 170 మంది, మహారాష్ట్రలో 139 మంది దుర్మరణం చెందారని వెల్లడించింది. అలాగే గుజరాత్‌లో 52 మంది, అస్సాంలో 45 మంది, నాగాలాండ్‌లో 8 మంది చనిపోయారంది. హోంశాఖకు చెందిన నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఎన్‌ఈఆర్సీ) గణాంకాల ప్రకారం వరదల కారణంగా కేరళలో 22 మంది, పశ్చిమబెంగాల్‌లో ఐదుగురు గల్లంతయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment